వక్రతా వ్యాసార్థం (దృశా శాస్త్రం)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Radius of curvature sign convention for optical design

వక్రతా వ్యాసార్థం అనేది దృశాశాస్త్రంలో ప్రత్యేక అర్థం, సంజ్ఞా సాంప్రదాయం కలది. ఒక గోళాకార కటకం, లేదా దర్పణం యొక్క తలం వక్రతలంగా ఉంటుంది. ఈ తలం దాని ప్రధానాక్షంపై ఒక వక్రతా కేంద్రాన్ని, శీర్షం (దర్పణ ధ్రువం) కలిగి ఉంటుంది. దర్పణ లేదా కటక శీర్షం నుండి వక్రతా కేంద్రానికి గల దూరాన్ని వక్రతా వ్యాసార్థం అంటారు.[1][2][3][4]  ఈ వక్రతా వ్యాసార్థం యొక్క సంజ్ఞా సంప్రదాయాలు దృశా శాస్త్రంలో ఈ క్రింది విధంగా ఉంటాయి.

  • దర్పణ లేదా కటక శీర్షం వక్రతా కేంద్రానికి ఎడమవైపు ఉంటే దాని వక్రతా వ్యాసార్థాన్ని ధనాత్మకంగా తీసుకోవాలి.
  • దర్పణ లేదా కటక శీర్షం వక్రతా కేంద్రానికి కుడి వైపు ఉంటే దాని వక్రతా వ్యాసార్థాన్ని ఋణాత్మకంగా తీసుకోవాలి.

ఒక ద్వికుంభాకార కటకానికి ఒక వైపు నుండి చూసినపుడు ఎడమవైపు ఉన్న ఎడమవైపు ఉన్న తలం యొక్క వక్రతా వ్యాసార్థం ధనాత్మకం, కుడి వైపు తలం యొక్క వక్రతావ్యాసార్థం ఋణాత్మకం అవుతుంది.

సంజ్ఞా సాంప్రదాయాలు[మార్చు]

దర్పణ సూత్రంలోని వివిధ అంశాలకు పాటించవలసిన సంజ్ఞా సాంప్రదాయం:

  • అన్ని దూరాలను దర్పణ ధ్రువం నుండి కొలవాలి.
  • కాంతి (పతన కాంతి) ప్రయాణించిన దిశలో కొలిచిన దూరాలను ధనాత్మకంగాను, కాంతి ప్రయాణ దిశకు వ్యతిరేక దిశలో కొలిచిన దూరాలను ఋణాత్నకంగా పరిగణించాలి.
  • కుంభాకార కటకానికి ఎడమవైపు నుండి కుడివైపుకి సమాంతర కాంతి కిరణాలు పతనమైనప్పుడు అవి వక్రీభవనం చెంది కుడి వైపు ప్రధానాక్షంపై గల నాభి పై కేంద్రీకరించబడతాయి. ఈ సందర్భంలో నాభి, మొదటి తలం యొక్క వక్రతా కేంద్రాలు కుడి వైపున ఉంటాయి. కనుక వక్రతా వ్యాసార్థాన్ని కొలిచినపుడు కటకం నుండి కుడివైపుకు కొలుస్తాము, కాంతి కిరణాలు కూడా కుడి వైపుకి ప్రయాణిస్తున్నందున సంజ్ఞా సాంప్రదాయం ప్రకారం వక్రతా వ్యాసార్థం ధనాత్మకంగా తీసుకోవాలి. ఎడమవైపు ఉన్న వక్రతా కేంద్రం కుడివైపు గల తలానికి చెందినది. దీనిని గణించినపుడు పతన కాంతి కిరణానికి వ్యతిరేకంగా కొలుస్తున్నందువల్ల అది ఋణాత్మకం అవుతుంది.

మూలాలు[మార్చు]

  1. Ernst, Steve. "The Lensmaker's Equation". Boundless (in English). Archived from the original (HTML) on 8 ఆగస్టు 2017. Retrieved 8 August 2017. The best reference.{{cite web}}: CS1 maint: unrecognized language (link)
  2. https://physics.stackexchange.com/questions/168750/radius-of-curvature-of-a-lens
  3. "Optics Theory" (in Russian).{{cite web}}: CS1 maint: unrecognized language (link)
  4. Barbastathis, George; Sheppard, Colin. "Real and Virtual Images" (Adobe Portable Document Format). MIT OpenCourseWare (in English). Massachusetts Institute of Technology. p. 4. Retrieved 8 August 2017.{{cite web}}: CS1 maint: unrecognized language (link)