వకుళా దేవి
స్వరూపం
This article needs more links to other articles to help integrate it into the encyclopedia. (జూన్ 2017) |
వకుళా దేవి, కలియుగ విష్ణు అవతారంగా భావించబడుతున్న వేంకటేశ్వరుని పెంచి పోషించిన తల్లి. ఈమె యశోద అవతారంగా చెప్పబడుతున్నది.
తిరుమల గిరులలో వకుళమాత దేవాలయాలు
తిరుమల గిరులలో రెండు వకుళమాత దేవాలయాలు ఉన్నాయి.
- మొదటిది తిరుపతిలోని కపిలతీర్థం దగ్గర వున్న మాలాడిగుండం దగ్గర ఉంది.
- రెండవది శ్రీవారి ప్రధానాలయంలో విమాన ప్రదక్షిణ మార్గంలో ఆగ్నేయ దిశలో వున్న పోటు (వంటగది) లో ఉంది. పోటులో వున్న వకుళాదేవి దగ్గరుండి తన కొడుకుకి కావలసిన తినుభండారాలను శుచిగా, శుభ్రంగా వండిస్తుంది అంటారు.
- వకుళ మాతే బంగారు తులసీపత్ర హారం (వకుళ మాల) గా మారి శ్రీవారి మెడలో చేరిందని ఒక ఇహిత్యం.
తిరుపతిలో వకుళమాత దేవాలయాలు
17వ శతాబ్దానికి చెందిన వకుళాదేవి ఆలయం తిరుపతి గ్రామీణ మండలంలోని పేరూరు గ్రామపంచాయితీ పరిధిలోని పేరూరు బండపై ఉంది.[1]
మూలాలు
- ↑ Quarry endangers temple - Deccan chronicle October 23rd, 2009