లెమన్ ఆయిల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
లెమన్/పసుపు నిమ్మ
P1030323.JPG
పళ్ళువున్న చెట్తు .పూలుకూదా వున్నవి.
శాస్త్రీయ వర్గీకరణ
రాజ్యం: ప్లాంటే
(unranked): Angiosperms/ఆంజియో స్పెర్మ్స్
(unranked): యూడికోట్స్/Eudicots
(unranked): రోసిడ్స్/Rosids
క్రమం: Sapindales
కుటుంబం: రూటేసి
జాతి: సిట్రస్
ప్రజాతి: C. limon
ద్వినామీకరణం
సిట్రస్ లిమోన్
(L.) Osbeck
పర్యాయపదాలు[1]

లెమన్ ఆయిల్ లేదా పసుపు నిమ్మపండు నూనె ఒక ఆవశ్యక నూనె మరియు ఒక సుగంధ తైలం.లెమన్ ఆయిల్ ను పరిమళ ద్రవ్యంగా ఇతర సుగంధ నూనెలతో మిశ్రమం చేసి ఉపయోగిస్తారు. లెమన్ ఆయిల్ ఔషధగుణాలు వున్న నూనె.లెమన్ ఆయిల్ ను పండు యొక్క పైనున్న తొక్కనుండి ఉత్పత్తి చేస్తారు.లెమన్ చెట్టు రూటేసి కుటుంబానికి చెందిన చెట్టు. లెమన్ యొక్క వృక్షశాస్త్రపేరు సిట్రస్ లిమోనమ్(సిట్రస్ లిమోన్ అనికూడా అంటారు). లెమన్ ఆయిల్ ను సెడ్రో ఆయిల్ అనికూడా అంటారు(అనగా టేర్పేన్ లేని నూనె అని అర్థం).

పసుపు నిమ్మ(లెమన్)చెట్టు[మార్చు]

నిమ్మ/లెమన్ చెట్టు మూల స్థానం భారత దేశం(ఆసియా). లెమన్ చెట్టు దాదాపు 6 మీటర్ల (20అడుగులు)ఎత్తువరకు పెరుగును.ఱంపము వంటి అంౘుగలఆకులు ముదురు ఆకుపచ్చ రంగులో దీర్ఘఅండాకారంలో వుండును.పింకు/తెలుపు పూలు పరిమళం కల్గి వుండును.చెట్టు ముళ్లను కల్గి వుండును.లెమన్ పళ్ళు మొదట ఆకుపచ్చగా వుండి పక్వానికి వచ్చాక పసుపు రంగుకు మారును.లెమన్ అనే పదం అరబిక్ పదం లైముమ్('laimun)లేదా పర్షియన్ పదం లిమూన్(limun)నుండి ఏర్పడి వుండును.లెమన్ అనే పదం అరబిక్ పదం లైముమ్('laimun) లేదా పర్షియన్ పదం లిమూన్(limun)నుండి ఏర్పడి నది. మధ్య యుగకాలం లోమతవిషయయోధుఁలద్వారా( Crusaders) ద్వారా యూరోప్ కు తీసుకు వెళ్లబడినది,లెమన్ పండులో విటమిన్ ఏ,బి,మరియు సి ఎక్కువ పరమాణంలో లభించును.[2] లెమన్ మరియు లెమన్ ఆయిల్ ను ఆయుర్వేదంలో చాలాకాలంనుండి ఉపయోగిస్తున్నారు.200 AD కాలంలో యూరోప్ కు తీసుకురాబాడినది.[3]

లెమన్ ఆయిల్/నిమ్మ నూనె సంగ్రహణ[మార్చు]

లెమన్ పండు యొక్కతొక్క నుండి కోల్డ్ ఎక్స్ప్రెసన్ పద్ధతిలో సంగ్రహిస్తారు.నీటి ఆవిరి పద్ధతిలో కూడా సంగ్రహిస్తారు,కానీ దాని నాణ్యత తక్కువగా పరిగణిస్తారు.

లెమన్ ఆయిల్[మార్చు]

లెమన్ ఆయిల్ పాలిపోయిన ఆకుపచ్చని ఛాయవున్న పసుపు రంగులో వుండును.తాజా నిమ్మవాసన కల్గి వుండును.నీటి వంటి స్నిగ్థత కల్గివున్నది.నూనె యొక్క నిల్వకాలం కేవలం 8 నుండి 10 నెలలు మాత్రమే. సాధారణంగా మిగతా ఆవశ్యక నూనెల నిల్వ కాలం రెండు సంవత్సరాలు వుండును.[2]

లెమన్ ఆయిల్ లోని రసాయన పదార్థాలు[మార్చు]

లెమన్ ఆయిల్ లో టేర్పేనులు,సెస్కీటేర్పేనులు,అల్డిహైడులు,ఆల్కహాలులు,ఇస్తారులు మరియు స్టేరోలులు వున్నవి.[3]లెమన్ ఆయిల్ లో పలు రసాయన పదార్థాలు వున్నప్పటికి వాటిలో ప్రధానమైనవి ఆల్ఫా పైనేన్, కాంపెన్, బీటా- పైనేన్, సబినెన్, మైర్సేన్, ఆల్ఫా-టెర్పినేన్, లినలుల్, బీటా బిసబోలెన్, లిమోనెన్, ట్రాన్స్-ఆల్ఫా-బెర్గమోటెన్, నేరోల్, మరియు నేరాల్ లు.[2] లెమన్ ఆయిల్ లో పలు రసాయన పదార్థాలు-శాతాలు[4]

వరుస సంఖ్య రసాయన పదార్థం శాతం స్వాభావం ఔషధగుణం
1 లిమోనేన్ 67.6 fragnance,flavor క్యాన్సరు నిరోధకం,యాంటి ఆక్సిడెంట్,కేమో ప్రివెంటివ్
2 బీటా-పైనేన్ 13.4 వుడి గ్రీన్ పైన్ వంటి వాసన యాంటీ డిప్రెసెంట్,యాంటి బాక్టీరియాల్,సైటోటాక్సిక్ మరియు యాంటీ మైక్రీబియల్
3 గామా-టెర్పినేన్ 10 పచ్చ నిమ్మ వంటి టేర్పీన్ వాసన ఉపశమనకారి,యాంటీ అక్సిడెంట్
4 సబినెన్ 2.3 మాసాలావంటి స్వభావం యాంటీ సెప్టిక్,యాంటీ మైక్రోబియాల్,యాంటీ ఇన్ఫ్లమేటరీ
5 అల్ఫాపైనేన్ 2.0 కర్పూరం వంటి వాసన మేధావికాసం,శ్వాసనాళలను విస్తరించును , యాంటీ ఇన్ఫ్లమేటరీ

లెమన్ ఆయిల్ భౌతిక గుణాలు[మార్చు]

లెమన్ ఆయిల్ భౌతిక గుణాల పట్టిక[5]

వరుససంఖ్య భౌతిక గుణం మితి
1 విశిష్ట గురుత్వం 0.849-0.855
2 వక్రీభవన సూచిక 1.474-1.467
3 దృశ్య భ్రమణం +57 to +65.6
4 రంగు పోలిపోయిన పసుపు-ముదురు పసుపు

లెమన్ ఆయిల్ వాడకంలో జాగ్రత్తలు[మార్చు]

లెమన్ ఆయిల్ విషరహితమైనప్పటికి కొందరికి చర్మానికి ఇరిటేసన్‌ కలిగించ వచ్చును. కారణం ఈ నూనె కాంతిప్రభావానికి ఎక్కువ సేపు గురైనపుడు విష గుణాన్ని పొందును (photo-toxic).[2]

ఉపయోగాలు[మార్చు]

  • రక్త ప్రసరణను వృద్ధిపరచును. జ్వరాన్ని తగ్గిస్తుంది. గొంతు నొప్పిని తగ్గిస్తుంది. దీర్గకాలిక శ్వాసకోశ జబ్బులను, ఆస్త్మాను మరియు ఫ్లూ ను తగ్గించును.ఇమ్యూన్ వ్యవస్థను మెరుగు పరచును.మలబద్దకాన్ని తగ్గిస్తుంది. జీర్ణ ప్రక్రియను వృద్ధిపరచును. మొటిమలను శుద్ధిపరచుటకు ఉపయోగిస్తారు.అలాగే జిడ్డు చర్మాన్ని, జిడ్డుతల కేశాలను శుభ్రపరచుటకు లెమన్ ఆయిల్ ను ఉపయోగిస్తారు. అలాగే పొడిబారిన చర్మ కణాలను తొలగించును, నోటి పుళ్ళను తగ్గించును.అలాగే పురుగుకాటు నొప్పులను తగ్గించును.తలనొప్పిని తగ్గించును.[2]
  • వాంతుల నుండి ఉపశమనం కల్గించ్చును.దేహ బరువును తగ్గిస్తుంది.వొంటిలోని కొవ్వును లెమన్ ఆయిల్ కరిగిస్తుంది.నూనెలోని D-లిమోనెన్ ఆహార పచనక్రియను(metabolism)వేగిరపరచి లిమ్పాటిక్ గ్రంధులను శుద్ధిపరచి కొవ్వును కరగించు బరువును తగ్గించును. [3]

బయటి లింకుల వీడియోలు[మార్చు]

ఇవికూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "The Plant List:Citrus limon (L.) Osbeck". Royal Botanic Gardens Kew and Missouri Botanic Garden. Retrieved February 20, 2017.
  2. 2.0 2.1 2.2 2.3 2.4 "Lemon essential oil information". essentialoils.co.za. https://web.archive.org/web/20180331221116/https://essentialoils.co.za/essential-oils/lemon.htm. Retrieved 19-10-2018. 
  3. 3.0 3.1 3.2 "Top 10 Lemon Essential Oil Uses and Benefits". draxe.com. https://web.archive.org/web/20181016185117/https://draxe.com/lemon-essential-oil-uses-benefits/. Retrieved 19-10-2018. 
  4. "Lemon Essential Oil". ayurvedicoils.com. https://web.archive.org/web/20180318083352/http://ayurvedicoils.com/tag/chemical-constituents-of-lemon-essential-oil. Retrieved 19-10-2018. 
  5. "Lemon Oil". ntp.niehs.nih.gov. https://web.archive.org/web/20170221163235/https://ntp.niehs.nih.gov/ntp/htdocs/chem_background/exsumpdf/lemonlimeoils_508.pdf. Retrieved 19-10-2018.