లూయిస్ విట్టన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Louis Vuitton Malletier
రకంDivision of holding company (LVMH)
స్థాపితం1854
వ్యవస్థాపకు(లు)Louis Vuitton
ప్రధానకార్యాలయంParis, France
కీలక వ్యక్తులుLouis Vuitton, (Founder)
Bernard Arnault, (President)
Marc Jacobs, (Art Director)
Antoine Arnault, (Director of Communications)
పరిశ్రమRetail
ఉత్పత్తులుLuxury goods
ఆదాయం1.98 billion (2009)[1]
ఉద్యోగులు9,671 (March 2010)
ఆదాయంLVMH
వెబ్‌సైటుwww.louisvuitton.com

'లూయిస్‌ విట్టన్‌ మాలెటియార్‌ - సాధారణంగా 'లూయిస్‌ విట్టన్ (ఇంగ్లీష్ లో) లేదా క్లుప్తంగా ఎల్‌వి అనేది 1854లో స్థాపించిన ఫ్రెంచ్‌ ఫ్యాషన్‌ హౌస్‌. ఎల్‌వి మోనోగ్రామ్‌ ద్వారా ఈ లేబుల్‌ ఎంతో చిరపరిచితం. దీన్ని లగ్జరీ ట్రంక్‌ల నుంచి లెదర్‌ గూడ్స్‌, రెడీమేడ్‌ వస్తువులైన షూలు, వాచీలు, జ్యుయలరీ, యాససరీస్‌, సన్‌గ్లాసెస్‌ మరియు పుస్తకాలపై చూడవచ్చు. లూయిస్‌ విట్టన్‌ ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన అంతర్జాతీయ ఫ్యాషన్‌ సంస్థల్లో ఒకటి. లూయిస్‌ విట్టన్‌ చిన్నచిన్న షాపుల నుంచి హై ఎండ్‌ డిపార్ట్‌మెంటల్‌ స్టోర్స్‌ వరకు, అదే విధంగా తన యొక్క వెబ్‌సైట్‌లోని ఈ కామర్స్‌ సెక్షన్‌ ద్వారానూ తన ఉత్పత్తులను విక్రయిస్తోంది.[2]

చరిత్ర[మార్చు]

లూయిస్ విట్టన్ యొక్క జీవిత చరిత్ర[మార్చు]

లూయిస్‌ విట్టన్‌ (1821- 1892 ఫిబ్రవరి 27[3] ఈ సంస్థ యొక్క వ్యవస్థాపకుడు. ఫ్రాన్స్‌లోని జ్యురా (ఇప్పుడు కమ్యునీ ఆఫ్‌ లావన్స్‌ -సర్‌-వాలస్‌) లో జన్మించాడు. 1835లో ఈయన జ్యురా నుంచి పారిస్‌ చేరుకున్నాడు. తన సొంత పట్టణం నుంచి పారిస్‌ చేరుకునేందుకు కాలినడకన400 kilometers (249 mi) విట్టన్‌ బయలుదేరాడు. దారిమధ్యలో ప్రయాణ ఖర్చుల కోసం వివిధ రకాల పనులు చేశాడు. పారిస్‌ చేరుకున్న తరువాత సూట్‌కేసుల తయారీలో ఆప్రంటీస్‌గా కుదురుకున్నాడు.[4] తన రంగంలో మంచి పేరు సంపాదించుకోవడంతో విట్టన్‌ను నెపోలియన్‌ 3 ఆఫ్‌ ఫ్రాన్స్‌ తన భార్య రాణి యుగెనీ డి మాటిజోకు సూట్‌కేసులు తయారుచేసే వ్యక్తిగా నియమించాడు. ఫ్రెంచ్‌ రాజకుటుంబాలకు తన సేవలందించడంతోపాటు, ప్రయాణానికి అవసరమైన మంచి పెట్టెల తయారీకి సంబంధించి లోతైన పరిజ్ఞానాన్ని పొందాడు. ఆ తరువాత తానే సొంతంగా లగేజ్‌ను తీసుకెళ్లేందుకు అవసరమైన పెట్టెలను తయారు చేయడం కోసం ఎల్‌వి కంపెనీ స్థాపించాడు.[4]

1854 నుండి 1892[మార్చు]

లూయిస్‌ విట్టన్‌ లేబుల్‌ను 1854లో పారిస్‌లోని ర్యూ న్యూవి డీస్‌ కాప్యుసినిస్‌లో మానిస్యుయర విట్టన్‌ గుర్తించాడు.[3] 1858లో విట్టన్‌ ట్రైనాన్‌ కాన్వాస్‌తో కూడిన ప్లాట్‌ బాటమ్‌ ట్రంక్‌లను, తక్కువ బరువుతో, గాలి చొరబడని విధంగా రూపొందించాడు.[3] విట్టన్‌ తన ట్రంక్‌లను ప్రవేశపెట్టముందు ప్రజలు రౌండెడ్‌ టాప్‌ ట్రంక్‌లు వాడేవారు. ఇవి సాధారణంగా నీటి నుంచి బహిస్సరణకు ఉపయోగపడేవి. అయితే ఇవి రాశిగా పెట్టేందుకు ఉపయోగపడేవి కావు. అయితే విట్టన్‌ రూపొందించిన గ్రే ట్రైనాన్‌ కాన్వాస్‌ ఫ్లాట్‌ ట్రంక్‌లో రాశిగా పెట్టుకునే అవకాశం ఉండటంతోపాటు ప్రయాణాలు సులభతరమయ్యాయి. ఇది విజయవంతం కావడంతోపాటు, కొనుగోలుదారులు వీటిని ప్రతిష్ఠాత్మకంగా భావించడంతో లగేజీ తయారీదారులు ఎల్‌వి స్టైల్‌ను, డిజైన్‌ను అనుకరించడం ప్రారంభించారు.[4]

1867లో కంపెనీ పారిస్‌లో జరిగిన యూనివర్సల్‌ ఎగ్జిబిషన్‌లో పాల్గొంది.[3] నకిలీల నుంచి కాపాడుకోవడం కోసం 1876లో తన ట్రైనాన్‌ డిజైన్‌ను బైగీకలర్‌లో బ్రౌన్‌ పట్టీలతో మార్పు చేసింది.[4] 1885నాటికి ఇంగ్లాండ్‌లో అడుగుపెట్టింది. లండన్లోని ఆక్స్‌ఫర్డ్‌ స్ట్రీట్‌లో తన తొలి స్టోరును ప్రారంభించింది.[3] దీని రూపును అనుకరించేవారి సంఖ్య నిరంతరం పెరిగిపోవడంతో, 1888లో లూయిస్‌ విట్టన్‌ డామియర్‌ కాన్వాస్‌ ప్యాట్రన్‌ను రూపొందించాడు. దీనిపై మార్కూ ఎల్‌, విట్టన్‌ డిపోసీ అనే లోగో ఉండేది. దీన్ని ఇంగ్లిష్‌లో అనువదిస్తే మార్క్‌ ఎల్‌ విట్టన్‌ డిపాజిటెడ్‌ లేదా ఎల్‌. విట్టన్‌ ట్రేడ్‌ మార్క్‌. 1892లో లూయిస్‌ విట్టన్‌ మరణించాడు. దీంతో కంపెనీ యాజమాన్యం ఆయన కుమారుని చేతిలోకి వెళ్లింది.[3][4]

1893 నుండి 1939[మార్చు]

తన తండ్రి మరణానంతరం జార్జి విట్టన్‌ తన కంపెనీని వరల్డ్‌ వైడ్‌ కార్పొరేషన్‌గా మార్చేందుకు ప్రచారం ప్రారంభించాడు. 1893లో చికాగో వర్డ్‌ ఫెయిర్‌లో తన ఉత్పత్తులను ప్రదర్శించడం ద్వారా దీనికి శ్రీకారం చుట్టాడు. 1896లో కంపెనీ సిగ్నేచర్‌ మోనోగ్రామ్‌ కాన్వాస్‌ను తయారి చేసి, దానికి ప్రపంచవ్యాప్త పేటెంట్‌ను పొందింది.[3][4] ఈ మోనోగ్రామ్‌లో గ్రాఫిక్‌ సింబల్స్‌తోపాటు, నాలుగు ఆకులు, పుష్పాలు ఉన్నాయి. విక్టోరియా కాలానికి ముందున్న ఓరియెంటల్‌ డిజైన్లుతోపాటు, జపనీస్‌ కళను మేళవించి దీన్ని రూపొందించారు. తరువాతి కాలంలో నకిలీలను నిరోధించడానికి ఈ పెటేంట్‌లు ఎంతగానో ఉపయోగపడ్డాయి. అదే సంవత్సరం జార్జి అమెరికాలోని వివిధ నగరాల్లో ( న్యూయార్క్‌, ఫిలడెల్ఫియా, జార్జియాలు వంటి నగరాల్లో) పర్యటించి విట్టన్‌ ఉత్పత్తులను అమ్మకం ప్రారంభించాడు. లూయిస్‌ విట్టన్‌ కంపెనీ 1901లో స్టీమర్‌ బ్యాగ్‌ను ప్రవేశపెట్టింది. విట్టన్‌ లగేజ్‌ ట్రంక్‌లను లోపల పెట్టుకునే విధంగా చిన్న సైజులో దీన్ని రూపొందించారు.

1913లో ఛాంప్స్‌- ఎల్సిస్‌లో లూయిస్‌విట్టన్‌ బిల్డింగ్‌ను ప్రారంభించాడు. ఆ సమయంలో ప్రపంచంలో అతి పెద్ద ట్రావెల్‌-గూడ్స్‌ స్టోరు ఇదే. మొదటి ప్రపంచ యుద్ధకాలం నాటికి న్యూయార్క్‌, బొంబాయి, వాషింగ్టన్‌, లండన్‌, అలెగ్జాండ్రియా, బ్యూనస్‌ఎయిర్స్‌లో స్టోరులను ప్రారంభించారు. ఆ తరువాత 1930లో కీపాల్‌ బ్యాగ్‌ను ప్రవేశపెట్టింది. 1932 కాలంలో ఎల్‌వి నో బ్యాగ్‌ను పరిచయం చేసింది ఈ బ్యాగ్‌ను షాంపైన్‌ విక్రేతలు బాటిల్స్‌ను తీసుకెళ్లడం కోసం దీన్ని ప్రవేశపెట్టారు. దీని తరువాత లూయిస్‌ విట్టన్‌ స్పీడీ బ్యాగ్‌లను మార్కెట్లోకి తెచ్చింది (ఈ రెండు బ్యాగ్‌లను ఇప్పటికీ తయారుచేస్తోంది).[3] 1936లో జార్జెస్‌ విట్టన్‌ మృతి చెందాడు. ఆయన కుమారుడు గాస్టన్‌ లూయి విస్టన్‌ను కంపెనీని తన ఆధీనంలోకి తీసుకున్నాడు.[3]

లూయిస్ విట్టన్ యొక్క సెమిటిజం వ్యతిరేకత (రెండవ ప్రపంచ యుద్ధం)[మార్చు]

రెండో ప్రపంచ యుద్ధకాలంలో జర్మన్లు ఫ్రాన్స్‌ను ఆక్రమించుకున్న సమయంలోలూయిస్‌ విట్టన్‌ అప్పటి నాజీ ప్రభుత్వానికి సహకరించాడు. పారిస్‌ కేంద్రంగా పనిచేసే ప్రచురణ సంస్థ ఫయార్డ్‌[5] ప్రచురించిన ఫ్రెంచ్‌ జర్నలిస్టు స్టీఫానీ బన్‌విస్కీ రచన లూయిస్‌విట్టన్‌, ఏ ఫ్రెంచ్‌ సాగా లో- లూయిస్‌ విట్టన్‌ కుటుంబ సభ్యులు మార్షల్‌ ఫిలిప్పి పెటైన్‌ నేతృత్వంలోని కీలుబమ్మ ప్రభుత్వానికి ఆర్థికసాయం అందించడం ద్వారా జర్మన్లతో వ్యాపార సంబంధాలు నెరిపి, తమ ఆస్తులను ఏ విధంగా పెంచుకున్నారో తెలిపాడు. పెటైన్‌ను ప్రస్తుతించడం కోసం ఆయన కళాకృతులను రూపొందించేందుకు విట్టన్‌ కుటుంబం ఏకంగా ఓ ఫ్యాక్టరీనే స్థాపించింది. తద్వారా 2500 పైచిలుకు పెటైన్‌ కళారూపాల్ని తయారు చేసింది. ఫ్రాన్స్‌లోని యూదులు జర్మనీలోని కాన్సంట్రేషన్‌ క్యాంప్‌లకు బహ్కిషరించడానికి పెటైన్‌ నేతృత్వంలోని క్రూర ప్రభుత్వమే కారణమైంది.[6]

ప్రచురణ సంస్థ ఫయార్డ్‌కు సంబంధించిన అధికార ప్రతినిధి మాట్లాడుతూ, 'పుస్తకంలో ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు లేవు. అవి జరగలేదని నటిస్తూ, వాటిని సమాధి చేయడానికి ప్రయత్నిస్తున్నారు' అని పేర్కొన్నాడు.[6] 2004లో విడుదలైన ఈ పుస్తకానికి సంబంధించి ఎల్‌విఎంహెచ్‌ అధికార ప్రతినిధి మాట్లాడుతూ: 'అది పురాతన చరిత్ర. అది కుటుంబసంస్థగా నడపబడుతున్నప్పుడు, ఎల్‌విఎంహెచ్‌గా రూపుదిద్దుకోవడానికి చాలా కాలానికి ముందు విషయాన్ని ఆ పుస్తకం ప్రచురించింది. విభిన్నమైన, సహనశీలత కలిగి, ఆధునిక యుగంలో ఒక కంపెనీకి ఉండాల్సిన లక్షణాలన్నీ మా కంపెనీకి ఉన్నాయి' అని పేర్కొన్నాడు.[6] ఎల్‌విఎంహెచ్‌ యొక్క అధికారప్రతినిధి ఒక సెటర్‌ మ్యాగజైన్‌ లీ కనార్డ్‌ ఎన్‌చైనీతో మాట్లాడుతూ, "మేము వాస్తవాలను ఖండించడం లేదు. అయితే ఆ దురదృష్టకర ఎపిసోడ్‌ను రచయిత మరింత ఎక్కువ చేసి చూపడం పట్ల మేం పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నాం" అని తెలిపాడు. ఈ పుస్తకం గురించి ప్రస్తావించిన ఫ్రెంచ్‌ పిరియాడికల్‌ అది ఒక్కటే.[6]

1945 నుండి 2000[మార్చు]

ఈ కాలంలో లూయిస్‌ విట్టన్‌ తమ ఉత్పత్తుల తయారీలో తోలు వాడకాన్ని పెంచారు. చిన్న చిన్న పర్సులు, వ్యాలెట్ల నుంచి పెద్దపెద్ద లగేజీల వరకు తోలుతో తయారుచేయడం ప్రారంభించారు. తమ రంగాన్ని మరింత విస్తరించడం కోసం, 1959లో ఎటుచూసినా కనిపించే విధంగా తమ సిగ్నేచర్‌ మోనోగ్రామ్‌ కాన్వాస్‌ను మార్పుచేసింది. తద్వారా దీన్ని తమ పర్సులు, బ్యాగులు, వ్యాలెట్లపై ముద్రించే అవకాశం ఏర్పడింది.[3] 1960ల్లో నకిలీల బెడదతో కంపెనీ ముందుకు సాగడం ప్రశ్నార్థకంగా మారింది.[4] 1966లో పాపిల్‌ను ప్రవేశపెట్టింది. (గోళాకారంలో ఉండే ఈ బ్యాగ్‌కు ఇప్పటికీ ప్రజాదరణ ఉంది). 1977నాటికి దీని వార్షిక ఆదాయం 70మిలియన్‌ ఫ్రాక్‌లకు (14.27 అమెరికన్‌ డాలర్లు) చేరుకుంది.[7] దీనికి ఏడాది తరువాత కంపెనీ జపాన్‌లో తన తొలిస్టోరును ప్రారంభించింది ( టోక్యోలోని ఒసాకాలో). 1983లో కంపెనీ అమెరికా కప్‌తో కలిసి, లూయిస్‌ విట్టన్‌ కప్‌ను ఏర్పరిచింది. తెరచాప పోటీలకు సంబంధించిన (ఎలిమెంటరీ రెగెట్టా) ప్రిలిమినరీ టోర్నమెంట్‌ఇది. లూయిస్‌ విట్టన్‌ ఆసియాలో తైపీ, తైవాన్‌లో 1983లోను, 1984లో దక్షిణ కొరియాలోని సియోల్లో స్టోర్స్‌ను ప్రారంభించడం ద్వారా తన ప్రాబల్యాన్ని పెంచుకుంది. తరువాత సంవత్సరం అంటే 1985 ఎపి లెదర్‌ లైన్‌ను ప్రవేశపెట్టింది.[3]

1987లో LVMH ఏర్పడింది.[3] ప్రముఖ షాంపైన్‌ మరియు కగ్నక్ తయారీసంస్థ మోయట్‌ ఎట్‌ చాండాన్‌ అండ్‌ హెన్సీ కంపెనీ లగ్జరీ గూడ్స్‌ తయారీ కోసం లూయిస్‌ విట్టన్‌లో విలీనమైంది. 1987లో పోలిస్తే 1988లోదీని లాభాలు 49శాతం పెరిగాయి. 1989నాటికి లూయిస్‌ విట్టన్‌ ప్రపంచవ్యాప్తంగా 130స్టోర్స్‌ను ఏర్పాటు చేసింది.[3] 1990లోప్రవేశించిన తరువాత యూవిస్‌ కార్సెల్లీ LVకి అధ్యక్షుడయ్యాడు. బీజింగ్‌లోని పాలస్‌ హెటల్‌లో తొలి స్టోర్‌ను ప్రారంభించడం ద్వారా చైనా గడ్డ మీద అడుగుపెట్టింది. ఆ తరువాత 1993లో టైగా లెదర్‌లైన్‌ను ప్రవేశపెట్టింది. 1994లో లిటరేచర్‌ కలెక్షన్‌ వాయేజ్‌ ఎవిక్‌ను మార్కెట్లోకి తెచ్చింది. మోనోగ్రామ్‌ కాన్వాస్‌ యొక్క శతజయంతి ఉత్సవాలను ప్రపంచవ్యాప్తంగా ఏడు నగరాల్లో జరిపింది.[3]

1997లో తమ పెన్‌ కలెక్షన్‌ను విడుదల చేసిన తరువాత, ఆ తరువాత సంవత్సరంలో లూయిస్‌ విట్టన్‌ మార్క్‌ జాకబ్‌, జోయ్‌ను తమ ఆర్ట్‌ డైరెక్టర్లుగా నియమించింది.[3] ఆ తరువాత సంవత్సరం మార్చిలో స్త్రీలు, పురుషుల కోసం వారు డిజైన్‌ చేసి, రూపొందించిన ప్రెట్‌- ఏ- పోర్టర్ లైన్‌ దుస్తులను విడుదల చేశారు. అదే సంవత్సరం మోనోగ్రామ్‌ వెర్నిస్‌లైన్‌, ద ఎల్‌వి స్క్రాప్‌బుక్స్‌, లూయిస్‌ విట్టన్‌ సిటీ గైడ్‌ వంటి ఉత్పత్తులను మార్కెట్లోకి విడుదల చేసింది.[3]

20వ శతాబ్దంలో చివరగా అంటే 1999లో తన మిని మోనోగ్రామ్‌ను కంపెనీ విడుదల చేసింది. 2000 సంవత్సరంలో ఆఫ్రికాలోని తొలి స్టోర్‌ మెనాకోలోని మెరాకిచ్‌లో ప్రారంభించింది. అదేవిధంగా ఇటలీలోని వెనిస్‌లో జరిగిన ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో వేలంపాటను నిర్వహించింది. ఈ సందర్భంగా షరాన్‌స్టోన్‌ డిజైన్‌ చేసిన వ్యానిటీ కేస్‌ యామ్‌ఫార్‌ను అమ్మకం జరిపింది. దీని ద్వారా లభించిన ఆదనియాన్ని ద ఫండేషన్‌ ఫర్‌ ఎయిడ్స్‌ రీసెర్చ్‌కు అందించారు. (ఇది కూడా 2000 సంవత్సరంలో జరిగింది).[3]

2001 నుండి ఈరోజు వరకు[మార్చు]

మన్హట్టన్ యొక్క ఐదవ వీధి వద్ద దుకాణం
మిలన్, ఇటలీలో గలేరియా విట్టోరియో ఇమాన్యూల్ II వద్ద ఒక లూయిస్ విట్టన్ బాతిక్.

2001 నాటికి స్టీఫెన్‌ స్పోరోజ్‌, మార్క్‌ జాకబ్‌లు కలిసి డిజైన్‌ చేసిన విట్టన్‌ బ్యాగ్స్‌ లిమిటెడ్‌ కలెక్షన్‌ను మార్కెట్లోకి విడుదల చేశారు. మోనోగ్రామ్‌ తరహాలో వీటిపై గ్రాఫిటీలను అమర్చారు.[3] ఈ గ్రాఫిటీ మీద లూయిస్‌ విట్టన్‌ పేరు పొందుపరిచారు. కొన్ని బ్యాగులపై ఆ బ్యాగు పేరును రాసారు. (ఉదాహరణకు కీపాల్‌, స్పీడీ వంటివి). కొన్ని బ్యాగులను మోనోగ్రామ్‌ కాన్వాస్‌ బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా కేవలం గ్రాఫిటీతో విడుదల చేశారు. వీటిని లూయిస్‌ విట్టన్‌ V.I.P. కస్టమర్‌ లిస్టులో ఉన్న వారికి మాత్రమే అందుబాటులోకి తెచ్చారు. జాకబ్స్‌ చామ్‌ బ్రాస్‌లెట్‌ను రూపొందించాడు. LV సంస్థ రూపొందించిన తొలి జ్యుయలరీ ఐటమ్‌ ఇదే.[3]

2002లో టాంబౌర్‌ వాచ్‌ కలెక్షన్‌ను ప్రవేశపెట్టారు.[3] అదే సంవత్సరంలో టోక్యోలో ఎల్‌వి బిల్డింగ్‌ను ప్రారంభించారు. క్రిస్టమస్‌ విండోస్‌ సీనోగ్రఫీ కోసం ఎల్‌వి బాబ్‌ విల్సన్‌తో సహకారం పొందింది. 2003లో మార్క్‌ జాకబ్స్‌ సహకారంతో తకాషి మురాకిమి న్యూ మోనోగ్రామ్‌ మల్టీకలర్‌ కాన్వాస్‌ రేంజ్‌ హ్యాండ్‌బ్యాగులు ఇతర ఎససరీస్‌ను రూపొందించారు.[3] ఇందులో స్టాండర్ట్‌ మోనోగ్రామ్‌ కాన్వాస్‌లున్నాయి. తెలుపు లేదా నలుపు బ్యాక్‌గ్రౌండ్‌లో మొత్తం 33 విభిన్న రకాలున్నాయి. (క్లాసిక్‌ కాన్వాస్‌ గోల్డ్‌ మోనోగ్రామ్‌ లేదా బ్రౌన్‌ బ్యాక్‌గ్రౌండ్‌ను కలిగి ఉంది). మురాకిమి చెర్రీ బోసమ్‌ప్యాటన్లను కూడా సృష్టించాడు. ఇందులో పింక్‌ లేదా ఎల్లోకలర్‌ పుష్పాల మధ్య నవ్వుతున్న కార్టూన్‌ ముఖాలను అక్కడడక్కడా మోనోగ్రామ్‌ కాన్వాస్‌పైన ఉంచారు. వీటిని చాలా పరిమిత సంఖ్యలో విడుదల చేశారు. ఇలా పరిమితమైన మోడల్స్‌ విడుదలను 2003 జూన్లో నిలిపేశారు. 2003లో రష్యాలోనిమాస్కో, ఇండియాలోని న్యూఢిల్లీ స్టోర్స్‌ను ప్రారంభించడంతో పాటు ఉహా, సుహాలీ లెదర్‌ లైన్స్‌ను విడుదల చేశారు. ఎల్‌వి కప్‌ 20వ వార్షికోత్సవాన్ని జరుపుకుంది.[3]

ప్రసిద్ధ చాంప్స్-ఎల్సీస్ లో ఉన్న లూయిస్ విట్టన్

2004లో లూయిస్‌ విట్టన్‌ 150 వార్షికోత్సవాన్ని జరుపుకుంది. న్యూయార్క్‌లోని ఫిఫ్త్‌ ఎవెన్యూలోపాటు సావ్‌పాలో, జోహానస్‌బర్గ్‌లో స్టోర్స్‌ను ఏర్పాటు చేసింది. షాంగైలో తొలి గ్లోబల్‌ షాప్‌ను తెరిచింది. 2005 నాటికి లూయిస్‌ విట్టన్‌ పారిస్‌లో అమెరికన్‌ ఆర్కిటెక్ట్‌ ఎరిక్‌ కార్లసన్‌ డిజైన్‌ చేసిన చాంఫ్‌స్‌ ఎల్‌సీస్‌ను తిరిగి తెరిచింది (ప్రపంచంలో అతి పెద్ద మరియ లాభాలను ఆర్జించే ఎల్‌వి స్టోర్‌గా ఇది పేరు గాంచింది). దీంతో పాటు స్పీడీ వాచ్‌ కలక్షన్‌ను విడుదల చేసింది. 2006లో LV ఎస్‌పేస్‌ లూయిస్‌ విట్టన్‌ ఏడో అంతస్తులో స్థాపించింది.[3] 2008లో లూయిస్‌ విట్టన్‌ డామియర్‌ గ్రాఫిటీ కాన్వాస్‌ను విడుదల చేసింది. ఈ కాన్వాస్‌లో క్లాసిక్‌ డామియర్‌ ప్యాట్రన్స్‌ ఉన్నప్పటికీ, బ్లాక్‌, గ్రే రంగులు ఉండటంతో, ఇది పూర్తిగా పురుష హూందాతనానికి, అర్బన్‌లుక్‌ పొందింది.

2010నాటికి లూయిస్‌ విట్టన్‌ అతి విలాసవంతమైన స్టోర్‌ను లండన్‌లో ప్రారంభించింది.[8]

ఈనాటి లూయిస్ విట్టన్[మార్చు]

ప్రచార కార్యక్రమాలు[మార్చు]

హాస్టన్ లో లూయిస్ విట్టన్ దుకాణం

సెలబ్రిటీలు తమ ఉత్పత్తులను వాడేవిధంగా లూయిస్‌విట్టన్‌ చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. అదేవిధంగా ప్రచారానికి ఫేమస్‌ మోడల్స్‌, యాక్టర్లను వినియోగించుకుంటుంది. ఉదాహరణ జెన్నిఫర్‌లోపేజ్‌, ఇటీవల కాలంలో మడోన్నాలు సంస్థ మార్కెటింగ్‌ ప్రచారంలో పాల్గొన్నారు. సంప్రదాయ పద్ధతులకు విరుద్ధంగా సూపర్‌మోడల్స్‌, సెలబ్రిటీలతో తమ ఉత్పత్తులకు ప్రచారం కల్పించడానికి భిన్నంగా తన సంస్థ యాడ్స్‌లో రష్యా నాయకుడు మిఖయిల్‌ గోర్బచేవ్‌తో పాటు స్టెఫీగ్రాఫ్‌, ఆండ్రీ అగస్సీ, క్యాథరిన్‌ డెనివ్యూతో పాటు చాలా రాప్‌ సింగర్స్‌ పాల్గొంటారని 2007 ఆగస్టు 2లో కంపెనీ ప్రకటించింది. వీరిలో మరీ ముఖ్యంగా కెన్లీ వెస్ట్‌ను పేర్కొనాలి. వెస్ట్‌ తన పాటల్లో లూయిస్‌ విట్టన్‌ పేరును ఏదో విధంగా జప్పించి కంపెనీకి ప్రచారం కల్పించేవాడు.

కంపెనీ సాధారణంగా మాగజినాలో యాడ్స్‌తోపాటు కాస్మోపాలిటన్‌ నగరాల్లో బిల్‌బోర్డుల ద్వారా ప్రచారం చేస్తుంది. గతంలో లెబోవిజ్‌ రూపొందించిన తమ యాడ్స్‌ను ప్రచార కార్యక్రమాల్ని, ఎంపిక చేసుకున్న కొన్నింటి వాటి ద్వారా మాత్రమే జరిపేది. (వీటిలో తరచుగా స్టెఫీగ్రాఫ్‌, అండ్రీ ఆగస్సీ, గిసెలీ బండ్‌చెన్‌, క్యాథరిన్‌ డెనివ్యూ వంటి వారు కనిపించేవారు) కమ్యునికేషన్‌ డిపార్ట్‌మెంట్‌ హెడ్‌ అయిన అంటోనీ ఆర్నాల్ట్‌ ఇటీవల కాలంలో టెలివిజన్‌, సినిమా ద్వారా ప్రచారం కల్పించాలని నిశ్చయించారు. వేర్‌ విల్‌ యు లైఫ్‌ టేక్‌ యు? అన్న థీమ్‌తో 90సెకండ్ల వ్యవధి ఉండే ఒక వాణిజ్య ప్రకటనను రూపొందించారు. 13 భాషల్లోకి అనువదించారు. విట్టన్‌ కంపెనీ రూపొందించిన తొలి యాడ్‌ ఇదే. దీన్ని ప్రఖ్యాత ఫ్రెంచ్‌ దర్శకుడు బ్యూనో ఎవిలిన్‌ రూపొందించాడు.[9]

ఉత్పత్తులు[మార్చు]

ఎకటేరిన్బర్గ్ లో దుకాణం (రష్యా)

19వ శతాబ్దం నుంచి లూయిస్‌ విట్టన్‌ తయారు చేస్తున్న గూడ్స్‌లో ఎలాంటి మార్పు లేదు. ఇప్పటికీ చేతితోనే లగేజీ బ్యాగులను రూపొందిస్తున్నారు.[4] ఆధునిక ఫ్యాషన్లు LV ట్రంకులకు సంబంధించిన ఒక చక్కటి పూర్వదర్శనాన్ని కల్పిస్తాయి. వృత్తిపనిదారుడు లెదర్‌, కాన్వాస్‌లను చిన్న చిన్న రంధ్రాల ద్వారా దగ్గరకు చేర్చి, ఆ తరువాత తీయడానికి వీలులేని విధంగా ఐదులక్షరాల బ్రాస్‌లాక్‌లతో పాటు హ్యాండ్‌మేడ్‌ కీఉంటాయి. ప్రయాణీకుడు తమ మొత్తం లగేజీకి ఒకే ఒక్క కీని ఉపయోగించే విధంగా ఈ కీని డిజైన్‌ చేస్తారు. ఉలెన్‌ ఫ్రేమ్‌తో ఉన్నవన్నీ కూడా 30 సంవత్సరాల వయస్సున్న బూరగ వంటి చెట్టు యొక్క చెక్క నుంచి తయారు చేస్తారు. ఈ చెక్కను నాలుగు సంవత్సరాలపాటు ఎండనిస్తారు. ప్రతి ట్రంక్‌కు ఒక సీరియల్‌ నెంబర్‌ ఉంటుంది. వీటి తయారీకి సుమారు 60 గంటలు పడుతుంది. సూట్‌కేసుల తయారీకి 15గంటలు పడుతుంది.[4]

కంపెనీకి సంబంధించిన చాలా ఉత్పత్తుల్లో సిగ్నేచర్‌ బ్రౌన్‌ డామియర్‌, మోనోగ్రామ్‌ కాన్వాస్‌ మెటీరియల్‌ను ఉపయోగిస్తారు. రెండింటిని కూడా మొదట 19వ శతాబ్దం చివరల్లో ఉపయోగించారు. కంపెనీకి సంబంధించిన అన్ని ఉత్పత్తులపైనా LV అనే అక్షరాలుంటాయి. కంపెనీ తన యొక్క త్పత్తులను ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన సొంత సోర్టుల ద్వారా మార్కెట్‌ చేస్తుంది. ఉత్పత్తుల క్వాలిటీ, ధరలను నియంత్రించడానికి ఇది ఉపయోగపడుతుంది. అదే విధంగా LV ప్రొడక్టులకు సంబంధించి నకిలీలు, అనుకరణలను నిరోధించడానికి దోహదపడుతుంది. లూయిస్‌ విట్టన్‌కు ఎలాంటి డిసౌంట్‌ సేల్స్‌కానీ, డ్యూటీ ఫ్రీ షాపులుగానీ లేవు. దీనికి అదనంగా కంపెనీ తన ఉత్పత్తులను LouisVuitton.com. ద్వారా అమ్మకాలు జరుపుతోంది.[4]

బ్రాండ్[మార్చు]

లూయిస్‌ విట్టన్‌ బ్రాండ్‌ మరియు దానికి సంబంధించిన ప్రఖ్యాత ఎల్‌వి మోనోగ్రామ్‌ ప్రపంచంలో అత్యధిక విలువైన బ్రాండ్లలో ఒకటిగా చెప్పవచ్చు. 2010లో మిల్‌వార్డ్‌ బ్రౌన్‌ జరిపిన సర్వేలో లూయిస్‌ విట్టన్‌ ప్రపంచంలో అత్యధిక విలువైన బ్రాండ్లలో 29 స్థానాన్ని సంపాదించుకుంది. ఇది వెల్స్‌ ఫార్గో కంటే తరువాత, గిలెట్‌ కంటే ముందు ఈ బ్రాండ్‌ ఉంది. ఈ బ్రాండ్‌ ఒక్కటే 19.781 బిలియన్‌ డాలర్లు చేస్తుందని అంచనా.[10]

నకళ్ళ తయారీ[మార్చు]

స్టేటస్‌ సింబల్‌కు ప్రతీక కావడంతో, ఫ్యాషన్‌ ప్రపంచంలో లూయిస్‌ విట్టన్‌కు సంబంధించి ఎన్నో నకిలీ బ్రాండ్లులు మార్కెట్లో దొరుకుతాయి. జనసామాన్యంలో LV అనే అక్షరాలతో లభించే ఉత్పత్తుల్లో నికార్సైనవి అతి తక్కువ ఉత్పత్తులుంటాయి. నకిలీల తయారీకి అడ్డుకట్ట వేయడానికి సిగ్నేచన్‌ మోనోగ్రామ్‌ను రూపొందించారు.[11] 2004లో యూరోపియన్‌ యూనియన్‌లో లభించే లూయిస్‌ విట్టన్‌కు సంబంధించిన 18శాతం నకిలీ ఉత్పత్తులను సీజ్‌ చేశారు.[12]

నకిలీల వ్యవహారాన్ని కంపెనీ చాలా తీవ్రంగా పరిగణిస్తుంది. దీనికి సంబంధించి న్యాయవాదుల బృందాన్ని, ఇన్వెస్టిగేట్‌ ఏజెన్సీలను ఏర్పాటు చేసి, ప్రపంచవ్యాపంగా, వివిధ కోర్టులను ఇలాంటి కేసులను వేసి ఉల్లంఘనకు పాల్పడే వారిపై చర్యలకు ఉపక్రమిస్తోంది. నకిలీలపై ఉద్యమించేందుకు తమ కమ్యునికేషన్స్‌ బడ్జెట్‌లో సగాన్ని ఖర్చు పెడుతోంది.[4] విస్త్రతమైన నెట్‌వర్క్‌ కలిగిన ఇన్వెస్టిగేటర్లు, న్యాయవాదుల బృందంతో పాటు కంపెనీకి చెందిన 60మంది వివిధ స్థాయిల్లో నకిలీలకు అడ్డుకట్ట వేసేందుకు పనిచేస్తున్నట్లు కంపెనీ పేర్కొంది.[13] నకిలీలను అడ్డుకట్ట వేసేందుకు కంపెనీ తమ ఉత్పత్తుల డిస్టిబ్యూషన్‌ను తన నియంత్రణలో ఉంచుకుంటుంది.[4] 1980 వరకు విట్టన్‌ ఉత్పత్తులను డిపార్ట్‌మెంట్‌ స్టోర్స్‌ (నీమెన్‌ మార్కస్‌ మరియు సాక్స్‌ ఫిప్త్‌ ఎవెన్యూ) లో విస్త్రతంగా అమ్మేవారు. ఇప్పుడు విట్టన్‌ ఉత్పత్తులను ప్రాథమికంగా గుర్తింపు పొందిన లూయిస్‌ విట్టన్‌ స్టోర్స్‌లో లభ్యమవుతాయి. దీనికి సంబంధించి చిన్నపాటి మినహాయింపులున్నాయి.[4] ఈ షాపులు షాపింగ్‌ డిస్టిక్స్‌ల్లోనో లేకపోతే లగ్జరీ డిపార్ట్‌మెంట్‌ స్టోర్స్‌ లోపల ఉంటాయి. డిపార్ట్‌మెంట్‌ స్టోర్స్‌ లోపల ఉండే షాపులను డిపార్ట్‌మెంట్‌తో సంబంధం లేకుండా LVకి చెందిన మేనేజర్లు మరియు ఇతర ఉద్యోగులు నిర్వహిస్తారు. ఎల్‌వి ఇటీవల తన మెయిన్‌వెబ్‌ సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌ స్టోర్‌ను ప్రారంభించింది. తన ఉత్పత్తులను అమ్మడానికి ఇది ఒక గుర్తింపు పొందిన ఛానల్‌గా ఉంది.[14]

విరుద్దత మరియు వివాదాలు[మార్చు]

లూయిస్ విట్టన్ vs. బ్రిట్నీ స్పియర్స్ వీడియో[మార్చు]

నకిలీలను సమర్థంగా నిరోధించడంలో భాగంగా 2007 నవంబరు 19లో కౌంటర్‌ఫీటింగ్‌ చట్టాలను ఉల్లంఘించారని ఆరోపిస్తూ లూయిస్‌ విట్టన్‌ బ్రిట్నీస్పియర్స్‌ను కోర్టుకు లాగింది. ఒక మ్యూజిక్‌ వీడియోలో డూ సమ్‌ధిన్‌ అనే పాటలో చేతి వేళ్లు పింక్‌ కలర్‌ హ్యూమర్‌ వాహనం యొక్క డ్యాష్‌బోర్డుపై ఉన్న కదులుతుంటాయి. ఇది లూయిస్‌విట్టన్‌ చెర్రీ బోసమ్‌ డిజైన్‌తోపాటు LV లోగోను పోలి ఉంది. బ్రిట్నీస్పియర్స్‌పై నేరం రుజువు కానప్పటికీ, పారిస్‌లో ఒక సివిల్‌ కోర్టు సోనీ బీఎంజీ మరియు ఎంటీవీ ఆన్‌లైన్‌లు ఈ వీడియోను ఆపేయాలని ఆదేశించింది. రెండు గ్రూపులకు 80వేల యూరోల చొప్పున నష్టపరిహారం విధించింది. లూయిస్‌ విట్టన్‌ బ్రాండ్స్‌ మరియు దానికున్న లగ్జరీ ఇమేజ్‌ను దెబ్బతీసే విధంగా ఉన్నాయని ఎల్‌విఎంహెచ్‌ అధికార ప్రతినిధి పేర్కొన్నాడు.[15]

లూయిస్ విట్టన్ vs. డార్ఫర్ దాతృత్వం[మార్చు]

లూయిస్‌ విట్టన్‌ మేధోసంపత్తి హక్కులకు భంగం కలిగే విధంగా బ్యాగులను తిరిగి రూపొందించినందుకు 2007 ఫిబ్రవరి 13లో ఆర్టిస్ట్‌ నాడియా పెల్సనర్‌కు లూయిస్‌ విట్టన్‌ సీజ్‌ అండ్‌ డెసిస్ట్‌ ఉత్తర్వులను పంపింది.[16] వ్యంగ్యంగా రూపొందించిన ఓ చిత్రంలో పోషకాహారం లేని ఒక పిల్లవాడు డిజైనర్‌ డాగ్‌తోపాటు డిజైనర్‌ బ్యాగును పట్టుకొని ఉంటాడు. ఈ చిత్రాన్ని టీ షర్టులు, పోస్టర్లపై ముద్రించారు. వీటి అమ్మకాల ద్వారా వచ్చే లాభాలను నేరుగా డివెస్ట్‌ ఫర్‌ డార్ఫర్‌ అనే స్వచ్ఛంద సంస్థకు వెళతాయి. దీనికి సంబంధించి సింపుల్‌ లివింగ్‌ అనే ప్రచారం కార్యక్రమం తన యొక్క కళాస్వేచ్ఛకు ప్రతీక అని నాడియా సమర్థించుకుంటూ లూయిస్‌విట్టన్‌కు 2008 ఫిబ్రవరి 27లో ఒక లేఖ రాసారు. ప్రఖ్యాత మోనోగ్రామ్‌ మీద ధ్యాసలేకపోవడం, అదేవిధంగా డిజైనర్‌ బ్యాగ్‌ అని జనరల్‌గా చెప్పడం తప్ప, ప్రత్యేకించి లూయిస్‌ విట్టన్‌ అనే బ్రాండ్‌ను తన ఫోటోల్లోకానీ, ఇతర ప్రచార సామగ్రిలోగానీ లేవని పేర్కొంది.[17] ఏప్రిల్‌15, 2008న లూయిస్‌విట్టన్‌ నాడియాపై న్యాయవివాదానికి దిగుతున్నట్లు పేర్కొంది. లూయిస్‌విట్టన్‌ కంపెనీ పెల్సనర్‌ తన సింపుల్‌ లివింగ్‌ ఉత్పత్తులను అమ్మకాలను కొనసాగించినట్లయితే రోజుకు 7,500 అమెరికన్‌ డాలర్లు చెల్లించాల్సి ఉంటుందని ఆ రిపోర్ట్‌ పేర్కొంది. దీంతోపాటు సిజ్‌ అండ్‌ డెస్టిస్‌ లెటర్‌ ఆమె వెబ్‌సైట్‌లో ఉంచినందుకు రోజుకు 7,500 డాలర్లుతోపాటు లూయిస్‌విట్టన్‌ పేరును ఆమె వెబ్‌సైట్‌లో ఉపయోగించుకున్నందుకు మరో 7,500 డాలర్లు చెల్లించాలని డిమాండ్‌ చేసింది. దీనికి అదనంగా మేధోసంపత్తి హక్కుల పరిరక్షణకు కాగా, ఖర్చు పెట్టిన మరో 15,000డాలర్లు చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది.[18] ఆ తరువాతి కాలంలో దీనికి సంబంధించిన చిత్రాలను పెల్సనర్‌ తన వెబ్‌సైట్‌ నుంచి తొలగించింది. పెల్సనర్‌ ఇప్పుడు తన ప్రచారానికి మరో ప్రత్యామ్నాయ చిత్రాన్ని ఉపయోగిస్తోంది, అయితే ఒరిజినల్‌ చిత్రం తిరిగి వెబ్‌సైట్‌లో ప్రత్యేకంగా వేరే ప్రాంతంలో ఉంచారు.

లూయిస్‌ విట్టన్‌ సంస్థ అధికార ప్రతినిధి ఇచ్చిన సమాచారం మేరకు న్యూయార్క్‌మాగజిన్ ఈ విధంగా ఉటంకించింది. నాడియాకు వ్యతిరేకంగా కోర్టుకు వెళ్లాలన్న నిర్ణయాన్ని లూయిస్‌విట్టన్‌ విరమించుకోవాలనుకున్నప్పటికీ, సంబంధించిన బమ్మను తొలగించాలన్న కంపెనీ విజ్ఞప్తికి, ఆ తరువాత పంపిన సీజ్‌ అండ్‌ డెసిస్ట్‌ ఉత్తర్వులకు నాడియా పక్క నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో బలవంతంగా కోర్టుకు వెళ్లాల్సి వచ్చిందన్నది. LVMH‌ పెట్టిన కేసు నుంచి తప్పించుకునేందుకు పెల్సనర్‌ రహస్యంగా దాక్కునే ప్రయత్నం చేస్తున్నారని LVMH‌ అధికార ప్రతినిధి ఆరోపించినట్లు ఆ కథనం పేర్కొంది.[19] అయితే ఈ ఆరోపణలు పెల్సనర్‌ సీజ్‌ అండ్‌ డెసిస్ట్‌ ఉత్తర్వుల పై[17] ఇచ్చిన స్పందనతో ఏకీభవించే విధంగా లేవు. కొన్ని రోజుల ముందే ఆ మ్యాగజైన్‌కు చెందిన ప్రతినిధులు ఆమెతో సంప్రదింపులు జరిపినప్పటికీ, ఎల్‌విఎంహెచ్‌ చేసిన ఆరోపణలకు పెల్సనర్‌ స్పందించే విధంగా ఆ కథనం లేదన్న ఆరోపణలు వచ్చాయి.[20]

అక్టోబరు 2008లో లూయిస్‌విట్టన్‌ ఈ కేసును ఉపసంహరించుకోవాలని నిర్ణయించుకుంది.[21]

సూచనలు[మార్చు]

 1. "Louis Vuitton records double-digit growth in 2009". Drapers. 5 February 2010. Retrieved 12 May 2010.
 2. 3.00 3.01 3.02 3.03 3.04 3.05 3.06 3.07 3.08 3.09 3.10 3.11 3.12 3.13 3.14 3.15 3.16 3.17 3.18 3.19 3.20 3.21 3.22 "Timeline". Louis Vuitton. మూలం నుండి 2008-12-19 న ఆర్కైవు చేసారు. Retrieved 2008-03-03. Cite web requires |website= (help)
 3. 4.00 4.01 4.02 4.03 4.04 4.05 4.06 4.07 4.08 4.09 4.10 4.11 4.12 Martin, Richard (1995). Contemporary fashion. London: St. James Press. p. 750. ISBN 1-55862-173-3.
 4. "Fayard". Cite web requires |website= (help)
 5. 6.0 6.1 6.2 6.3 "Louis Vuitton's links with Vichy regime exposed, The Guardian, June 3, 2004". London. June 3, 2004. Retrieved May 11, 2010. Cite news requires |newspaper= (help)
 6. "1977 Exchange Rates". Retrieved 16 May 2010. Cite web requires |website= (help)
 7. "ఆర్కైవ్ నకలు". మూలం నుండి 2011-05-14 న ఆర్కైవు చేసారు. Retrieved 2010-07-14. Cite web requires |website= (help)
 8. "Fashion Week Daily - Dispatch". మూలం నుండి 2012-12-09 న ఆర్కైవు చేసారు. Retrieved 2008-03-04. Cite web requires |website= (help)
 9. "ఆర్కైవ్ నకలు". మూలం నుండి 2011-05-04 న ఆర్కైవు చేసారు. Retrieved 2010-07-14. Cite web requires |website= (help)
 10. "European trademarks vs. Google". మూలం నుండి 2006-07-01 న ఆర్కైవు చేసారు. Retrieved 2010-07-14. Cite web requires |website= (help)
 11. "Times Online: Special Report: Trying to stub out the fakes". The Times. London. June 11, 2006. Retrieved May 11, 2010.
 12. "Special Report: Trying to stub out the fakes". The Times. London. June 11, 2006. Retrieved May 11, 2010.
 13. "Louis Vuitton: luxury leather luggage, French fashion designer". Retrieved 2008-03-04. Cite web requires |website= (help)
 14. "Louis Vuitton Wins Spears Video Lawsuit". FOXNews. The Associated Press. 2007-11-20. Retrieved 2007-11-20.
 15. "Cease-and-Desist Order, February 13, 2008" (PDF). మూలం (PDF) నుండి 2010-10-26 న ఆర్కైవు చేసారు. Retrieved 2010-07-14. Cite web requires |website= (help)
 16. 17.0 17.1 Nadia Plesner (February 22, 2008). "Answer to Louis Vuitton" (PDF). మూలం (PDF) నుండి 2010-12-23 న ఆర్కైవు చేసారు. Retrieved 2010-07-14. Cite web requires |website= (help) ఉదహరింపు పొరపాటు: చెల్లని <ref> ట్యాగు; "Answer" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు
 17. "Louis Vuitton Sues Darfur Fundraiser, Techdirt, April 25, 2008". Cite web requires |website= (help)
 18. "Louis Vuitton Tried to Prevent the Nadia Plesner Lawsuit, nymag, May 9, 2008". Cite web requires |website= (help)
 19. "Art Student Nadia Plesner's Giant Louis Vuitton Copyright Suit, NYMag, May 6, 2008". Cite web requires |website= (help)
 20. Cecilie Back (October 27, 2008). "Franske hyklere". Ekstra Bladet (Danish లో).CS1 maint: unrecognized language (link)

వెలుపలి లింకులు[మార్చు]