Jump to content

వనిత (పత్రిక)

వికీపీడియా నుండి
వనిత
వనిత పత్రిక శీర్షిక
సంపాదకులుబి. విశ్వనాథరెడ్డి
వర్గాలుమహిళల పత్రిక
తరచుదనంపక్షపత్రిక (1975-1978 జూన్)
మాసపత్రిక (1978 జూలై -)
ప్రచురణకర్తచందమామ పబ్లికేషన్స్
మొదటి సంచిక1975
దేశంభారతదేశం
కేంద్రస్థానంమద్రాసు

వనిత, మహిళల కోసం ప్రచురితమైన పక్షపత్రిక. ఈ పత్రిక 1975 జూన్‌లో మొదలైంది.[1] పిల్ల పత్రిక చందమామను ప్రచురించిన చందమామ పబ్లికేషన్స్ వారు బి. విశ్వనాథరెడ్డి సంపాదకత్వంలో మద్రాసు నుండి ఈ పత్రికను వెలువరించారు. 1978 జూలై నుండి ఇది మాసపత్రికగా మారింది.

కథలు, సీరియళ్ళు, వంటలు, సౌందర్య సలహాలు, రచయిత్రులతో ముఖాముఖీ వంటి శీర్షికలతో పాటు వనిత మాటల కొలువు పేరుతో గళ్ళనుడికట్టు శీర్షికను కూడా నిర్వహించేవారు. పాఠకుల లేఖలలో రెండు రకాలుగా చేసేవారు "అభిప్రాయాలు" శీర్షిక కింద ప్రచురించే ప్రతి లేఖకూ 5 రూపాయలు పారితోషికం ఇచ్చేవారు. ఉత్తరాలు శీర్షిక కింద ప్రచురించేవాటికి బహుమతి ఉండేది కాదు.[2]

మూలాలు

[మార్చు]
  1. వనిత పత్రిక (1975). వనిత. p. 2.
  2. వనిత. 4. Vol. 1. మద్రాసు: చందమామ పబ్లికేషన్స్. 1978. p. 4.