Jump to content

లిజుమ్ రోన్యా

వికీపీడియా నుండి
లిజుమ్ రోన్యా

పదవీ కాలం
1990 – 1995
ముందు టి.ఎల్. రాజ్‌కుమార్
తరువాత టాకో దబీ

పదవీ కాలం
1990 – 2004
తరువాత జార్బోమ్ గామ్లిన్
నియోజకవర్గం లిరోమోబా

వ్యక్తిగత వివరాలు

జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
వృత్తి రాజకీయ నాయకుడు

లిజుమ్ రోన్యా అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన అరుణాచల్ ప్రదేశ్ శాసనసభకు లిరోమోబా శాసనసభ నియోజకవర్గం నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై అరుణాచల్ ప్రదేశ్ శాసనసభ స్పీకర్‌గా పని చేశాడు.[1]

రాజకీయ జీవితం

[మార్చు]

లిజుమ్ రోన్యా భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 1990 అరుణాచల్ ప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో లిరోమోబా శాసనసభ నియోజకవర్గం నుండి ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి జనతాదళ్ అభ్యర్థి జార్బోమ్ గామ్లిన్ పై 299 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికై 1990 నుండి 1995 వరకు అరుణాచల్ ప్రదేశ్ శాసనసభ స్పీకర్‌గా పని చేశాడు. ఆయన 1995 శాసనసభ ఎన్నికలలో ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి స్వతంత్ర అభ్యర్థి లిబి యోంగమ్ పై 1,571 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.

లిజుమ్ రోన్యా 1999 అరుణాచల్ ప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి అరుణాచల్ కాంగ్రెస్ అభ్యర్థి గెగాంగ్ అపాంగ్ పై 1,486 ఓట్ల మెజారిటీతో గెలిచి వరుసగా మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన 2004 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ టికెట్ దక్కకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ జార్బోమ్ గామ్లిన్ చేతిలో 439 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.

లిజుమ్ రోన్యా 2015లో లిరోమోబా నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి 2,589 ఓట్లతో మూడో స్థానంలో నిలిచాడు.[2][3]

మూలాలు

[మార్చు]
  1. "Arunachal Pradesh Speakers". NLC. 24 May 2025. Archived from the original on 24 May 2025. Retrieved 24 May 2025.
  2. "Congress retains Liromba assembly seat in Arunachal Pradesh by-polls". The Economic Times. 16 February 2015. Archived from the original on 24 May 2025. Retrieved 24 May 2025.
  3. "Congress retains Liromba Assembly seat in Arunachal bypolls" (in Indian English). The Hindu. 16 February 2015. Archived from the original on 24 May 2025. Retrieved 24 May 2025.