Jump to content

వడ్డీ మహేశ్వరి

వికీపీడియా నుండి

వడ్డీ మహేశ్వరి భారతీయ సినిమా నటి. సీరియల్ నటి. నృత్య కారిణి వడ్డీ మహేశ్వరి తెలుగు సినిమాలలో నటించింది. 2021లో సంపూర్ణేష్ బాబు హీరోగా నటించిన బజార్ రౌడి సినిమాతో సినిమా రంగంలోకి ప్రవేశించింది. తరువాత వడ్డీ మహేశ్వరి సీరియల్స్ లో నటించడం మొదలుపెట్టింది. వడ్డీ మహేశ్వరి మనసంతా నువ్వే మగువా ఓ మగువా లాంటి సీరియల్స్ లో నటించింది. కూచిపూడి నృత్యంలో వడ్డీ మహేశ్వరి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకుంది.

బాల్యం,విద్యా భాస్యం

[మార్చు]

వడ్డీ మహేశ్వరి 1994 మార్చి 1తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాదు లో జన్మించింది. వడ్డీ మహేశ్వరి ప్రాథమిక విద్యను హైదరాబాద్లోని ఒక ప్రైవేటు పాఠశాలలో అభ్యసించింది. తరువాత ఉన్నత విద్యను ఉస్మానియా విశ్వవిద్యాలయం లో పూర్తి చేసింది. వడ్డీ మహేశ్వరి ఎం.బి.ఎ పూర్తి చేసింది.

కెరీర్

[మార్చు]

వడ్డీ మహేశ్వరి 2021 లో సంపూర్ణేష్ బాబు హీరోగా నటించిన బజార్ రౌడి సినిమాలో సంపూర్ణేష్ బాబు సరసన నటించి తెలుగు సినిమా రంగంలోకి ప్రవేశించింది. తర్వాత 2022 లో వచ్చిన అతడు ఆమె ప్రియుడు సినిమాలో నటించింది. 2023లో ఎదురుచూపు అనే సినిమాలో నటించింది. తరువాత వడ్డీ మహేశ్వరి సీరియల్స్ లోకి ప్రవేశించింది.జీ తెలుగు లో ప్రసారమైన రాధమ్మ కూతురు సీరియల్లో నటించింది. ఈటీవీ లో ప్రసారమైన మనసంతా నువ్వే సీరియల్లో నటించింది. ప్రస్తుతం వడ్డీ మహేశ్వరి స్టార్ మా లో ప్రసారం అవుతున్న మగువ ఓ మగువ సీరియల్ లో నటిస్తుంది. వడ్డీ మహేశ్వరి కూచిపూడి నృత్యం లో గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకుంది.

నటించిన సినిమాలు

[మార్చు]

బజార్ రౌడి (2021)[1][2]

అతడు ఆమె ప్రియుడు (2022)

ఎదురు చూపు (2023)

నటించిన సీరియల్స్

[మార్చు]

రాధమ్మ కూతురు (జీ తెలుగు)

కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ

మనసంతా నువ్వే (ఈటీవీ)

మగువ ఓ మగువ (స్టార్ మా)

మూలాలు

[మార్చు]
  1. Telugu, TV9 (2021-02-11). "Sampoornesh Babu: 'బజార్‌ రౌడీగా' మారిన సంపూర్ణేష్‌ బాబు... వైరల్‌ అవుతోన్న బర్నింగ్‌ స్టార్‌ న్యూ లుక్‌." TV9 Telugu. Retrieved 2025-03-25.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
  2. "రౌడీయిజం ఎలా చేయాలో నేర్పుతున్న సంపూర్ణేశ్ బాబు‌ | Sampoornesh Babu Bazaar Rowdy Movie Teaser Out | Sakshi". www.sakshi.com. Retrieved 2025-03-25.