Jump to content

వక్కలంక సరళ

వికీపీడియా నుండి
వక్కలంక సరళ
1953లో వక్కలంక సరళ
జననం1927 ఆగష్టు 8
చెన్నై
పిల్లలు3, ఒక కుమారుడు. ఇద్దరు కుమార్తెలు
వక్కలంక స్వప్నసుందరి,
వక్కలంక పద్మ
తల్లిదండ్రులు
  • గోపాలరావు (తండ్రి)
  • సుందరమ్మ (తల్లి)

వక్కలంక సరళ (1927 ఆగస్టు 8 - 1999) [1] తెలుగు సినిమా గాయని. కీలుగుర్రం సినిమాలోని 'కాదు సుమా కల కాదు సుమా' పాట పాడిన గాయనిగా ప్రసిద్ధి చెందింది. 1940వ దశకంలో జెమినీ స్టూడియో హిందీ విభాగంలో సహాయ సంగీత దర్శకురాలిగా పనిచేసింది.[2] ఈమె పూర్వీకులు అమలాపురానికి చెందిన బ్రాహ్మణులు, అయితే మద్రాసులో స్థిరపడ్డారు. సరళ తండ్రి గోపాలరావు, చలం (గుడిపాటి వెంకటాచలం) తమ్ముడు[3] సరళ 1927, ఆగష్టు 8మద్రాసులో సుందరమ్మ, గోపాలరావు దంపతులకు జన్మించింది. ఈమె తల్లి సుందరమ్మ కూడా గాత్ర సంగీత కళాకారిణే.

ఆమెకు అలనాటి సినీనటి అంజలీదేవికి మంచి స్నేహితురాలు. అంజలీదేవి మొదటిసినిమా బాలరాజులో 'ఇది తీయని వెన్నెల రేయి' పాటను సరళ పాడింది. అప్పటి నుంచీ వారు స్నేహితులయ్యారు. 1950ల్లో అంజలీదేవి 'స్వప్నసుందరి' తీసిన తర్వాత నాకు గనుక కూతురు పుడితే కచ్చితగా ఇదే పేరు పెడతానని సరళ అంజలీదేవికి మాటిచ్చింది. అలా మాటిచ్చిన పదేళ్లకు పుట్టిన బిడ్డకు మాట ప్రకారం స్వప్నసుందరి అని పేరుపెట్టింది.[4] ఈమే కూచిపూడి నాట్యకళాకారిణి, పద్మభూషణ గ్రహీత స్వప్నసుందరి.

ఘంటసాలతో కలిసి సరళ, కాదు సుమా కల కాదు సుమా' పాటతో సహా అనేక పాటలు పాడింది. ఈమెకు ఘంటసాలతో పెళ్ళికుదరబోయి, అనుకోని పరిస్థితుల్లో, ఘంటసాలకు మరో రంగూన్ ‘సరళ’తో ద్వితీయ వివాహం జరగింది.[5]

సరళ వివాహం అయ్యాక సినిమా రంగం నుంచి వైదొలగింది. ఆ రోజుల్లో దక్షిణ భారతదేశంలో పెళ్లవగానే సినిమాల్ని వదిలేసేవాళ్లు. ఈమెకు స్వప్నసుందరితో పాటు మరో కూతురు, ఒక కొడుకు పుట్టారు. 1979లో విడుదలైన గోరింటాకు సినిమాలో నటించిన వక్కలంక పద్మ కూడా సరళ కూతురే.[6]

సరళ కూతురు స్వప్నసుందరి ప్రతి సంవత్సరం తల్లి జ్ఞాపకార్ధం, ఆగష్టు 8న స్వరలహరి అనే కర్ణాటక సంగీత కచ్చేరిని నిర్వహిస్తుంది. ఈ కచ్చేరీలో యువ గాయనీగాయకులు సరళ స్వరపరచిన పాటలను ప్రముఖంగా పాడతారు.[1][7]

ఈమె ఆలపించిన తెలుగు సినిమా గీతాల జాబితా

[మార్చు]
విడుదల సం. సినిమా పేరు పాట ఇతర గాయకులు సంగీత దర్శకుడు రచయిత
1948 బాలరాజు తీయనివెన్నెల రేయి ఎడబాయని వెన్నెల హాయీ ఘంటసాల సముద్రాల సీనియర్
1949 కీలుగుర్రం అహా ఓహో ఎంతానందంబాయెనహా ఊహాతీతముగా ఘంటసాల తాపీ
1949 కీలుగుర్రం కాదుసుమా కలకాదుసుమా అమృతపానమును ఘంటసాల ఘంటసాల తాపీ
1949 రక్షరేఖ బిడియమా మనలో ప్రియతమా సఖా బిగువ చాలు నాతో ఓగిరాల రామచంద్రరావు బలిజేపల్లి
1949 లైలా మజ్ను అనగనగా ఓ ఖాను ఆ ఖానుకో జనానా భానుమతి సి.ఆర్.సుబ్బరామన్ సముద్రాల సీనియర్
1952 సింగారి శుద్ధం చెయ్యండోయ్ తొలంచి శుద్ధం చెయ్యండోయ్ తంగవేలు బృందం ఎస్.వి.వెంకట్రామన్,
టి.కె.రామనాథన్
టి.ఎ.కళ్యాణం
1952 మరదలు పెళ్ళి పిలిచే గోదావరోడ్డు నూరూరించే బందరు లడ్డు చిత్తూరు నాగయ్య,
టంగుటూరి సూర్యకుమారి
శ్రీశ్రీ
1953 అమరకవి జి.రామనాధన్,
టి.కె.కుమారస్వామి

ఇవీ చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 "Rhythm of recall". The Hindu. No. August 10, 2012. Retrieved 2 December 2014.
  2. Living out a dream - The Hindu Feb 05, 2003[permanent dead link]
  3. "కుటుంబంలో సంగీతం - కొడవటిగంటి రోహిణీప్రసాద్‌". Archived from the original on 2016-03-07. Retrieved 2013-08-26.
  4. అంజలీదేవి సినిమా చూసి నాకు పేరు పెట్టారు - ఈనాడు[permanent dead link]
  5. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2012-12-23. Retrieved 2013-08-26.
  6. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-03-05. Retrieved 2013-08-26.
  7. "Hyderabad today". The Hindu. No. August 8, 2007. Retrieved 2 December 2014.