Jump to content

లూడో

వికీపీడియా నుండి
లూడో
దర్శకత్వంఅనురాగ్ బసు
రచనఅనురాగ్ బసు
నిర్మాత
తారాగణంఅభిషేక్ బచ్చన్
ఆదిత్య రాయ్ కపూర్
రాజ్‌కుమార్ రావు
పంకజ్ త్రిపాఠి
ఫాతిమా సనా షేక్
సన్యా మల్హోత్రా
రోహిత్ సరాఫ్
పెర్లే మానే
ఛాయాగ్రహణంఅనురాగ్ బసు
కూర్పుస్టీవెన్ హెచ్. బెర్నార్డ్
హేమల్ కొఠారి
సంగీతంప్రీతమ్
నిర్మాణ
సంస్థలు
టి-సిరీస్ ఫిల్మ్స్
అనురాగ్ బసు ప్రొడక్షన్స్
ఇషానా మూవీస్
పంపిణీదార్లునెట్‌ఫ్లిక్స్
విడుదల తేదీ
12 నవంబర్ 2020 (2020-11-12)
సినిమా నిడివి
150 నిమిషాలు
దేశంభారతదేశం
భాషహిందీ

లూడో 2020లో విడుదలైన భారతీయ హిందీ-భాష బ్లాక్ కామెడీ క్రైమ్ సినిమా. టి-సిరీస్ ఫిల్మ్స్, అనురాగ్ బసు ప్రొడక్షన్స్, ఇషానా మూవీస్ బ్యానర్‌లపై నిర్మించిన ఈ సినిమాకు అనురాగ్ బసు రచించి, దర్శకత్వం వహించాడు.[1] అభిషేక్ బచ్చన్, ఆదిత్య రాయ్ కపూర్, రాజ్‌కుమార్ రావ్, ఫాతిమా సనా షేక్, సన్యా మల్హోత్రా, రోహిత్ సరాఫ్, పెర్లే మానే ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా దీపావళి సందర్భంగా 2020 నవంబర్ 12న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలై, సానుకూల సమీక్షలు, స్క్రీన్‌ప్లే, సినిమాటోగ్రఫీ, సంగీతం, దర్శకత్వం & నటీనటుల ప్రదర్శనలపై ప్రశంసలు అందాయి.[2][3][4][5]

లూడో 66వ ఫిల్మ్‌ఫేర్ అవార్డులలో ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు (అనురాగ్ బసు), ఉత్తమ నటుడు , ఉత్తమ నటుడు (విమర్శకులు) (రాజ్‌కుమార్ రావ్), ఉత్తమ నటి (విమర్శకులు) (సన్యా మల్హోత్రా), ఉత్తమ సహాయ నటుడు (పంకజ్ త్రిపాఠి) సహా 16 నామినేషన్లను అందుకుంది, ఉత్తమ సంగీత దర్శకుడు (ప్రీతమ్) ను గెలుచుకుంది.

నటీనటులు

[మార్చు]

విడుదల

[మార్చు]

ఈ సినిమా మొదట 2020 ఏప్రిల్ 24న విడుదల కావాల్సి ఉంది కానీ కోవిడ్  -19 మహమ్మారి కారణంగా వాయిదా పడి అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల అవుతుందని పుకార్లు ఉన్నప్పటికీ, విడుదల హక్కులు నెట్‌ఫ్లిక్స్‌కు అమ్ముడయ్యాయి. ఈ సినిమా నవంబర్ 13న విడుదల కావాల్సి ఉంది, కానీ అమెజాన్ ప్రైమ్ వీడియో చలాంగ్‌తో ఘర్షణను నివారించడానికి ఒక రోజు ముందుగా నవంబర్ 12న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది.[6]

ప్రశంసలు

[మార్చు]
అవార్డు వేడుక తేదీ విభాగం గ్రహీత(లు) ఫలితం మూ
ఫిల్మ్‌ఫేర్ అవార్డులు 17 మే, 2021 ఉత్తమ చిత్రం భూషణ్ కుమార్ , దివ్య ఖోస్లా కుమార్ , క్రిషన్ కుమార్ మరియు అనురాగ్ బసు ప్రతిపాదించబడింది [7]
ఉత్తమ దర్శకుడు అనురాగ్ బసు ప్రతిపాదించబడింది
ఉత్తమ స్క్రీన్ ప్లే ప్రతిపాదించబడింది
ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ ప్రతిపాదించబడింది
ఉత్తమ నటుడు రాజ్కుమార్ రావు నామినేట్ అయ్యారు
ఉత్తమ నటుడు (విమర్శకులు) ప్రతిపాదించబడింది
ఉత్తమ నటి (విమర్శకులు) సాన్య మల్హోత్రా ప్రతిపాదించబడింది
ఉత్తమ సహాయ నటుడు అమిత్ సాధ్ ప్రతిపాదించబడింది
ఉత్తమ సంగీత దర్శకుడు ప్రీతమ్ గెలుపు
ఉత్తమ నేపథ్య సంగీతం ప్రతిపాదించబడింది
ఉత్తమ గేయ రచయిత సయీద్ ఖాద్రీ ( హమ్దుమ్ హర్దామ్ పాట కోసం ) ప్రతిపాదించబడింది
ఉత్తమ పురుష నేపథ్య గాయకుడు అరిజిత్ సింగ్ ( ఆబద్ బర్బాద్ పాట కోసం ) ప్రతిపాదించబడింది
ఉత్తమ ఎడిటింగ్ అజయ్ శర్మ నామినేట్ అయ్యారు
ఉత్తమ సంభాషణ సామ్రాట్ చక్రవర్తి ప్రతిపాదించబడింది
ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ ఆశిష్ డ్వయర్ ప్రతిపాదించబడింది
ఉత్తమ సౌండ్ డిజైన్ అభిషేక్ నాయర్ మరియు షిజిన్ మెల్విన్ హట్టన్ ప్రతిపాదించబడింది
IIFA అవార్డులు 4 జూన్, 2022 ఉత్తమ దర్శకుడు అనురాగ్ బసు ప్రతిపాదించబడింది [8][9]
ఉత్తమ కథ ప్రతిపాదించబడింది
ఉత్తమ సహాయ నటుడు పంకజ్ త్రిపాఠి గెలుపు
ఉత్తమ సహాయ నటి షాలిని వత్స ప్రతిపాదించబడింది
ఉత్తమ సంగీత దర్శకుడు ప్రీతమ్ ప్రతిపాదించబడింది
ఉత్తమ పురుష నేపథ్య గాయకుడు అరిజిత్ సింగ్ ( ఆబద్ బర్బాద్ పాట కోసం ) ప్రతిపాదించబడింది

మూలాలు

[మార్చు]
  1. "T-Series & Anurag Basu's next titled Ludo starring Abhishek Bachchan, Aditya Roy Kapur, Bhanu Uday Goswami to release on April 24, 2020". Bollywood Hungama. 27 December 2019. Archived from the original on 27 December 2019. Retrieved 27 December 2019.
  2. "Ludo first poster: Anurag Basu announces film starring Abhishek Bachchan and Rajkummar Rao". India Today. 27 December 2019. Retrieved 27 December 2019.
  3. "Ludo first look: Rajkummar Rao, Fatima Sana Shaikh walk in with a baby and swag to spare for Netflix release". Hindustan Times. 16 July 2020. Archived from the original on 16 July 2020. Retrieved 16 July 2020.
  4. "Ludo". Netflix (in ఇంగ్లీష్). 16 July 2020. Retrieved 10 November 2020.
  5. "Abhishek, Aditya Roy Kapur, Rajkummar, Pankaj Tripathi & others lives go beyond one's understanding". DNA (in అమెరికన్ ఇంగ్లీష్). 19 October 2020. Archived from the original on 21 October 2020. Retrieved 19 October 2020.
  6. "Abhishek, Aditya Roy Kapur, Rajkummar, Pankaj Tripathi & others lives go beyond one's understanding". DNA (in అమెరికన్ ఇంగ్లీష్). 19 October 2020. Archived from the original on 21 October 2020. Retrieved 19 October 2020.
  7. "Nominations For The 66th Vimal Elaichi Filmfare Awards 2021". filmfare.com. Archived from the original on 25 March 2021. Retrieved 25 March 2021.
  8. Hungama, Bollywood (2022-04-01). "IIFA 2022 Nominations: Shershaah takes the lead with 12 Nominations, Ludo and 83 emerge as strong contenders; check out the complete list : Bollywood News - Bollywood Hungama". Bollywood Hungama (in ఇంగ్లీష్). Archived from the original on 1 April 2022. Retrieved 2022-06-06.
  9. "IIFA Awards 2022 complete list of winners: Vicky Kaushal, Kriti Sanon win top acting honours". DNA India (in ఇంగ్లీష్). Archived from the original on 5 June 2022. Retrieved 2022-06-06.

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=లూడో&oldid=4655653" నుండి వెలికితీశారు