లోక్‌తాంత్రిక్ సమాజ్ వాదీ పార్టీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
లోక్‌తాంత్రిక్ సమాజ్ వాదీ పార్టీ
ప్రధాన కార్యాలయం27-ఎ, డిడిఎ ఫ్లాట్స్, సుందరి రోడ్, దర్యా గంజ్, న్యూఢిల్లీ - 110002

లోక్‌తాంత్రిక్ సమాజ్ వాదీ పార్టీ అనేది భారతదేశంలోని చిన్న రాజకీయ పార్టీ. ఇది జనతాదళ్ పార్టీకి చెందిన ముగ్గురు సీనియర్ ఎంపీలచే (రామ్ సుందర్ దాస్, రషీద్ మసూద్, ఉపేంద్ర నాథ్ వర్మ) 1994 జనవరి 9న పాట్నాలో స్థాపించబడింది.[1]

ఎన్నికల పనితీరు

[మార్చు]

1998 లోక్‌సభ (జాతీయ పార్లమెంటు) ఎన్నికలలో పార్టీ 14 స్థానాల్లో పోటీ చేసింది. వారు 1999, 2004, 2009, 2014 ఎన్నికలలో కూడా నిలబడ్డారు, పోటీ చేసిన స్థానాల సంఖ్య క్రమంగా పడిపోయింది. 2014 నాటికి కేవలం రెండు స్థానాల్లో మాత్రమే పోటీ చేశారు. ఆ కాలంలో ప్రతి ఎన్నికల్లో పోటీ చేసిన ప్రతి నియోజకవర్గంలో డిపాజిట్లు కోల్పోయారు.[2]

రాజస్థాన్‌లో 2008 రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ ఒక స్థానాన్ని గెలుచుకుంది.[3][4]

మూలాలు

[మార్చు]
  1. Vijaya R. Trivedi, A Chronicle of World Events: January–March 1994, p. 31, Gyan Publishing, 1994, ISBN 8121202132.
  2. "PC: Party performance over elections - Loktantrik Samajwadi Party", India Votes, retrieved 15 May 2021.
  3. Darpan, Pratiyogita (February 2009). "Pratiyogita Darpan".
  4. "AC: Party performance over elections - Loktantrik Samajwadi Party", India Votes, retrieved 15 May 2021.