లేజర్ ప్రింటర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

లేజర్ ప్రింటర్ అనేది ఒక మామూలు రకం కంప్యూటర్ ప్రింటర్ వంటిది. ఇది ఒక తెల్లకాగితంపై నాణ్యమైన అక్షరాలను మరియు చిత్రాలను శరవేగంగా ముద్రించగలదు. డిజిటల్ ఫోటోకాపీయర్‌లు మరియు బహుళ ప్రయోజన ప్రింటర్‌ల (MFPలు) మాదిరిగా లేజర్ ప్రింటర్లు జరోగ్రఫీ సంబంధిత ప్రింటింగ్ ప్రక్రియను కలిగి ఉంటాయి. అయితే ప్రింటర్ యొక్క ఫోటోరిసెప్టర్ వెంట ఉండే లేజర్‌ పుంజాన్ని నేరుగా స్కానింగ్ చేయడం ద్వారా ఇమేజ్‌ను ఉత్పత్తి చేసే ఎనలాగ్ ఫోటోకాఫీయర్లతో ఈ ప్రక్రియ భిన్నంగా ఉంటుంది.

అవలోకనం[మార్చు]

లేజర్ పుంజం ఒక పేజీ దృశ్యాన్ని సెలీనియం పూయబడిన విద్యుదావేశం కలిగిన రొటేటింగ్ డ్రమ్‌పై పడే విధంగా చేస్తుంది. ఫోటోకండక్టివిటీ అనేది కాంతికి గురయ్యే ప్రాంతాలపై ఛార్జ్ (ఆవేశం)ను తొలగిస్తుంది. తర్వాత డ్రై ఇంక్ (టోనర్‌) కణాలు స్థిరవిద్యుత్ రూపకంగా డ్రమ్ యొక్క ఆవేశం చెందిన భాగాల ద్వారా గ్రహించబడతాయి. తద్వారా సిరాను కాగితంపై కరిగించే విధంగా ప్రత్యక్ష స్పర్శ మరియు ఉష్ణం ద్వారా ఇమేజ్‌ను డ్రమ్ కాగితంపై ముద్రిస్తుంది.

ఇతర ప్రింటర్లతో పోల్చితే, లేజర్ ప్రింటర్ల వల్ల అనేక విశిష్ట ఉపయోగాలున్నాయి. ఇంపాక్ట్ ప్రింటర్ల మాదిరిగా కాకుండా, ప్రాసెస్‌కు సంబంధించిన చిత్రపటం (గ్రాఫిక్) తీవ్రత సహా పలు అంశాలపై ఆధారపడి లేజర్ ప్రింటర్ వేగం విస్తృతంగా మారుతుంది. అత్యంత వేగవంతమైన మోడళ్లు నిమిషానికి సుమారు 200 మోనోక్రోమ్ పేజీలను (గంటకు 12,000 పేజీలు) ముద్రించగలవు. అదే అత్యంత వేగవంతమైన కలర్ లేజర్ ప్రింటర్లు నిమిషానికి 100 పేజీలను (గంటకు 6000 పేజీలు) ముద్రించగలవు. చాలా వేగవంతమైన లేజర్ ప్రింటర్లను క్రెడిట్ కార్డు లేదా యుటిలిటీ బిల్లులు వంటి వ్యక్తిగత డాక్యుమెంట్లను పంపడానికి ఉపయోగిస్తారు. అలాగే కొన్ని వాణిజ్యపరమైన ఉపయోగాల పరంగా ఇవి లిథోగ్రఫీ (లిథోగ్రాఫిక్ ప్రింట్‌కు సంబంధించినది)తో కూడా పోటీపడుతాయి.[ఉల్లేఖన అవసరం]

ఈ రకమైన టెక్నాలజీ ఖర్చు పలు అంశాల సంయోగంపై ఆధారపడుతుంది. అంటే కాగితం, టోనర్ (ఒక విధమైన సొల్యూషన్) ధర మరియు అరుదుగా డ్రమ్‌ను మార్చడం, ఫ్యూజర్ సమూహం, బదిలీ పరికరాల సమూహం వంటి వినియోగితాలను మార్చడం. సున్నితమైన ప్లాస్టిక్ డ్రమ్‌లతో కూడిన ప్రింటర్లు తరచూ అత్యధిక వెలను కలిగి ఉంటాయి. డ్రమ్‌ను మార్చాల్సిన పరిస్థితి ఏర్పడేంత వరకు అది స్పష్టం కాదు.

ద్వంద్వ ప్రింటర్ (కాగితం రెండు వైపులా ముద్రించగలుగుతుంది) కాగితం ఖర్చులను సగానికి తగ్గించడంతో పాటు పేర్చడం కూడా తగ్గుతుంది. అంతకుముందు హై-ఎండ్ ప్రింటర్లు మాత్రమే అందుబాటులో ఉండేవి. అయితే ద్వంద్వ ప్రింటర్లు ప్రస్తుతం మధ్యస్థాయి కార్యాలయ ప్రింటర్లుగా సర్వసాధారణంగా వాడబడుతున్నాయి. అయితే అన్ని ప్రింటర్లు ఒక ద్వంద్వ ప్రింటర్ యూనిట్‌ సదుపాయాన్ని కలిగి ఉండ లేవు. పొడవాటి కాగితాన్ని ఉపయోగించే అవకాశమున్నందున ద్వంద్వ ప్రింటర్ ద్వారా పేజీ ప్రింటింగ్ వేగం తక్కువగా ఉంటుంది.

లేజర్ ప్రింటర్‌తో పోల్చితే పలు ఇంక్‌జెట్ ప్రింటర్‌లు మరియు డాట్-మ్యాట్రిక్స్ ప్రింటర్‌లు లోపలకు తీసుకున్న డేటాను నేరుగా నెమ్మదిగా ముద్రిస్తాయి. ఇవి విడతలు విడతలుగా మరింత డేటాను తీసుకోవడంతో ప్రింటింగ్ ప్రక్రియకు మధ్యమధ్యలో కొంత విరామం వస్తుంటుంది. అయితే లేజర్ ప్రింటర్ ఈ విధంగా పనిచేయలేదు. ఎందుకంటే ఎడతెగని ప్రక్రియగా అవుట్‌పుట్ కోసం అత్యధిక డేటాను ప్రింటింగ్ పరికరానికి వేగంగా అందజేయాల్సి ఉంటుంది. మరింత డేటా అందే వరకు కనిపించే ఖాళీలను సృష్టించకుండా లేదా ముద్రిత పేజీపై చుక్కలు గజిబిజిగా కాకుండా ఈ ప్రింటర్ యంత్రాంగాన్ని తగిన రీతిలో ఆడ్డుకోలేదు.

అందుకు బదులుగా ఇమేజ్ డేటా ఏర్పడి, పేజీపై ప్రతి చుక్కను తెలిపే సామర్థ్యం కలిగిన అతిపెద్ద మెమరీ బ్యాంకులో అది నిల్వ అవుతుంది. ప్రింటింగ్‌కు ముందు అన్ని చుక్కలను మెమరీలో నిల్వ చేయడానికి సంప్రదాయబద్ధంగా లెటర్ లేదా A4 వంటి నిర్దుష్ట కాగితపు పరిమాణాలకు పరిమిత లేజర్ ప్రింటర్లు అవసరమవుతాయి. పలు లేజర్ ప్రింటర్లు సుమారు రెండు మీటర్ల పొడవైన షీట్‌పై నిరంతరాయంగా బ్యానర్లను ముద్రించలేవు. ఎందుకంటే ప్రింటింగ్ ప్రక్రియ మొదలవడానికి ముందు అంత పెద్ద ఇమేజ్‌ను నిల్వ (నిక్షిప్తం) చేసుకోవడానికి ప్రింటర్‌లో తగినంత మెమరీ సామర్థ్యం ఉండదు.

చరిత్ర[మార్చు]

గ్యారీ స్టార్క్‌వెథర్, లేజర్ ప్రింటర్ సృష్టికర్త, 2009.

1969లో లేజర్ ప్రింటర్‌ను పరిశోధకుడు గ్యారీ స్టార్క్‌వెథర్‌ జిరాక్స్‌లో కనిపెట్టాడు. అతనికి 1971[1] నాటి కల్లా అభివృద్ధి చెందిన ప్రింటర్ వర్కింగ్ ఉంది. దానిని సుమారు ఏడాది తర్వాత నెట్‌వర్క్ ద్వారా సంపూర్ణంగా పనిచేసే ప్రింటర్ వ్యవస్థగా వ్యవస్థీకరించాడు.[2] ప్రొటోటైప్ (నమూనా) అప్పటికే ఉన్న జిరోగ్రాఫిక్ కాపీయర్‌కు మార్పులు చేర్పులు చేసి, రూపొందించబడింది. స్టార్క్‌వెథర్ ఇమేజింగ్ సిస్టమ్‌ను పనిచేయకుండా చేసి, కొత్తగా 8 అద్దాల అంచులు కలిగిన ఒక స్పిన్నింగ్ డ్రమ్‌ను రూపొందించాడు. అంటే డ్రమ్‌పై లేజర్ కేంద్రీకృతమయ్యే విధంగా. లేజర్ కాంతి స్పిన్నింగ్ డ్రమ్‌ నుంచి బయటపడుతుంది. నకలు (కాపీయర్) అంతటా అది ప్రయాణించడంతో పేజీ మొత్తంపై ప్రింటింగ్ చేస్తుంది. దానికి సంబంధించిన హార్డ్‌వేర్ ఒకటి లేదా రెండు వారాల్లో సిద్ధమైంది. అయితే కంప్యూటర్ ఇంటర్‌ఫేస్ మరియు సాఫ్ట్‌వేర్‌ పూర్తి చేయడానికి మాత్రం సుమారు 3 నెలలు పట్టింది.[ఉల్లేఖన అవసరం]

1976లో వాణిజ్య అవసరాలకు ఉపయోగించిన తొలి లేజర్ ప్రింటర్ IBM మోడల్ 3800. ఇన్‌వాయిస్‌లు మరియు మెయిలింగ్ లేబుళ్లు వంటి అధిక పరిమాణం కలిగిన డాక్యుమెంట్ల ప్రింటింగ్‌కు దీనిని వాడుతారు. దీనిని తరచూ "ఒక గది మొత్తాన్ని ఆక్రమిస్తుంది," అని అంటుంటారు, ఎందుకంటే పర్శనల్ కంప్యూటర్‌ సాయంతో ఉపయోగించే విధంగా తర్వాత వచ్చిన పరికరం యొక్క పురాతన వెర్షన్‌గా దీనిని పేర్కొన్నారు. భిన్నమైన అవసరం కోసం పూర్తిగా అతిపెద్ద పరిమాణంలోనూ దీనిని రూపొందించారు. పలు 3800 మోడళ్లు ఇప్పటికీ వాడబడుతున్నాయి.[ఉల్లేఖన అవసరం]

ఒక కార్యాలయంలో ఏర్పాటు చేసే విధంగా రూపొందించిన తొలి లేజర్ ప్రింటర్‌ను 1981లో జిరాక్స్ స్టార్ 8010 మోడల్‌తో పాటు విడుదల చేశారు. ఇది ఆధునికమైనదైనప్పటికీ, స్టార్ అత్యంత ఖరీదైన ($17,000) వ్యవస్థ. దానిని కొన్ని వ్యాపారాలు మరియు సంస్థలు మాత్రమే కొనుగోలు చేయగలవు. పర్శనల్ కంప్యూటర్‌ల వినియోగం పెరిగిన తర్వాత, సామూహిక మార్కెట్‌కు ఉద్దేశించిన తొలి లేజర్ ప్రింటర్ HP లేజర్‌జెట్‌ 8ppm 1984లో విడుదలయింది. ఇది HP సాఫ్ట్‌వేర్‌ నియంత్రణతో కూడిన Canon ఇంజిన్ కలిగి ఉంటుంది. HP లేజర్‌జెట్ ప్రింటర్ అనంతరం బ్రదర్ ఇండస్ట్రీస్, IBM మరియు ఇతర కంపెనీలు కూడా లేజర్ ప్రింటర్ల ఉత్పత్తిని ప్రారంభించాయి. మొదటి తరం ప్రింటర్లు కాగితపు పొడవు కంటే ఎక్కువ పరిధి ఉన్న అతిపెద్ద ఫోటోసెన్సిటివ్ డ్రమ్‌లను కలిగి ఉన్నాయి. ఫాస్టర్ రికవరీ కోటింగ్‌లు అభివృద్ధి చెందిన తర్వాత, ఒక్క పాస్‌లో డ్రమ్‌లు కాగితాన్ని పలుమార్లు తాకగలిగాయి. తద్వారా వ్యాసం కూడా తగ్గింది.

పలు ఎలక్ట్రానిక్ పరికరాల మాదిరిగా, లేజర్ ప్రింటర్ల ధరలు కొన్నేళ్లుగా చెప్పుకోదగ్గ విధంగా తగ్గాయి. 1984లో $3500[3]కు అమ్ముడైన HP లేజర్‌జెట్ మరింత చిన్న పరిమాణం కోసం, తక్కువ రిజల్యూషన్ గ్రాఫిక్స్ పరంగా మరియు 71 పౌండ్ల(32 kg) బరువు కలిగి ఉండటం వల్ల కొంత సమస్యను ఎదుర్కొంది. తక్కువ ధర కలిగిన మోనోక్రోమ్ లేజర్ ప్రింటర్లు 2008 నాటికి తరచూ $75 కంటే తక్కువ రేటుకే అమ్ముడయ్యాయి. ఈ ప్రింటర్లు ఆన్‌బోర్డ్ ప్రాసెసింగ్‌ లేమితో పాటు రాస్టర్ ఇమేజ్‌ (బిట్‌మ్యాప్)( విన్‌ప్రింటర్‌ను చూడండి) ఉత్పత్తి చేయడానికి ఆతిథేయ కంప్యూటర్‌పై ఆధారపడుతుంది. అయితే దాదాపు అన్ని పరిస్థితుల్లోనూ లేజర్‌జెట్ క్లాసిక్‌ను తలదన్నే రీతిలోనే ఇప్పటికీ పనిచేస్తున్నాయి.

ఎలా పనిచేస్తుంది?[మార్చు]

లేజర్ ప్రింటింగ్ ప్రక్రియలో ఏడు ప్రత్యేకమైన సోపానాలున్నాయి:

రాస్టర్ ఇమేజ్ ప్రాసెసింగ్[మార్చు]

రాస్టర్ ఇమేజ్ డేటా ఉత్పత్తి

పేజీ వెంట ఉన్న ప్రతి సమతల పట్టీ (స్ట్రిప్)ని రాస్టర్‌ లైన్ లేదా స్కాన్ లైన్‌‌గా పేర్కొంటారు. ముద్రించే విధంగా ఇమేజ్‌ను తయారు చేయడం రాస్టర్ ఇమేజ్ ప్రాసెసింగ్‌ (RIP) చేస్తుంది. ప్రత్యేకంగా లేజర్ ప్రింటర్‌లో దానిని ఏర్పాటు చేస్తుంది. మూల సామగ్రి అడోబ్ పోస్ట్‌స్క్రిప్ట్(PS), HP ప్రింటర్ కమాండ్ లాంగ్వేజ్‌(PCL) లేదా Microsoft XML పేజ్ స్పెసిఫికేషన్ (XPS) అదే విధంగా ఫార్మాట్ చేయని టెక్స్ట్ డేటా వంటి పలు స్పెషల్ పేజ్ డిస్క్రిప్షన్ లాంగ్వేజీల్లో దేనిలో కైనా ఎన్‌కోడ్ చేయబడుతుంది. రాస్టర్ మెమరీలో తుది పేజీ యొక్క బిట్‌మ్యాప్‌ను ఉత్పత్తి చేయడానికి పేజ్ డిస్క్రిప్షన్ లాంగ్వేజ్‌ని RIP ఉపయోగించుకుంటుంది. మొత్తం పేజీ ఒక్కసారిగా రాస్టర్ మెమరీలోకి ప్రవేశించగానే నిరంతర ప్రవాహం వలే పిక్సల్స్‌గా మార్చిన చుక్కలను కాగితంపైకి పంపే ప్రక్రియను ప్రారంభించడానికి ప్రింటర్ సిద్ధమవుతుంది.

తొలి హ్యూలెట్ ప్యాకర్డ్‌ లేజర్‌జెట్‌కి 128 కిలోబైట్స్ మెమరీ సామర్థ్యం మాత్రమే ఉంటుంది. ఇది విలక్షణమైన రీతిలో అక్షరాలను మాత్రమే ముద్రించడానికి ఉపయోగించబడుతుంది. అయితే ఇది ఆధునిక గ్రాఫికల్ ప్రింటర్ల మాదిరిగా పనిచేయదు. పేజీకి సంబంధించిన సమాచారం కొద్ది కిలోబైట్లలో మాత్రమే నిక్షిప్తమవుతుంది. ప్రింటింగ్ సమయంలో ప్రతి రాస్టర్ స్కాన్ లైన్‌కు సంబంధించిన వాస్తవిక చుక్కల క్రమం రీడ్ ఓన్లీ మెమరీ(ROM)లో నిక్షిప్తమైన బిట్‌మ్యాప్ పట్టికలపై ఆధారపడుతుంది. అదనపు ఫాంట్లు ఎక్స్‌పేన్షన్ స్లాట్లలోకి ప్లగ్ చేయబడిన ROM క్యార్ట్రిడ్జిలలో నిక్షిప్తమై ఉంటాయి.

పేజ్ డిస్క్రిప్షన్ లాంగ్వేజ్‌ని ఉపయోగించే మొత్తం గ్రాఫికల్ అవుట్‌పుట్‌కు పూర్తి మోనోక్రోమ్ లెటర్/A4 సైజు కలిగిన చుక్కల పేజీ అంటే 300 dpi కలిగిన దానిని నిక్షిప్తం చేయాలంటే కనీసం 1 మెగాబైట్ మెమరీ అవసరమవుతుంది. 300 dpi నందు చదరపు అంగుళానికి 90,000 చుక్కలు (సరళ అంగుళానికి 300 చుక్కలు)ఉంటాయి. ఒక ప్రత్యేకమైన 8.5 x 11 కాగితపు షీటుకు 0.25 అంగుళంతో హద్దులు ఉంటాయి. తద్వారా ముద్రించే భాగాన్ని 8.0 x 10.5 అంగుళాలు లేదా 84 చదరపు అంగుళాలకు తగ్గుతుంది. 84 sq/in x 90,000 dots per sq/in = 7,560,000 చుక్కలు. అదే విధంగా 1 మెగాబైట్ = 1048576 బైట్స్, లేదా 8,388,608 బిట్స్. 300 dpi కలిగిన మొత్తం పేజీకి ఇది తగినంతగా ఉంటుంది. సుమారు 100 కిలోబైట్లు రాస్టర్ ఇమేజ్ ప్రాసెసర్‌ వినియోగానికి విడిచిపెట్టబడుతుంది.

కలర్ ప్రింటర్‌లో నాలుగు CYMK టోనర్ పొరల్లోని ప్రతి ఒక్కటి ఒక ప్రత్యేక బిట్‌మ్యాప్‌గా నిక్షిప్తమవుతుంది. మొత్తం నాలుగు పొరలు (లేయర్లు) విలక్షణంగా ప్రింటింగ్ మొదలవడానికి ముందు ప్రాసెస్ అవుతాయి. కాబట్టి 300 dpi కలిగిన ఒక పూర్తిస్థాయి కలర్ లెటర్ సైజు పేజీకి కనీసం 4 మెగాబైట్స్ సామర్థ్యం అవసరమవుతుంది.

dpi వర్గమూలంతో మెమరీ అవసరాలు పెరుగుతాయి. అంటే మోనోక్రోమ్‌కు సంబంధించి, 600 dpiకి కనీసం 4 మెగాబైట్స్ మరియు 600 dpi కలిగిన కలర్‌కు 16 మెగాబైట్స్ మెమరీ అవసరమవుతుంది. కొన్ని ప్రింటర్లు విభిన్నమైన పరిమాణాల చుక్కలు మరియు మధ్యరకం చుక్కల పరంగా సామర్థ్యం కలిగి ఉంటాయి. ఈ అదనపు పనులకు పైన తెలిపిన తక్కువ పరిమాణాల కంటే పలు రెట్లు అధిక మెమరీ అవసరమవుతుంది.

ప్రింటర్లు టాబ్లాయిడ్ (చిన్న) పరిమాణంలో ఉంటాయి. అలాగే పెద్ద సైజు ప్రింటర్లలో మెమరీ విస్తరణ సదుపాయం ఉంటుంది. తగినంత మెమరీ లేకపోతే, కొన్ని విశిష్టాంశాలు (ఫీచర్స్)పనిచేయకుండా పోవచ్చు. అంటే లెటరు సైజులో కలర్ ప్రింట్ చేయడం వంటివి. అయితే టాబ్లాయిడ్ సైజులో మోనోక్రోమ్ (నలుపు మరియు తెలుపు రంగు మాత్రమే)ను ముద్రించవచ్చు. అదనపు మెమరీని పొందడం ద్వారా పెద్ద సైజుల్లో కలర్ ప్రింటింగ్ చేయవచ్చు.

ఛార్జింగ్[మార్చు]

ఫోటోసెన్సిటివ్ డ్రమ్‌కు రుణావేశాన్ని అనువర్తించడం

పాత ప్రింటర్లలో ఒక కరోనా వైర్ (కాంతివలయ వైరు) డ్రమ్‌కు సమాంతరంగా ఏర్పాటు చేయబడి ఉంటుంది లేదా ఇటీవలి కాలంలోని ప్రింటర్లలో ఒక ప్రైమరీ ఛార్జ్ రోలర్ స్థిరవిద్యుదావేశాన్ని ఫోటోరిసెప్టర్‌ (లేదా ఫోటోకండక్టర్ యూనిట్‌గా పిలుస్తారు)పై కలిగిస్తుంది. ఫోటోరిసెప్టర్ అనేది తిరుగుతూ ఉండే ఒక ఫోటోసెన్సిటివ్ డ్రమ్ లేదా బెల్టు. ఇది చీకటిలో ఉన్నప్పుడు స్థిరవిద్యుదావేశాన్ని తనపై నిలుపుకునే సామర్థ్యం కలిగి ఉంటుంది.

అంతకుముందు ఇమేజ్‌లు విడిచిపెట్టిన ఏవైనా అవశేష ఆవేశాలను తొలగించడానికి AC బియాస్ (పాక్షికం)ను ప్రైమరీ ఛార్జ్ రోలర్‌కు అనువర్తిస్తారు. ఏకరీతి రుణావేశం కోసం ఈ రోలర్ డ్రమ్ ఉపరితలంపై DC బియాస్‌ను కూడా అనువర్తిస్తుంది. కోరిన ప్రింట్ యొక్క తీవ్రత DC బియాస్ ద్వారా నియంత్రించబడుతుంది. [4]

అసంఖ్యాక పేటెంట్లు[specify] ఫోటోసెన్సిటివ్ డ్రమ్ కోటింగ్‌ను ఫోటోఛార్జింగ్ లేయర్ కలిగిన ఒక సిలికాన్ పదార్థంగానూ అదే విధంగా ఉపరితల లేయర్‌గానూ అభివర్ణించాయి. ఒక వెర్షన్[specify] హైడ్రోజన్‌ కలిగిన నిరాకార సిలికాన్‌ను కాంతి స్వీకరణ లేయర్‌గా, ఆవేశ ఉద్గార అవరోధ లేయర్‌గా బోరాన్ నైట్రైడ్, అదే విధంగా ఉపరితల లేయర్‌గా ఉత్ప్రేరక సిలికాన్, ప్రత్యేకంగా ఆక్సిజన్ లేదా నైట్రోజన్‌తో కూడిన సిలికాన్‌ను ఉపయోగిస్తుంది. తగిన మిశ్రమం ద్వారా ఇది సిలికాన్ నైట్రైడ్‌ మాదిరిగా కనిపిస్తుంది. అతి తక్కువ లీకేజీ కలిగిన లైట్ ఛార్జబుల్ డయోడ్ మరియు శిథిలం చేయడానికి నిరోధం యొక్క ప్రభావం.[ఉల్లేఖన అవసరం]

బహిర్గతం[మార్చు]

ఫోటోసెన్సిటివ్ డ్రమ్‌పై బిట్‌మ్యాప్ ఏ విధంగా ఏర్పడుతుంది

తిరుగుతున్న అనేక కోణాలున్న అద్దంపై లేజర్ దృష్టి సారిస్తుంది. అది లేజర్ పుంజాన్ని కటకాలు మరియు అద్దాలతో కూడిన వ్యవస్థ ద్వారా ఫోటోరిసెప్టర్‌పైకి పంపుతుంది. పేజీపై నిటారుగా కదిలే విధంగా పుంజం ఫోటోరిసెప్టర్ వెంట కదులుతుంది. ఈ సమయంలో సిలిండర్ తిరుగుతూనే ఉంటుంది. ఈ కదలికకు తగ్గట్టుగా సిలిండర్ కోణం మారుతుంటుంది. పిక్సల్స్‌గా మార్చిన డేటా ప్రవాహం మెమరీలో నిక్షిప్తమవుతుంది. సిలిండర్‌పై చుక్కలు ఏర్పడే విధంగా అది లేజర్‌‌ను ఆన్ మరియు ఆఫ్ చేస్తుంది. (కొన్ని ప్రింటర్లు పేజీ వెడల్పును విస్తరించడం ద్వారా కాంతి ఉద్గార డయోడ్ల అమరికను మారుస్తాయి. అయితే ఈ పరికరాలు "లేజర్ ప్రింటర్లు" కావు) సుదూర ప్రాంతాలపై ఒక నిటారైన పుంజం పడే విధంగా చేయగలగడం వల్ల లేజర్లను ఉపయోగిస్తారు. ఇమేజ్ యొక్క నలుపు భాగాలపై ఆవేశాన్ని లేజర్ పుంజం తటస్థీకరిస్తుంది(లేదా వ్యతిరేకిస్తుంది). ఫలితంగా టోనర్ కణాలను తొలగించడానికి ఒక స్థిర విద్యుత్ రుణ చిత్రం ఫోటోరిసెప్టర్‌పై పడుతుంది.

పుంజ శోధక (BD) సెన్సార్‌ను ప్రతి స్వీప్ సైకిల్ (ప్రింటింగ్ జరగడం) ముగింపు సమయంలో లేజర్ స్వీపింగ్ ప్రక్రియను సమకాలీకరించడానికి ఉపయోగిస్తారు. [4]

అభివృద్ధి[మార్చు]

పైకి కనిపించని ఇమేజ్‌తో కూడిన ఉపరితలం టోనర్‌కు గురవుతుంది. కార్బన్ బ్లాక్ లేదా కలరింగ్ ఏజెంట్లతో కలిసిన పొడి ప్లాస్టిక్ పౌడర్ యొక్క సున్నితమైన కణాలు. అవేశం చెందిన టోనర్ కణాలకు, లేజర్ స్పర్శించే భాగాలకు రుణావేశాన్ని ఇస్తారు. తద్వారా అవి స్థిరవిద్యుత్ రూపకంగా ఫోటోరిసెప్టర్ యొక్క ప్రచ్ఛన్న ఇమేజ్‌‌కు దగ్గరవుతాయి. ఎందుకంటే, సజాతి ధ్రువాలు వికర్షించుకుంటాయి. రుణావేశం చెందిన టోనర్ రుణావేశం అలాగే ఉన్న డ్రమ్‌ను తాకవు.

ముద్రిత చిత్రం యొక్క మొత్తం నల్లదనం సప్లయ్ టోనర్‌కు అనువర్తించిన హై ఓల్టేజ్ ఛార్జ్ ద్వారా నియంత్రించబడుతుంది. ఆవేశం చెందిన టోనర్ ఖాళీ ప్రాంతం నుంచి ఎగిరి, డ్రమ్ ఉపరితలంపై చేరగానే టోనర్‌పై ఉన్న రుణావేశం సప్లయ్ టోనర్‌ను వికర్షిస్తుంది. అలాగే డ్రమ్‌పై మరింత టోనర్ ఏర్పడకుండా నిరోధిస్తుంది. ఒకవేళ ఓల్టేజీ తక్కువగా ఉంటే, బదిలీ ద్వారా ఏర్పడే అధిక టోనర్‌ను ఆపడానికి పలుచని టోనర్ కోటింగ్ అవసరమవుతుంది. ఓల్టేజీ అధికంగా ఉంటే, డ్రమ్‌పై ఉండే పలుచటి కోటింగ్ డ్రమ్‌కు బదిలీ చేయడం ద్వారా ఏర్పడే అధిక టోనర్‌ను ఆపడానికి సరిపోదు. సప్లయ్ టోనర్‌ను వికర్షించే విధంగా డ్రమ్‌పై ఉన్న ఆవేశాలు తిరిగి అధికమయ్యేంత వరకు ఎక్కువ సప్లయ్ టోనర్ డ్రమ్‌పైకి ఎగరడం కొనసాగుతూనే ఉంటుంది. అత్యంత చీకటి సెట్టింగుల్లో సప్లయ్ టోనర్ ఓల్టేజీ అధికంగా ఉంటుంది. సహజంగా ఏర్పడిన ప్రాథమిక డ్రమ్ ఛార్జ్ యధాతథంగా ఉండే డ్రమ్‌పై కోటింగ్‌ను కూడా అది ప్రారంభిస్తుంది. అలాగే మొత్తం పేజీకి నలుపు ఛాయను అంటిస్తుంది.[ఉల్లేఖన అవసరం]

బదిలీ[మార్చు]

ఫోటోరిసెప్టర్ కాగితంపై ఒత్తిడి చేస్తుంది లేదా అటూ ఇటూ కదులుతుంది. తద్వారా ఇమేజ్ బదిలీ అవుతుంది. టోనర్‌ను ఫోటోరిసెప్టర్‌ నుంచి వెనక్కు తీసి, కాగితంపై పంపడానికి అధిక ధరల ప్రింటర్లు కాగితం యొక్క వెనుక భాగాన ధనావేశం చెందిన బదిలీ రోలర్‌ను ఉపయోగిస్తాయి.

ఫ్యూజింగ్ (కరగడం)[మార్చు]

ఉష్ణం మరియు పీడనం ద్వారా కాగితంపై టోనర్‌ను కరిగించడం

ఫ్యూజర్ సమూహంలోని రోలర్ల ద్వారా కాగితం కదులుతుంది. అందులోని ఉష్ణం (200 సెల్సియస్‌ వరకు) మరియు ఒత్తిడి ప్లాస్టిక్ పౌడర్ కాగితానికి అంటుకునే విధంగా చేస్తుంది.

ఒక రోలర్ సాధారణంగా ఖాళీ గొట్టం (ఉష్ణ రోలర్) మరియు మరొకటి రబ్బరు సాయం కలిగిన రోలర్ (పీడన (ఒత్తిడి) రోలర్). అత్యంత ప్రకాశవంతమైన ఉష్ణ దీపం (హీట్ ల్యాంప్) ఖాళీ గొట్టం మధ్య భాగంలో అమర్చబడి ఉంటుంది. దాని యొక్క పరారుణ శక్తి రోలర్‌ను లోపల భాగం నుంచి అవిరుద్ధంగా వేడి చేస్తుంది. టోనర్‌ను కచ్చితంగా బంధించడానికి ఫ్యూజర్ రోలర్ తప్పకుండా అవిరుద్ధమైన వేడిని కలిగి ఉండాలి.

ప్రింటర్ యొక్క మొత్తం విద్యుత్ వినియోగంలో ఒక్క ఫ్యూజర్ మాత్రమే 90% వరకు వినియోగించుకుంటుంది. ఫ్యూజర్ సమూహం నుంచి జనించే వేడి ప్రింటర్ యొక్క ఇతర భాగాలను పాడు చేయగలదు. అందువల్ల ఆ వేడిని తరచూ ఫ్యాన్ల సాయంతో బయటకు పంపుతుంటారు. పలు కాపీయర్లు మరియు లేజర్ ప్రింటర్ల ప్రాథమిక విద్యుత్ పొదుపు చర్య ప్యూజర్‌ను ఆఫ్ చేసి, దానిని చల్లబరచడం. సాధారణ ఆపరేషన్‌ను తిరిగి ప్రారంభించడానికి అంటే ప్రింటింగ్ మొదలుపెట్టడానికి ముందు ఫ్యూజర్ పనిచేయ గలిగే ఉష్ణోగ్రతకు తిరిగి వచ్చేంత వరకు వేచి ఉండాలి.

కొన్ని ప్రింటర్లు చాలా పలుచటి సరళమైన లోహపు ఫ్యూజర్ రోలర్‌ను ఉపయోగిస్తాయి. అందువల్ల ఉష్ణం తక్కువగా విడుదలవుతుంది. తద్వారా ఫ్యూజర్ అతి త్వరగా తిరిగి ఆపరేటింగ్ టెంపరేచర్‌కు చేరుకోగలుగుతుంది. ఈ రెండు కూడా నిశ్చల స్థితి నుంచి ప్రింటింగ్‌ను వేగవంతం చేస్తాయి. తద్వారా విద్యుత్‌ను పొదుపు చేసే విధంగా ప్యూజర్ పదే పదే టర్న్ ఆఫ్ అయ్యే విధంగా చేస్తాయి.

ఒకవేళ కాగితం గనుక ఫ్యూజర్ ద్వారా అత్యంత నెమ్మదిగా కదులుతున్నట్లయితే, టోనర్ కరగడానికి రోలర్ స్పర్శకు చాలా సమయం పడుతుంది. ఫలితంగా ఫ్యూజర్ తక్కువ ఉష్ణోగ్రత వద్ద పనిచేయగలదు. చిన్నసైజు మరియు చౌకయైన లేజర్ ప్రింటర్లు విలక్షణమైన రీతిలో ప్రింటింగ్‌ను నెమ్మదిగా చేస్తాయి. ఎందుకంటే విద్యుత్‌ను పొదుపు చేసే విధంగా వాటిని రూపొందించడం జరుగుతుంది. అదే పెద్ద పరిమాణంతో అతి వేగమైన ప్రింటర్లలో అత్యధిక ఉష్ణోగ్రత కలిగిన ఫ్యూజర్ ద్వారా కాగితం స్వల్ప స్పర్శ కాలంతోనే శరవేగంగా ముందుకు కదులుతుంది.

శుభ్రపరచడం[మార్చు]

ప్రింట్రింగ్ ప్రక్రియ ముగియగానే, విద్యుత్‌తో పనిచేసే మెత్తని ప్లాస్టిక్ బ్లేడు ఫోటోరిసెప్టర్‌పై ఉన్న అదనపు టోనర్‌ను శుభ్రపరుస్తుంది. తర్వాత దానిని ఒక పనికిరాని తొట్టిలోకి పంపుతుంది. ఉత్సర్గ దీపం ఫోటోరిసెప్టర్ నందు మిగిలిన ఛార్జ్ (ఆవేశం లేదా విద్యుత్)ను తొలగిస్తుంది.

కాగితం నలిగిపోవడం వంటి అనూహ్య సంఘటనలు చోటు చేసుకున్నప్పుడు ఫోటోరిసెప్టర్‌పై సందర్భోచితంగా కొంత టోనర్ ఉండిపోతుంది. ఫోటోకండక్టర్‌పై ఉన్న టోనర్ అంటుకోవడానికి సిద్ధంగా ఉంది. అయితే అది అంటుకోవడానికి ముందే ఆ పని విఫలమైంది. టోనర్‌ను తప్పక తొలిగించిన తర్వాత ప్రాసెస్‌ను తిరిగి ప్రారంభించాలి.

పనికిరాని టోనర్‌ను ప్రింటింగ్ కోసం తిరిగి వాడరాదు. ఎందుకంటే, అది దుమ్ము మరియు కాగితపు చెత్త చేత కలుషితమై ఉంటుంది. నాణ్యమైన ఇమేజ్‌ రావాలంటే స్వచ్ఛమైన, శుభ్రమైన టోనర్ కావాలి. కలుషితమైన టోనర్‌ను తిరిగి వాడటం వల్ల కాగితంపై టోనర్ తక్కువగా కరిగి, అంటుకుంటుంది. అందువల్ల పెద్దగా నాణ్యత రాదు. అయితే కొన్ని మినహాయింపులు ఉన్నాయి, కొన్ని ప్రముఖ కంపెనీలైన బ్రదర్‌ మరియు తోషిబా లేజర్ ప్రింటర్లు పనికిరాని టోనర్‌ను శుభ్రపరచడం మరియు తిరిగి ఉపయోగించుకోవడానికి ప్రత్యేకమైన పద్ధతిని అనుసరిస్తున్నాయి.[5][6]

ఒకేసారి అనేక పనులు[మార్చు]

రాస్టర్ ఇమేజ్ ఉత్పత్తి పూర్తయిన వెంటనే ప్రింటింగ్ ప్రక్రియకు సంబంధించిన అన్ని పనులు త్వరితగతిన ఒకటి తర్వాత మరొకటి జరుగుతాయి. ఇది ఒక చాలా చిన్న మరియు గట్టిదైన విభాగాన్ని ఉపయోగించుకునే విధంగా చేస్తుంది. ఇక్కడ ఫోటోరిసెప్టర్ ఛార్జవుతుంది. ఫలితంగా అది కొన్ని డిగ్రీల వరకు తిరగడం మరియు స్కాన్ చేయబడుతుంది. అలాగే ఇది మరికొన్ని డిగ్రీల వరకు తిరిగి, తర్వాత అభివృద్ధి చెందుతుంది. ఈ ప్రక్రియ మొత్తం డ్రమ్ ఒక చుట్టు పూర్తి చేయడానికి ముందే పూర్తవుతుంది.

విభిన్న ప్రింటర్లు ఈ సోపానాలను వివిధ మార్గాల్లో పాటిస్తాయి. కాంతిని డ్రమ్‌పై "ఉత్పత్తి" చేయడానికి(LED ప్రింటర్‌ని చూడండి) కొన్ని "లేజర్‌" ప్రింటర్లు వాస్తవానికి కాంతి ఉద్గార డయోడుల యొక్క సరళమైన వరుసను ఉపయోగిస్తాయి. టోనర్ అనేది మైనంపై గానీ లేదా ప్లాస్టిక్‌పై గానీ ఆధారపడుతుంది. ఫ్యూజర్ సమూహం ద్వారా కాగితం కదులుతున్నప్పుడు టోనర్ కణాలు కరుగుతాయి. కాగితం విరుద్ధంగా ఆవేశం (ఛార్జ్) చెందవచ్చు లేదా చెందకనూ పోవచ్చు. ఫ్యూజర్ అనేది ఒక పరారుణ పొయ్యి వంటిది. అంటే వేడిపుట్టించే పీడన రోలర్ లేదా (అత్యంత వేగవంతమైన, ఖరీదైన కొన్ని ప్రింటర్లలో) ఒక జినాన్ ఫ్లాష్ ల్యాంప్. విద్యుత్‌ను ప్రింటర్‌కు ఇచ్చినప్పుడు లేజర్ ప్రింటర్‌లో ఏర్పడే వేడి పుట్టించే ప్రక్రియ ఎక్కువగా ఫ్యూజర్ పదార్థం ద్వారానే జరుగుతుంది. పలు ప్రింటర్లు టోనర్-కన్సర్వేషన్ మోడ్‌ను కలిగి ఉంటాయి. దానినే "ఎకనోమోడ్‌‌"గా హ్యూలెట్ ప్యాకర్డ్‌ పిలిచాడు. అది సుమారు సగం టోనర్‌ను మాత్రమే ఉపయోగించుకుంటుంది. అయితే ఒక తేలికపాటి చిత్తుప్రతి (డ్రాఫ్ట్) తరహా నాణ్యతతో కూడిన అవుట్‌పుట్‌ ఇస్తుంది.

కలర్ లేజర్ ప్రింటర్లు[మార్చు]

ఫ్యూజి జిరాక్స్ కలర్ లేజర్ ప్రింటర్ C1110B

కలర్ లేజర్ ప్రింటర్లు రంగులో ఉండే టోనర్‌ (పొడి సిరా)ను ప్రత్యేకించి, ముదురు నీలం, మెజంతా, పసుపు మరియు నలుపు (CMYK) ఉపయోగిస్తాయి.

అదే మోనోక్రోమ్ ప్రింటర్లు ఒక లేజర్ స్కానర్ సమూహాన్ని మాత్రమే ఉపయోగిస్తాయి. అయితే కలర్ ప్రింటర్లకు కొన్నిసార్లు రెండు లేదా అంతకంటే ఎక్కువ స్కానర్ సమూహాలుంటాయి.

కలర్ ప్రింటింగ్‌ అనేది ప్రింటింగ్ ప్రక్రియను మరింత క్లిష్టతరం చేస్తుంది. ఎందుకంటే, నమోదు పొరపాట్లుగా పిలిచే స్వల్ప గజిబిజి అమరికలు ముద్రించేటప్పుడు రంగుకు రంగుకు మధ్య ఏర్పడవచ్చు. ఫలితంగా అనూహ్యమైన రంగు వలయాలు ఏర్పడటం మరియు పేలవంగా కనిపించడం లేదా లేత/ముదురు చారలు రంగు భాగాల అంచుల వెంట ఏర్పడుతాయి. అత్యంత నమోదు రుజువర్తనం (రిజిస్ట్రేషన్ అక్యురసీ)ని అనుమతించడానికి కొన్ని కలర్ లేజర్ ప్రింటర్లు "ట్రాన్స్‌ఫర్ బెల్ట్‌"గా పిలిచే అతిపెద్ద రొటేటింగ్ బెల్టును ఉపయోగిస్తాయి. ట్రాన్స్‌ఫర్ బెల్ట్ అన్ని టోనర్ క్యార్టిడ్జిల ముందు కదులుతుంది. ప్రతి ఒక్క టోనర్ లేయర్ బెల్టుకు సరైన రీతిలో అనువర్తించబడి ఉంటుంది. సంఘటిత లేయర్లను తర్వాత ఒక్కసారిగా ఏకరీతిలో కాగితానికి అనువర్తిస్తారు.

మోనోక్రోమ్ ప్రింటర్ల కంటే కలర్ ప్రింటర్లు సాధారణంగా అత్యధిక "సెంట్స్ పర్ పేజ్" ఉత్పత్తి వ్యయాన్ని కలిగి ఉంటాయి.

DPI విశ్లేషణ[మార్చు]

1200 DPI ప్రింటర్లు సాధారణంగా 2008 సమయంలో అందుబాటులో ఉన్నాయి.

2400 DPI ఎలక్ట్రోఫోటోగ్రాఫిక్ ప్రింటింగ్ ప్లేట్ మేకర్స్, ప్రత్యేకించి ప్లాస్టిక్ షీట్లపై ముద్రించగలిగే లేజర్ ప్రింటర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.

లేజర్ ప్రింటర్ నిర్వహణ[మార్చు]

పలు వినియోగదారు మరియు చిరు వ్యాపారాలకు వాడే లేజర్ ప్రింటర్లు టోనర్ కార్‌ట్రిడ్జ్ (గుళిక)ను ఉపయోగిస్తాయి. అది ఫోటోరిసెప్టర్ (కొన్ని సందర్భాల్లో "ఫోటో కండక్టర్ యూనిట్" లేదా "ఇమేజింగ్ డ్రమ్" అని పిలుస్తారు)ను టోనర్ వ్యర్థం కలిగిన తొట్టి, టోనర్ సప్లయ్ బిన్‌ మరియు అనేక వైపర్ బ్లేడ్లతో కలుపుతుంది. టోనర్ పంపిణీ వినియోగితమైనప్పుడు, టోనర్ గుళిక స్వయంచాలకంగా తొలగించబడుతుంది. తద్వారా టోనర్ వ్యర్థపు తొట్టి, ఇమేజింగ్ డ్రమ్ మరియు వైపర్ బ్లేడ్లు తొలగించబడుతాయి.

కొన్ని లేజర్ ప్రింటర్లు చివరి నిర్వహణ తర్వాత ముద్రితమైన మొత్తం పేజీలను గణిస్తాయి. ఈ రకం మోడళ్లపై నిర్దిష్ట నిర్వహణ భాగాలను మార్చాల్సిన సమయం ఆసన్నమైందంటూ వినియోగదారుడికి సూచించే ఒక సందేశం కనిపిస్తుంది. అదే ఇతర మోడళ్లపై మొత్తం పేజీలు లేదా సందేశం వంటివి కనిపించవు. అందువల్ల వినియోగదారుడు మానవ ప్రయత్నంతో ప్రింట్ చేసిన పేజీలను గుర్తించుకోవాలి లేదా కాగితం కొరత సమస్యలు మరియు ముద్రణ లోపాలు వంటి హెచ్చరిక సంకేతాలను గమనిస్తూ ఉంటాలి.

తయారీ సంస్థలు సాధారణంగా మామూలు ప్రింటర్ విడి భాగాలు మరియు వినియోగితాలకు మన్నిక కాలం చార్టులను అందిస్తాయి. తయారీ సంస్థలు తమ ప్రింటర్ భాగాలకు కాల ప్రమాణాల కంటే "ఊహించిన పేజీ ఉత్పత్తి మన్నిక" ద్వారా ఊహాజనిత మన్నికను మతింపు వేస్తాయి.

వ్యాపార తరగతి ప్రింటర్ల యొక్క వినియోగితాలు మరియు నిర్వహణ భాగాలు సాధారణంగా వ్యక్తిగత ప్రింటర్ల భాగాల కంటే అత్యధిక పేజీ ఉత్పత్తి అంచనా ద్వారా మతింపు వేయబడతాయి. ప్రత్యేకంగా, టోనర్ గుళికలు మరియు ఫ్యూజర్లు సాధారణంగా వ్యక్తిగత తరగతి ప్రింటర్ల కంటే వ్యాపార తరగతి ప్రింటర్ల పరంగా అత్యధిక పేజీ ఉత్పత్తి అంచనాను కలిగి ఉంటాయి. కలర్ లేజర్ ప్రింటర్ల నిర్వహణ మరియు విడి భాగాలను మార్చడం మోనోక్రోమ్ లేజర్ ప్రింటర్లతో పోల్చితే చాలా ఎక్కువ. ఎందుకంటే, మోనోక్రోమ్ ప్రింటర్లు ఎక్కువగా ఊహాత్మక విడిభాగాలను కలిగి ఉంటాయి.

కాగితాన్ని లాక్కునే మార్గం మరియు కాగితం సరఫరా అయ్యే మార్గంలో రోలర్లు మరియు సమూహాలు పనిచేస్తాయి. టోనర్‌ మరియు యంత్రాంగాల నుంచి దుమ్మును శుభ్రపరచడం మరియు తొలగించడం లేదా రబ్బరుతో తయారు చేసిన పేపర్ హ్యాండ్లింగ్ రోలర్ల పునరుద్ధరణకు ప్రత్యేకమైన నిర్వహణ అవసరం. పలు పికప్, ఫీడ్ మరియు సెపరేషన్ రోలర్లు రబ్బరు కోటింగ్‌ను కలిగి ఉంటాయి. అయితే అవి కూడా చివరకు అరగడం మరియు జారే కాగితపు చెత్త ద్వారా ఆవరించబడుతాయి. ప్రత్యామ్నాయ రోలర్లు పనిచేయకపోవడం లేదా అందుబాటులో లేనప్పుడు రబ్బరు రోలర్లను తడిగా ఉన్న మెత్తటి గుడ్డ సాయంతో సురక్షితంగా శుభ్రం చేయవచ్చు. వాణిజ్య అవసరాలకు ఉపయోగించే కెమికల్ సొల్యూషన్స్ (రసాయన ద్రావణాలు) కూడా అందుబాటులో ఉన్నాయి. అవి రబ్బరు మార్గాన్ని తాత్కాలికంగా పునరుద్ధరించడంలో సాయపడుతాయి.

ఫ్యూజింగ్ సమూహం ("ఫ్యూజర్‌" అని కూడా పిలుస్తారు) అనేది సాధారణంగా లేజర్ ప్రింటర్లలో మార్చగల వినిమయ భాగంగా భావించబడుతోంది. ఫ్యూజింగ్ సమూహం అనేది టోనర్ కరగి, కాగితంపై పడే విధంగా చేస్తుంది. ఫ్యూజింగ్ సమూహాల్లో పలు సాధ్యపర లోపాలున్నాయి. వాటిలో ప్లాస్టిక్ డ్రైవ్ గేర్లు అరిగిపోవడం, వేడిని పుట్టించే విడి భాగాల యొక్క ఎలక్ట్రానిక్ వైఫల్యం, ఫిక్సింగ్ ఫిల్మ్ స్లీవ్‌లు చిరిగిపోవడం, ప్రెజర్ రోలర్లు అరిగిపోవడం, ఉష్ణ రోలర్లు మరియు పీడన రోలర్లపై టోనర్ ఏర్పడటం, ప్రెజర్ రోలర్లు అరిగిపోవడం లేదా గీరుకుపోవడం మరియు కాగితపు సెన్సార్లు నాశనమవడం వంటివి ముఖ్యమైనవి.

కొన్ని తయారీ సంస్థలు ప్రతి మోడల్ ప్రింటర్‌కు ప్రత్యకమైన ప్రతిక్రియ నిర్వహణ కిట్లను అందిస్తాయి. అలాంటి కిట్లు సాధారణంగా ఒక ఫ్యూజర్ మరియు పికప్ రోలర్లు, ఫీడ్ రోలర్లు, ట్రాన్స్‌ఫర్ రోలర్లు, ఛార్జ్ రోలర్లు మరియు సెపరేషన్ ప్యాడ్లను కలిగి ఉంటాయి.

గోప్య నకిలీ నిరోధక ("రహస్య") గుర్తులు[మార్చు]

కాగితంపై చిన్న పసుపు చుక్కల ద్వారా విశ్లేషణ, కలర్ లేజర్ ప్రింటర్ ఉత్పత్తి చేయబడింది.

పలు ఆధునిక కలర్ లేజర్ ప్రింటర్లు గుర్తించడానికి వీలుగా పైకి కనిపించని ఒక డాట్ రాస్టర్ ద్వారా ప్రింటవుట్‌లను గుర్తిస్తాయి. పసుపు రంగులో ఉండే చుక్కలు దాదాపు 0.1 mm పరిమాణంతో సుమారు 1 mm రాస్టర్‌ను కలిగి ఉంటాయి. దీనికి కారణం నకిలీలను కనిపెట్టడంలో సాయపడే విధంగా U.S. ప్రభుత్వం మరియు ప్రింటర్ తయారీసంస్థల మధ్య ఒప్పందమేనని భావిస్తున్నారు.[7]

తేదీ, సమయం మరియు ముద్రించబడిన ప్రతి పేపరు షీటుపై ద్వియాంశ సంక్షిప్తీకర దశాంశంలో ప్రింటర్ సీరియల్ నంబర్ వంటి రూపాలుగా డేటాను చుక్కలు మారుస్తాయి. తద్వారా తయారీ సంస్థ కాగితపు ముక్కల సాయంతో ప్రింటర్ ఎక్కడ కొనుగోలు చేసింది మరియు కొన్ని సమయాల్లో కొనుగోలుదారుడిని కూడా కనిపెట్టగలుగుతుంది. ఎలక్ట్రానిక్ ఫ్రంటియర్ ఫౌండేషన్‌ వంటి డిజిటల్ హక్కుల అధివక్తృత్వ గ్రూపులు గోప్యత క్షీణించిపోవడం మరియు ముద్రించిన వారి రహస్య గోపనంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.[8]

భద్రతా పరమైన ప్రమాదాలు, ఆరోగ్య సమస్యలు మరియు జాగ్రత్తలు[మార్చు]

షాక్ ప్రమాదాలు[మార్చు]

ఆధునిక ప్రింటర్లకు పలు సురక్షిత ఇంటర్‌లాక్‌లు మరియు రక్షిత వలయాలు ఉన్నప్పటికీ, పలు రోలర్లు, వైర్లు మరియు లేజర్ ప్రింటర్‌ లోపల ఉండే మెటల్ కాంటాక్టులపై అధిక ఓల్టేజీ లేదా అవశేష ఓల్టేజీ ఉండే అవకాశముంది. ఎక్కువగా నొప్పి కలిగించే విద్యుత్ షాకుకు గురికాకుండా ఉండటానికి ఇలాంటి భాగాలను అనవసరంగా తాకకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి.

టోనర్‌ను శుభ్రపరచడం[మార్చు]

టోనర్‌ కణాలు స్థిరవిద్యుత్ ధర్మాలు ఉండే విధంగా రూపొందించబడుతాయి. ఇతర కణాలు, వస్తువులు లేదా రవాణా వ్యవస్థల యొక్క అంతర భాగాలు మరియు ఖాళీ గొట్టాలను అవి స్పర్శించినప్పుడు స్థిరవిద్యుదావేశాలు ఏర్పడుతాయి. దీనివల్ల మరియు దీని యొక్క చిన్న కణ పరిమాణం కారణంగా, టోనర్‌ను చీపురుతో శుభ్రం చేయరాదు. ఆవేశం చెందిన టోనర్ కణాల యొక్క స్థిరమైన ఉత్సర్గం వాక్యూమ్ క్లీనర్ బ్యాగులోని దుమ్మును మండించగలదు లేదా గాలి ద్వారా బయటకు వచ్చిన తగినంత టోనర్ (సొల్యూషన్) ద్వారా చిన్నపాటి పేలుడును కూడా కలిగించగలదు. ఇది వాక్యూమ్ క్లీనర్‌ను నాశనం చేయవచ్చు లేదా మంటలు ఏర్పడవచ్చు. అదనంగా, టోనర్ కణాలు సూక్ష్మమైనవిగా ఉంటాయి. సంప్రదాయక పద్ధతిలో ఇంటిని శుభ్రం చేయడానికి వాడే బ్యాగుల చేత అవి తక్కువగా పీల్చుకోబడతాయి లేదా మోటారు ద్వారా వీస్తాయి లేదా తిరిగి గదిలోకి చేరుతాయి.

వేడెక్కినప్పుడు టోనర్ కణాలు కరుగుతాయి. ఒలికిన చిన్న టోనర్ కణాలను చల్లటి, తడి గుడ్డ ద్వారా శుభ్రం చేయొచ్చు.

ఒకవేళ టోనర్ గనుక లేజర్ ప్రింటర్‌లోకి ఒలికినట్లయితే, సమర్థవంతంగా శుభ్రం చేయడానికి విద్యుత్‌ ప్రవహించే గొట్టముతో కూడిన ఒక ప్రత్యేక వాక్యూమ్ క్లీనర్ మరియు అధిక సామర్థ్యం (HEPA) కలిగిన ఫిల్టర్ అవసరమవుతాయి. వీటిని ESD-సురక్షిత (స్థిరవిద్యుత్ ఉత్సర్గ-సురక్షితం) లేదా టోనర్ ఖాళీలుగా పిలుస్తారు. HEPA-ఫిల్టర్ మాదిరిగా తయారు చేసిన వాక్యూమ్ క్లీనర్లు అతిపెద్ద టోనర్ వ్యర్థాలను శుభ్రం చేయడానికి ఉపయోగిస్తారు.

నీటి ద్వారా ఉతకగలిగే బట్టల ద్వారా టోనర్‌ను సులువుగా శుభ్రం చేయవచ్చు. టోనర్ అనేది తక్కువ ద్రవీభవన ఉష్ణోగ్రతను కలిగిన మైనం లేదా ప్లాస్టిక్ పౌడర్ కావడంతో శుభ్రం చేసేటప్పుడు దానిని చల్లగా ఉంచాలి. టోనర్ అంటిన బట్టను చల్లని నీటి ద్వారా ఉతకితే మంచి ఫలితం ఉంటుంది. వేడి నీళ్ల ద్వారా శాశ్వతంగా మరకను పోగొట్టవచ్చు. టోనర్ అంటిన బట్టను చేర్చడానికి ముందు వాషింగ్ మెషీన్‌ను చల్లటి నీటితో నింపాలి. రెండు పర్యాయాలు ఉతకడం ద్వారా చక్కటి ఫలితం కనిపిస్తుంది. మొదటిసారి ఉతకడానికి వంటసామగ్రిని శుభ్రం చేయడానికి వాడే డిటర్జెంట్‌ను, రెండోసారి సాధారణ బట్టల డిటర్జెంట్‌ను వాడవచ్చు. తొలిసారి ఉతకడానికి ఉపయోగించిన నీటిలో ఉండే అవశేష టోనర్ బట్టకు అలాగే అంటుకుని ఉంటుంది. అందువల్ల బట్ట శాశ్వతంగా నెరిసిపోవచ్చు. టోనర్ మొత్తం తొలగించబడిందని నిర్దారించుకునేంత వరకు బట్టల అనార్ద్రకి లేదా ఐరన్ బాక్సును ఉపయోగించరాదు.

ఓజోన్ ప్రమాదాలు[మార్చు]

ప్రింటింగ్ ప్రక్రియలో సాధారణ భాగంగా ప్రింటర్‌లోని హై ఓల్టేజీలు ఒక కాంతివలయ ఉత్సర్గంను ఉత్పత్తి చేయగలవు. అది అయానీకరించిన ఆక్సీజన్ మరియు నైట్రోజన్‌ను కొద్దిమొత్తంలో ఉత్పత్తి చేస్తుంది. తర్వాత అవి ఓజోన్‌ మరియు నైట్రోజన్ డయాక్సైడ్‌లుగా ఏర్పడుతాయి. అతిపెద్ద వాణిజ్య ప్రింటర్లు మరియు కాపీయర్లలో బయటకు వెళ్లే వాయు ప్రవాహంలోని కార్బన్ ఫిల్టర్ కార్యాలయ పరిసరాలు కాలుష్యం బారిన పడకుండా ఈ ఆక్సైడ్‌లను విచ్ఛిన్నం చేస్తుంది.

అయితే కొంత ఓజోన్ మాత్రం వాణిజ్య ప్రింటర్లలో జరిగే వడపోత ప్రక్రియ నుంచి తప్పించుకుంటుంది. ఓజోన్ ఫిల్టర్లను పలు చిన్నపాటి వినియోగదారు ప్రింటర్లలో ఉపయోగించరు. చిన్న, తక్కువ వెళుతురు ఉన్న ప్రదేశంలో ఒక లేజర్ ప్రింటర్ లేదా కాపీయర్ దీర్ఘకాలం పాటు పనిచేసినట్లయితే, ఓజోన్ వాసనను గుర్తించడం లేదా చికాకు కలగడం వంటి వాటిని గుర్తించే స్థాయిలకు ఈ వాయువులు ఆవరిస్తాయి. సిద్ధాంతపరంగా, తీవ్రమైన పరిస్థితుల్లో ఆరోగ్యపరమైన ఇబ్బందులు తలెత్తే అవకాశముంటుంది.[9]

శ్వాస సంబంధిత సమస్యలు[మార్చు]

ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్‌లో ఇటీవల నిర్వహించిన సర్వేలో కొన్ని ప్రింటర్లు ఉప మైక్రోమీటర్‌ కణాలను విడుదల చేస్తున్నట్లు వెల్లడైంది. అవి శ్వాస సంబంధిత వ్యాధులను కలిగించవచ్చని కొందరు సందేహం వ్యక్తం చేస్తున్నారు.[10] క్వీన్స్‌లాండ్ యూనివర్శిటీ ఆఫ్ టెక్నాలజీ అధ్యయనంలో పరిశీలించిన మొత్తం 63 ప్రింటర్లలో హ్యూలెట్ ప్యాకర్డ్‌ తయారు చేసిన 17 మరియు ఒక తోషిబా ప్రింటర్ అత్యధిక ఉద్గారాలను కలిగి ఉన్నాయి. మొత్తం యంత్రాలపై చేసిన అధ్యయనం చివరకు ప్రత్యకమైన తయారీసంస్థల దిశగా ఏకపక్షమయ్యాయి. భవనంలో అప్పటికే ఏర్పాటు చేసిన యంత్రాల (ప్రింటర్లు)పై మాత్రమే పరిశోధన జరిపారు. కణ ఉద్గారాలు ఒకే విధమైన మోడల్ యంత్రాల్లోనూ చెప్పుకోదగ్గ విధంగా మారుతున్నట్లు రచయితలు గుర్తించారు. క్వీన్స్‌లాండ్ యూనివర్శిటీకి చెందిన ప్రొఫెసర్ మొరావ్‌స్కా ప్రకారం, ఒక ప్రింటర్ సిగరెట్టు మాదిరిగా అనేక కణాలను విడుదల చేయగలదు.[11]

"కణం యొక్క సంవిధానం ఆధారంగా అతిసూక్ష్మ కణాలను పీల్చడం ద్వారా ఆరోగ్య సంబంధమైన సమస్యలు తలెత్తుతాయి. ఫలితాలు మాత్రం శ్వాస సంబంధిత సమస్య మొదలుకుని గుండె మరియు రక్తనాళాలకు సంబంధించిన సమస్యలు లేదా క్యాన్సర్ వంటి పలు వ్యాధులు సంక్రమించే ప్రమాదముంది." (క్వీన్స్‌లాండ్ యూనివర్శిటీ ఆఫ్ టెక్నాలజీ).[12]

జపాన్‌లో 2006లో నిర్వహించిన అధ్యయనం ఈ విధంగా పేర్కొంది, లేజర్ ప్రింటర్లు స్టిరైన్, జిలీన్‌లు మరియు ఓజోన్‌, అలాగే ఇంక్‌-జెట్ ప్రింటర్లు విడుదల చేసే పెంతనాల్ యొక్క గాఢతను పెంచుతాయి.[13]

ముహ్లీ ఇతర సహచర బృందం (1991) ఈ విధంగా వివరించింది, కార్బన్ బ్లాక్‌‌‌, టైటానియం డయాక్సైడ్ మరియు సిలికాలతో కలిపిన ఒక ప్లాస్టిక్ దుమ్మును దీర్ఘకాలం పాటు పీల్చడం ద్వారా కలిగిన పరిణామాలు గుణాత్మకంగా టైటానియం డయాక్సైడ్ మరియు డీజల్ విడుదలకు సమానంగా ఉన్నాయి.[14]

ఇవి కూడా చూడండి[మార్చు]

సూచనలు[మార్చు]

 1. Edwin D. Reilly (2003). Milestones in Computer Science and Information Technology. Greenwood Press. ISBN 1573565210.
 2. Roy A. Allan (2001). A History of the Personal Computer: The People and the Technology. Allan Publishing. ISBN 0968910807.
 3. HP వర్చువల్ మ్యూజియం: హ్యూలెట్-ప్యాకర్డ్ లేజర్‌జెట్ ప్రింటర్, 1984
 4. 4.0 4.1 HP LaserJet 3050/3052/3055 All-in-One Service Manual (4 సంపాదకులు.). United States: Hewlett Packard. 2006. p. 99.
 5. U.S. పేటెంట్ 5231458 - ప్రింటర్ విచ్ యుటిలైజెస్ ప్రీవియస్లీ యూజ్డ్ డెవలపర్
 6. fixyourownprinter.com అనే వెబ్‌సైటులో బ్రదర్ వేస్ట్ టోనర్ రీసైకిలింగ్ ప్రాసెస్‌పై సూక్ష్మీకరించిన వివరణ
 7. ఎలక్ట్రానిక్ ఫ్రంటియర్ ఫౌండేషన్- ప్రైవసీ ఆన్ ప్రింటర్స్
 8. ఎలక్ట్రానిక్ ఫ్రంటియర్ ఫౌండేషన్ త్రెట్ టు ప్రైవసీ
 9. "Photocopiers and Laser Printers Health Hazards". Cite web requires |website= (help)
 10. "Particle Emission Characteristics of Office Printers" (PDF). మూలం (PDF) నుండి 2007-09-28 న ఆర్కైవు చేసారు. Retrieved 2010-05-12. Cite web requires |website= (help)
 11. "Particle Emission Characteristics of Office Printers". Cite web requires |website= (help)
 12. "Study reveals the dangers of printer pollution". http://www.news.qut.edu.au/cgi-bin/WebObjects/News.woa/wa/goNewsPage?newsEventID=13495. 
 13. "Are Laser Printers Hazardous to Your Health? - Yahoo! News". Cite web requires |website= (help)
 14. "11.6 METALS" (PDF). Cite web requires |website= (help) 070821 epa.gov

బాహ్య లింకులు[మార్చు]

Commons-logo.svg
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.