Jump to content

లెంగీ నృత్యం

వికీపీడియా నుండి

లెంగీ నృత్యం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాల ,సుగాలీ, లంబాడీ గిరిజనుల హోళీ పండుగను పురస్కరించుకుని చేసె సాంప్రదాయ నృత్యాన్ని లెంగి నృత్యం' అని అంటారు. ఈ లెంగి నృత్యం చాలా ప్రసిద్ధి చెందిన నృత్యం. గిరిజనులు సామూహికంగా 20 నుండి 40 వరకు లేదు అంతకంటే ఎక్కువ మంది కూడా ఈ లెంగి నృత్యంలో పాల్గోని నృత్యం చేస్తారు[1].

లెంగీ నృత్యం
అధికారిక పేరులెంగీ నృత్యం
యితర పేర్లుహోళీర్ గెర్యా
జరుపుకొనేవారు లంబాడీ గిరిజనులు
రకంప్రాంతీయ జానపదం
జరుపుకొనే రోజుమార్చి నేలలో
ఆవృత్తి‌ హోళీర్ గెర్యా

చరిత్ర

[మార్చు]

లంబాడీ గిరిజనులు అత్యంత ఉత్సాహంతో జరుపుకునే పండుగల్లో హోళీ ఒకటి.హోళీ పండుగ వసంతకాలంలో పున్నమిన వచ్చే పండుగ. తాండలో పండుగకు పది రోజుల ముందు నుంచే డప్పు వాయిస్తూ లెంగీ పాటల పై లెంగీ నృత్యాలు చేస్తారు.నృత్యాలు చెసే మగవాళ్ళని గేర్యా అని ఆడవాళ్ళను గేరణి అని అంటారు. గేర్యా, గేరణిలు ఒకరినొకరు తిట్టుకుంటూ హోళీ పాటలు పాడుతారు. వీరు కూర్చోని డప్పులు వాయిస్తూ కుర్చోని లెంగీ పాటలు పాడుతారు దానిని బెటిలెంగీ అంటారు. ఆ ఊరిలో సంవత్సర కాలంలో ఎవరైనా చని పోతే వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించిన తర్వాత వాళ్ళను కూడా లెంగీ నృత్యాల్లో కలుపుకుని తీసుకోని వెళ్తారు. వీరు హోళీ పండుగన చిన్నారి మగ పిల్లలకు ఢూండ్ చేస్తారు. హోళి కామధహనం మరుసటి రోజున దులండి పండుగ చిన్న పెద్ద అనే తారతమ్యం లేకుండా అందరూ మోదుగ (కేసులా) పువ్వులతో తయారు చేసిన రంగులను గాని, రసాయన రంగు‌ నీళ్ళను గాని ఒకరి పై ఒకరు జల్లు కుంటు గేర్ ( పండుగ ఇనామ్) అడుగుతారు. వరుసగా మరిది అయ్యే వారి వస్తువులను గాని, ధరించే బట్టలను గాని వదినమ్మలు దాసి పెట్టుతారు. ఆ వస్తువును మళ్ళీ పొందాలంటే వారికి కుడుకలు బెల్లం ఇనామ్ ఇచ్చి తీసుకుంటారు[2].

నృత్య ప్రాముఖ్యత

[మార్చు]

లెంగీ నృత్యం లంబాడీ,సుగాలీ గిరిజనులు హోళీపండుగ సందర్భంగా మహిళలు, పురుషులు లెంగీ నృత్యాలు ప్రదర్శిస్తారు.లెంగీ నృత్యాలు చేసేటప్పుడు డప్పు వాయించే వాడు  మద్యలో ఉండి  నృత్యాలు చేసే వారు చుట్టురా ఉంటారు.అందులో సగం మంది ముందు పాటలు పాడుతారు  తర్వాత మిగిలిన సగంమంది లెంగీ పాటలు పాడుతూ నృత్యాలు చేస్తారు. నృత్య కళాకారులు రంగు రంగుల ఏకరూప దుస్తులు ధరించి కాళ్ళుకు గుజ్జెలు కట్టి చేతుల్లో  రుమాలు గాని కట్టెగాని పట్టు కుంటారు.వివిధ భంగిమల్లో వీరు నృత్యాలు చేస్తారు. ఈ నృత్యంలో పోటీలు నిర్వహించి బహుమతులు కూడా ప్రధానం చేస్తారు.అతి పురాతన మైన నృత్యాలలో లెంగీ నృత్యం ఒకటి ఇది వినోదాన్ని పంచే అందమైన నృత్యకళ.

మూల ప్రాంతం

[మార్చు]

భారతదేశం లోని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మహారాష్ట్ర కర్ణాటక మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ ఒరిస్సా రాజస్థాన్ గుజరాత్ గోవా మొదలు రాష్ట్రాల్లో ఈ లెంగీ నృత్యాన్ని బంజారా సమాజం ప్రజలు చేస్తారు.

సామూహిక నృత్యం

[మార్చు]

హోళీ పర్వదిన సందర్భం లెంగీ‌ నృత్యం చేస్తారు. లెంగీ నృత్యం అనేది సాముహిక గోళాకార నృత్యం ఈ నృత్యంలో సుమారు 25 నుంచి 50‌వరకు కూడా పాల్గొని నృత్యం చేస్తారు. ముందుకు పది పదిహేను మంది పాడిన తర్వాత మిగిలిన వారు కోర్సు అందిస్తూ పాడుతారు. ఈ లెంగీ నృత్యంలో ముఖ్యంగా డప్పులు మాత్రమే వాయిస్తారు.డప్పు వాయించే వారు గోళాకార మద్యలో ఉంటు డప్పు వాయిస్తూ ఉంటాడు.పాటలు పాడుతు గుండ్రంగా తిరుగుతు నృత్యం చేస్తారు.ఈ నృత్యం చేసే టప్పుడు విరి వద్ద రుమాలు గానీ,కట్టే గాని చేతుల్లో ఉపుతు నృత్యం చేస్తారు.

దుస్తులు

[మార్చు]

లంబాడీ గిరిజనులు ఈ లెంగీ నృత్యం చేసేటప్పుడు పురుషులు తెల్లని ధోవతి,తెల్లటి ఖమిజు చెతులలో పింక్ కలర్ రుమాలు, మహిళలు కూడా సాంప్రదాయం దుస్తులు ధరిస్తారు. బంజారా సమాజానికి చెందిన వస్త్రాలను ఆభరణాలను ధరిస్తారు. ఉత్సాహవంతులు కాళ్ళకు గజ్జెలు కట్టుకొని కూడా నృత్యం చేస్తారు.

నృత్య శైలి

[మార్చు]

లంబాడీ గిరిజనుల హోళీ పండుగ సందర్భంగా చేసి డ్యాన్స్ లెంగీ నృత్యం, ఇది వారి సంస్కృతి సంప్రదాయాల పరంపర నుండి వస్తున్న సంప్రదాయం నృత్యం .ఈ నృత్య ప్రదర్శనలో పది పదిహేను మంది నుండి ముఫై దానికంటే ఎక్కువగా కూడా పాల్గొని నృత్యం చేస్తారు. ఇది వారి సంప్రదాయ నృత్య శైలిలో డప్పు వాయిస్తూ అందరూ ఒకే రంగు దుస్తులు ధరించి గోళాకారంలో తిరుగుతూ నృత్య ప్రదర్శన నిర్వహిస్తారు. డప్పు వాయించే వాడు మద్యలో ఉంటు డప్పు కొడతాడు.

సంగీత వాయిద్యాలు

[మార్చు]

లంబాడీ గిరిజనులు లెంగీ నృత్యంలో ముఖ్యంగా డప్పు వాయిద్యాలు మాత్రం ఉపయోగిస్తారు.

ఇవి కూడా చూడండి

[మార్చు]

బంజారా నృత్యం

మూలాలు

[మార్చు]
  1. Sumithra (2023-03-05). "గిరిజన నృత్యంలో పాలుపంచుకున్న ఎమ్మెల్యే." www.dishadaily.com. Retrieved 2025-04-24.
  2. "बंजारा समुदाय में सुख और दुख के समय होता है पारंपरिक नृत्य लेंगी - fUfUfUfUfUfUfUfUfU". Nai Dunia (in హిందీ). 2020-09-02. Retrieved 2025-04-24.