వడ్డే సిరి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వడ్డే సిరి
వడ్డే సిరి
జననండిసెంబర్ 17
నివాస ప్రాంతంకేంబ్రిడ్జ్, యునైటెడ్ కింగ్డమ్
వృత్తికస్టమర్ కేర్, చెకౌట్ క్యాషియర్ ఇన్ మార్కెటింగ్ గ్రూప్స్
ప్రసిద్ధికవయిత్రి, రచయిత్రి
మతంహిందూ

శ్రీమతి సిరి వడ్డే వర్థమాన తెలుగు కవయిత్రి, రచయిత్రి.

ఆమె గురించి[మార్చు]

సిరి వడ్డే కలం పేరు సిరి. ఆమె ముఖ్యంగా కవితలు, గజల్ గీతాలు, వ్యాసాలు రాస్తుంటారు. ప్రేమ, విరహం, వేదన, ఆరాధన లాంటి ఎన్నో భావాలు ఆమె రచనల్లో ఎక్కువగా కనిపిస్తుంటాయి. అనేకమైన ఏకవాక్య కవితలు, దీర్ఘకవితలు, మనోహరమైన గజల్ గీతాల్ని రచించారు ఈమె. అనేక విషయాలపై ఈమె వ్రాసిన వ్యాసాలు వివిధ దేశ విదేశీ పత్రికలలో, అంతర్జాల పత్రికలలో ప్రచురితమయ్యాయి. విదేశాలలో ఉంటూ కూడా మాతృభాష మీద ఉన్న మమకారంతో తెలుగు సాహిత్య రచనలు చేస్తున్నారు. ఈమె 2015లో 'సిరిమల్లెలు' అనే సహస్ర ఏకవాక్య కవితల సంపుటి వెలువరించారు.