Jump to content

వనపట్ల సుబ్బయ్య

వికీపీడియా నుండి
వనపట్ల సుబ్బయ్య
వనపట్ల సుబ్బయ్య


వ్యక్తిగత వివరాలు

జాతీయత భారతీయుడు
నివాసం నాగర్ కర్నూల్
మతం హిందూ

వనపట్ల సుబ్బయ్య ఉద్యమ కవి, రచయిత, విశ్లేషకులు, సాహితీకారుడు. ఆయన సృజనాత్మజ సాహిత్యం విభాగంలో తెలుగు విశ్వవిదయలయం 2014 కీర్తిపురస్కారాన్ని అందుకున్నారు.[1]

జీవిత విశేషాలు

[మార్చు]
స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా 2021లో హైదరాబాదులోని రవీంద్రభారతిలో జరిగిన ఆజాది కా కవి సమ్మేళన కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు డా. మామిడి హరికృష్ణ చేత సత్కారం అందుకుంటున్న వనపట్ల సుబ్బయ్య

ఆయన తెలంగాణ రాష్ట్రానికి చెందిన నాగర్ కర్నూలు మండలం లోని వనపట్ల గ్రామానికి చెందినవారు. అందువల్ల తన ఇంటిపేరు ఊరిపేరు అయింది. ఆయనది పేద కుటుబం. ఆయన ఎం.ఎ. చదివారు. ఆయన ఎల్లప్పుడు ఏదో ఒక విషయం పట్ల చర్చిస్తుంటాడు. గత కాలం సమీక్ష చేసుకుంటూ భవిష్యత్తులో ఏలాంటి ఉద్యమాలు చేయాలనే తపన ఆయనలో ఉంటుంది. ఎవరితోనైనా సమకాలీన సమాలోచనలు చేయడంలో ఆయన దిట్ట. ముఖ్యంగా దళిత, బహుజన, ఎస్సీ, ఎస్టీలే గాకుండా వెనకబడిన ప్రాంతాల పట్ల కూడా ఆయన తన రచనలో అభిప్రాయం వ్యక్తం చేస్తాడు. నాగర్‌కర్నూలు‌లో ఒక వేదిక ఏర్పాటు కావాలన్నా, సంఘం రూపుదిద్దుకోవాలన్నా, ఉద్యమం ఉధృతం కావాలన్నా సుబ్బయ్య సలహాలు సూచనలు తీసుకుంటారు. [2]

2017 ఉగాది కవి సమ్మేళనంలో సత్కారం అందుకుంటున్న వనపట్ల సుబ్బయ్య

ముందు సిపిఎం అనుబంధ సంఘంలో కొంతకాలం పనిచేసిన సుబ్యయ్య తర్వాతి కాలంలో వీరన్న పార్టీవైపు కొంత మొగ్గుచూపారు. కులవర్గ పోరాటాలు జమిలిగా నడపాలని ఆయన కాంక్షించారు. కాని అనతికాలంలోనే బడుగు బలహీన వర్గాల కోసం తన వంతు రచన కొనసాగించాలని సాహిత్యవైపు మళ్లారు. ఎంఏ వరకు చదివిన సుబ్బయ గ్రామ స్థాయి రాజకీయాల నుండి దేశ, విదేశీ విధానాల గురించి కూడా తన రచనలో చెబుతాడు. సరళీకరణ ఆర్థిక విధానాల వల్ల నేడు వామపక్షాలు కొంతవరకు నష్టపోయినా మునుముందు వారికే ప్రజల సహాయ సహకారాలు ఉంటాయని గుర్తు చేస్తున్నారు.[2]

రచనలు

[మార్చు]
2017 ఉగాది కవి సమ్మేళనంలో కవిత్వ పఠనం చేస్తున్న వనపట్ల సుబ్బయ్య

ఆయన వ్రాసిన "వొల్లెడ" సినారె పురస్కారాన్ని అందుకోగా, మశాల్‌[3] పై యూనివర్సిటీలలో పత్ర సమర్పణలు జరిగాయి. వనపట్ల సుబ్బయ్య కలం నుంచి జాలువారిన మరో దీర్ఘకవిత ఊర చెరువు ఈ దీర్ఘకవితలో రెండు భాగాలున్నాయి. మొదటిది చెరువు వలపోత కాగా రెండోది కవి తలపోత. వలపోతలో చెరువు తనకు పట్టిన దుస్థితిపై కుమిలిపోతూ తన వ్యథను మనకు చెప్పుకోగా, తలపోతలో కవి చెరువు ఏ విధంగా ఉంటే బాగుంటుందో తన అభిప్రాయాన్ని వ్యక్త పరిచాడు.[4][5]

మూలాలు

[మార్చు]
  1. 36 మందికి కీర్తి ఇపురస్కారాలు[permanent dead link]
  2. 2.0 2.1 "ప్రకృతిని ప్రేమిస్తే... అదే మనల్ని కాపాడుతుంది." నవతెలంగాణ-మహబూబ్‌నగర్‌ ప్రతినిధి. navatelangana. 27 May 2015. Retrieved 22 May 2016.
  3. ఉద్యమం సృష్టించిన గొప్ప వచన కవిత్వం -జయధీర్ 06/09/2014[permanent dead link]
  4. మిషన్ కాకతీయకు ఊపిరి..ఊర చెరువు 5/28/2015[permanent dead link]
  5. పోరుకు సైరనూదిన పాలమూరు..

ఇతర లింకులు

[మార్చు]
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.