Jump to content

లోహార్‌దాగా

అక్షాంశ రేఖాంశాలు: 23°26′N 84°41′E / 23.43°N 84.68°E / 23.43; 84.68
వికీపీడియా నుండి
లోహార్‌దాగా
పట్టణం
లోహార్‌దాగా is located in Jharkhand
లోహార్‌దాగా
లోహార్‌దాగా
జార్ఖండ్ పటంలో పట్టణ స్థానం
Coordinates: 23°26′N 84°41′E / 23.43°N 84.68°E / 23.43; 84.68
దేశం India
రాష్ట్రంజార్ఖండ్
జిల్లాలోహార్‌దాగా
Elevation
647 మీ (2,123 అ.)
జనాభా
 (2011)
 • Total57,411
భాషలు
 • అధికారికహిందీ, నాగ్‌పురీ
Time zoneUTC+5:30 (IST)
PIN
Vehicle registrationJH-08

లోహార్‌దాగా జార్ఖండ్ రాష్ట్రంలో, లోహార్‌దాగా జిల్లాకు చెందిన పట్టణం, ఆ జిల్లాకు ముఖ్యపట్టణం. గతంలో (1900 ల ప్రారంభంలో) లోహార్‌దాగా చోటనాగ్‌పూర్ కమిషనరీ ప్రధాన కార్యాలయంగా ఉండేది. [1] తర్వాత చోటనాగ్‌పూర్ కమిషనరీని రాంచీకి మార్చారు. కమిషనర్ కార్యాలయం ఇప్పటికీ ఉంది. ఇందులో లోహార్‌దాగా పురపాలక కార్యాలయం ఉంది.

భౌగోళికం

[మార్చు]

లోహార్‌దాగా 23°26′N 84°41′E / 23.43°N 84.68°E / 23.43; 84.68 వద్ద , [2] సముద్రమట్టం నుండి 647 మీటర్ల ఎత్తున ఉంది.

ఆర్థిక వ్యవస్థ

[మార్చు]

లోహార్‌దాగాను బాక్సైట్ గనుల భూమిగా పిలుస్తారు. బహుళ సంస్థలు, ముఖ్యంగా హిందాల్కో, లోహార్‌దాగా సమీపంలో బాక్సైట్ గనులను నడుపుతున్నాయి. లోహార్‌దాగా చుట్టుపక్కల ఉన్న గనుల నుండి సేకరించిన బాక్సైటును దేశం లోని వివిధ రాష్ట్రాలలో ఉన్న అల్యూమినా రిఫైనరీలకు పంపిస్తారు.

జనాభా

[మార్చు]

2011 భారత జనగణన ప్రకాఅరం,[3] లోహార్‌దాగా జనాభా 57,411. జనాభాలో పురుషులు 52%మ్ మహిళలు 48% ఉన్నారు. లోహార్‌దాగా సగటు అక్షరాస్యత 85.37%. ఇది జాతీయ సగటు 59.5%కంటే ఎక్కువ: పురుషుల అక్షరాస్యత 89.80%, స్త్రీల అక్షరాస్యత 80.75%. లోహార్‌దాగాలో, జనాభాలో 15% మంది 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గలవారు.

మూలాలు

[మార్చు]
  1. http://lohardaga.nic.in/history.htm
  2. Falling Rain Genomics, Inc - Lohardaga
  3. "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. Archived from the original on 2004-06-16. Retrieved 2008-11-01.