లిటిల్ సోల్జర్స్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
లిటిల్ సోల్జర్స్
(1996 తెలుగు సినిమా)
దర్శకత్వం గుణ్ణం గంగరాజు
నిర్మాణం గుణ్ణం గంగరాజు
రచన గుణ్ణం గంగరాజు
కథ గుణ్ణం గంగరాజు
చిత్రానువాదం గుణ్ణం గంగరాజు
తారాగణం బాలాదిత్య (అప్పటి పేరు మాష్టర్ వై.ఎస్. ఆదిత్య) - సన్నీ,
బేబీ కావ్య (బన్నీ),
రమేష్ అరవింద్ (అరవింద్),
హీరా రాజగోపాల్ (అనిత),
కోట శ్రీనివాసరావు (హరిశ్చంద్ర ప్రసాద్),
రోహిణీ హట్టంగడి (రాజేశ్వరీ దేవి),
గిరిబాబు (శేషగిరిరావు),
బేతా సుధాకర్ (శేషగిరిరావు కొడుకు),
బ్రహ్మానందం (గన్),
రాళ్ళపల్లి (గోపాల్),
బెనర్జీ (పోలీస్ ఆఫీసర్)
సంగీతం శ్రీ
నేపథ్య గానం దీపిక, శ్రీలేఖ, విష్ణు, శ్రీ, రామ్ చక్రవర్తి, మనో, రవి
గీతరచన సిరివెన్నెల సీతారామశాస్త్రి
సంభాషణలు గుణ్ణం గంగరాజు
ఛాయాగ్రహణం రసూల్ ఎల్లోర్
కూర్పు మోహన్ రామారావు
నిర్మాణ సంస్థ ఫాంట్ ఫిల్మ్స్
విడుదల తేదీ ఫిబ్రవరి 2, 1996
భాష తెలుగు

లిటిల్ సోల్జర్స్, 1996లో విడుదలైన ఒక తెలుగు సినిమా. అప్పుడు వస్తున్న మూస చిత్రాలకు భిన్నంగా చిన్నపిల్లలతో ప్రయోగాత్మకంగా తీసిన ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. క్రైమ్, సస్పెన్స్‌లతో హాస్యాన్ని జోడించడం వలన సినిమా సాఫీగా సాగిపోతుంది.

అరవింద్ (రమేష్ అరవింద్), అనిత (హీరా) తల్లిదండ్రుల అనుమతిలేకుండా ప్రేమ వివాహం చేసుకుంటారు. వారికి ఇద్దరు పిల్లలు. సన్నీ (ఇప్పటి బాలాదిత్య అయిన మాస్టర్ ఆదిత్య), బన్నీ (బేబీ కావ్య). అనిత తల్లి రాజరాజేశ్వరి (రోహిణీ హట్టంగడి) గొప్ప ధనవంతురాలు. ఆమె ఆస్తిమీద కన్ను వేసిన అనిత మేనమామ శేషాద్రి (గిరిబాబు), అతని కొడుకు(సుధాకర్) ఒక ప్రమాదంలో అనిత, అరవింద్‌లు చనిపోయేలా చేస్తాడు. అయితే అదృష్టవశాత్తూ సన్నీ, బన్నీ ఆ ప్రమాదంనుండి తప్పించుకొని తాత (తండ్రికి తండ్రి) అయిన హరిశ్చంద్ర ప్రసాద్ (కోట శ్రీనివాసరావు) దగ్గఱకు చేరుతారు. శేషాద్రి వారిని చంపించే ప్రయత్నాలు కొనసాగిస్తాడు. ఆ పిల్లలు అనేక విపత్తులనుండి బయటపడి తాత, అమ్మమ్మల మనసులు మార్చడం సినిమా కథాంశం.

పాటలు

[మార్చు]

ఈ చిత్రానికి శ్రీ సంగీతం అందించాడు.[1]

  • అయామ్ ఎ వెరీ గుడ్ గర్ల్, సెడ్ మై టీచర్, మైడియర్ బ్రదర్ - - ఎస్.పి. బాలు, దీపిక (6 యేండ్ల అమ్మాయి), విష్ణు (10 యేండ్ల బాలుడు)
  • మా ఫాదర్ ఓ టైగర్! మాట్లాడాలంటే థండర్ - మనో
  • అడగాలనుంది ఒక డౌట్‌ని.. సన్‌రైస్ లేని రోజేదని - శ్రీ, దీపిక, విష్ణు, శ్రీలేఖ
  • వెండి వెన్నెలా.. దిగిరా ఇలా! - రామ్ చక్రవర్తి, శ్రీలేఖ
  • సరేలే ఊరుకో పరేషాన్ ఎందుకూ? - శ్రీ
  • ఎవడండీ వీడు, రాబిన్‌హుడ్‌లా ఉన్నాడే - మనో
  • ఏక్ దో తీన్ ఆగే చల్.. యే ప్రమాదం ముంచుకు రానీ, డోంట్‌ యూ రన్! - రవి

విశేషాలు

[మార్చు]
  • ఈ సినిమాలో బాలనటుడిగా నటించిన మాస్టర్ ఆదిత్య పెద్దయింతర్వాత హీరోగా మారి చంటిగాడు, కీలుగుర్రం వంటి సినిమాలలో నటించాడు.
  • ఈ సినిమాలో బాలాదిత్యకు రెండవ నంది అవార్డు లభించింది. అంతకు ముందు "అన్న" సినిమాలో మొదటి అవార్డు అందుకొన్నాడు.
  • ఈ సినిమా తీసే సమయానికి కావ్యకు మూడున్నర యేండ్ల వయసు. కొన్ని షాట్‌లు ఇరవైసార్లు కూడా రీటేక్ చేశారు.
  • గుణ్ణం గంగరాజు సహజమైన సంభాషణలు, రసూల్ కెమరా, సిరివెన్నెల పాటలు ఈ చిత్రానికి మంచి బలాన్ని చేకూర్చాయి.
  • ఈ సినిమాకు లభించిన అవార్డులు
    • ఉత్తమ బాల నటుడు (మాస్టర్ ఆదిత్య)
    • ఉత్తమ బాలనటి (బేబీ కావ్య)
    • ఉత్తమ క్యారెక్టర్ నటుడు (కోట శ్రీనివాసరావు)
    • ఉత్తమ స్క్రీన్‌ప్లే (గుణ్ణం గంగరాజు)
    • ఉత్తమ ఆరంభ దర్శకుడు (గుణ్ణం గంగరాజు)
    • ఉత్తమ దర్శకుడు (గుణ్ణం గంగరాజు)
    • రెండవ ఉత్తమ చిత్రం
  • 19 కేంద్రాలలో విడుదలైన ఈ సినిమా 4 కేంద్రాలలో 100రోజులు ఆడింది.

మూలాలు

[మార్చు]
  1. ఆంధ్రజ్యోతి, తెలుగు వార్తలు (13 September 2015). "సంగీత దర్శకుడి శ్రీ జయంతి". andhrajyothy.com. Archived from the original on 2 August 2020. Retrieved 2 August 2020.

వనరులు

[మార్చు]