వడ్లకొండ అనిల్ కుమార్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వడ్లకొండ అనిల్ కుమార్
జననం జమ్మికుంట గ్రామం, హుజూరాబాద్ మండలం, కరీంనగర్ జిల్లా
వృత్తి గాయకుడు
మతం హిందూ
తండ్రి మొగిలయ్య,
తల్లి సుగుణమ్మ

వడ్లకొండ అనిల్ కుమార్' తెలంగాణకు చెందిన ప్రజా గాయకులలో ఒకరు. పాటకు కొత్త హొయలు అద్ది ప్రాణం పొసిన గాయకుడు.

జీవిత విశేషాలు[మార్చు]

అనిల్ కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలంలోని జమ్మికుంట గ్రామంలో. మొగిలయ్య, సుగుణమ్మ దంపతులకు జన్మించాడు. "బార్డర్ లో సైనికుడా భారత్ కు రక్షకుడా" అనే దేశభక్తి పాటతో వడ్లకొండ అనిల్ కుమార్ ప్రపంచానికి పరిచయం అయిండు. యం.కామ్. పూర్తి చేసిన అనిల్ చదువుకునేటప్పటి నుంచే తన గళానికి పదును పెట్టిండు. యన్ యస్ యస్ లో ఢిల్లీ రిపబ్లిక్ డే కు సెలక్టయిండు. ఆ అవకాశంతో ఢిల్లీ, వారణాసిలలో పాటలు పాడిండు. మలేషియా వంటి పరదేశాలలో కూడా తన గళమాధుర్యాన్ని వినిపించి, తన పాటలు ఖండాతంరాలను వ్యాపింపజేసిండు అనిల్.

మూలాలు[మార్చు]