Jump to content

లోవాంగ్చా వాంగ్లాట్

వికీపీడియా నుండి
లోవాంగ్చా వాంగ్లాట్
లోవాంగ్చా వాంగ్లాట్

తరువాత వాంగ్లిన్ లోవాంగ్‌డాంగ్

పదవీ కాలం
1990 – 2004
నియోజకవర్గం బోర్దురియా-బాగపాని

వ్యక్తిగత వివరాలు

జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ[1]
వృత్తి రాజకీయ నాయకుడు

జేమ్స్ లోవాంగ్చా వాంగ్లాట్ అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన అరుణాచల్ ప్రదేశ్ శాసనసభకు బోర్దురియా-బాగపాని శాసనసభ నియోజకవర్గం నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై హోమ్ శాఖ మంత్రిగా పని చేశాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

లోవాంగ్చా వాంగ్లాట్ జనతాదళ్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 1990 అరుణాచల్ ప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో బోర్దురియా-బాగపాని శాసనసభ నియోజకవర్గం నుండి జనతాదళ్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి అజయ్ రాజ్ కుమార్ ను 1,165 ఓట్లతో ఓడించి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన ఆ తరువాత భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో చేరి 1995,1999 శాసనసభ ఎన్నికలలో వరుసగా ఎమ్మెల్యేగా ఎన్నికై హోమ్ శాఖ మంత్రిగా పని చేశాడు.

లోవాంగ్చా వాంగ్లాట్ 2019 లోక్‌సభ ఎన్నికలలో అరుణాచల్ తూర్పు నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి బీజేపీ అభ్యర్థి తపిర్ గావో చేతిలో 69,948 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[2][3]

మూలాలు

[మార్చు]
  1. "Former Arunachal home min Wanglat joins BJP". The Times of India. 20 January 2014. Archived from the original on 30 May 2025. Retrieved 30 May 2025.
  2. "Congress fielded new face against BJP veteran in Arunachal East" (in అమెరికన్ ఇంగ్లీష్). Hindustan Times. 3 April 2019. Archived from the original on 30 May 2025. Retrieved 30 May 2025.
  3. "Lok Sabha Election in Arunachal Pradesh 2024". The Times of India. 16 March 2024. Archived from the original on 30 May 2025. Retrieved 30 May 2025.