Jump to content

వడ్డే నవీన్

వికీపీడియా నుండి


వడ్డే నవీన్
జననం వడ్డే నవీన్
విజయవాడ, ఆంధ్రప్రదేశ్
తండ్రి_పేరు వడ్డే రమేష్
వృత్తి సినిమా
నివాసం హైదరాబాదు

వడ్డే నవీన్ తెలుగు సినిమా నటుడు. సుమారు 30 సినిమాల్లో కథానాయకుడిగా నటించాడు. 1997లో వచ్చిన కోరుకున్న ప్రియుడు ఇతని మొదటి సినిమా. ఇంకా పెళ్ళి, చాలా బాగుంది, స్నేహితులు మొదలైన సినిమాలు ఇతనికి గుర్తింపు తెచ్చాయి.[1] ఇతని తండ్రి వడ్డే రమేష్ తెలుగు సినీ నిర్మాత.

కెరీర్

[మార్చు]

1997 లో వచ్చిన కోరుకున్న ప్రియుడు చిత్రంతో తన కెరీర్ ప్రారంభించిన నవీన్ తర్వాత పెళ్ళి, మనసిచ్చి చూడు, స్నేహితులు, చాలా బాగుంది లాంటి సినిమాలతో మంచి గుర్తింపు సాధించుకున్నాడు. అయితే 2000 దశకంలో అవకాశాలు సన్నగిల్లడంతో చాలా తక్కువ సినిమాలు చేశాడు. 2016 తర్వాత మరే సినిమాలో నటించలేదు.[2]

నటించిన చిత్రాలు

[మార్చు]
  1. కోరుకున్న ప్రియుడు (1997)
  2. పెళ్లి (1997)
  3. ప్రియా ఓ ప్రియా (1997)
  4. మనసిచ్చి చూడు (1998)
  5. లవ్ స్టోరీ 1999 (1998)
  6. స్నేహితులు (సినిమా) (1998)
  7. నా హృదయంలో నిదురించే చెలీ (1999)
  8. ప్రేమించేమనసు (1999)
  9. మా బాలాజీ (1999)
  10. చాలా బాగుంది (2000)
  11. బాగున్నారా (2000)
  12. మా ఆవిడమీదొట్టు - మీ ఆవిడ చాలా మంచిది (2001)
  13. చెప్పాలని ఉంది (2001)
  14. అయోధ్య (సినిమా) (2005)
  15. ఆదిలక్ష్మి (2006)
  16. నా ఊపిరి
  17. శ్రీమతి కళ్యాణం
  18. ఎటాక్ (2016)
  19. క్రాంతి (2018)[3]

బయటి లంకెలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Vadde Naveen turns a baddie". The Times of India. 2017-01-15. ISSN 0971-8257. Retrieved 2025-12-12.
  2. Devulapally, Aditya (2025-08-10). "Vadde Naveen returns as a khaki-clad constable in his comeback film". Cinema Express (in ఇంగ్లీష్). Retrieved 2025-12-12.
  3. "Vadde Naveen makes a comeback". 123telugu.com. Retrieved 10 January 2020.