లిప్‌స్టిక్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
లిప్స్టిక్ రాసుకుంటున్న అమ్మాయి

లిప్‌స్టిక్ అనేది పిగ్మెంట్లు, నూనెలు, మైనములతో తయారు చేయబడిన ఒక కాస్మెటిక్ వస్తువు. లిప్‌స్టిక్‌లు వివిధ రంగులు, వెరైటీలలో లభిస్తాయి. ఎక్కువగా మహిళలు తమ రోజువారీ మేకప్‌లో భాగంగా ఈ లిప్‌స్టిక్‌ను ఉపయోగిస్తారు.

చరిత్ర

[మార్చు]
లిప్స్టిక్

పురాతన కాలం నుండి, 3300 BC నుండి లిప్‌స్టిక్‌ను ఉపయోగిస్తున్నారు. లిప్‌స్టిక్‌ను భారతదేశం, మెసొపొటేమియా, ఈజిప్ట్, అరేబియా, యూరప్, అమెరికా, ప్రపంచవ్యాప్తంగా ఉపయోగిస్తున్నారు.

భారతదేశం

[మార్చు]

ప్రపంచంలో మొట్టమొదటి సారి లిప్‌స్టిక్‌ను తయారు చేసి, ఉపయోగించిన వారు భారతీయులు. అంతేకాకుండా ప్రపంచంలో లిప్‌స్టిక్‌ను తయారు చేసి వాడిన మొదటి వ్యక్తులు పంజాబీ ప్రజలు. సింధు లోయ నాగరికతలో సింధూ లోయ ప్రాంతం (ప్రస్తుత పాకిస్తాన్‌), భారతదేశంలోని గుజరాత్, రాజస్థాన్, పంజాబ్‌లోని కొన్ని ప్రాంతాల ప్రజలు దీనిని వాడేవారు. దీనిని తేనెటీగలు, మొక్కల నుండి సేకరించిన ద్రవంతో కొన్ని రకాల వర్ణద్రవ్యాలు కలిపి వాడేవారు[1].

మెసొపొటేమియా

[మార్చు]

మెసొపొటేమియా ప్రజలు 1500సంవత్సరములలో, విలువైన ఆభరణాలను పొడి చేసి పెదవులపై రాసుకునేవారు. ఆ తరువాత, సీతాకోకచిలుకల శరీరం మీద ఉన్న రంగును పెదాలకు పూసుకునేవారు[2].

ఈజిప్ట్

[మార్చు]

పురాతన ఈజిప్షియన్ నాగరికతలో కూడా లిప్‌స్టిక్‌ను ఉపయోగించారు. చీమలు, బీటిల్స్ నుండి తీసిన వర్ణద్రవ్యాలను క్లియోపాత్రా తన పెదవులకు రాసుకునేది[3] .

ఘన లిప్‌స్టిక్

[మార్చు]

అబూ అల్-ఖాసిమ్ అల్- జహ్రావి (క్రీ.శ. 936-1013) అనే ఒక ఇస్లామిక్ వ్యక్తి , తేనెటీగ, మైనం, ఆముదం, పిగ్మెంట్లను ఉపయోగించి మొట్టమొదటి ఘన-లిప్‌స్టిక్ పద్ధతిని కనుగొన్నాడు. అప్పటి వరకు లిప్ స్టిక్ లు ద్రవ రూపంలోనే అందుబాటులో ఉండేవి.

వాడుక

[మార్చు]

లిప్‌స్టిక్‌ను పదహారవ శతాబ్దంలో మొదటలో రాణి ఎలిజబెత్ ఉపయోగించింది.[4] పద్దెనిమిదవ శతాబ్దం వరకు, లిప్‌స్టిక్‌ను ఎక్కువగా సెక్స్ వర్కర్లు, నటులు, నటీమణులు ఉపయోగించేవారు. 1880లో సారా బెర్నార్డ్ బహిరంగ కార్యక్రమాలకు హాజరైనప్పుడు, బయటికి వెళ్లేటప్పుడు లిప్‌స్టిక్‌ను ఉపయోగించడం ప్రారంభించింది. ఆ తరువాత, కొంతమంది ప్రజాప్రతినిధులు ఛాయాచిత్రాలు తీసుకునేటప్పుడు మాత్రమే లిప్‌స్టిక్‌ను వాడటం అలవాటు చేసుకున్నారు.

వ్యాపారం, మార్కెట్లు

[మార్చు]

పంతొమ్మిదవ శతాబ్దం వరకు, లిప్‌స్టిక్ పరిశ్రమ ఎక్కువగా కుటీర పరిశ్రమగా ఉండేది. 1884లో, గ్వెర్లిన్ అనే ఒక ఫ్రెంచ్ కంపెనీ, పెద్ద వాణిజ్య స్థాయిలో లిప్‌స్టిక్‌ను ఉత్పత్తి చేసి మార్కెట్ చేసింది. ఆ కంపెనీ తేనె, ఆముదం, జింక, ఆవు కొవ్వులతో తయారు చేసిన లిప్‌స్టిక్‌ను ఉత్పత్తి చేసింది. ప్రారంభంలో, లిప్‌స్టిక్‌ను కంటైనర్‌లలో అమ్మేవారు.

సీలింగ్ రోలర్లు

[మార్చు]

1912లో, మారిస్ లెవీ లిప్‌స్టిక్‌లను నిల్వ చేయడానికి, అమ్మడానికి మెటల్ స్థూపాకార బాటిళ్లను ప్రవేశపెట్టారు. ఆ తరువాత 1923లో, జేమ్స్ బ్రూస్ పేసన్ మెటల్ సిలిండర్‌ను కనుగొన్నాడు.

పిగ్మెంట్లు

[మార్చు]

1930లో, ఎలిజబెత్ ఆర్డెన్ అనే బ్యూటీషియన్ వివిధ రకాల పిగ్మెంట్‌లను కనుగొని రంగురంగుల లిప్‌స్టిక్‌లను తయారు చేసింది[5][6].

నష్టాలు

[మార్చు]

యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా అధ్యయనంలో లిప్‌స్టిక్‌ లలో తొమ్మిది రకాల లోహాలు ఉన్నట్లు కనుగొన్నారు. అవి క్రోమియం, కాడ్మియం, కోబాల్ట్, అల్యూమినియం, టైటానియం, రాగి, మాంగనీస్, క్రోమియం, నికెల్. లిప్‌స్టిక్‌లు వాడటం వలన పెదాలు పగిలిపోవడం, పెదవులు, చుట్టుపక్కల చర్మంపై అలెర్జీ వస్తుంది. ఇందులో ఉండే కొన్ని హానికరమైన పదార్థాలు క్యాన్సర్‌కు కారణమవుతాయి, అలాగే హెవీ మెటల్ పాయిజనింగ్ మన లిప్‌స్టిక్‌లలో సూక్ష్మ పరిమాణంలో ఉంటుంది[7].

లిప్‌స్టిక్ వల్ల చర్మం ఇరిటేట్ అవడం, శ్వాసలో ఆటంకం కలిగి గురక వస్తుందట. లిప్‌స్టిక్‌లో యూజ్ చేసే బిస్మత్ ఆక్సీ క్లోరైడ్ , పారాబెన్స్ వల్ల క్యాన్సర్ సోకే అవకాశం చాలా వరకు ఉందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు ఈ రసాయనాల వల్ల బాడీలో ఉండే అవయవాలు దెబ్బతింటాయని హెచ్చరిస్తున్నారు.

లిప్‌స్టిక్‌లోని కెమికల్స్ పెదాల నుండి శరీరంలోకి వెళ్లే అవకాశం ఉంది. కాడ్మియం అనే కెమికల్ వల్ల కిడ్నీలు దెబ్బతింటాయి. అంతేకాదు కడుపులో కణితులు కూడా ఏర్పడేృ అవకాశం ఉంది.

ఇది కూడ చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Yona Williams. Ancient Indus Valley: Food, Clothing & Transportation.
  2. The Slightly Gross Origins of Lipstick". InventorSpot. Retrieved 09-02-2010.
  3. "What's That Stuff?". Chemical and Engineering News. Retrieved 2010-09-02.
  4. "Elizabethan Makeup 101". www.elizabethancostume.net. Retrieved 2022-08-20.
  5. How Lipstick Works". Discovery Health. Retrieved 2010-09-02.
  6. Sherrow, Victoria (03-30-2001). For Appearance's Sake: The Historical Encyclopedia of Good Looks, Beauty, and Grooming. Connecticut: Greenwood Publishing. pp. 180. doi:10.1336/1573562041. ISBN 1-57356-204-1.
  7. "These shocking facts about lipstick might just keep you off them! | TheHealthSite.com". TheHealthSite. 2015-02-19. Retrieved 2022-08-20.