వరం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వరం
జననం
వరలక్ష్మి

1995
వృత్తిగాయని
తల్లిదండ్రులుఉప్పలయ్య, కనకలక్ష్మీ
బంధువులుసారయ్య (అన్నయ్య)

వరలక్ష్మి, తెలంగాణ రాష్ట్రానికి చెందిన హాకీ క్రీడాకారిణి, జానపద, తెలుగు సినిమా గాయని. ఆమె ‘హమ్ తుమ్’ సినిమా ద్వారా గాయనిగా సినీరంగంలోకి అడుగుపెట్టి ఆర్ఎక్స్ 100, ఇస్మార్ట్ శంకర్, సీటీమార్, నారప్ప, విరాటపర్వం[1] సినిమాల్లోని పాటలు, బతుకమ్మ పాటలు, 200కుపైగా జానపదాలు గీతాలు పాడి గాయనిగా మంచి పేరు తెచ్చుకుంది.[2]

జననం, విద్యాభాస్యం

[మార్చు]

వరం తెలంగాణ రాష్ట్రం, మహబూబాబాద్‌ జిల్లా, కేసముద్రం మండలం, బేరువాడ గ్రామంలో జన్మించింది. ఆమె ఇంటర్మీడియట్ వరకు మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలో పూర్తి చేసి హైదరాబాద్‌లోని బేగంపేట ఉమెన్స్ కాలేజీల బిఎస్సి (బిజెడ్సి) చేసింది. ఉస్మానియా యూనివర్సిటీ Prof. G. Ram Reddy Centre for Distance Education లొ ఎంఏ ఇంగ్లిష్‌ పూర్తి చేసింది. ఆమె ఇంటర్‌లో హాకీ నేషనల్స్‌కీ ఎంపికైంది.

సినీ జీవితం

[మార్చు]

వరం 2012 సంవత్సరంలో ఇంటర్మీడియట్ పూర్తిచేసి డిగ్రీ చదవడానికి హైదరాబాద్‌కు వచ్చి గాయకుడు హేమచంద్ర తల్లి శశికళ మాస్టారు దగ్గర సంగీతం నేర్చుకుంది. ఆ క్రమంలో 2014లో సంగీత దర్శకుడు బోలే షావలీ సంగీత దర్శకత్వం వహించిన హమ్‌తుమ్ సినిమాలో పడే అవకాశం కల్పించాడు. ఆలా ఆమె గాయనిగా సినీరంగంలోకి అడుగు పెట్టి వీ6 చానల్ కోసం పాడిన బతుకమ్మ పాటలు 'మా బొట్టు బోనం'[V6 బోనాల పాట 2018], ‘కోలో కోలో కోల్‌ కొమ్మ పూసే కోల్‌’[2016 V6 బతుకమ్మ పాట], 'డోలు డోలు డోల్'[V6 బోనాల పాట 2017], పాటలు, చరణ్ అర్జున్ సంగీత దర్శకత్వంలో పాడిన 'సుక్కురారమ్‌ మహాలచ్చిమి' పాట ఆమెకు మంచి గుర్తింపును తీసుకువచ్చాయి. వరం 2017 సంవత్సరంలో 20 ఛానల్స్‌కు బతుకమ్మ పాటలు పాడింది.[3]

గాయనిగా

[మార్చు]

డబ్బింగ్ ఆర్టిస్టుగా

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Virata Parvam: Varam's vocals make Nagaadaarilo a soulful track". 123telugu.com (in ఇంగ్లీష్). 2022-06-02. Retrieved 2023-08-18.
  2. Eenadu (12 December 2021). "నా పాట.. నాన్న వరం". Archived from the original on 12 జనవరి 2022. Retrieved 12 January 2022.
  3. Namasthe Telangana (28 April 2021). "స్వరమే.. నా వరం". Archived from the original on 5 June 2022. Retrieved 5 June 2022.
  4. Namasthe Telangana (2 June 2022). "'విరాట‌ప‌ర్వం' నుంచి 'న‌గాదారిలో' సాంగ్ విడుద‌ల‌.. ఆక‌ట్టుకుంటున్న సోల్‌ఫుల్ ట్యూన్‌!". Archived from the original on 5 June 2022. Retrieved 5 June 2022.
  5. Mana Telangana (31 July 2018). "పాటలు పాడడమే వరం". Retrieved 5 June 2022. {{cite news}}: |archive-date= requires |archive-url= (help)[permanent dead link]
"https://te.wikipedia.org/w/index.php?title=వరం&oldid=3989828" నుండి వెలికితీశారు