వందేభారతమాతరం
వందేభారతమాతరం | |
కృతికర్త: | వడ్డూరి అచ్యుతరామ కవి |
---|---|
దేశం: | భారత దేశము |
భాష: | తెలుగు |
విభాగం (కళా ప్రక్రియ): | జాతీయ గీతం |
ప్రచురణ: | వడ్డూరి అచ్యుతరామ కవి |
విడుదల: | 1952 |
పేజీలు: | 3 |
యమునాకల్యాణి రాగం మిశ్రచాపుతాళం
రచన : శ్రీ వడ్డూరి అచ్యుతరామ కవి (స్వాతంత్ర్యసమరయోధులు, తామ్రపత్రగ్రహీత)
<poem>
వందేభారతమాతరం
వందారుజన సుర మందారం
మందరాచల వింధ్య హిమగిరి
సుందరోన్నత శిఖర చుంబిత చంద్ర తారక మండలాం సాంద్ర ఫలతరు మండితామ్ !! వందేభారత మాతరం !! 1.
గౌతమీ కావేరి గంగా కృష్ణవేణి తరంగరంగా న్మంగళోదక పోషితాఖిల
భూతజాల విభాశితే పాతకాఘ వినాశితే !!వందేభారత మాతరం !! 2
అంగవంగ కళింగ కాశ్మీ రాంధ్ర సౌరాష్ట్రాది మండల సంగరాంగణ విజిత రిపుజన వీరభారత బృంద వంధ్యామ్ !! వందేభారత మాతరం !! 3
లలిత కుసుమిత ఫలిత వికసిత సస్య తరులత పల్లవామ్ కిలకిలారవ ఝంకారిత కలనినాద పతంగ బృందామ్ !! వందేభారత మాతరం !! 4
చందనాగరు పారిజాత మం దార కుంద కమల సు గంధ బంధుర మందానిల కందళిత హృదయార విందామ్ !! వందేభారత మాతరం !! 5 చతుష్షష్ఠి కళాన్వితామ్ చతుర్వేద నివేదితామ్ చతుస్సాగర వేల్లితామ్ చతురంగ బలోపేతామ్ !! వందేభారత మాతరం !! 6
శాంత శమదమ నియమ వితరణ సత్యశౌచ దయార్త రక్షణ ధీర గంభీరాది సుగుణ గుభిరామ కుమార జననీమ్ !! వందేభారత మాతరం !! 7
వ్యాస వాల్మీకి కాళిదాసా మర మయూర శుకాది కవి కుల భాసమాన మహా కవిత్వ సుధాతరంగ సురంజితాం !!వందేభారత మాతరం! 8
కృష్ణ శంకర బుద్ధ గాంధీ రామకృష్ణ సుబోధా మృత రసప్లావిత మానకాఘామ్ విశుద్ధాంచిత కర్మబధ్దామ్ !! వందేభారత మాతరం !! 9
ధర్మసత్య దయాశ్రితావన ద్వాత్రిశంశ త్సుగుణ భూషిత రాజరాజాధిప మహా
రాజ పరిపాలితామ్ — !!వందేభారత మాతరం! 10
ఋగ్యజుస్సా మాధర్వణ శృతి స్మృతి పురాణొధిత వాదగాధా బోధితామ్
వేదనాద వినోదితామ్ !! వందేభారత మాతరం !! 11
సరిగమ పదని సంయుత సప్తస్వర గానలోలామ్ తధిమి ధిమికిట ధణం ధణముఖ తాళ బంధుర నటన ఖేలామ్ !! వందేభారత మాతరం !! 12
కమల దళ సన్నిభ విలోచన కమల కేశర వర్ణినీ కమల భవముఖ వినుత సుచరణ
కమల యుగళ విభాసినీమ్ !!వందేభారత మాతరం!13
అభయ ముద్ర త్రివర్ణ కేతన శూల కమల కరాంబు జామ్ విబుధ లోక సమర్పనీయ సు దివ్య మంగళ విగ్రహామ్ !వందేభారత!14
ప్రాత్య పాశ్చాత్యాది భూతల భాసమాన శిరోరత్నామ్ అచ్యుతార్చిత చరణ పద్మామ్
నిత్య ఫలిత సురత్న గర్భామ్ !! వందేభారత మాతరం!! 15