Jump to content

లెహంబర్ సింగ్

వికీపీడియా నుండి
లెహంబర్ సింగ్
Personal information
Birth nameలెహంబర్ సింగ్ మందర్
Nationalityభారతీయుడు
Born1949
మందర్ డోనా, కపూర్తలా జిల్లా, పంజాబ్
Died2025, డిసెంబర్ 25
Sport
Country భారతదేశం
Sportఅథ్లెటిక్స్
Medal record
పురుషుల అథ్లెటిక్స్
Representing భారతదేశం
ఆసియా క్రీడలు
Silver medal – second place1974 టెహ్రాన్4 × 400 m
Bronze medal – third place1974 టెహ్రాన్400 m hurdles

సర్దార్ లెహంబర్ సింగ్ మందర్ ఒక భారతీయ క్రీడాకారుడు, సరిహద్దు భద్రతా దళం కమాండెంటు. ఇతడు 1974లో టెహ్రాన్‌లో జరిగిన ఆసియా క్రీడలలో 400 మీ హర్డిల్స్‌లో కాంస్య పతకాన్ని, సుచ్చా సింగ్, శ్రీరామ్ సింగ్, పి.సి. పునప్పలతో కలిసి 4 × 400 మీ రిలేలో రజత పతకాన్ని సాధించాడు.[1][2][3]

విశేషాలు

[మార్చు]

లెహంబర్ సింగ్ 1949లో పంజాబ్ రాష్ట్రం, కపూర్తలా జిల్లాలోని మందర్ డోనా అనే గ్రామంలో జన్మించాడు. ఇతడు 1969లో ఘాద్రి బాబా హర్నామ్ సింగ్ సీనియర్ సెకండరీ స్కూల్ నుండి 10వ తరగతి ఉత్తీర్ణుడయ్యాడు. ఇతడు హాకీ, వాలీబాల్, కబడ్డీ, బాస్కెట్‌బాల్, అథ్లెటిక్స్‌ మొదలైన క్రీడలలో ఎల్లప్పుడూ ముందుండేవాడు. జలంధర్ రాష్ట్ర క్రీడా కళాశాలలో 11వ తరగతిలో ప్రవేశం పొందిన తర్వాత, మొదటి సంవత్సరం నుండి పతకాలు గెలుచుకోవడం ప్రారంభించాడు. ఇతడు భారతదేశానికి మొదటి 400 మీటర్ల హర్డిల్స్ పతకాన్ని గెలుచుకున్నాడు. 1974 టెహ్రాన్ ఆసియా క్రీడల్లో కాంస్య పతకం, 1975 సియోల్ మీట్‌లో రజత పతకం, 1976 పాకిస్తాన్ క్వాయిడ్-ఎ-అజామ్ మీట్‌లో బంగారు, వెండి పతకాలు గెలుచుకున్నాడు. 1978 బ్యాంకాక్, 1982 ఢిల్లీ ఆసియా క్రీడల్లో పాల్గొనడం ద్వారా, ఇతడు అనేక జాతీయ రికార్డులను బద్దలు కొట్టి భారతదేశానికి గర్వకారణంగా నిలిచాడు. ఇతడు పంజాబ్ ప్రభుత్వం నుండి మహారాజా రంజిత్ సింగ్ అవార్డును అందుకున్నాడు. ఇతడు 7 సంవత్సరాలు జాతీయ క్రీడలలో, 14 సంవత్సరాలు పోలీస్ క్రీడలలో రాణించాడు. తరువాత, BSFలో జాయింట్ డైరెక్టర్ స్పోర్ట్స్‌గా పనిచేస్తున్నప్పుడు చాలా మంది ప్రతిభావంతులైన ఆటగాళ్లను తయారుచేసి ఆలిండియా పోలీస్ క్రీడలలో వారు అనేక ట్రోఫీలను గెలుచుకునేలా చేశాడు. ఇతడు 2025, డిసెంబర్ 25న జలంధర్‌లో మరణించాడు.[4]

మూలాలు

[మార్చు]
  1. "MEDAL WINNERS OF ASIAN GAMES". Athletics Federation of India. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 13 July 2021.
  2. Asian Recorder. K. K. Thomas at Recorder Press. 1977. p. 13832. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 14 July 2021.
  3. The Indian Police Journal. Indian Police Journal. 1976.
  4. వెబ్ మాస్టర్. "ਕਮਾਡੈੰਟ ਲਹਿੰਬਰ ਸਿੰਘ ਮੰਡੇਰ ਦਾ ਦਿਹਾਂਤ". పంజాబీ జాగరణ్. Jagran New Media. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 1 January 2026.