వడ్డేపల్లి చెరువు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వడ్డేపల్లి చెరువు
Waddepally lake 13122015.jpg
వరంగల్లులోని వడ్డేపల్లి చెరువు
స్థానంవడ్డేపల్లి, హనుమకొండ మండలం, వరంగల్ (పట్టణ) జిల్లా, తెలంగాణ
భౌగోళికాంశాలు17°59′37″N 79°31′15″E / 17.993662°N 79.520878°E / 17.993662; 79.520878
సరస్సు రకంజలాశయం
ప్రవహించే దేశాలు భారతదేశం
శీతలీకరణముNo

వడ్డేపల్లి చెరువు తెలంగాణ రాష్ట్రం, వరంగల్ (పట్టణ) జిల్లా, హనుమకొండ మండలం, వడ్డేపల్లి గ్రామంలో ఉన్న చెరువు. ఇది హన్మకొండ, కాజీపేట ప్రాంతాల ప్రజలకు తాగునీటిని అందిస్తుంది.[1]

చరిత్ర[మార్చు]

కాకతీయ రాజులకాంలో సాగు, తాగునీటి అవసరాలకోసం వడ్డేపల్లి చెరువును తవ్వించారు. ఈ చెరువు సుమారు 600 ఎకరాలకు సాగునీరు అందించడమేకాకుండా,ప్రజలకు తాగునీటిని అందిస్తుంది. అందుకోసం ఇది 1993లో సమ్మర్‌ స్టోరేజ్‌గా అభివృద్ధి చేయబడింది.[2]

పర్యాటకప్రాంతంగా[మార్చు]

వరంగల్ మహానగర పాలక సంస్థ ఆధ్వర్యంలో ఈ ప్రాంతాన్ని పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దారు. చెరువు మధ్యలోకి వెళ్ళేందుకు వీలుగా దారిని, చెరువును చూసేందుకు రెండు వ్యూ పాయింట్లను ఏర్పాటుచేశారు. ఈ చెరువు పక్కన శివాలయం కూడా ఉంది. ఇది చేపలు పట్టడానికి అనువైన ప్రాంతం. దీనిని తెలంగాణ ప్రభుత్వం జలాశయంగా గుర్తించింది.[3]

ఇతర వివరాలు[మార్చు]

  1. ప్రతి సంవత్సరం బతుకమ్మ పండగ సందర్భంగా చెరువు దగ్గర మహిళలు బతుకమ్మ ఆట అడుతారు.[4]
  2. ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ (కుడా), మున్సిపల్‌ కార్పోరేషన్‌ సంయుక్తంగా వడ్డేపల్లి కట్టపై మినీ ట్యాంక్‌బండ్‌ ఏర్పాటుచేసి కట్టపై వివిధ రకాల మొక్కలు నాటించారు.
  3. ఇక్కడ సినిమాలు, సీరియల్స్, లఘు చిత్రాలకు సంబంధించిన షూటింగులు జరుగుతాయి.
  4. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం వాకర్లతో బండ్‌ కట్ట రద్దీగా ఉంటుంది.[2]

మూలాలు[మార్చు]

  1. The Hindu, Telangana (13 May 2016). "Devadula water to quench thirst of Warangal, Kazipet, Hanamkonda". Archived from the original on 13 డిసెంబర్ 2019. Retrieved 15 December 2019. Check date values in: |archivedate= (help)CS1 maint: discouraged parameter (link)
  2. 2.0 2.1 నవతెలంగాణ, వరంగల్ (7 April 2019). "కాజీపేట షాన్‌.. వడ్డేపల్లి బండ్‌". NavaTelangana. Archived from the original on 15 డిసెంబర్ 2019. Retrieved 15 December 2019. Check date values in: |archivedate= (help)CS1 maint: discouraged parameter (link)
  3. Deccan Chronicle, Telangana (12 June 2015). "Waddepally tank beautification left midway". Archived from the original on 15 జూన్ 2015. Retrieved 15 December 2019. Check date values in: |archivedate= (help)CS1 maint: discouraged parameter (link)
  4. ఆంధ్రజ్యోతి, వరంగల్ (10 October 2018). "బతుకమ్మ సంబురాలు". www.andhrabhoomi.net. Archived from the original on 15 డిసెంబర్ 2019. Retrieved 15 December 2019. Check date values in: |archivedate= (help)CS1 maint: discouraged parameter (link)