లేడీ గాగా
లేడీ గాగా | |
|---|---|
Gaga at the inauguration of Joe Biden, 2021 | |
| జననం | స్టెఫానీ జోవాన్ ఏంజెలీనా జర్మనోటా 1986 మార్చి 28 న్యూయార్క్ నగరం, US |
| చదువు | New York University (no degree) |
| వృత్తి |
|
| క్రియాశీలక సంవత్సరాలు | 2000–ప్రస్తుతం |
| Organization | Born This Way Foundation |
| కృతులు | |
| తల్లి | సింథియా జర్మనోటా |
| పురస్కారాలు | Full list |
| Musical career | |
| Genres |
|
| Instruments |
|
| Labels |
|
| Signature | |
లేడీ గాగా (జ. మార్చి 28, 1986) ఒక అమెరికన్ గాయని, పాటల రచయిత, నటి. ఈమె అసలు పేరు స్టెఫానీ జోవాన్ ఏంజెలీనా జర్మనోటా. ఈమె పలు వినోద రంగాల్లో దారి మార్చుకుంటూ వాటిలో రాణించి ప్రత్యేకతను నిలుపుకుంది. పాపులర్ మ్యూజిక్ లో ఈమె ఒక ప్రభావవంతమైన గాయని.
2007 లో ఇంటర్‌స్కోప్ రికార్డ్స్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్న ఈమె తన తొలి ఆల్బం ద ఫేమ్ (2008), దానికి కొనసాగింపుగా వచ్చిన ద ఫేమ్ మాన్‌స్టర్ (2009) తో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు సాధించింది. ఈమె సృష్టించిన మ్యూజిక్ రికార్డులు సుమారు 170 మిలియన్లు అమ్ముడయ్యాయి. ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడుపోయే సంగీతంలో ఈమె రికార్డులు కూడా ఉన్నాయి. ఫోర్బ్స్ పత్రిక ప్రకారం ఈమె ప్రపంచంలో అత్యధిక పారితోషికాన్ని అందుకునే మహిళా సంగీతకళాకారిణి, 2011 లో అత్యంత శక్తివంతమైన సెలెబ్రిటీ. టైమ్ పత్రిక 2010, 2019 సంవత్సరాల్లో ఈమెను ప్రపంచంలో అత్యంత ప్రభావవంతమైన 100 మంది మహిళల్లో ఒకరిగా గుర్తించింది.