Jump to content

లైన్ మ్యాన్

వికీపీడియా నుండి
లైన్ మ్యాన్
దర్శకత్వంవి. రఘుశాస్త్రి
స్క్రీన్ ప్లేవి. రఘుశాస్త్రి
కథవి. రఘుశాస్త్రి
నిర్మాత
  • యతీష్ వెంకటేష్
  • గణేష్ పాపన్న
తారాగణం
  • త్రిగుణ్
  • కాజల్ కుందర్
  • బి. జయశ్రీ
  • హరిణి శ్రీకాంత్
  • అంజలి
ఛాయాగ్రహణంశాంతి సాగర్ హెచ్ జి
కూర్పుఎల్. రఘునాథ
సంగీతంమణికాంత్ కద్రి
నిర్మాణ
సంస్థ
పర్పుల్‌ రాక్‌ ఎంటర్‌టైనర్స్‌
విడుదల తేదీ
22 మార్చి 2024 (2024-03-22)
దేశంభారతదేశం
భాషతెలుగు

లైన్‌ మ్యాన్‌ 2024లో తెలుగులో విడుదలైన సినిమా. పర్పుల్‌ రాక్‌ ఎంటర్‌టైనర్స్‌ బ్యానర్‌పై యతీష్ వెంకటేష్, గణేష్ పాపన్న నిర్మించిన ఈ సినిమాకు వి రఘుశాస్త్రి ద‌ర్శ‌క‌త్వం వహించాడు.[1] త్రిగుణ్, కాజల్‌ కుందెర్‌, బి.జయశ్రీ, నివిక్ష నాయుడు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను మార్చి 6న విడుదల చేసి,[2] మార్చి 22న తెలుగు, కన్నడ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదలైంది.

లైన్‌మ్యాన్ సినిమా ఆమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో తెలుగు, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ ప్రారంభమైంది.[3]

ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎలక్ట్రిసిటీ డిపార్ట్‌మెంట్‌లో లైన్ మేన్‌గా పనిచేస్తున్న తండ్రి సడెన్‌గా మరణించడంతో ఆ ఉద్యోగం నటరాజు అలియాస్ నట్టు (త్రిగుణ్)కి వస్తుంది. ఇక ఆ గ్రామంలో కరెంట్ పోవాలన్నా, రావాలన్నా అంతా నటరాజు చేతిలోనే ఉంటుంది. ఆ ఊర్లో అందరికీ సహాయ సహకారాలు అందిస్తూ ఆ గ్రామ దేవతగా దేవుడమ్మ (బి.జయశ్రీ) ఉంటుంది. ఆమెకు 99 సంవత్సరాలు నిండి 100వ పడిలోకి అడుగు పెడుతుండటంతో పుట్టిన రోజు వేడుకను చేయాలనుకుంటారు. అదే సమయానికి నట్టు (త్రిగుణ్) పవర్ ఇవ్వను అని మొండికేస్తాడు. నట్టు ఎందుకు పవర్ ఇవ్వనన్నాడు? దానికి దేవుడమ్మ, గ్రామస్థుల ఏమి చేశారు? పుట్టిన రోజు వేడుకను నిర్వహించరా లేదా ? అనేదే మిగతా సినిమా కథ.[4][5]

నటీనటులు

[మార్చు]
  • నటేషాగా త్రిగుణ్
  • కాజల్ కుందర్
  • బి. జయశ్రీ
  • హరిణి శ్రీకాంత్
  • అంజలి
  • చేతన్ గంధర్వ
  • గౌరవశెట్టి
  • దిలీప్ కెంపెగౌడ
  • సందీప్ కెంపెగౌడ
  • సుహైల్ రసూల్
  • మైకో నాగరాజ్
  • నివిక్ష నాయుడు
  • సమర్థ్ నరసింహరాజు
  • సుజయ్ శాస్త్రి
  • అప్పూర్వ శ్రీ
  • శ్రీదత్త

పాటలు

[మార్చు]
సం.పాటపాట రచయితగాయకులుపాట నిడివి
1."చెబితే వినవా"వనమాలిహరిచరణ్3:42
2."జో లాలి"వనమాలిసుప్రియా రామ్3:03
3."జల్దిరా"వనమాలిమంగ్లీ4:08
4."పెళ్లి గోల"వనమాలిఅనిరుద్ధ శాస్త్రి3:40

మూలాలు

[మార్చు]
  1. "'లైన్‌మ్యాన్‌' జీవిత చిత్రం". NT News. 24 February 2024. Archived from the original on 15 January 2026. Retrieved 15 January 2026.
  2. "'లైన్‌మ్యాన్' మూవీ ట్రైలర్". Chitrajyothy. 7 March 2024. Archived from the original on 15 January 2026. Retrieved 15 January 2026.
  3. "ఓటీటీలోకి వచ్చేసిన త్రిగుణ్‌ 'లైన్‌ మ్యాన్‌'.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?". Eenadu. 3 May 2024. Archived from the original on 15 January 2026. Retrieved 15 January 2026.
  4. "'Lineman' movie review: A poignant tale about the light of hope" (in ఇంగ్లీష్). The New Indian Express. 23 March 2024. Archived from the original on 15 January 2026. Retrieved 15 January 2026.
  5. "Lineman Movie Review: Lineman review: A well-intentioned village drama" (in ఇంగ్లీష్). The Times of India. 22 March 2024. Archived from the original on 15 January 2026. Retrieved 15 January 2026.

బయటి లింకులు

[మార్చు]