లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్
కృతికర్త:
దేశం:  భారతదేశం
భాష: ఇంగ్లీష్
సీరీస్: లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్
ప్రక్రియ: భారతీయుల రికార్డులు
విభాగం (కళా ప్రక్రియ): సమాచారం
ప్రచురణ: కోకా కోలా భారతదేశం
విడుదల: 1990

భారతీయ సంతతికి చెందిన ఒక రికార్డు పుస్తకం లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్[1]. లిమ్కా బ్రాండ్ పార్లే గ్రూప్ యాజమాన్యంలో ఉన్నప్పుడు ఇది మొట్టమొదటగా 1990 లో ప్రచురించబడింది. లిమ్కా బ్రాండ్ ను కోకా కోలా కొనుగోలు చేసినప్పటి నుండి కోకా కోలా ఈ పుస్తక ప్రచురణను కొనసాగిస్తుంది. ఈ పుస్తకం యొక్క 20 వ ఎడిషన్ మార్చి 2009 లో అమితాబ్ బచ్చన్ విడుదల చేశారు [1]. లిమ్కా అనే సాప్ట్ డ్రింక్ ను తయారు చేస్తున్న కోకా కోలా ఇండియా ప్రోత్సాహంతో ఈ "లిమ్కా రికార్డుల పుస్తకం" ప్రచురించబడుతుంది. ఇది వాస్తవంగా రమేష్ చౌహాన్ చే ప్రారంభమైంది, అతను దీనిని 1993లో కోకా కోలాకు విక్రయించాడు[2]. దీనికి ప్రస్తుత సంపాదకుడు విజయ ఘోష్.[3] దీని యొక్క 2006 సంవత్సరం సంచికను కోకాకోలా ఇండియా సీఈఓ అతుల్ సింగ్ న్యూఢిల్లీలో విడుదల చేశారు[4]. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 60 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 2007 సెప్టెంబరు 25 న ప్రత్యేక సంచికను కోకా కోలా చే విడుదల చేశారు[1]. 2008 మే 30 న, 19 వ ఎడిషన్ న్యూఢిల్లీలో ప్రారంభించబడింది[3]. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (FICCI) సెక్రటరీ జనరల్ అమిత్ మిత్రా ఈ కార్యక్రమంలో హాజరై ప్రసంగించారు. దీని యొక్క 20 వ ఎడిషన్ అమితాబ్ బచ్చన్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చీఫ్ జి.మాధవన్ నాయర్ కూడా పాల్గొన్నారు[5].

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 "Article: COCA-COLA INDIA UNVEILS THE LIMCA BOOK OF RECORDS IN NEW YORK. - AsiaPulse News | HighBeam Research - FREE trial". Highbeam.com. 2007-09-26. Archived from the original on 2013-01-25. Retrieved 2014-07-27. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; "highbeam1" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు
  2. http://articles.economictimes.indiatimes.com/2008-03-12/news/27714756_1_coca-cola-india-limca-book-brand
  3. 3.0 3.1 "Limca Book of Records launches special Olympic edition". SiliconIndia. 2008-05-30. Retrieved 2009-12-08.
  4. "The Hindu Business Line : Limca Book of Records 2006 edition". Blonnet.com. 2006-06-10. Retrieved 2009-12-08.[permanent dead link]
  5. "Amitabh releases Limca Book of Records' 20th edition". Thaindian.com. Archived from the original on 2014-08-08. Retrieved 2009-12-08.

ఇతర లింకులు

[మార్చు]