వని వికసించెవిరి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఈ గీతాన్ని బెంగాలీలో విశ్వకవి రవీంద్రనాథ టాగూరు రచించి సంగీతం కూర్చగా మల్లవరపు విశ్వేశ్వరరావుగారు తెలుగులోకి అనువదించారు. దీన్ని బెంగాలీ మూలంలో గీతం యొక్క బాణీలోనే శ్రీమతి వక్కలంక సరళ పాడారు.

రాగం: మిశ్ర శంకరాభరణం (మిశ్ర బిలావల్)

తాళం: చతురశ్ర ఏక (కహరువా)

<poem>

వని వికసించెవిరి - పక్షి ఏల రాదోయ్ ఏల రాదోయ్ పక్షి - ఏ దూరాకాశము నుండి పిలుతు పిలుతునిటకు పక్షి - పక్షి ఏల రాదోయ్ ఏల రాదోయ్ పక్షి ॥

వాయువీచికలు మత్తిలి రేగే లేచివుళ్ళ నృత్యములు సాగెనోయ్ ఈ మధు గానాలాపన వేళా ఆ మాధుర్యమదేదోయ్ - పక్షి ఏల రాదోయ్ ఏల రాదోయ్ పక్షి ॥

విహ్వలమై హృదయహరమై పిల్చునదేమి స్వరమో సాగారపార వనతీరాన విడిచిరెవ్వరోదాని వృథాయెనా మధుమాసమిదే మరి మరి నాకై పిల్చునదేనోయ్ వ్యథావిలమ్మీ రేయిని పక్షి ఎలా మోసము చేసే పక్షి ఏల రాదోయ్ ఏల రాదోయ్ పక్షి ॥