వజ్ర సూత్రం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బుద్ధుని ప్రశ్నిస్తున్న ముసలి సుభూతి. దున్‌హువాంగ్ చెక్క ప్రతి నుండి సేకరించబడినది

మహాయాన బౌద్ధానికి చెందిన ప్రజ్ఞాపారిమిత సూత్రాల వర్గ రచనలలోని "వజ్రచ్ఛేదిక ప్రజ్ఞాపారిమిత సూత్రాని"కి ఉన్న సంక్షిప్తనామం వజ్ర సూత్రం. సా.శ. 868 నాటి చైనీయ వజ్ర సూత్రాల దున్‌హువాంగ్ ప్రచురణలు 20వ శతాబ్దంలో లభ్యమయ్యాయి. బ్రిటీషు గ్రంథాలయం వారి ఉద్దేశ్యం ప్రకారం, ఇది పూర్తిగా దొరుకుతున్నవాటిలో అత్యంత ప్రాచీన సాహిత్యం.

చరిత్ర

[మార్చు]
చైనీయ వజ్ర సూత్రం

వజ్ర సూత్రాల చరిత్ర గురించి ఇప్పటి వరకూ ఎవరూ నిర్ధారించలేకపోయారు. జపనీయ విద్వాంసులు ప్రజ్ఞాపారిమిత సూత్రాలతోనే వజ్రసూత్రం ప్రారంభమైందని భావిస్తారు. దీని మొట్టమొదటి అనువాదం సా.శ. 401లో కుమార రాజీవుడు చైనీయ భాషలోకి చేసాడని భావిస్తున్నారు. కుమారరాజీవుడేకాక ఇతరులు కూడా సంస్కృతం నుండి చైనీయ భాషలోని అనువాదం చేసారు. వాటిలో సా.శ. 509 నాటి బోధిరుచి, 558నాటి పరమార్థ, 648నాటి గ్జువాన్‌జాంగ్, 703నాటి యింజింగ్ ల అనువాదాలు కూడా ఉన్నాయి.

విషయం

[మార్చు]
చైనీయ వజ్ర సూత్రం యొక్క సాంప్రదాయిక చేతి మడత ప్రతి

ఒకరోజు, బుద్ధుడు తక్కిన సన్యాసులతో కలిసి భిక్షాటన ముగించుకొని, విశ్రాంతిగా కూర్చొని ఉంటాడు. అప్పుడు ముసలివాడైన సుభూతి ముందుకు వచ్చి బుద్ధుని ప్రశ్నిస్తాడు. జ్ఞానం యొక్క స్వభావం గురించిన సంభాషణ జరుగుతుంది. కొన్ని సందర్భాలలో బుద్దుడు "ఉన్నతబోధన అని దేనిని అంటారో అది నిజానికి ఉన్నతబోధన కాదు" అని కూడా అంటాడు. వాస్తవం, జ్ఞానోదయం లకు సంబంధించిన అపరిపక్వ భావనల నుండి సుభూతి దూరం కావడానికి బుద్ధుడు సహాయం చేస్తున్నట్టుగా భావిస్తారు.

ఇందులోని అఖరి నాలుగు వాక్యాల అర్థం ఈ విధంగా ఉంటుంది. భౌతికమైన విషయాలన్నీ స్వప్నాలూ, భ్రమలూ, బుడగలూ, నీడలూనూ.. .. ..

ఇది పూర్తిగా పఠించడానికి 40-50 నిమిషాలు మాత్రమే పట్టడం వల్ల, బౌద్ధ మఠాలలో దీనిని కంఠతా పట్టి వల్లె వేస్తూ ఉంటారు.

ఇవి కూడా చూడండి

[మార్చు]