వకుళాభరణం కృష్ణమోహన్ రావు

వికీపీడియా నుండి
(వకుళాభరణం కృష్ణమోహన్‌ రావు నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
వకుళాభరణం కృష్ణమోహన్‌ రావు
వకుళాభరణం కృష్ణమోహన్ రావు


తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ ఛైర్మన్‌
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
23 ఆగష్టు 2021 - ప్రస్తుతం
ముందు బి.ఎస్.రాములు

వ్యక్తిగత వివరాలు

జననం 2 నవంబర్ 1970
హుజూరాబాద్ , కరీంనగర్ జిల్లా , తెలంగాణ రాష్ట్రం
రాజకీయ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ
నివాసం నల్లకుంట , హైదరాబాద్
వృత్తి రాజకీయ నాయకుడు, రచయిత, వక్త

వకుళాభరణం కృష్ణమోహన్‌ రావు తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, రచయిత, వక్త, తెలంగాణ ఉద్యమకారుడు. ఆయన ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ ఛైర్మన్‌గా ఉన్నాడు. [1][2]

జననం, విద్యాభాస్యం[మార్చు]

వకుళాభరణం కృష్ణమోహన్‌ 1970లో తెలంగాణ రాష్ట్రం , కరీంనగర్ జిల్లా , హుజూరాబాద్ లో జన్మించాడు. ఆయన పదవ తరగతి వరకు హుజురాబాద్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో, 1988లో ఇంటర్మీడియట్ కోరుట్ల ప్రభుత్వ జూనియర్ కాలేజ్ లో, కరీంనగర్ లోని ఎస్.ఆర్.ఆర్ డిగ్రీ కళాశాలలో 1991లో బీకామ్, 1992లో అన్నామలై యూనివర్సిటీ నుండి బీఈడీ , 1994లో ఉస్మానియా యూనివర్సిటీ నుండి పీజీ (ఎంఏ) పూర్తి చేశాడు.

రాజకీయ జీవితం[మార్చు]

వకుళాభరణం కృష్ణమోహన్‌ కాంగ్రెస్‌ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చాడు. ఆయన బీసీ విద్యార్థి సంఘం నాయకునిగా రెండు దశాబ్ధాలుగా బీసీల ఉద్యమాల్లో క్రియాశీల పాత్ర పోషించాడు. వకుళాభరణం కృష్ణమోహన్‌ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2004 నుండి 2014 వరకు బీసీ కమిషన్ సభ్యుడిగా పని చేశాడు. కృష్ణమోహన్‌ 2009 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి టిఆర్ఎస్ అభ్యర్థి ఈటెల రాజేందర్ చేతిలో 15035 ఓట్ల తేడాతో ఓటమి పాలై, 2010లో జరిగిన ఉప ఎన్నికల్లో తిరిగి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. తెలంగాణ  ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014లో ఆయనకు కాంగ్రెస్‌ టికెట్టు దక్కలేదు. ఆయన 2016లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి,[3] తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ లో చేరాడు.[4]

వకుళాభరణం కృష్ణమోహన్‌ రావు అక్టోబర్ 22, 2016న తెలంగాణ బీసీ కమిషన్‌ సభ్యుడిగా నియమితుడై అక్టోబర్ 2019 వరకు ఆ పదవిలో ఉన్నాడు. వకుళాభరణం కృష్ణమోహన్‌ రావు 23 ఆగష్టు 2021న తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ ఛైర్మన్‌గా నియమితుడయ్యాడు.[5][6][7] ఆయన 1 సెప్టెంబర్ 2021న ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేపట్టాడు.[8]

పురస్కారం[మార్చు]

  • బహుజన బంధు[9]

మూలాలు[మార్చు]

  1. Namasthe Telangana (23 August 2021). "బీసీ క‌మిష‌న్ చైర్మ‌న్ గా వ‌కుళాభ‌ర‌ణం కృష్ణ‌మోహ‌న్ రావు". Archived from the original on 23 August 2021. Retrieved 23 August 2021.
  2. Andrajyothy (23 August 2021). "బీసీ కమిషన్‌ చైర్మన్‌గా వకుళాభరణం". Archived from the original on 24 August 2021. Retrieved 24 August 2021.
  3. The Hindu (18 April 2016). "TPCC spokesperson Krishna Mohan quits" (in Indian English). Archived from the original on 24 August 2021. Retrieved 24 August 2021.
  4. Sakshi (29 May 2021). "ఒక్క ఛాన్స్‌.. ఈటలపై పోటీకి సై అంటున్న నేతలు!". Archived from the original on 24 August 2021. Retrieved 24 August 2021.
  5. Eenadu (24 August 2021). "బీసీ కమిషన్‌ ఛైర్మన్‌గా వకుళాభరణం". Archived from the original on 24 August 2021. Retrieved 24 August 2021.
  6. The New Indian Express (24 August 2021). "Dr Vakulabharanam Krishna Mohan Rao named chairman of Backward Classes Commission". Archived from the original on 24 August 2021. Retrieved 24 August 2021.
  7. V6 Velugu (24 August 2021). "BC కమిషన్‌‌ చైర్మన్‌‌గా వకుళాభరణం కృష్ణమోహన్‌ రావు" (in ఇంగ్లీష్). Archived from the original on 24 August 2021. Retrieved 24 August 2021.
  8. Andrajyothy (1 September 2021). "బిసి కుల గణనతోనే సమగ్ర ప్రగతి సాధ్యం: వకుళాభరణం". Archived from the original on 1 September 2021. Retrieved 1 September 2021.
  9. Eenadu (2 January 2023). "వకుళాభరణం కృష్ణమోహన్‌రావుకు 'బహుజన బంధు' పురస్కారం". Archived from the original on 2 January 2023. Retrieved 2 January 2023.