లెహర్ తుఫాను

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
లెహర్ అతి తీవ్రమైన తుఫాను
Very severe cyclonic storm (IMD scale)
Category 1 tropical cyclone (SSHWS)
2013 నవంబరు 25 న లెహర్ తుపాను
చలనంతుపాను స్థితి
ఏర్పడిన తేదీ2013 నవంబరు 19
సమసిపోయిన తేదీ2013 నవంబరు 28
అత్యధిక గాలులు3-minute sustained: 140 km/h (85 mph)
1-minute sustained: 140 km/h (85 mph)
అత్యల్ప పీడనం980 hPa (mbar); 28.94 inHg
మరణాలుNone
నష్టంMinimal
ప్రభావిత ప్రాంతాలుథాయిలాండ్, మలేషియా, మలయా ద్వీఓకల్పం, అండమాన్ నికోబార్ దీవులు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా
Part of the 2013 Pacific typhoon and the North Indian Ocean cyclone seasons

చాలా తీవ్రమైన సైక్లోనిక్ తుఫాను లెహర్ [nb 1] ఒక ఉష్ణమండల తుఫాను. ఇది ప్రధానంగా అండమాన్, నికోబార్ దీవులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రభావితం చేసింది. లెహర్ 2013 సీజన్‌లో ఫైలిన్ తుఫాను తరువాత ఇది రెండవ అత్యంత తీవ్రమైన ఉష్ణమండల తుఫాను. అలాగే 2013 నవంబరులో దక్షిణ భారతదేశాన్ని ప్రభావితం చేసిన సాపేక్షంగా బలమైన రెండు తుఫానులలో ఒకటి కాగా మరొకటి హెలెన్ తుఫాను.

నవంబర్ 18న దక్షిణ చైనా సముద్రంలో ఏర్పడిన అల్పపీడన ప్రాంతాన్ని లెహర్ మూలంగా గుర్తించవచ్చు. ఈ వ్యవస్థ మెల్లగా పశ్చిమ దిశగా మళ్లి, బంగాళాఖాతంలోకి ప్రవేశించింది. అక్కడ నవంబరు 23న అది త్వరగా అల్పపీడనంగా మారింది. ఇది తుఫానుగా మారి, అండమాన్ నికోబార్ దీవుల మీదుగా బంగాళాఖాతంలోకి ప్రవేశించిన తర్వాత, నవంబరు 24న దీనికి లెహర్ అని పేరు పెట్టారు. ఇది పశ్చిమ-వాయవ్య దిశగా మరింత మెరుగైన వాతావరణంలోకి మళ్ళింది. లెహర్ క్రమంగా తీవ్ర తుఫానుగా తీవ్రరూపం దాల్చింది. ఇది సఫీర్-సింప్సన్ హరికేన్ విండ్ స్కేల్ (SSHWS)పై కేటగిరీ 1 హరికేన్‌కు సమానం. నవంబరు 26న గరిష్ట స్థాయికి చేరుకుంది, 3 నిమిషాల నిరంతర గాలి వేగం 140 కి.మీ/గంట తో, కనిష్ఠ కేంద్ర పీడనం 982 mbar (29.0 inHg) తో ఉంది.

తరువాతి రోజుల్లో పశ్చిమ-వాయువ్య మార్గంలో కదులుతూ, చల్లటి జలాలు, మితమైన నిలువు గాలి కోత ఉన్న ప్రాంతం మీదుగా వెళ్లింది. తుఫాను యొక్క తక్కువ-స్థాయి ప్రసరణ కేంద్రం (LLCC) దాని నిర్మాణాన్ని కోల్పోవడం మొదలై, బలహీనపడే ధోరణిని ప్రేరేపించింది. నవంబరు 28న లెహర్ వేగంగా బలహీనపడి అల్పపీడనంగా మారింది. మచిలీపట్నం సమీపంలో రెండవసారి తీరం దాటింది. అదే రోజు, ఇది చివరిసారిగా ఆంధ్రప్రదేశ్‌పై అల్పపీడన ప్రాంతంగా గుర్తించబడింది.

తుఫాను నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, ఒడిశాలోని కోస్తా జిల్లాల అధికారులు 45,000 మందిని లోతట్టు ప్రాంతాలకు తరలించడంతో సహా విస్తృతంగా సన్నాహాలు చేశారు. తీరం దాటే ముందు తుఫాను వేగంగా బలహీనపడటం వలన ఎటువంటి మరణాలు సంభవించలేదు. నష్టం కనిష్ఠ స్థాయిలో జరిగింది.

వాతావరణ చరిత్ర[మార్చు]

Map plotting the track and intensity of the storm, according to the Saffir–Simpson scale
Map key
  Tropical depression (≤38 mph, ≤62 km/h)
  Tropical storm (39–73 mph, 63–118 km/h)
  Category 1 (74–95 mph, 119–153 km/h)
  Category 2 (96–110 mph, 154–177 km/h)
  Category 3 (111–129 mph, 178–208 km/h)
  Category 4 (130–156 mph, 209–251 km/h)
  Category 5 (≥157 mph, ≥252 km/h)
  Unknown
Storm type
▲ Extratropical cyclone / Remnant low / Tropical disturbance / Monsoon depression

2013 నవంబరు 19 న జపాన్ వాతావరణ సంస్థ, ఉష్ణమండల మాంద్యం మలేషియాలోని కౌలాలంపూర్‌కు పశ్చిమాన దాదాపు 365 కి.మీ. దూరంలో ఏర్పడినట్లు వెల్లడించింది. [1] తరువాతి కొద్ది రోజులలో ఈ వ్యవస్థ పశ్చిమ-వాయువ్య దిశగా కదిలి, నవంబరు 21 న మలయా ద్వీపకల్పంలో మరింత అభివృద్ధి కోసం అత్యంత అనుకూలమైన వాతావరణంలోకి మారింది. [2] వ్యవస్థ 100°తూ రేఖాంశాన్ని దాటి అండమాన్ సముద్రం లోకి వెళ్లినందున మరుసటి రోజు JMA చివరిగా గుర్తించింది. [3] [4]

అక్కడ, ఇది బాగా నిర్వచించబడిన తక్కువ-స్థాయి ప్రసరణ కేంద్రాన్ని (LLCC) అభివృద్ధి చేసింది. జాయింట్ టైఫూన్ వార్నింగ్ సెంటర్ (JTWC) ఈ తుపానుపై ఉష్ణమండల తుఫాను ఫార్మేషన్ హెచ్చరిక (TCFA) జారీ చేసింది. బంగాళాఖాతంలోని వెచ్చని విభాగాలలోకి కదులుతున్నందున ఇది మరింత తీవ్రతర మవుతుందని భావించారు. [4] 08 knots (15 km/h; 9.2 mph) వేగంతో పశ్చిమ దిశగా కదులుతూ తర్వాతి 24 గంటల్లో ఈ వ్యవస్థ క్రమంగా తీవ్రమైంది. నవంబరు 23 ప్రారంభంలో, JTWC వ్యవస్థను ఉష్ణమండల తుఫానుగా వర్గీకరించింది, దీనికి 05B అనే పేరు పెట్టింది. [5] కొన్ని గంటల తర్వాత, భారత వాతావరణ శాఖ (IMD) ఈ వ్యవస్థను అల్పపీడనంగా ట్రాక్ చేయడం ప్రారంభించింది. దీనికి ప్రారంభంలో BOB 07 అనే కోడ్‌ను కేటాయించింది. [6] మరుసటి రోజు ప్రారంభంలో, IMD BOB 07 లోతైన అల్పపీడన స్థితికి చేరుకుందని నివేదించింది, [7] వెంటనే, వారు BOB 07 ను తుఫానుగా మార్చి, దానికి లెహర్ అని పేరు పెట్టారు. [8] ఆ రోజు తర్వాత, లెహర్ బలహీనమైన మైక్రోవేవ్ కంటి లాంటి లక్షణాన్ని అభివృద్ధి చేసింది. [9]

లెహర్ నవంబరు 25 ప్రారంభంలో పోర్ట్ బ్లెయిర్, అండమాన్ నికోబార్‌కు దక్షిణంగా మొదటిసారి తీరం దాటింది. అయితే, అది అదే తీవ్రతతో కొనసాగింది. [10] తుఫాను మరింత బలపడి, బలమైన రేడియల్ అవుట్‌ఫ్లోను అభివృద్ధి చేసి, ఈ ప్రాంతంలోని మితమైన నిలువు గాలి కోతను పూరించింది. ఈ పరిణామాన్ని అనుసరించి భారత వాతావరణ సంస్థ, లెహర్‌ను తీవ్రమైన సైక్లోనిక్ తుఫానుగా అప్‌గ్రేడ్ చేసింది. నవంబరు 26 ప్రారంభంలో IMD, లెహర్‌ను చాలా తీవ్రమైన సైక్లోనిక్ తుఫానుగా అప్‌గ్రేడ్ చేసింది. మరోవైపు ఆంధ్రప్రదేశ్, ఒడిశాలోని కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు, బలమైన గాలులు వీస్తాయని హెచ్చరించింది. [11]

తీరాన్ని దాటుతున్న లెహర్ యానిమేషన్

తుఫాను గరిష్టంగా 1-నిమిషంపటు నిలకడగా 75 knots (139 km/h; 86 mph) సగటు గాలివేగంతో సాగింది. [12] చల్లటి జలాల మీదుగా వెళుతున్నప్పుడూ, మితమైన తూర్పు నిలువు గాలి కోతను ఎదుర్కొన్నప్పుడూ తుఫాను తీవ్రతను కోల్పోవడం ప్రారంభించింది. [13] నవంబరు 27న, తుఫాను కేంద్రం చుట్టూ ఉన్న ఉష్ణప్రసరణ దాని నిర్మాణాన్ని కోల్పోవడం ప్రారంభించింది. ఆ తర్వాత, లెహెర్ వేగంగా అల్పపీడనంగా బలహీనపడి, నవంబర్ 28న ఆంధ్రప్రదేశ్‌లోని మచిలీపట్నంకు దక్షిణంగా తీరం దాటింది. [14] లోతట్టు ప్రాంతాలకు కదులుతూందగా, పెరిగిన ఘర్షణ వలన తుఫాను అల్పపీడన ప్రాంతంగా మారింది.

సన్నాహాలు, ప్రభావం[మార్చు]

అండమాన్ నికోబార్ దీవులు[మార్చు]

భారీ వర్షం, ఈదురుగాలులతో అండమాన్ దీవులపై తుపాను ప్రభావం పడింది. వరదలు వచ్చాయి, భూమి కోతలు పడింది, రోడ్లు దిగ్బంధనమయ్యాయి, చెట్లు కూలిపోయాయి, భవనాలకు నష్టం కలిగింది. రెండు డజన్ల మంది మత్స్యకారులు తప్పిపోయారు. లిటిల్ అండమాన్‌లో 2000 మందిని, హేవ్‌లాక్ ద్వీపంలో 1500 మందినీ ఖాళీ చేయించారు. [15] తుఫాను తీరం దాటాక 24 గంటల్లో మాయాబందర్, పోర్ట్ బ్లెయిర్‌ లలో 243 మి.మీ., 213 మి.మీ. భారీ వర్షపాతం నమోదైంది. [16] 110 km/h (68 mph) వేగంతో గాలులు ద్వీపాలను తాకాయి. నవంబరు 25న చెన్నై నుండి పోర్ట్ బ్లెయిర్‌కు వెళ్లాల్సిన నాలుగు విమానాలను రద్దు చేసారు. [17]

ఆంధ్రప్రదేశ్[మార్చు]

తీరం దాటడానికి కొద్దిసేపటి ముందు అల్పపీడనంగా లెహర్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నాలుగు మిలిటరీ హెలికాప్టర్లను ఏర్పాటు చేసింది, అయితే జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (NDRF) రాష్ట్రవ్యాప్తంగా 15 బృందాలను మోహరించింది. తుఫాను వచ్చిన వెంటనే రెస్క్యూ, రిలీఫ్ ఆపరేషన్ల కోసం మరో 15 బృందాలను ఏర్పాటు చేసారు. నాలుగు హెలికాప్టర్లను విశాఖపట్నంలో ఉంచారు. [18] విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి జిల్లాల్లో పల్లపు ప్రాంతాల ప్రజలందరినీ ఎత్తైన ప్రాంతాలకు తరలించాలని ప్రభుత్వం జిల్లా కలెక్టర్లకు సూచించింది. [19] తుఫాను తెచ్చిన అత్యంత భారీ వర్షాల కారణంగా వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని స్థానిక రాష్ట్ర ఆరోగ్య అధికారులు హెచ్చరించారు. [20] నవంబరు 27న రాష్ట్ర ప్రభుత్వం తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో తరలింపులను ప్రారంభించింది. [21] గుంటూరు, కృష్ణా, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లా నుండి మొత్తం 45,000 మందిని ఖాళీ చేయించారు. తుఫాను తీరం దాటే ముందు కనిష్ట అల్పపీడనంగా బలహీనపడినందున, తుఫాను-సంబంధిత సంఘటనల కారణంగా ఎటువంటి ప్రాణనష్టం లేదా ఆస్తికి గణనీయమైన నష్టం జరగలేదు. 

ఒడిశా[మార్చు]

మత్స్యకారులందరూ తీరానికి తిరిగి రావాలని, నవంబరు 25న సురక్షిత ప్రాంతాలకు తరలాలని ఒడిశా ప్రభుత్వం కోరింది. భువనేశ్వర్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ పారదీప్, గోపాల్‌పూర్ ఓడరేవులలో తుఫాను ప్రమాద సంకేతాలను ఎగురవేయాలని కోరారు. [22]

ఇవి కూడా చూడండి[మార్చు]

నోట్స్[మార్చు]

  1. (Lehar meaning "wave")

మూలాలు[మార్చు]

  1. "JMA WWJP25 Warning and Summary November 19, 2013 12z". Japan Meteorological Agency. 19 November 2013. Archived from the original on 20 November 2013. Retrieved 24 November 2013.
  2. Joint Typhoon Warning Center (21 November 2013). "Significant Tropical Weather Outlook for the Western and South Pacific Ocean November 21, 2013 13z". United States Navy, United States Airforce. Archived from the original on 24 November 2013. Retrieved 21 November 2013.
  3. "JMA WWJP25 Warning and Summary November 22, 2013 06z". Japan Meteorological Agency. 22 November 2013. Archived from the original on 24 November 2013. Retrieved 24 November 2013.
  4. 4.0 4.1 Joint Typhoon Warning Center (22 November 2013). "Tropical Cyclone Formation Alert November 22, 2013 09z". United States Navy, United States Airforce. Archived from the original on 24 November 2013. Retrieved 22 November 2013. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; "TCFA" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు
  5. "JTWC Warning 01 – Cyclone Lehar". Joint Typhoon Warning Center. Archived from the original on 20 November 2013. Retrieved 24 November 2013.
  6. "IMD Cyclone Warning BOB07/2013/01 for India" (PDF). India Meteorological Department. Archived from the original (PDF) on 24 November 2013. Retrieved 24 November 2013.
  7. "IMD Warning BOB07/2013/02 for India" (PDF). India Meteorological Department. Archived from the original (PDF) on 24 November 2013. Retrieved 24 November 2013.
  8. "IMD Warning BOB07/2013/02 for India" (PDF). India Meteorological Department. Archived from the original (PDF) on 24 November 2013. Retrieved 24 November 2013.
  9. "JTWC Warning 07 – Cyclone Lehar". Joint Typhoon Warning Center. Archived from the original on 25 November 2013. Retrieved 25 November 2013.
  10. "IMD Warning BOB07/2013/10 for India" (PDF). India Meteorological Department. Archived from the original (PDF) on 25 November 2013. Retrieved 25 November 2013.
  11. "IMD Warning BOB07/2013/18 for India" (PDF). India Meteorological Department. Archived from the original (PDF) on 26 November 2013. Retrieved 26 November 2013.
  12. "JTWC Warning 14 – Cyclone Lehar". Joint Typhoon Warning Center. Archived from the original on 27 November 2013. Retrieved 27 November 2013.
  13. "JTWC Warning 15 – Cyclone Lehar". Joint Typhoon Warning Center. Archived from the original on 27 November 2013. Retrieved 27 November 2013.
  14. India Meteorological Department. "Tropical Storm Lehar Advisory 34, issued at 1200 UTC of 28 November 2013" (PDF). India Meteorological Department. Archived from the original (PDF) on 28 November 2013. Retrieved 28 November 2013.
  15. "Cyclonic storm 'Lehar' leaves Andaman Paralysed". 26 November 2013.
  16. [1]
  17. Press Trust of India. "Four Port Blair-bound flights from Chennai cancelled as Cyclone Lehar hits Andaman". NDTV. Retrieved 28 November 2013.
  18. "Cyclone Lehar: Andhra seeks choppers, extra NDRF teams". DNA India. Retrieved 26 November 2013.
  19. "Mighty Lehar to hit land on Thursday". The Times of India. Retrieved 26 November 2013.
  20. "Cyclone Lehar raises health concerns". The Times of India. Retrieved 27 November 2013.
  21. "'Cyclone Lehar' travelling at 150 kmph, evacuations started". DNA India. Retrieved 27 November 2013.
  22. "Cyclone Lehar: Odisha asks fishermen to return to safer places". The Times of India. Retrieved 25 November 2013.