లింగ యోని

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వియత్నాం లోని లాం డాంగ్ లో లింగం ఇనుమడింపజేయని యోని

లింగ యోని అనునది శివలింగం నిర్మాణం లోని ఒక భాగం. ఒక పరిపూర్ణ శివలింగంలో లింగం, యోనిలు ఉంటాయి. యోనిలో ఇనుమడింపజేసిన లింగాన్నే ఆలయాలలో శివలింగంగా పూజిస్తారు. యోని ఆది పరాశక్తి యొక్క చిహ్నము. యోని శివుడి దేవేరి. లింగం యోని పూరకము. లింగ యోనుల సంగమం సృష్టి, పునరుత్పత్తి అనే శాశ్వత ప్రక్రియని సూచిస్తుంది. 19వ శతాబ్దపు ద్వితీయార్థము నుండి యోని, లింగాలు స్త్రీ పురుష జనేంద్రియాలకు సూచికలుగా అభివర్ణింపబడుతున్నాయి.

భారతీయ తత్త్వము

[మార్చు]
వియత్నాం లోని లాం డాంగ్ లో లింగం ఇనుమడింపజేసిన యోని

హిందూమతము లోని వివిధ పురాతన వ్రాతలలో యోని గురించిన ప్రస్తావనలు ఉన్నాయి. హిందూ తత్త్వములో తంత్ర శాస్త్రం ప్రకారం యోని అనునది జీవమూలము. శక్తికి, దేవికి యోని ప్రతిరూపంగా, సృష్టి ఆసాంతానికి జీవం పోసే ఒక మహత్తర శక్తిగా పరిగణింపబడుతుంది.

భారతీయ మతాలలోని వేదాలు, భగవద్గీత లలో యోని జీవ రూపంగా, జాతిగా చెప్పబడింది. ఈ సృష్టిలో మనుష్య యోనులతో కలిపి 8.4 మిలియను యోనులు కలవని లెక్క. మనుష్య యోని యొక్క ప్రాప్తి వివిధ దశలలో సంభవించే వివిధ జన్మలలో (ఉదా:కీటకము, మీనము, హిరణము, వానరము యొక్క అవతారాలలో ఉన్న యోనులు) చేసిన సత్కార్యాల యొక్క సత్కర్మ వలన ప్రాప్తిస్తుంది అని నమ్మకము ఉంది. దుష్కార్యాలు చేయటం వలన రాక్షస యోని సంభవిస్తుంది. మనిషి యొక్క జన్మ, పునర్జన్మ, జీవిత చక్రం వివిధ యోనులలో సంభవిస్తుంది. మోక్షము పొందిన మానవుడు జీవిత చక్రాన్ని ఛేదించి బ్రహ్మ ప్రక్కన స్థానాన్ని పొందుతాడు.

లింగ యోని

[మార్చు]

యోని అనునది శక్తినీ, సృష్టి యొక్క సృజనాత్మక శక్తినీ ప్రతిబింబించేది. యోనిలో ఇనుమడింపజేసిన రాతి లింగం శివుణ్ణి ప్రతిబింబిస్తుంది. లింగం అనునది సర్వసృష్టికీ బీజాతీత మూలం. యోనితో సంగమించిన లింగం అంతర్గత సత్యం యొక్క అద్వైతాన్ని, బీజాతీత సంభావ్యతనీ ప్రతిబింబిస్తుంది.

ఆరాధన

[మార్చు]

శక్తి ధర్మంలో యోనిని ఆరాధిస్తారు. అస్సాంలో ప్రతి సంవత్సరం జూన్ నెలలో భూదేవి యొక్క మరొక రూపమైన కామాఖ్య యొక్క ఋతుస్రావాన్ని అట్టహాసంగా జరుపుతారు. దీనినే అంబుబాచి మేళాగా వ్యవహరిస్తారు. మూడు రోజులు కామాఖ్య గుడిని మూసివేసి ఆ తర్వాతి రోజు నుండి భక్తుల, యాత్రికుల సందర్శనార్థం గుడిని తెరుస్తారు. నాలుగు రోజులుగా జరిగే ఈ పండుగకి ప్రతి రోజు కనీసం లక్ష మంది భక్తుల తాకిడి ఉంటుంది. మిగతా గుళ్ళలో వలె దర్శనం చూపుతో కాకుండా, ఈ గుడిలో స్పర్శిస్తేనే దర్శనం అయినట్టు భావిస్తారు. ఆధార శిల పై గల చీలికనుండి భూ అంతర్భాగంలో ఉన్న నీటి ఊట పైకి ఎగచిమ్ముతూ ఉంటుంది. ఈ చీలికని యోనిగా పరిగణిస్తారు. దీనిని పుష్పాలతో, కుంకుమతో, వివిధ రకాల వస్త్రాలతో, అలంకరించబడిన పైటకొంగులతో కప్పి ఉంచుతారు. భక్తులు నైవేద్యాలని నేరుగా దేవికి సమర్పించి, తల్లిని స్పృశించి ఊట నుండి వస్తున్న జలాన్ని సేవిస్తారు. పూజారి భక్తులకి కుంకుమ ప్రసాదాలని ఇస్తాడు. దర్శనం తర్వాత భక్తులు గుడి వెలుపల దీపాలని, అగరొత్తులని వెలిగిస్తారు. దర్శనాన్ని పరిపూర్ణం చేయటానికి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు.

పురాతత్త్వ త్రవ్వకాలు

[మార్చు]

హరప్పా, మొహెంజో-దారోలలో సింధు లోయ నాగరికతకి చెందిన లింగ యోనులు త్రవ్వకాలలో బయటపడ్డాయి. సంస్కృతి-సంప్రదాయాలు సింధు నాగరికత నుండి వైదిక, ఆధునిక హిందూ పద్ధతులు వారసత్వ సంపదగా తీసుకొనబడ్డాయని చెప్పటానికి పలు మూలాలు గలవు.[1]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Lal, B.B. (2002). The Sarasvati Flows On: The Continuity of Indian Culture. Aryan Books International. ISBN 81-7305-202-6.
"https://te.wikipedia.org/w/index.php?title=లింగ_యోని&oldid=4010949" నుండి వెలికితీశారు