లోమో

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
LOMO
Native name
ЛОМО
పరిశ్రమImaging, Medical
స్థాపనపెట్రోగ్రాడ్, రష్యా (1914)
Foundersస్థాపకుడు
ప్రధాన కార్యాలయంసెయింట్ పీటర్స్‌బర్గ్, Russia
Areas served
ప్రాంతాల సేవలు
Productsకటకాలు, వైద్య పరికరాలు, స్టిల్, మూవీ కెమెరాలు, చలన చిత్ర శ్రవణ సాధనాలు
Revenue3,27,27,95,000 (2017) Edit this on Wikidata
51,46,71,000 (2017) Edit this on Wikidata
−33,95,25,000 (2017) Edit this on Wikidata
Total assets13,84,84,34,000 (2017) Edit this on Wikidata
Number of employees
2,386 Edit this on Wikidata
Website

లోమో (ఆంగ్లం: LOMO) రష్యా లోని సెయింట్ పీటర్స్‌బర్గ్ కేంద్రంగా వైద్య పరికరాలు/చలన చిత్రాలకు కావలసిన కటకాలు/పరికరాలు తయారు చేసే సంస్థ [1] . LOMO యొక్క పూర్తి రూపం Leningradskoye Optiko-Mekhanicheskoye Obyedinenie (Ленинградское Oптико-Mеханическое Oбъединение) అనగా లెనిన్ గ్రాడ్ ఆప్టికల్ మెకానికల్ అసోసియేషన్ అని అర్థం. సోవియట్ యూనియన్ యొక్క ప్రఖ్యాత ఆర్డర్ ఆఫ్ లెనిన్ అవార్డులు లోమో సంస్థకు మూడు లభించినవి.

చరిత్ర[మార్చు]

లోమో చే తయారు చేయబడ్డ 9 X 12 కెమెరా - FOTOKOR

1914 లో పెట్రోగ్రాడ్ (ఇప్పటి సెయింట్ పీటర్స్బర్గ్) లో కటకాలు, కెమెరాలు తయారు చేసే ఫ్రెంచి-రష్యన్ సంస్థగా స్థాపించబడింది. 1919లో ఇది జాతీయం చేయబడింది. 1921 లో Factory of State Optics (G.O.Z) గా పేరు మార్చబడింది. 1928 లో 9 X 12 కెమెరాను తయారు చేయవలసిందిగా సంస్థ ఆజ్ఙాపించడమైంది.

GOMZ[మార్చు]

రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత పలు సంస్కరణల వలన 1932లో సంస్థను GOMZ (Gosularstvennyi Optiko-Mehanicheskiy Zavod అనగా State Optical-Mechanical Plant) గా మార్చారు.

లోమో చే తయారు చేయబడ్డ ఎస్ ఎల్ ఆర్ కెమెరా - Sport

లోమో సంస్థ లైకా కెమెరా స్ఫూర్తిగా VOOMP I ను తయారు చేసింది. దీనిని అభివృద్ధి చేసి VOOMP II, పయనీర్ కెమెరాలు తయారు చేసింది. ఎస్ ఎల్ ఆర్ కెమెరా అయిన Sport ను తయారు చేసింది.

LOMO[మార్చు]

1965లో పలు ఇతర సంస్థలను కలుపుకొంటూ GOMZ కాస్తా LOMO అయ్యింది.

టాయ్ కెమెరాల నిర్మాణం[మార్చు]

లుబిటెల్[మార్చు]

రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన సంవత్సారానికే లోమో సోవియట్ యూనియన్ యొక్క మొట్టమొదటి టి ఏల్ ఆర్ కెమెరా, Komosmolets ను రూపొందించింది. వోయిగ్ట్ ల్యాండర్ బ్రిల్లియంట్ స్ఫూర్తిగా ఈ కెమెరా నిర్మాణం జరిగింది. ఒక సుదీర్ఘమైన యుద్ధం నుండి ఆర్థికంగా చిత్తు అయి అప్పుడప్పుడే కోలుకొంటూన్న దేశానికి ఇది గొప్ప విజయమే. దీనికి మరిన్ని మెరుగులు దిద్ది 1949లో లుబిటెల్ కెమెరా విడుదల చేయడం జరిగింది. లుబిటెల్ అనగా Amateur అని అర్థం. చవకగా లభ్యమయ్యే లుబిటెల్ ఔత్సాహిక ఫోటోగ్రఫర్ల ప్రియతమ కెమెరా అయ్యింది. ఎప్పటికప్పుడు లుబిటెల్ కు లోమో సంస్థ మెరుగులు దిద్దుకొంటూ వచ్చింది.

లోమో ఎల్ సి ఏ[మార్చు]

ఫిలిం విప్లవాన్ని సృష్టించిన లోమో ఎల్ సీ ఏ కెమెరా

Cosina CX-2 స్ఫూర్తిగా రష్యాలో ఒక కెమెరా రూపొందించవలసిందిగా లోమో ఆజ్ఙాపించబడింది. 1981 లో లోమో కాంపాక్ట్ ఆటోమేట్ (LC-A) నిర్మాణం ప్రారంభం అయ్యింది. 1984 లో కెమెరా తయారీ ప్రారంభం అయ్యింది. సోవియట్ విచ్ఛిన్నం తర్వాత లోమో ఎల్ సి ఏ ఉత్పత్తిలో ఒడిదుడుకులు ఎదురయ్యాయి.

ఆస్ట్రియా కి చెందిన ఒక విద్యార్థి బృందం చెకోస్లోవకియా కు సెలవులకు వెళ్ళి ఒక పురాతన కెమెరా స్టోరులో ఉత్పత్తి ఆగిపోయిన లోమో ఎల్ సి-ఏ కెమెరాను కొనుగోలు చేసి దానితో ఛాయాచిత్రాలు తీసారు. లోమో ఎల్ సి-ఏ తో వీరు తీసిన ఛాయాచిత్రాలకు అంతర్జాతీయ స్థాయిలో మన్ననలు రావటం, తర్వాత అది లోమోగ్రఫీ అనే కళా విప్లవాన్ని తీసుకు రావటం, లోమోగ్రఫీ ఒక సంస్థగా ఏర్పడటం జరిగాయి.

1993లో సంస్థ LOMO PLC అయ్యింది.

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. రష్యన్ లో లోమో వెబ్ సైటు
"https://te.wikipedia.org/w/index.php?title=లోమో&oldid=3850014" నుండి వెలికితీశారు