లుఫ్తాన్సా

వికీపీడియా నుండి
(లుఫ్తాన్స నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
Lufthansa
Lufthansa Logo 2018.svg
IATA
LH
ICAO
DLH
కాల్ సైన్
LUFTHANSA
స్థాపన1926 (as Deutsche Luft Hansa Aktiengesellschaft), refounded 1954
Hub
Focus cities
Frequent flyer programMiles & More
Member loungeHON / Senator Lounge
AllianceStar Alliance
Subsidiaries
Fleet size274 (+ 73 orders) excl. subsidiaries 746 (+ 156 orders) inc. subsidiaries excl. shares
Destinations202
కంపెనీ నినాదంThere's no better way to fly
ముఖ్య స్థావరంLufthansa Aviation Center Airportring, Frankfurt am Main, Hesse, Germany[2]
ప్రముఖులు
 • Jürgen Weber (Head of Supervisory Board)
 • Wolfgang Mayrhuber (CEO)
 • Stefan Lauer (Aviation Services and Human Resources)
 • Stephan Gemkow (CFO)
Website: www.lufthansa.com

డ్యూయిషె లూఫ్తాన్స ఎజి German pronunciation: [ˈdɔʏt͡ʃə ˈlʊfthanza]మూస:FWB అనేది జర్మనీకి చెందిన విమానయాన సంస్థ. మరియు ప్రయాణీకులను చేరే విషయంలో యూరోప్‌లో అతిపెద్ద ఎయిర్‌లైన్స్ ఇది. కంపెనీ యొక్క పేరు లుఫ్ట్ (ఈ జర్మనీ పదానికి గాలి అని అర్థం) మరియు హన్స (హాన్సియాటిక్‌లీగ్‌, మధ్యయుగంలో అతిశక్తివంతమైన వాణిజ్య బృందం) అనే పదాల ద్వారా వచ్చింది.

ఈ ఎయిర్‌లైన్స్ ప్రయాణికులను చేరేవేసే లెక్కల ప్రకారం ప్రపంచంలో ఐదవ అతి పెద్ద ఎయిర్‌లైన్స్. జర్మనీలో 18 ప్రాంతాలకు, అంతర్జాతీయంగా ఆఫ్రికా, అమెరికాస్‌, ఆసియా మరియు యూరోప్‌లోని 78 దేశాల్లోని 183 ప్రాంతాలకు తన విమానాలను నడుపుతోంది. లుఫ్తాన్స తన యొక్క ఇతర భాగస్వాములతో మొత్తం 722 ఎయిర్‌క్రాఫ్ట్ ద్వారా 410 ప్రాంతాలకు విమానాలను నడుపుతోంది.[3] దీని యొక్క ఇతర సబ్సిడిరీలను కలుపుకుంటే ప్రపంచంలో అతి మూడో అతి పెద్ద ప్యాసింజర్‌ ఎయిర్‌లైన్స్ ఇది.

కొలోన్‌లోని డ్యూష్జ్‌లో లుఫ్తాన్స యొక్క ప్రధాన ఆపరేషన్స్ యొక్క కేంద్రం లుఫ్తాన్స ఏవియేషన్‌ సెంటర్‌ (ఎల్‌ఏసి) ఉంది. మరియు దీని యొక్క ప్రధాన ట్రాఫిక్‌ హబ్‌ ఫ్రాంక్‌ఫోర్ట్ లోని ఫ్రాంక్‌ఫోర్ట్ విమానాశ్రయంలో ఉంది. రెండో ప్రధాన హబ్‌ మ్యూనిచ్‌ ఏయిర్‌పోర్ట్ ‌లోఉంది.[3][4][5][6] లుఫ్తాన్స యొక్క అధిక శాతం పైలట్లు, గ్రౌండ్‌ స్టాఫ్‌, ఫ్లైట్‌ అటెండర్లు ఫ్రాంక్‌ఫోర్ట్ కేంద్రంగా పనిచేస్తారు.[7]

ప్రపంచంలో అతి పెద్ద ఎయిర్‌లైన్స్ అలయన్స్ అయిన స్టార్‌ అలయన్స్లో లుఫ్తాన్సకు వ్యవస్థాపక సభ్యత్వం ఉంది. థాయ్‌ ఎయిర్‌వేస్‌, యునైటెడ్‌ ఎయిర్‌వేస్‌, ఎయిర్‌ కెనడా మరియు స్కాండనేవియన్‌ ఎయిర్‌లైన్స్ సిస్టమ్‌ యొక్క కలయికలో 1997లో స్టార్‌ అలయన్స్ ను ప్రారంభించారు. లుఫ్తాన్స గ్రూప్‌ సుమారు 500 ఎయిర్‌క్రాఫ్ట్‌లను, ప్రపంచవ్యాప్తంగా 146 దేశాలకు చెందిన (2007 డిసెంబరులో ఇది 31) 1,05,261 మంది ఉద్యోగులున్నారు. 2008లో సుమారు 70.5 మిలియన్ల ప్రయాణికులు లుఫ్తాన్స విమానాల్లో ప్రయాణించారు. ( జర్మన్‌ వింగ్స్, బిఎమ్‌ఐ, ఎయుఏ, బ్రస్సెల్స్‌ ఎయిర్‌లైన్స్‌లను ఇందులో చేర్చలేదు).

విషయ సూచిక

చరిత్ర[మార్చు]

1949–1972: ప్రారంభ సంవత్సరాలు[మార్చు]

డ్యూయిషే ఎరో లాయిడ్‌ (డిఏఎల్‌) మరియు జంకర్స్‌ లుఫ్తావికేర్‌ అనే కంపెనీల కలయికతో 1926, జనవరి ఆరవ తేదిన లుఫ్తాన్స ఆవిర్భవించింది.[8] కంపెనీ యొక్క అసలు పేరు డ్యూయిష్‌ లుఫ్తాహాన్స్‌ అకిటెంజిసెల్స్‌చాఫ్ట్‌ . 1933 నుంచి ఒక్క పదంగా లుఫ్తాన్స అని ఉపయోగిస్తున్నారు. స్పెయిన్‌, జర్మనీ మధ్య విమాన సర్వీసులు నడిపేందుకు 1927 డిసెంబరు9న డ్యూయిష్‌ లుఫ్తాహాన్స్‌ జర్మనీ ప్రభుత్వం తరఫున స్పెయిన్‌ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. కొత్త పెట్టుబడి పెట్టి ఎయిర్‌లైన్స్ ను ఏర్పాటుచేసింది. తదుపరి కాలంలో ఇది లిబేరియాగా మారింది.

లుఫ్తాన్స జు 52, బెల్‌గ్రేడ్‌ డోనోప్లోజి ఎయిర్‌పోర్ట్ కింగడమ్‌ ఆఫ్‌ యుగస్లేవియాలో రన్నింగ్‌ ఇంజిన్లతో ఒట్టో ఫ్లేక్‌ కన్వేయర్‌340 రకం1941

రెండో ప్రపంచ యుద్ధకాలంలో కంపెనీ ప్రధానంగా మధ్యప్రాచ్యం మరియు నార్త్ అట్లాంటిక్‌ మరియు సౌత్‌ అట్లాంటిక్‌ మార్గాల్లో తన అధిక శాతం విమానాల్ని నడిపింది. దీని కోసం డోనియర్‌, జంకర్స్, హెన్కిల్‌,, ఫోచే-ఊల్ప్‌తో జర్మనీలో డిజైన్‌ అయిన ఇతర మోడళ్లను వినియోగించింది. ముఖ్యంగా దీని యొక్క సబ్సిడరీ అయిన కోండర్‌ సిండికాట్‌ ద్వారా కొన్ని దక్షిణ అమెరికా ఎయిర్‌లైన్స్ల ఏర్పాటులోను ఇది కీలక పాత్ర పోషించింది. 939లో రెండో ప్రపంచయుద్ధం ప్రారంభమైన తరువాత కేవలం తటస్థ దేశాలకు మాత్రమే విమాన సర్వీసులను నడిపింది. యుద్ధం తొలినాళ్లలో ఇటాలియన్‌ ట్రాన్స్‌ కంటెన్షనల్‌ ఎయిర్‌లైన్స్‌ (లీ ఏరీ ట్రాన్స్ కంటెన్షనల్‌ ఐటాలియానీ లేదా ఎల్‌ఏటిఐ) ద్వారా దక్షిణ అమెరికాలో గట్టి పోటీ ఇచ్చింది.[9] అయితే 1945లో జర్మనీ పరాజయం తరువాత లుఫ్తాన్స తన అన్ని సర్వీసులను సస్పెండ్‌ చేసింది.

1950: యుద్ధం తరువాత తిరిగి ఏర్పడటం[మార్చు]

లుఫ్తాన్స యుద్ధానంతరం రూపొందించిన ఎయిర్‌క్రాఫ్ట్‌ దీన్ని 1954లో డెలివరీ చేసింది

1953 జనవరి 6న లుఫ్తాన్స తిరిగి అకిటెంగ్‌సెల్స్‌చాఫ్ట్‌ ఫర్‌ లుఫ్త్‌విర్‌కెర్‌స్‌డార్ఫ్‌ (లుఫ్‌టగ్‌) గా తిరిగి ఏర్పడిరది. మరియు 1954, ఆగస్టు6న దీన్ని డ్యూయిషే లుఫ్తాన్స అకిటెంగ్‌సెల్స్‌చాఫ్ట్ ‌గా పేరుమార్చారు. 1953లో ఏర్పడ్డ కొత్త లుఫ్తాన్స 1926లో ప్రారంభించి, రెండో ప్రపంచయుద్ధం వరకు ఉన్న లుఫ్తాన్స యొక్క న్యాయపరమైన వారసురాలు కాదు. 1955, ఏప్రిల్‌1న లుఫ్తాన్స కన్వెర్‌340ను ఉపయోగించి జర్మనీలో తన షెడ్యూలు సర్వీసులను ప్రారంభించింది. 1955, మే5న తన యూరోప్‌లోని వివిధ ప్రాంతాలకు తన విమనాలను పంపడం ద్వారా అంతర్జాతీయ సర్వీసులను ప్రారంభించింది. జూన్‌ ఎనిమిది నాటిక తన లాక్‌హీడ్‌ సూపర్‌ కన్టలేషన్స్ విమానాల ద్వారా న్యూయార్క్ సర్వీస్‌ను ప్రారంభించింది. 1956లో దక్షిణ అట్లాంటిక్‌ మార్గాలను పునరుద్ధరించింది.

తూర్పు జర్మనీ 1950ల్లో లుఫ్తాన్స పేరును ఉపయోగించి సొంత ఎయిర్‌లైన్స్‌ను ప్రారంభించడానికి ప్రయత్నించింది. కానీ దీని ఫలితంగా, అప్పటికే పనిచేస్తున్న ఈ ఎయిర్‌లైన్స్‌కు సంబంధించి పశ్చిమ జర్మనీతో వివాదం ఏర్పడిరది. తూర్పుజర్మనీ తన జాతీయ ఎయిర్‌లైన్స్‌కు ఇంటర్‌ఫ్లంగ్‌ అని పేరు పెట్టింది.ఇది 1991లో తన కార్యకలాపాలను నిలిపివేసింది. జిడిఆర్‌ కాలంలో పశ్చిమ బెర్లిన్‌ మీద లుఫ్తాన్స విమానాలను ఎగరడాన్ని నిషేధించారు.

లుఫ్తాన్స యొక్క మొదటి ఎ 380 రకం విమానం లుఫ్తాన్స ఎయిర్‌బస్‌ ఎ 340-300 రకాన్ని మొదటిసారిగా నడిపిన సంస్థ

1960: జెట్‌లైనర్ల పరిచయం[మార్చు]

1958లో లుఫ్తాన్స నాలుగు బోయింగ్‌ 707 విమానాలకు ఆర్డరిచ్చింది. మార్చి 1960లో ఫ్రాంక్‌ఫర్డ్నుంచి న్యూయార్క్ మధ్య జెట్‌ సర్వీసుల్ని ప్రారంభించడానికి వీటిని ఉపయోగించుకుంది. తరువాత దశలో 707విమానాలకు బ్యాక్‌అప్‌గా బోయింగ్‌ 720 విమానాలను ప్రవేశపెట్టింది. 1 961 ఫిబ్రవరిలో సుదూర తూర్పు మార్గాల్లో బ్యాంకాంక్‌ వరకు, థాయ్‌లాండ్‌ నుంచి హాంకాంగ్‌ మరియు టోక్యోలకు తన రూట్లను పొడిగించింది. లోగోస్‌, నైజీరియా మరియు దక్షిణాఫ్రికాలోని జోహానస్‌బర్గ్‌కు 1962లో విమాన సేవల్ని ప్రారంభించింది.

1964లో లుఫ్తాన్స బోయింగ్‌ 727 విమానాల్ని ప్రవేశపెట్టింది. అదే సంవత్సరం ఫ్రాంక్‌ఫర్ట్ నుంచి టోక్యోకు పోలార్‌ రూట్‌ను ప్రారంభించింది. 1965 ఫిబ్రవరిలో కంపెనీ 21 బోయింగ్‌ 737 మీడియమ్‌ జెట్లను ఆర్డర్‌ చేసింది. 1968లో ఇవి తమ సేవలందించడం ప్రారంభించాయి.

బోయింగ్‌ 737 విమానాలను భారీ సంఖ్యలో కొనుగోలు చేసిన తొలి కస్టమర్‌ లుఫ్తాన్సనే. కొత్త 737-100లను కొనుగోలు చేసిన నాలుగు సంస్థల్లో ఇది ఒకటి. ( నాసా, మలేసియన్‌- సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌ మరియు ఏవియానికా వాస్తవానికి సాంకేతికంగా నాసా ఎయిర్‌ఫ్రేమ్‌ను ముందుగా నిర్మించారు, అయితే దీన్ని చివరల్లో డెలివరీ చేసారు.వాస్తవానికి ఇది లుఫ్తాన్స కొరకు రూపొందించింది). బోయింగ్‌ కమర్షియల్‌ ప్లేన్‌ యొక్క తొలి విదేశీ కస్టమర్‌ లుఫ్తాన్సనే.

1970-1980ల్లో: వైడ్‌ బాడీ కాలం[మార్చు]

లుఫ్తాన్స ఎయిర్‌బస్‌ ఎ 300ా600ను 1976 నుంచి 2009 వరకు నడిపింది.

1970, ఏప్రిల్‌26న బోయింగ్‌ 747 విమానాన్ని ప్రవేశపెట్టడం ద్వారా లుఫ్తాన్స వైడ్‌ బాడీ కాలాన్ని ప్రారంభించింది. 1971లో లుఫ్తాన్స దక్షిణ అమెరికాకు తన సర్వీసులను ప్రారంభించింది. 1979లో లుఫ్తాన్స మరియు స్విస్‌ ఎయిర్‌లు అడ్వాన్స్‌ ఎయిర్‌బస్‌ ఎ 310కి లాంచ్‌ కస్టమర్లు. ఇవి రెండూ కలిసి 25 ఎయిర్‌క్రాఫ్ట్‌లకు ఆర్డరిచ్చాయి.

1990నాటికి కంపెనీకి చెందిన విమానాల అధునీకీకరణ కార్యక్రమం జూన్‌ 29,1985లో 15 ఎయిర్‌బస్‌ ఎ 320 మరియు ఏడు ఎయిర్‌బస్‌ ఎ 300-600లకు ఆర్డరివ్వడం ద్వారా ప్రారంభమైంది. కొన్ని రోజుల తరువాత పది బోయింగ్‌ 737-600లకు ఆర్డరిచ్చింది. 1987 మరియు 1992లోఅన్ని విమానాలు డెలివరీ ఇవ్వబడ్డాయి. లుప్తాన్స ఎయిర్‌బస్‌ ఎ 321, ఎయిర్‌బస్‌ ఎ 340, మరియు బోయింగ్‌ 747-400లకు కూడా ప్రవేశపెట్టింది.

లుఫ్తాన్స 1988లో కొత్త కార్పొరేట్‌ రూపును సొంతం చేసుకుంది. విమానాల్లోని క్యాబిన్‌లతోపాటు, సిటీ మరియు ఎయిర్‌పోర్ట్ లాంజ్‌లను రీ డిజైన్‌ చేసింది.[ఉల్లేఖన అవసరం]

1990-2000 మరింత విస్త్రతం[మార్చు]

జర్మనీ యొక్క ఏకీకరణ జరిగిన 25రోజుల తరువాత 1990 అక్టోబరు 28లో లుఫ్తాన్సా బెర్లిన్‌కు విమానాలు నడపడం ప్రారంభించింది. 1997 మే 18లో లుఫ్తాన్స, ఎయిర్‌ కెనడా, స్కాండనేవియన్‌ ఎయిర్‌లైన్స్‌, థాయ్‌ ఎయిర్‌లైన్స్ మరియు యునైటెడ్‌ ఎయిర్‌లైన్స్లు కలిసి స్టార్‌ అలయన్స్‌ను ఏర్పాటు చేశాయి. ప్రపంచంలో మల్లీల్యాటర్‌ ఎయిర్‌లైన్‌ అలయన్స్ ఇదే.

కొలోన్‌లో లుఫ్తాన్స యొక్క పాత హెడ్‌క్వార్టర్స్

2000లో ఎయిర్‌ వన్‌ లుఫ్తాన్స యొక్క భాగస్వామ్య ఎయిర్‌లైన్స్‌ అయింది. ఎయిర్‌వన్‌ చెందిన అన్ని విమానాలు లుఫ్తాన్సతో కోడ్‌ షేర్‌ చేసుకునేవి. సామర్థ్య, ప్రతిబంధకాలను ఎదుర్కొంటున్న తన ప్రధాన హబ్‌ ఫ్రాంక్‌ఫర్ట్ పై ఒత్తిడి తగ్గించేందుకు 2003 జూన్‌లో లుఫ్తాన్స మ్యూనిచ్‌ ఫ్రాంక్‌ జోసెఫ్‌ స్టారస్‌ ఎయిర్‌పోర్ట్లో తన రెండో టెర్మినల్‌ను ఏర్పాటు చేసింది. యూరోప్‌లో పాక్షికంగా ఒకటెర్మినల్‌ను పంచుకున్న ఎయిర్‌లైన్స్‌ లుఫ్తాన్సనే.

2004 మే 17న లుఫ్తాన్స బోయింగ్‌ ఇన్‌ఫ్లైట్‌ ఆన్‌లైన్‌ కనక్టివిటీ సర్వీస్‌ అయిన కనెక్షన్‌కు లుఫ్తాన్స లాంఛ్‌ కస్టమర్‌ అయింది.

On March 22, 2005 SWISS merged with Lufthansa Airlines. The merger included the provision that the majority shareholders (the Swiss government and large Swiss companies) be offered payment if Lufthansa's share price outperforms an airline index during the years following the merger. The two companies will continue to be run separately.

మునిచ్ విమానాశ్రయం వద్ద లుఫ్తాన్స మరియు భాగస్వామ్య ఎయిర్ కెనడా విమానం
లుఫ్తాన్స యొక్క మొదటి ఎ 380 రకం విమానం

2006 డిసెంబరు 6లో లుఫ్తాన్స 20 బోయింగ్‌ 747-8 ఎయిర్‌లైన్స్‌కు ఆర్డరు చేసింది. తద్వారా ఈ రకం విమానాలకు లాంఛ్‌ కస్టమర్‌ అయింది. ఎయిర్‌బస్‌ ఎ 380ను ఆపరేట్‌ చేసిన రెండో యూరోపియన్‌ ఎయిర్‌లైన్స్ లుఫ్తాన్సనే. (ఎయిర్‌ఫ్రాన్స్ తరువాత. మొదటి ఎ 380 రకం విమానం 2010 మే 18న డెలివరీ ఇచ్చింది. మొదటి ఎ 380 రకం విమానాం 2010 మే 18న డెలివరీ ఇచ్చింది.[10]

అలయన్సులు మరియు భాగస్వామ్యం[మార్చు]

లుఫ్తాన్సాలో ప్రయివేటు పెట్టుబడిదారులకు 88.52శాతం, ఎమ్‌జిఎల్‌ గెసిల్‌ఛాఫ్ట్‌ ఫర్‌ లుఫ్‌వెర్కర్‌వుర్ట్ కు 10.05శాతం, డ్యూయిష్‌ పోస్టుబ్యాంకుకు 1.03శాతం మరియు డ్యూయిష్‌ బ్యాంకుకు 0.4శాతం వాటాలున్నాయి. మరియు దీనికి 37,042 మంది ఉద్యోగులున్నారు.[3]

డిసెంబరు 14న లుఫ్తాన్స మరియు అమెరికన్‌లో కాస్ట్ ఎయిర్‌లైన్స్ జెట్‌ ఎయిర్‌వేస్‌ తమ మధ్య భాగసామ్యం ప్రారంభం కానున్నట్లు ప్రకటించాయి. దీనికి అనుగుణంగా లుఫ్తాన్స జెట్‌ బ్లూ యొక్క 19శాతం షేర్లను కొనుగోలు చేసింది. ఈయూ-అమెరికా మధ్య ఒపెన్‌ స్కై అగ్రిమెంట్‌ 2008లో అమల్లోకి వచ్చిన తరువాత యూరోపియన్‌ ఎయిర్‌లైన్స్, ఒక అమెరికన్‌ ఎయిర్‌లైన్స్ తో కుదుర్చుకున్న తొలి పెద్ద యాజమాన్యం ఒప్పందం ఇదే.

లుఫ్తాన్స ఎయిర్‌బస్‌ ఎ 340-300 రకాన్ని మొదటిసారిగా నడిపిన సంస్థ

2007 తరువాత లుఫ్తాన్సకు కార్గో హబ్‌ విషయలో రష్యాతో వివాదం ఏర్పడిరది. దీంతో ఇది తన యొక్క కార్గోహబ్‌ను కజికిస్థాన్‌ నుంచి బలవంతంగా రష్యాకు మార్చాల్సి వచ్చింది.

2008 ఆగస్టు 28లో లుప్తాన్స మరియు బ్రసెల్స్‌ ఎయిర్‌లైన్స్ తమ రెండుసంస్థల విలీనాలకి సంబంధించి చర్చలు జరుగుతున్నట్లు ప్రకటించాయి.[11]

2008 సెప్టెంబరు 28లో లుఫ్తాన్స, బ్రసెల్స్ ఎయిర్‌లైన్స్లో 45శాతం వాటాన్ని ఆప్షన్‌ విధానంలోను మిగిలిన 55శాతాన్ని 2011లోను కొనుగోలు చేయనున్నట్లు రెండు సంస్థలు ఉమ్మడిగా ప్రకటించాయి. ఈ ఒప్పందం కారణంగా బ్రసెల్స్ ఎయిర్‌లైన్స్‌ స్టార్‌ అలయన్స్‌లో చేరాల్సి వచ్చింది. బ్రసెల్స్‌ డిసెంబరు 2009లో స్టార్‌ అలయెన్స‌లో చేరింది.[12][13][14]

లుఫ్తాన్స బిఏఈ 146ఆర్‌జే 85

2008 అక్టోబరు 28న లుఫ్తాన్స బిఎమ్‌ఐలో మరో 60శాతం వాటాను ( లుఫ్తాన్సకు అప్పటికే ఉన్న 20శాతం వాటాకు అదనంగా) కొనుగోలు చేయడానికి కసరత్తు చేసింది. దీని ఫలితంగా మాజీ యజమాని సర్‌ మైకెల్‌ బిషప్‌తో వివాదం ఏర్పడిరది. అయితే రెండు వర్గాలు జూన్‌ 2009లో ఒక ఒప్పందానికి వచ్చాయి. ఈ షేర్ల కొనుగోలు అనేది 2009 జూలై 1 నుంచి ప్రారంభించవచ్చని తీర్మానించారు.[15] స్కాండినేవియన్‌ ఎయిర్‌లైన్స్ నుంచి మరో 20శాతం వాటాను కొనుగోలు చేయడం ద్వారా బిఎమ్‌ఐపై లుప్తాన్స 2008 నవంబరు 1 నాటికి పూర్తిగా పట్టు సంపాదించింది.[16]

నవంబరులో లుఫ్తాన్స మరియు ఆస్ట్రియన్‌ ఎయిర్‌లైన్స్ ఒక ఒప్పందాన్ని ప్రకటించాయి.ఈ ఒప్పందం ప్రకారం లుఫ్తాన్స ఆస్ట్రియన్‌ ప్రభుత్వం వద్దనున్న ఆస్ట్రియన్‌ ఎయిర్‌లైన్స్ కు సంబంధించిన మెజారిటీ వాటాను కొనుగోలు చేస్తుంది. ఈ ఒప్పందం జనవరి 2006లో పూర్తయింది. జనవరి 2009లో స్కాండినేవియన్‌ ఎయిర్‌లైన్స్ యొక్క విలీనానికి సంబంధించి తీవ్రంగా చర్చలు జరుపుతున్నట్లు లుఫ్తాన్స ప్రకటించింది. స్కాండినేవియన్‌ ఎయిర్‌లైన్స్ యొక్క ఆర్థిక పరిస్థితి గడిచిన కొద్ది సంవత్సరాలుగా పెద్దగా మెరుగ్గా లేకపోవడంతో, ఈ ఒప్పందం లాభసాటిగా మారాలంటే స్కాండినేవియన్‌ ఎయిర్‌లైన్స్‌లో లుఫ్తాన్స భారీగా మార్పుచేర్పులు చేసుకోవాల్సిన పరిస్థితి కనపడిరది. మే2009లో ఆర్థిక సాయం వ్యవహారంలోనే రెండు కంపెనీల మధ్య చర్చలు జరపాల్సిన పరిస్థితి నెలకొంది తప్ప, స్కాండినేవియన్‌ ఎయిర్‌లైన్స్ ను టేక్‌ఓవర్‌ చేసే ఆలోచనే తమకు లేదని లుఫ్సాన్స ప్రకటించింది.[17] దీనికి అదనంగా ఇబెరియా ఎయిర్‌లైన్స్ విలీనానికి సంబంధించి బ్రిటిష్‌ ఎయిర్‌వేస్‌ విలీన ప్రక్రియను పూర్తిచేయనట్లయితే, స్పానిష్‌ ఎయిర్‌లైన్స్‌తో చర్చలు ప్రారంభించడానికి ప్రయత్నిస్తామని పేర్కొంది.[18]

కార్పొరేట్‌ వ్యవహారాలు, గుర్తింపు[మార్చు]

ప్రధాన కార్యాలయాలు[మార్చు]

కొలోన్‌లోని డ్యూయిష్‌లో లుఫ్తాన్స యొక్క ప్రధాన ద్వారం

లుఫ్తాన్స యొక్క ప్రధానకార్యాలయం కొలోన్‌లో ఉంది.[19]

కోలోన్‌లో ఉన్న లుఫ్తాన్స యొక్క ప్రధాన కార్యాలయం తళుకులీనేటట్లుందని లారెన్స్ ఫెలోస్‌ 1971లో ద న్యూయార్క్ టైమ్స్లో వర్ణించాడు.[20] 1986లో టెర్రరిస్టులు లుఫ్తాన్స ప్రధాన కార్యాలయంలో బాంబులు వేశారు.[21] ఈ బాంబు దాడుల్లో ఒక్క వ్యక్తి కూడా గాయపడలేదు.

2006లో కోలోన్‌లోని డ్యూయిజ్‌లో లుఫ్తాన్స యొక్క ప్రధాన కార్యాలయ నిర్మాణానికి శంకుస్థాపన జరిపారు. 2007 నాటికి లుఫ్తాన్స తన యొక్క 800 మంది ఉద్యోగులతోపాటు, కంపెనీ యొక్క ఫైనాన్స్ డిపార్ట్ మెంట్ను కొత్త బిల్డింగ్‌లోకి మార్చాలని లుఫ్తాన్స భావిస్తోంది.[22]

లుఫ్తాన్సకు సంబంధించిన చాలా డిపార్ట్మెంట్లు ప్రధాన కార్యాలయంలో లేవు. దీనికి బదులుగా ఫ్రాంక్‌ఫర్డ్ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టులో ఉన్న లుఫ్తాన్స యొక్క ఏవియేషన్‌ సెంటర్‌లో ఈ విభాగాలున్నాయి. ఈ డిపార్ట్మెంట్లలో కార్పొరేట్‌ కమ్యునికేషన్స్[23], ఇన్వెస్టర్‌ రిలేషన్స్[24], మీడియా రిలేషన్‌[25] మొదలైనవి ఉన్నాయి.

సహాయకారులు/అనుబంధ సంస్థలు[మార్చు]

ప్రధాన కార్యకలాపాలతో పాటు లుఫ్తాన్సకు ఎన్నో సబ్సిడిరీలు ఉన్నాయి.
ఎయిర్‌లైన్‌ సబ్సిడరీలు

ఇతర కార్యకలాపాలు

 • డెల్‌వాగ్‌, ఎయిర్‌ట్రాన్స్ పోర్ట్ ‌లో స్పెషలైజేషన్‌ ఉన్న ఇన్స్యూరెన్స్ ‌ కంపెనీ
 • గ్లోబల్‌ లోడ్‌ కంట్రోల్‌, రిమోట్‌ వెయిట్‌ మరియు బ్యాలెన్స్ సర్వీసుల్లో ప్రపంచ నెంబర్‌ వన్‌
 • ఎల్‌ఎస్‌జి స్లై ఛెఫ్ట్స్‌, ప్రపంచంలో అతి పెద్ద ఎయిర్‌లైన్స్‌ క్యాటరర్‌, ప్రపంచ ఎయిర్‌లైన్స్ ‌మార్కెట్లో ఇది మూడో వంతు భోజనం సరఫరా చేస్తోంది.
 • లుఫ్తాన్స కమర్షియల్‌ హోల్డింగ్‌, ఇందులో లుఫ్సాన్స 13శాతం వాటాను కలిగిఉంది. ఇది లుఫ్సాన్స వాటా కలిగి ఉన్న 400 సేవా మరియు ఫైనాన్స్ కంపెనీలకు సంబంధించిన సేవలను అందిస్తుంది.
 • లుఫ్తాన్స ఫ్లైట్‌ ట్రైనింగ్‌, ఫ్లైట్‌ క్రూ ట్రైనింగ్‌ను అందిస్తుంది. వివిధ రకాల ఎయిర్‌లైన్స్‌తో పాటు, సొంత పైలట్లకు శిక్షణ ఇచ్చే ప్రధాన విభాగం
 • లుఫ్తాన్స రీజనల్‌, లుఫ్తాన్స సిటీలైన్‌తోపాటు అనేక చిన్న ప్రాంతీయ ఎయిర్‌లైన్స్‌తో కలిసి విస్త్రుతమైన ఆపరేషన్స్‌ నిర్వహిస్తోంది.
 • లుఫ్తాన్స సిస్టమ్స్‌, అతి పెద్ద యూరోపియన్‌ ఏవియేషన్‌ ఐటీ సేవలను అందించే సంస్థ
 • లుఫ్తాన్స టెక్నిక్‌, ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటెన్స్ సేవలందించే సంస్థ

బ్రాండ్‌ చరిత్ర[మార్చు]

విమానం మధ్య ఉన్న సర్కిల్‌లో కొంగ ఉన్న లుఫ్తాన్స లోగోను 1918లో రూపొందించారు. ఇది 1919 ఫిబ్రవరి 5లో సేవలందించడం ప్రారంభించిన మొదటి జర్మన్‌ ఎయిర్‌లైన్‌ డ్యూయిష్‌ లుఫ్త్‌ట్రీడ్‌రీ జిఎమ్‌బిహెచ్‌ (డిఎల్‌ఆర్‌) లోగో. అందంగా ఉండే కొంగలను ఫ్రొఫెసర్‌ ఒట్టో ఫిరేల్‌ రూపొందించారు. 1926లో లుఫ్తాన్స ఎరో లాయిడ్‌ ఎజీ నుంచి ఈ సింబల్‌ను పొందింది. ఇది డిఎల్‌ఆర్‌లో 1923లో విలీనమైంది. లుఫ్తాన్స అనే పేరు సృష్టించింది.ఎఫ్‌. ఎ. ఫిషర్‌ వాన్‌ పుటర్‌జెన్‌ అని భావిస్తారు. 1925లో అప్పటి ఏవియేషన్‌ విధాన రూపకర్తలకు ఉన్న మార్గాలకు సంబంధించి ఆయన లుఫ్త్‌`హాన్స అనే పుస్తకాన్ని వెలువరించాడు. జంకర్స్ లుఫ్‌విర్‌కెహర్‌ ఏజి మరియు డ్యూయిష్‌ ఎరో లాయిడ్‌ల విలీన ఫలితంగా ఏర్పడ్డ కంపెనీకు లుఫ్తాన్స అనే పేరు పెట్టారు.[8]

గమ్యస్థానాలు[మార్చు]

విమానాలు[మార్చు]

ఎయిర్ బస్ ఎ319-100 లాండింగ్ తరువాత టాక్సింగ్ణ్
ఎయిర్ బస్ ఎ320
ఎయిర్ బస్ ఎ321
బోయింగ్ 737-500
ఎయిర్ బస్ ఎ340-600
బోయింగ్ 747-400
1981లో బోయింగ్ 727-200

లుఫ్తాన్స విమానాలు [30][31][32]
విమానం మొత్తం ఆర్డర్స్ ప్రయాణీకులు
(ఫస్ట్, బిజినెస్ ఎకానమి)
ఎయిర్ బస్ ఎ319-100 28 9 126 (0/24/102)
ఎయిర్ బస్ ఎ320-200 44 8 146 (0/32/114)
ఎయిర్ బస్ ఎ321-100 20 0 186 (0/31/155)
ఎయిర్ బస్ ఎ321-200 23 22 186 (0/31/155)
ఎయిర్ బస్ ఎ330-300 15 0 221 (8/48/165)
ఎయిర్ బస్ ఎ340-300 26 0 241 (8/36/197)
221 (8/48/165)
266 (0/44/222)
ఎయిర్ బస్ ఎ340-600 24 0 306 (8/60/238)
345 (0/66/279)
ఎయిర్ బస్ ఎ380-800 2 13 526 (8/98/420)
బోయింగ్ 737-300 33 0 124 (0/18/106)
బోయింగ్ 737-500 30 0 108 (0/18/90)
బోయింగ్ 747-400 30 0 330 (16/80/234)
352 (16/66/270)
378 (16/52/310)
బోయింగ్ 747-8I 0 20 టిబిఏ
మొత్తం 275 72

విమానాల చరిత్ర[మార్చు]

గడిచిన సంవత్సరాలలో

1955 నుంచి లుఫ్తాన్స ఉపయోగించిన విమానాలు
విమానం ప్రవేశపెట్టింది రిటైర్ అయింది గమనికలు
ఎయిర్‌బస్‌ ఎ300 1976
1987
1984
2009
ఎయిర్‌బస్‌ ఎ310 1984 2005
ఎయిర్‌బస్‌ ఎ319 1996
ఎయిర్‌బస్‌ ఎ320 1989
ఎయిర్‌బస్‌ ఎ321 1994
ఎయిర్‌బస్‌ ఎ330-200 2002 2006
ఎయిర్‌బస్‌ ఎ330-300 2004
ఎయిర్‌బస్‌ ఎ340-200 1993 2006
ఎయిర్‌బస్‌ ఎ340-200 1999
ఎయిర్‌బస్‌ ఎ340-600 2003
ఎయిర్‌బస్‌ ఎ380 2010
బోయింగ్ 707 విమానాలు 1960 1984 కార్గో అవసరాలకు కూడా దీన్ని ఉపయోగించారు.
బోయింగ్ 720 విమానాలు 1961 ?
బోయింగ్ 727 1964 1992 కార్గో ఎయిర్ క్రాఫ్ట్ గాను మార్చవచ్చు
బోయింగ్ 727-100 1967 1983 లాంచ్ కస్టమర్
బోయింగ్ 727-200 1969 2000
బోయింగ్ 737-300 1986
బోయింగ్ 737-400 1992 1998
బోయింగ్ 737-500 1990
బోయింగ్ 747-100 1970 1979 కార్గో అవసరాలకు కూడా దీన్ని ఉపయోగించారు.
బోయింగ్ 747-200 1971 2005 కార్గో అవసరాలకు కూడా దీన్ని ఉపయోగించారు.
బోయింగ్ 747-400 1989
కాంవైర్ సివి -340/440 1955 1969 కార్గో అవసరాలకు కూడా దీన్ని ఉపయోగించారు.
లాక్‌హెడ్‌ సూపర్‌ కన్‌స్టలేషన్‌/స్టార్‌లైనర్‌ 1955 1967
డగ్లస్ డిసి -4 1957 ? కార్గో ఎయిర్ క్రాఫ్ట్
మెక్డోనాల్ డగ్లస్ డిసి-10 1974 1996
మెక్డోనాల్ డగ్లస్ ఏండి-11 1998 కార్గో ఎయిర్ క్రాఫ్ట్
వికెర్స్ విస్కౌంట్ 1957 1971 కార్గో అవసరాలకు కూడా దీన్ని ఉపయోగించారు.

ఎయిర్‌బస్‌ ఎ 380[మార్చు]

లుప్తాన్స ఎయిర్‌బస్‌ ఏ 380 టెస్టింగ్‌ తరువాత యాంగర్‌ కోసం తీసుకొని వెళుతున్నది. జోహానస్‌బర్గ్‌కు జూన్‌ 6,2010 తొలిసారి ఎగరడానికి షెడ్యూలు ఖరారైంది.[33]

2001 డిసెంబరు 6లో లుఫ్తాన్స 15 ఎయిర్‌బస్‌ ఏ 380 సూపర్‌ జెంబ్లో పది అదనపు అప్షన్స్‌తో కొనుగోలు చేయడానికి ఆర్డరు చేసినట్లు ప్రకటించింది. దీన్ని 2001 డిసెంబరు 20న ధ్రృవీకరించింది. ఎ 380 విమానాలు ఫ్రాంక్‌ఫర్డ్ నుంచి దూర ప్రాంతాలను వెళ్లేందుకు ఉపయోగించాలనకున్నారు. 2010 మే 19లో వచ్చిన మొదటి విమానాన్ని ఫ్రాంక్‌ఫర్డ్ ఆమ్‌ మెయిన్‌ అని పేరు పెట్టారు. జూన్‌11, 2010లో ఎయిర్‌బస్‌ ఏ 380 యొక్క మొదటి రూట్‌ ఫ్రాంక్‌ఫర్డ్ నుంచి టోక్కోకు లుఫ్తాన్స నడిపింది.[34] రెండో ఎయిర్‌ ఏ 380కు మ్యూన్‌చిన్‌ (మ్యూనిచ్‌) అని పేరు పెట్టింది. ఇది జూలై2010లో డెలివరీ అయింది.[35] 2010నాటికి మరో నాలుగు ఇదే తరహా విమానాలు రావొచ్చని లుఫ్తాన్స భావిస్తోంది. కొత్త విమానాలు వచ్చిన తరువాత ఎ380 విమానాలు ఆగస్టు 2010నుంచి బీజింగ్‌కు అక్టోబరు2010లో జోహానెస్‌బర్గ్‌కు నడపనుంది. ఆసక్తికర అంశమేమిటంటే, ఈ మూడు గమ్యస్థానాలకు సహ యూరోపియన్‌ ఏ 380 ఆపరేటర్‌ ఎయిర్‌ఫ్రాన్స్‌ విమానాలు నడుపుతోంది. లుఫ్తాన్స 2010-2011 శీతాకాలం సీజన్‌లో న్యూఢిల్లీకు సూపర్‌ జెట్‌ను నడపాలని భావిస్తోంది.[36]

వింటేజ్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ ల పునరుద్ధరణ[మార్చు]

ఎయిర్‌లైన్స్‌ యొక్క మెయింటెన్స్‌ ప్రధాన విభాగమైన లుఫ్తాన్స టెక్నిక్‌, 1936లో రూపొందించిన జంకర్స్ జెయు-52 విమానాన్ని ఎయిర్‌వర్తీనెస్‌కు తీసుకొచ్చింది. దీన్ని బెర్లిన్‌ నుంచి రోమ్‌కు ఆల్ఫ్ పర్వతాల మీదగా పదిగంటల ప్రయాణానికి వినియోగించేవారు. ఒక వేలంపాటలో కొనుగోలు చేసిన మూడు లాక్‌హీడ్‌ సూపర్‌ కన్‌స్టలేషన్‌ల యొక్క విడిభాగాలను ఉపయోగించి, మరొకదాన్ని తిరిగి రూపొందిస్తోంది. లుఫ్తాన్స యొక్క సూపర్‌ కన్‌స్టలేషన్స్ మరియు ఎల్‌ 1649 స్టార్‌లైనర్లుహాంబర్గ్- మాడ్రిడ్‌-డాకర్‌- కారకాస్‌- శాంటియాగో మార్గాల్లో ప్రయాణించెది. లుఫ్సాన్స టెక్నిక్‌ నైపుణ్యమైన కార్మికుల కోసం రిటైర్డ్ అయిన ఉద్యోగులు మరియు వాలంటర్లీను నియమించుకుంటుంది.[37][38] విమాన ఔత్సాహికుల కోసం ఈ పునరుద్ధరించిన ఎయిరోప్లేన్లపై ప్రయాణించే అవకాశం కల్పిస్తోంది. ఎయిర్‌వర్తీ జు52 లిస్టును కూడా గమనించండి)

కాబిన్[మార్చు]

లుఫ్తాన్స బోయింగ్‌ 747-400 బిజినెస్‌ క్లాస్‌

ఖండాతరాల్లో[మార్చు]

లూఫ్తాన్స ఎయిర్‌బస్‌ ఎ 340 -600లోపల ఎకానమీ క్లాస్‌

ఫస్ట్ క్లాస్‌: లుఫ్తాన్స ఫస్ట్ క్లాస్‌ను దూర ప్రయాణం చేసే అన్ని ఎయిర్‌క్రాఫ్ట్లు ( ఎయిర్‌బస్‌ ఏ 330-300, ఎ340-300, ఎ340-600మరియు ఎ 380-800, బోయింగ్‌ 747-400) లో ఉన్నాయి. ప్రతి సీటు రెండు మీటర్ల బెడ్‌, లాప్‌టాప్‌ పవర్‌ అవుట్‌లెట్స్‌తోపాటు, వినోదకార్యక్రమాల సదుపాయాలున్నాయి. ప్రయాణీకుల కోరిక మేరకు ఆహారాన్ని అందిస్తారు. చాలా ఎయిర్‌పోర్టుల్లో ప్రత్యేకమైన ఫస్ట్ క్లాస్‌ చెక్‌ఇన్‌ పాయింట్లను ఏర్పాటు చేసింది. దీనితోపాటు ఫస్ట్‌ క్లాస్‌ ప్రయాణీకుల కోసం ఫ్రాంక్‌ఫర్డ‌ మరియు మ్యూనిచ్‌ల్లో ప్రత్యేక లాంజ్‌లు మరియు ఫ్రాంక్‌ఫర్డ్ లో ప్రత్యేక ఫస్ట్‌ క్లాస్‌ టెర్మినల్‌ను కూడా ఏర్పాటు చేసింది. వచ్చే ప్రయాణీకులు లుఫ్తాన్స ఫస్ట్ క్లాస్‌ ఎరైవల్‌ సదుపాయాలతోపాటు, కొత్త వెల్‌కమ్‌ లాంజ్‌ను ఉపయోగించుకోవచ్చు. లుఫ్తాన్స కొత్త ఫస్ట్‌ క్లాస్‌ ప్రోడక్ట్ ‌ను ఎయిర్‌బస్‌ ఏ 380లో ప్రవేశపెట్టింది. దూరప్రయాణం చేసే ఇతర అన్ని విమానాల్లోనూ దీన్ని క్రమేపీ ప్రవేశపెట్టనున్నారు.లుఫ్తాన్స కొత్త ఫస్ట్ క్లాస్‌ ప్రొడక్ట్‌ను ఎయిర్‌బస్‌ ఏ 380లో ప్రవేశపెట్టింది.దూరప్రయాణం చేసే ఇతర అన్ని విమానాల్లోనూ దీన్ని క్రమేపీ ప్రవేశపెట్టనున్నారు.[39]

బిజినెస్‌ క్లాస్‌: లుఫ్తాన్స దూరప్రయాణం చేసే అన్ని విమానాల్లో బిజినెస్‌ క్లాస్‌ ప్రవేశపెట్టింది.ప్రతి సీటు రెడు మీటర్ల బెడ్‌, లాప్‌టాప్‌ పవర్‌ అవుట్‌లెట్స్‌తోపాటు, వినోదకార్యక్రమాల సదుపాయాలున్నాయి. చాలా ఎయిర్‌పోర్టుల్లో ప్రత్యేకమైన బిజినెస్‌ క్లాస్‌ చెక్‌ఇన్‌ పాయింట్లను ఏర్పాటు చేసింది. చాలావిమానాశ్రయాల్లో ప్రత్యేక బిజినెస్‌క్లాస్‌ లాంజ్‌లను లేదా కొన్ని ఎయిర్‌ పోర్టుల్లో కాంట్రాక్ట్ లాంజ్‌లనుఏర్పాటు చేసింది. ఫ్రాంక్‌ఫర్డ్‌లో వచ్చే ప్రయాణీకులు లుఫ్తాన్స వెల్‌కమ్‌ లాంజ్‌ను ఉపయోగించుకొనవచ్చు.

ఎకానమీ క్లాస్‌: లుఫ్తాన్సలో దూర ప్రయాణం చేసే అన్ని విమానాల్లో ఎకానమీ క్లాసును అందిస్తున్నారు. అన్ని విమానాల్లో 31ఇంచ్‌ల పొడవుండే సీట్లు ఉంటాయి. ఎయిర్‌బస్‌ ఎ340లో మాత్రం సీట్‌పిచ్‌ 32గా ఉంటుంది. ప్రయాణీకులు భోజనంతోపాటు ఉచితం పానీయాలు పొందగలుగుతారు. 2007లో లుఫ్తాన్స ఎకానమీ క్లాస్‌లో పర్సనల్‌ ఆడియో వీడియో ఆన్‌ డిమాండ్‌ సదుపాయాన్ని ప్రవేశపెట్టింది. ఒక్క బోయింగ్‌ 747లు తప్ప అన్ని దూరప్రయాణ విమానాలను రీఫిట్‌ చేశారు.

యూరోపియన్ డొమెస్టిక్[మార్చు]

బిజినెస్‌ క్లాస్‌: లుఫ్తాన్స తక్కువ దూరం ప్రయాణించే విమానాల్లో బిజినెస్‌ క్లాస్‌లో 31 నుంచి 32 ఇంచ్‌ల సీట్‌ పిచ్‌ ఎ319, ఎ320, ఎ321 మరియు బి737 ఎయిర్‌క్రాఫ్ట్‌ల్లో ఉంటుంది. ప్యాసింజర్లకు ఆహారంతోపాటు పానీయాలను కూడా అందిస్తారు. దీనితోపాటు ప్రత్యేకమైన బిజినెస్‌క్లాస్‌, లుఫ్తాన్స బిజినెస్‌ క్లాస్‌ లాంజ్‌లను ఏర్పాటు చేసింది. వీటిని ఎంపిక చేసిన మార్గాల్లో ఈ ఎయిర్‌క్రాఫ్ట్‌లను ఉపయోగిస్తున్నారు. తక్కువ వ్యవధి విమానాల్లో వినోదకార్యక్రమాలుండవు.

ఎకానమీ క్లాస్‌: లుఫ్తాన్స తక్కువ దూరం ప్రయాణించే విమానాల్లో ఎకానమీ క్లాస్‌లో 31 నుంచి 32 ఇంచ్‌ల సీట్‌ పిచ్‌ ఎ319, ఎ320, ఎ321 మరియు బి737 ఎయిర్‌క్రాఫ్ట్‌ల్లో ఉంటుంది. ప్రయాణీకులకు పానీయాలు, స్నాక్స్ మరియు భోజనం అందిస్తారు. తక్కువ వ్యవధి విమానాల్లో వినోదకార్యక్రమాలుండవు.

జులై 2010లో లుఫ్తాన్స యూరోపియన్‌ విమానాల్లో తక్కువ బరువుండే సీట్లను ఏర్పాటు చేయడం ద్వారా కొత్త క్యాబిన్లు రూపొందిస్తున్నట్లు పేర్కొంది. సామర్థ్యం పెంచడం కోసం 12 కొత్త ఎ320 రకం విమానాలను కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించింది.[40]

లాంజ్ లు[మార్చు]

లాంజ్ యాక్సెస్ క్లాస్ యాక్సెస్-పరిస్థితి గమనికలు నెట్ వర్క్ లో సంఖ్య
ఫస్ట్ క్లాసు టెర్మినల్ ఫస్ట్ క్లాసు హెఛ్ ఓ ఎన్ సర్కిల్ ఎఫ్ ఆర్ ఎ మాత్రమే 1
ఫస్ట్ క్లాసు లాంజ్ ఫస్ట్ క్లాసు హెఛ్ ఓ ఎన్ సర్కిల్ ఎఫ్ ఆర్ ఎ మరియు ఎం యు సి మాత్రమే 3
సెనేటర్ లేదా లాంజ్ ఫస్ట్ క్లాసు సెనేటర్ లేదా దానికన్నా ఎక్కువ
స్టార్ అలయన్స్ గోల్డ్
30
బిజినెస్ లాంజ్ బిజినెస్ క్లాసు (లేదా ఎక్కువ ) తరచుగా ప్రయాణిచే వారు (లేదా ఎక్కువ) 26
వెల్ కం లాంజ్ బిజినెస్ క్లాసు (లేదా ఎక్కువ ) తరచుగా ప్రయాణిచే వారు (లేదా ఎక్కువ) ఎఫ్ ఆర్ ఎ మాత్రమే
ఖండాంతర ప్రయాణికులకు మాత్రమే
స్టార్ అలయన్ గోల్డ్ లేదు
1

లుఫ్తాన్స నాలుగు రకాల లాంజ్ ఆపరేట్ చేస్తోంది. ఫస్ట్ క్లాసు, సెనేటర్, బిజినెస్ మరియు వెల్ కం లాంజ్ లు. ప్రతి డిపార్చర్‌ లాంజ్‌లో ట్రావెల్‌ క్లాస్‌, దూరం మరియు ఇంకా స్టార్‌ అలయెన్స్‌ స్టేటస్‌ ఆధారంగా వ్రవేశం ఉంటుంది. వెల్‌కం లాంజ్‌ అనేది ఎరైవల్‌ లుఫ్తాన్స ప్రీమియం ప్యాసెంజర్లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.

పస్ట్ క్లాస్‌ టెర్మినల్‌[మార్చు]

లుఫ్తాన్స ఫ్రాంక్‌ఫర్డ్ ఎయిర్‌పోర్ట్ లో ఫస్ట్ క్లాస్‌ టెర్మినల్‌ను నిర్వహిస్తోంది. లుఫ్తాన్స ఫస్ట్ క్లాస్‌ మరియు హెచ్‌ఓఎన్‌ సర్కిల్‌ సభ్యులకు మాత్రమే ఇందులో ప్రవేశం పరిమితం. సుమారు 200 మంది సిబ్బంది సుమారు ప్రతిరోజు 300మంది సభ్యులకు సేవలందిస్తారు. ఇందులో ఫుల్‌ సర్వీస్‌ రెస్టారెంట్‌, ఫుల్‌బార్‌, సిగార్‌లాంజ్‌, రిలాక్సేషన్‌ రూమ్‌లు మరియు ఆఫీసురూమ్‌లతోపాటు స్నాన సదుపాయాలున్నాయి. గెస్ట్ లను ఎగరాల్సిన ఫ్లైట్ల వరకు మెర్సిడెంజ్‌ బెంజ్‌, పోర్సీ పనమోరా లేదా పోర్సీ కెనిన్‌లో తీసుకుకెళతారు.

మైల్స్ అండ్‌ మోర్‌[మార్చు]

లుఫ్తాన్స తరచుగా ఏర్పాటు చేసే ఫ్లైయర్‌ ప్రోగ్రామ్‌ పేరు మైల్స్ అండ్‌ మోర్‌. ఇది ఇతర యూరోపియన్‌ ఎయిర్‌లైన్స్ సంస్థలైన ఆస్ట్రియన్‌ ఎయిర్‌లైన్స్, ఎల్‌ఓటి పోలిష్‌ ఎయిర్‌లైన్స్, స్విస్‌ ఇంటర్నేసనల్‌ ఎయిర్‌లైన్స్, లక్స్ ఎయిర్‌, క్రోయేషిన్‌ ఎయిర్‌లైన్స్‌, ఆడ్రియా ఎయిర్‌వేస్‌మరియు బ్రసెల్స్ ఎయిర్‌లైన్స్తో కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. మైల్స్ అండ్‌ మోర్‌ సభ్యులు లుఫ్తాన్స మరియుస్టార్‌ అలయన్స్‌ పార్టర్‌ విమానాల్లో ప్రయాణించడం ద్వారా, లుఫ్తాన్స క్రెడిట్‌ కార్డులను ఉపయోగించి, లుఫ్తాన్స షాపుల్లో కొనుగోలు చేయడం ద్వారా అదనపు మైళ్లను పొందగలుగుతారు. నిర్దిష్ట పార్టనర్‌తో కలిసి ఒక క్యాలెండర్‌ సంవత్సరంలో ఎన్ని మైళ్లు ప్రయాణించారన్న దాన్ని ఆధారంగా చేసుకొని మైల్స్‌ అండ్‌ మోర్‌లో స్థాయిని నిర్ధారిస్తారు. మెంబర్‌షిప్‌ స్థాయిలు ఇలా ఉంటాయి. బేసిక్‌ ( ఎలాంటి కనీస పరిమితి ఉండదు), ఫ్రీక్వెంట్‌ ట్రావెలర్‌ ( సిల్వర్‌, 35 వేల మైళ్ల పరిధి), సెనేటర్‌ ( గోల్డ్‌, అరవై వేల మైళ్ల పరిధి, జర్మనీవాసులకు 1,30,00) మరియు హెచ్‌ఓఎన్‌ సర్కిల్‌ ( బ్లాక్‌, 600,000 రెండు క్యాలెండర్‌ సంవత్సరాల్లో). నాన్‌ బేసిక్‌స్థాయి వారందరూ లాంజ్‌లతోపాటు, ఎగ్జిక్యూటివ్‌ బోనస్‌ మైల్స్ సాయంతో మరింత పై లెవల్స్‌కు చేరుకోవడానికి, ప్రత్యేక బోనస్‌లు అందిస్తారు.

కోడ్‌షేరింగ్‌ ఒప్పందం[మార్చు]

లుఫ్తాన్స కోడ్‌షేరింగ్‌ ఒప్పందంతో పాటు ఫ్రీక్వెంట్‌ ఫ్లైయర్‌ ప్రోగామ్స్‌కు సంబంధించి దిగువ ఎయిర్‌లైన్స్‌తో భాగస్వామ్యం ఉంది.

వలిగ్న్="టాప్" వలిగ్న్="టాప్" వలిగ్న్= టాప్ వలిగ్న్="టాప్"

స్టార్‌ అలయన్స్ సభ్యుడు

ప్రమాదాలు, ఘటనలు[మార్చు]

వీటిని కూడా చూడండి[మార్చు]

సూచనలు[మార్చు]

 1. "Our hubs in Frankfurt, Munich, Dusseldorf and Zurich". Lufthansa. 2007-02-16. Retrieved 2010-06-06. Cite web requires |website= (help)
 2. "Airline Membership". IATA. మూలం నుండి 2012-10-12 న ఆర్కైవు చేసారు. Retrieved 2010-08-02.
 3. 3.0 3.1 3.2 "Directory: World Airlines". Flight International. 2007-04-03. p. 107.
 4. "We hereby invite our shareholders to attend the 51st Annual General Meeting Archived 2011-07-14 at the Wayback Machine.." లుఫ్తాన్స 25, ఆగస్ట్టు2009 నుంచి తిరిగి పొందబడింది.
 5. హౌటు గెట్‌ దేర్ Archived 2006-11-01 at the Wayback Machine.‌, లుఫ్తాన్స 18 జూలై 2007లో తిరిగి పొందబడింది.
 6. లుఫ్తాన్స ఓపెన్స్‌ న్యూ ఆఫీస్‌ కాంప్లెక్స్ ఇన్‌ ఫ్రాంక్‌ఫర్డ్‌( లుఫ్తాన్స యురోప్‌నెట్‌ న్యూజి కొంచిరానాజింట్రెల్‌ ఇన్‌ ప్రాంక్‌ఫర్డ్, యూరోపియన్‌ ఇంటెలిజెన్స్‌, యూరోపియన్‌ ఇంటెలిజెన్స్ వైర్ 1 జూలై 2007 25, ఆగస్ట్టు2009 నుంచి తిరిగి పొందబడింది.
 7. లుఫ్తాన్స ఫ్లైస్‌ టు 50 ఇయర్‌ మైల్‌స్టోన్‌, డ్యూయిష్‌వెల్లి జనవరి 17, 2007. ఆగస్టు 4, 2009 పునరుద్ధరించబడింది.
 8. 8.0 8.1 "లుఫ్తాన్స క్రానికల్‌". మూలం నుండి 2009-10-10 న ఆర్కైవు చేసారు. Retrieved 2010-08-02. Cite web requires |website= (help)
 9. "Sedta Cuts Rates". Time Magazine. January 27, 1941. Retrieved 2007-09-14.
 10. Another airline enters the “A380 era” as Lufthansa receives its initial 21st century flagship aircraft
 11. "Lufthansa.com". మూలం నుండి 2009-01-08 న ఆర్కైవు చేసారు. Retrieved 2020-01-08. Cite web requires |website= (help)
 12. "లుఫ్తాన్స అధికారిక ప్రకటన". మూలం నుండి 2009-01-08 న ఆర్కైవు చేసారు. Retrieved 2020-01-08. Cite web requires |website= (help)
 13. బ్రసెల్స్ ఎయిర్‌లైన్స్ అధికారిక ప్రకటన
 14. staralliance.com
 15. http://www.dowjones.de/site/2009/06/lufthansa-reaches-deal-to-raise-stake-in-bmi-to-80.html Archived 2011-07-27 at the Wayback Machine., Dow Jones Deutschland, July 22, 2009
 16. లుఫ్తాన్స టు గెయిన్‌ ఫుల్‌ కంట్రోల్‌ ఆఫ్‌ బిఎమ్‌ఐ ఫ్రమ్‌ ఎస్‌ఏఎస్‌, వైల్‌ బిఎ కన్‌ఫర్మ్‌స్‌ ఇంట్రెస్ట్‌ ఇన్‌ ద యుకె క్యారియర్‌, సెంటర్‌ ఫర్‌ ఆసియా, ఫసిఫిక్‌ ఏవియేషన్‌, అక్టోబర్‌2, 2009
 17. ఇంప్యాక్ట్ పబ్లికేషన్‌
 18. FT.com UK
 19. ఇంప్రింట్‌ Archived 2009-11-05 at the Wayback Machine., లుఫ్తాన్స 25, ఆగస్టు2009 నుంచి తిరిగి పొందబడింది
 20. ఫెల్లోస్‌,లారెన్స్, జర్మన్స్‌ సెట్టింగ్‌ ఓన్‌ ఆఫీస్‌ అవర్స్, సమ్‌ జర్మన్‌ వర్కర్స్ సెట్‌ దైయిర్‌ ఓన్‌ అవర్స్ వితిన్‌ రీజన్‌, న్యూయార్క్ టైమ్స్. జులై12, 1971 పేజీ ఫిబ్రవరి 2, 2010న పునరుద్ధరించబడింది. లుఫాన్సా యొక్క కొత్త భవంతి తళుకులీనుతోంది. పశ్చిమజర్మనీలోని ఎన్నో ఇతర ఆఫీసులు, ఫ్యాక్టరీలకు పురుషులు, స్త్రీలు పనికోసం తమకు నచ్చినప్పుడు ఆఫీసుకు వెళి,్ల నచ్చినంత సేపు పనిచేయడానికి అందులో కారణముంది
 21. "Terrorists Shoot Berlin Official, Bomb Airline." లాస్ ఏంజిల్స్ టైమ్స్ 14-అక్టోబర్-05 సెక్షన్ 1,లేట్ ఫైనల్ డెస్క్ . స్టార్ట్ పేజి 2. ఫిబ్రవరి 2, 2010న పునరుద్ధరించబడింది. పశ్చిమ జర్మనీ టెర్రరిస్టులు బెర్లిన్‌ ఇమిగ్రేషన్‌ అధికారిని కాళ్లపై కాల్చడంతోపాటు ప్రభుత్వ ఆధీనంలో ఉన్న కొలోన్‌లో ఉన్న లుఫ్తాన్స ఎయిర్‌లైన్స్‌ యొక్క ప్రధాన కార్యాలయంపై బాంబులు విసిరారు.
 22. "Grundsteinlegung für Lufthansa Hauptverwaltung in Köln Archived 2013-06-04 at the Wayback Machine.." KFZ.net. ఫిబ్రవరి 2, 2010న పునరుద్ధరించబడింది. "Die Lufthansa hat mit einer Grundsteinlegung in Köln-Deutz den Beginn der Arbeiten für ihre neue Kölner Konzernzentrale gefeiert. Ende 2007 werden rund 800 Kölner Lufthanseaten, vor allem aus dem Konzernressort Finanzen, das Hochhaus am Rhein verlassen und in den nur wenige hundert Meter entfernten Neubau umziehen, erklärte das Unternehmen."
 23. "Service Contact Person Archived 2012-03-20 at the Wayback Machine.." లుఫ్తాన్స ఫిబ్రవరి 2, 2010న పునరుద్ధరించబడింది.
 24. "Contacts Investor Relations Archived 2011-07-14 at the Wayback Machine.." లుఫ్తాన్స ఫిబ్రవరి 2, 2010న పునరుద్ధరించబడింది.
 25. "మీడియా సంబంధాలు Archived 2011-06-20 at the Wayback Machine.." లుఫ్తాన్స ఫిబ్రవరి 2, 2010న పునరుద్ధరించబడింది.
 26. "ఆర్కైవ్ నకలు". మూలం నుండి 2013-02-18 న ఆర్కైవు చేసారు. Retrieved 2010-08-02. Cite web requires |website= (help)
 27. [1][dead link]
 28. CNN.com
 29. Reuters.com
 30. "Lufthansa-Fleet". మూలం నుండి 2012-05-19 న ఆర్కైవు చేసారు. Retrieved 2010-08-02. Cite web requires |website= (help)
 31. Lufthansa fleet list at ch-aviation.ch. Archived 2007-02-06 at the Wayback Machine.2010-02-09న పునరుద్దరించబడింది. Archived 2007-02-06 at the Wayback Machine.
 32. లుఫ్తాన్స సీట్ మ్యాప్
 33. [50]
 34. "A380". Lufthansa. 2007-02-16. Retrieved 2010-06-06. Cite web requires |website= (help)
 35. "Lufthansa takes second A380, while 747s ply short-haul". Flight Global. 2010. Retrieved 2010-07-18. Cite web requires |website= (help)
 36. "Lufthansa plans to fly Airbus A380 to India in winter – Yahoo! India News". In.news.yahoo.com. Retrieved 2010-06-06. Cite web requires |website= (help)
 37. లుఫ్తాన్స లేబర్‌ ఆఫ్‌ లవ్‌: రిస్టోరింగ్‌ సమ్‌ రియల్లీ ఓల్డ్‌ జంకర్స్‌ వాల్‌స్ట్రీన జర్నల్‌, జూన్‌, 16,2008
 38. ఇంజినీరింగ్‌ వెటరన్‌ ప్లేస్‌ ఏ వైటల్‌ రోల్‌ ఇన్‌ ప్లేన్స్ రీబర్త్
 39. http://a380.lufthansa.com/VIRTUALTOUR/#/DE/EN/EXPERIENCE/FIRSTCLASS
 40. "Lufthansa: Cabin layout rejig equates to 12 'free' A320s". Flight Global. 2010. Retrieved 2010-07-18. Cite web requires |website= (help)
 41. 20100525. "Azerbaijan Airlines codeshare with Lufthansa/Austrian « AIRLINE ROUTE". Airlineroute.net. Retrieved 2010-06-06. Cite web requires |website= (help)
 42. "జెట్ బ్లూ ఎయిర్ వేస్". మూలం నుండి 2013-07-09 న ఆర్కైవు చేసారు. Retrieved 2020-01-08. Cite web requires |website= (help)
 43. TAAG TO START LUFTHANSA CODESHARING
 44. "No casualties in Riyadh Lufthansa cargo plane crash". Reuters. Cite news requires |newspaper= (help)

బాహ్య లింకులు[మార్చు]


మూస:Star Alliance మూస:Navbox Airlines of Germany మూస:IATA members మూస:Association of European Airlines మూస:DAX companies


Coordinates: 50°56′15″N 006°58′11″E / 50.93750°N 6.96972°E / 50.93750; 6.96972