వరంగల్ జిల్లా

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
  ?వరంగల్
తెలంగాణ • భారతదేశం
View of వరంగల్, India
అక్షాంశరేఖాంశాలు: 17°57′N 79°30′E / 17.95°N 79.5°E / 17.95; 79.5
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
విస్తీర్ణం 12,846 కి.మీ² (4,960 చ.మై)
ముఖ్య పట్టణము వరంగల్
ప్రాంతం తెలంగాణ
జనాభా
జనసాంద్రత
• మగ
• ఆడ
అక్షరాస్యత శాతం
• మగ
• ఆడ
35,22,644 (2011 నాటికి)
• 274/కి.మీ² (710/చ.మై)
• 1766257
• 1756387
• 58.41(2001)
• 70.01
• 46.54
హనుమకొండ పద్మాక్షి అమ్మవారి చిత్రము

వరంగల్ జిల్లా తెలంగాణ రాష్ట్రంలోని 10 జిల్లాలలో ఒకటి. ఇది రాష్ట్ర రాజధాని అగు హైదరాబాదునకు ఉత్తర దిశలో 157 కి.మి దూరంలో ఉన్నది. వరంగల్ జిల్లా కు ముఖ్య పట్టణం - వరంగల్. కాకతీయ విశ్వవిద్యాలయము కాకతీయ మెడికల్‌ కాలేజి, నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (పూర్వపు రీజినల్ ఇంజనీరింగ్ కాలేజ్), కాకతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్,కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మొదలైన ప్రముఖ విద్యా సంస్థలు వరంగల్లులో ఉన్నాయి. వరంగల్లు తెలంగాణ లో రెండో అతి పెద్ద నగరము. జనవరి 28, 2014న గ్రేటర్ (మహా నగరం ) గా మారింది.

జిల్లా చరిత్ర[మార్చు]

11వ శతాబ్దానికి చెందిన పార్శ్వనాధుని విగ్రహం (ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మ్యూజియం)

క్రీ.శ. 12 - 14 శతాబ్దాలలో పరిపాలించిన కాకతీయుల రాజ్యానికి వరంగల్ రాజధాని. కాకతీయుల నిర్మించిన ఎన్నో కట్టడాలు, పర్యాటక ప్రాంతాలు ఈ జిల్లాలో ఉన్నాయి. వరంగల్ కోట, వేయిస్థంభాల గుడి, రామప్ప దేవాలయము, పాకాల చెరువు లక్నవరం సరస్సు మొదలైనవి వీటిలో కొన్ని. కాకతీయుల పాలనా దక్షత గురించి ఇటలీ యాత్రికుడు మార్కోపోలో తన రచనలలో రాసాడు. కాకతీయ పాలకులు -కాకర్త్య గుండన , మొదటి ప్రోలరాజు (1050-1080) , రెండవ బేత రాజు (1080 - 1115) , రెండవ ప్రోల రాజు (1115-1158) , రుద్ర దేవుడు (1158-1195) , మహా దేవుడు (1195-1199) , గణపతిదేవ చక్రవర్తి (1199-1261), రుద్రమ దేవి (1258-1290), ప్రతాపరుద్రుడు ( 1290-1326).

14 వ శతాబ్దంలో ఢిల్లీ తుగ్లక్ సుల్తానుల చేతిలో ఓడిపోవడంతో కాకతీయుల పరిపాలన అంతమయింది. తరువాత అది ముసునూరి నాయకులు, రేచెర్ల నాయకులు, బహమనీ సుల్తానులు, గోల్కొండను పాలించిన దక్కను సుల్తానుల పాలన లోకి వచ్చింది. మొగలు చక్రవర్తి ఔరంగజేబు గోల్కొండను 1687 లో ఆక్రమించినపుడు అది మొగలు సామ్రాజ్యంలో భాగమయింది. తరువాత 1724లో ఈ సామ్రాజ్యం లోని దక్షిణ ప్రాంతం విడివడి హైదరాబాదు రాజ్యం ఏర్పడినపుడు వరంగల్లు ఆ రాజ్యంలో భాగమైంది. 1948లో వరంగల్లుతో సహా హైదరాబాదు భారత దేశంలో కలిసి పోయింది. 1956లో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటులో భాగంగా అవతరించిన ఆంధ్రప్రదేశ్‌లో ఉండి 2014లో తెలంగాణలో భాగమైంది.

పురావస్తు శాఖవారు ఈ మధ్యకాలంలో చారిత్రాత్మక కట్టడం అయిన వేయి స్తంభముల దేవాలయాన్ని మరమత్తు చేయడానికి పూనుకొన్నారు. అయితే వారు జరిపిన త్రవ్వకాలలో ఒక విస్మయం చెందే విషయం బయటపడినది. ఉత్తరం దిక్కుగా ఉన్న ఆలయం క్రింద ఒక నీటితొ నిండిన బావి బయటపడినది. ఉపరితలం నుండి సుమారు 3-4 మీటర్ల లోతున ఈ బావి ఉంది. అంతేకాకుండా కట్టడం క్రింద అనగా పునాది క్రింద మొత్తం ఇసుకతో ఉండడం మరొక విషయం. ఆకాలం నాటి సాంకేతిక పరిజ్ఞానానికి నిదర్శనం. ఇలా పునాది క్రింద మొత్తం ఇసుకతో కట్టడానికి భూకంపాలనుండి రక్షించడానికి అని కొంతమంది శాస్త్రజ్ఞుల అభిప్రాయం. ఈ విషయం మీద పురావస్తు శాఖ ఇంకా తన పరిశోధన కొనసాగిస్తుంది.

1969లో తెలంగాణా ప్రజలు రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయం జరుగుతున్నట్లు మిగిలిన ఆంధ్రరాష్ట్ర ప్రజలపట్ల చూపుతున్న శ్రద్ధ తమ పట్ల చూపకుండా పక్షపాత దృష్టితో వ్యవహరిస్తున్నట్లు తలచారు. ఫలితంగా ప్రత్యేక తెలంగాణా ఉద్యమం తలెత్తింది. ఈ ఉద్యమం కారణంగా వరంగల్ జిల్లాలో విషాదపరిస్థితిని ఎదుర్కొన్నది. ఇలాంటి పరిస్థితిలో డాక్టర్ మర్రి చెన్నారెడ్డి నాయకత్వంలో తెలంగాణా ప్రజా సమితి (టి పి ఎస్) పార్టీ స్థాపించబడింది. 1956లో నిర్ణయించిన విధంగా ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం కావాలని ఇతరనాయకులు కూడా తమ కోరికను వెలిబుచ్చారు. వరంగల్ జిల్లా ప్రజలు ఈ ఉద్యమానికి పక్కబలంగా నిలిచారు. విద్యార్దులు, ప్రభుత్వోద్యోగులు, వ్యవసాయదారులు అందరూ ఉద్యమంలో పాలుపంచుకున్నారు. 400 కంటే అధికమైన విద్యార్ధులు ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయారు. విద్యార్ధులు ఒక విద్యాసంవత్సరం కోల్పోయారు.

భౌగోళిక స్వరూపం[మార్చు]

వరంగల్ జిల్లా 12,846 చ.కి.మీ.లలో వ్యాపించి 32,31,174 (2001 లెక్కలు) జనాభా కలిగి ఉంది. బొగ్గు మరియు గ్రానైటు గనులకు (నలుపు, బ్రౌను రకాలు) జిల్లా ప్రాముఖ్యత చెందింది. వరి, మిరప, పత్తి మరియు పొగాకు పంటలు విరివిగా పండుతాయి.

వాతావరణం[మార్చు]

గాలిలోని తేమశాతం సగం మాత్రమే ఉండే తెలంగాణా భూభాగంలో ఉన్న కారణంగా వరంగల్ వాతావరణం వేడివాతావరణం కలిగి ఉంటుంది. మార్చ్ మాసంలో ఆరంభం అయ్యే వేసవి కాలం మే మాసానికి 42 °(108 ° ఫారెన్ హీట్ ) సెంటీగ్రేడుల శిఖరాగ్రం చేరుకుంటుంది. జూన్ మాసానికంతా ఆరంభం అయ్యే వర్షాలు సెప్టేంబర్ వరకు కురుస్తుంటాయి. వర్షపాతం 22 మిల్లీమీటర్ల (22 అంగుళాలు)వరకు కురుస్తుంది. నవంబర్ మాసం నుండి మంచుకురవని తేమలేని స్వల్పమైన శీతాకాలం ఆరంభం అయి ఫిబ్రవరి మాసం ఆరంభం వరకు ఉంటుంది. శీతాకాలం సరసరి ఉష్ణోగ్రత 22-23 ° సెంటీగ్రేడులు (72-73 ఫారెన్ హీట్ )వరకు ఉంటుంది. వరంగల్ జిల్లా సందర్శనానికి ఇది తగిన సమయం. వరంగల్ జిల్లా సముద్రమట్టానికి 302 మీటర్ల (990 అడుగులు)ఎత్తులో ఉంటుంది. భారతదేశంలోని భూపర్యవేష్టిత జిల్లాలలో ఇది ఒకటి. అలాగే అటవీ ప్రాంతం అధికంగా ఉన్న జిల్లాలలో కూడా ఇది ఒకటి.

ఆర్ధిక స్థితి గతులు[మార్చు]

వరంగల్లు లో ఒక వీధి

వరంగల్ ఆర్ధికంగా వ్యవసాయం మీద ఆధాపడి ఉంది. వరంగల్ సమీపంలో దేశాయిపేట వద్ద ఉన్న ఎనుమాముల గ్రామం వరంగల్ జిల్లా ధాన్యపు వాణిజ్య కేంద్రంగా ఉంది. ఈ ప్రాంతం బియ్యపు వ్యాపారానికి ప్రధాన కేంద్రం. ప్రాంతీయ అవసరాలకు మరియు వెలుపలి వాణిజ్యానికి అవసరమైన బియ్యం వ్యాపారం ఇక్కడ ప్రధానంగా జరుగుతుంది. 1990 వరకు ఈ ప్రాంతంలో పత్తి ఉత్పత్తి ప్రధానంగా జరిగింది. ఇటీవలి కాలంలో పత్తి ఉత్పత్తిలో సమస్యలు ఎదురైయ్యాయి. ఈ జిల్లాలో 1997-1998 మధ్య పత్తిరైతుల ఆత్మహత్యలు అత్యధికంగా నమోదు అయ్యాయి. ప్రస్థుత ప్రభుత్వం ఈ జిల్లాలో పరిశ్రమలకు ముఖ్యత్వం ఇవ్వడంలో శ్రద్ధవహించ లేదు. నిజాం కాలం నుండి సాగుతున్న కొన్ని పరిశ్రమలు మాత్రమే ఉన్నాయి. అజం జాహి క్లోత్ మిల్లు మూతపడింది. జిల్లాలో చిన్నతరహా పరిశ్రమలు మాత్రం నడుస్తున్నాయి. రెండవ స్థాయి నగరాలు సాంకేతిక రంగంలో జరుగుతున్న విప్లవాత్మక ఫలాలని అందునే ప్రయత్నంగా సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా (ఎస్ టి పి ఐ)వరంగల్ జిల్లాలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ స్థాపించాలని అనుకుంటున్నారు. చక్కని ప్రయాణ వసతులు, నాణ్యమైన విద్యాసంస్థల నుండి విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్ధులు, మంచి భవనవసతులు, తక్కువగా ఉన్న వాహనాల రద్దీ మరియు హైదరాబాదుకు అందుబాటు దూరంలో ఉన్న కారణంగా వరంగల్ ఇందుకు తగి ఉన్నది. విదేశాలలో స్థిరపడిన ప్రవాసభారతీయుల నుండి ఈ జిల్లాకు విదేశీ పెట్టుబడులు అందుతున్నాయి.

డివిజన్లు లేదా మండలాలు, నియోజక వర్గాలు[మార్చు]

భౌగోళికంగా వరంగల్ జిల్లాను 51 రెవిన్యూ మండలములుగా విభజించినారు.[2]

వరంగల్ జిల్లా మండలాలు
సంఖ్య పేరు సంఖ్య పేరు సంఖ్య పేరు
1 చేర్యాల 18 తొర్రూర్ 35 దుగ్గొండి
2 మద్దూర్ 19 నెల్లికుదురు 36 గీసుకొండ
3 నర్మెట్ట 20 నర్సింహులపేట 37 ఆత్మకూరు
4 బచ్చన్నపేట 21 మరిపెడ 38 శాయంపేట
5 జనగాం 22 డోర్నకల్ 39 పరకాల
6 లింగాల ఘనా‌‌పూర్‌ 23 కురవి 40 రేగొండ
7 రఘునాథపల్లి 24 మహబూబాబాద్‌ 41 మొగుళ్ళపల్లి లొ
8 స్టేషన్‌ ఘనా‌పూర్‌ 25 కేసముద్రం 42 చిట్యాల
9 ధర్మసాగర్‌ 26 నెక్కొండ 43 భూపాలపల్లి
10 హసన్‌పర్తి 27 గూడూరు 44 ఘనపూర్‌
11 హనుమకొండ 28 కొత్తగూడెం 45 ములుగు
12 వర్ధన్నపేట 29 ఖానాపూర్‌ 46 వెంకటాపూర్‌
13 జాఫర్‌గఢ్‌ 30 నర్సంపేట 47 గోవిందరావుపేట
14 పాలకుర్తి 31 చెన్నారావుపేట 48 తాడ్వాయి
15 దేవరుప్పుల 32 పర్వతగిరి 49 ఏటూరునాగారం
16 కొడకండ్ల 33 సంగెం 50 మంగపేట
17 రాయిపర్తి 34 నల్లబెల్లి 51 వరంగల్

పడమర వరంగల్[మార్చు]

2014 తెలంగాణ శాసనసభ ఎన్నికల ఫలితాలు తెలిపే పటము
 • 2010 అసెంబ్లీ ఉప ఎన్నికలలో దాస్యం వినయ భాస్కర్ 74.85% శాతం ఓట్లతో విజయం సాధించారు.
 • 2009 అసెంబ్లీ ఎన్నికలలో దాస్యం వినయభాస్కర్ 39.64% శాతం ఓట్లతో విజయం సాధించారు.

తూర్పు వరంగల్[మార్చు]

 • 2009 అసెంబ్లీ ఎన్నికలలో బసవరాజు సారయ్య 32.66% శాతం ఓట్లతో విజయం సాధించారు.

2014 అస్సెంప్ల్య్ ఎన్నికలొ కొంద సురెఖ విజయం సాదించరు.

ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఈ జిల్లాను పరిపాలన దృశ్యా విభజించాలి అనే ఆలోచనతో ఉన్నది[మార్చు]

రవాణా వ్వవస్థ[మార్చు]

వరంగల్ నగర శివార్లలో ఈశాన్యంలో ఉన్న మామ్నూరు గ్రామం వద్ద వరంగల్ ఖమ్మమ్ రహదారిలో వాయుసేన గ్లైడర్ శిక్షణా కేంద్రంగా ఉపయోగపడుతుంది. నిజాం నవాబు కాగజ్ నగర్ పేపర్ మిల్లు మరియు అజం జాహీ మిల్లుకు చేరడానికి అనుగుణంగా నిర్మించబడిన ఈ విమానాశ్రయం 1947 వరకు దేశంలోనే పెద్ద విమానాశ్రయంగా ఉంటూ వచ్చింది. సమీపంలో ఉన్న విమానాశ్రయం వరంగల్ పట్టణానికి 160 కిలోమీటర్ల దూరంలో హైదరాబాదులో ఉన్న రాజీవ్ గాంధీ విమానాశ్రయం.

రైలు[మార్చు]

ఖాజీపేట రైల్వే జంక్షన్ ముఖద్వారమ్

వరంగల్ రైలు మార్గం ద్వారా భారతదేశంలోని అనేక ప్రముఖ నగరాలతో అనుసంధానించబడింది. ఇది భారతీయ రైల్వేలో దక్షిణ మధ్య రైల్వే విభాగానికి చెందినది. వరంగల్‌కు సమీపంలో 13 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖాజీపేట రైల్వే జంక్షన్ ఉంది. ఇది హైదరాబాదు, న్యూ ఢిల్లీ, విజయవాడ, చెన్నై మరియు కొలకత్తా రైలు మార్గంలో ప్రముఖ రైలు కూడలి (రైలు జంక్షన్)ఖాజీపేట రైల్వే జంక్షనే. వరంగల్ రైలు స్టేషను హైదరాబాద్, విజయవాడ, చెన్నై రైలు మార్గంలో ఉంది. ప్రతి రోజు ఈ స్టేషను ద్వారా గూడ్స్ రైళ్ళు కాక 132 రైళ్ళు దాటి వెళుతుంటాయి. దేశంలో రైలు స్టేషనులలో పెద్ద రైలు స్టేషనులలో వరంగల్ రైలు స్టేషను ఒకటి.

రోడ్డు[మార్చు]

హైదరాబాదు నుండి భోపాలపట్నం వరకు వేస్తున్న జాతీయరహదారి 202 నిర్మాణదశలో ఉంది. ఈ రహదారిలో వరంగల్ నుండి పోతుంది. వరంగల్ మరియు హనుమకొండ వద్ద రెండు ప్రధాన బస్సు స్టాండ్లు ఉన్నాయి. వరంగల్ నుండి దూరప్రాంతాలకు వెళ్ళే డీలక్స్ బస్సులు బెంగుళూరు, మద్రాసు, హైదరాబాదు, తిరుపతి, అనంతపూరు, హుబ్లి మరియు బెల్గాం లకు ఉన్నాయి. అలాగే స్టాండెడ్ ఎక్ష్ప్రెస్స్ బస్సులు గుంటూరు వయా విజయవాడ, చెన్నై, చెరియల్ మార్గంలో వరంగల్6ను చేరుకుంటాయి.

జనాభా లెక్కలు[మార్చు]

1981 నాటి జనాభా లెక్కల ప్రకారం ఈ జిల్లా జనాభా: 22,99,61, స్త్రీ,పురుషుల నిష్పత్తి... 987:1000, అక్షరాశ్యత...23.84 శాతం (మూలం: ఆంధ్రాప్రదేశ్ దర్శిని. 1985) 2011 భారతీయ జనాభా గణాంకాలను అనుసరించి వరంగల్ జిల్లా జనాభా 759,594. వీరిలో పురుషుల శాతం 51%. స్త్రీల శాతం 49%. 2001 గణాంకాల ప్రకారం వరంగల్ జిల్లాఅక్షరాస్యత 84.16%. ఇది జాతీయక్షరాస్యత 69.5% కంటే అధికం. వీరిలో పురుషుల అక్షరాస్యత శాతం 91.54%. స్త్రీల అక్షరాస్యత 76.79%. వరంగల్ జిల్లాలో 6 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న వారి శాతం 11%.

సంస్కృతి[మార్చు]

వరంగల్ జిల్లాలో ప్రజలు అధికంగా తెలుగు భాషను మాట్లాడుతుంటారు. వరంగల్ ప్రజలు సంప్రదాయమైన చీరె మరియు ధోవతి వంటి దుస్తులతో అధునిక వస్త్రాలను కూడా ధరిస్తుంటారు. జిల్లాలో ప్రతీ రెండేళ్ళ కొకసారి జరిగే సమ్మక్క-సారక్క జాతరకు 90 లక్షల మందికి పైగా యాత్రికులు వస్తారు. వరంగల్లుకు 90 కి.మీ ల దూరంలో గల మేడారం గ్రామం వద్ద జరిగే ఈ జాతర అధర్మ చట్టాన్ని ఎదిరించి పోరాడిన ఒక తల్లీ, కూతురుల ప్రతిఘటనకు స్మృత్యర్ధం జరుగుతుంది.చిన్న గ్రామమైన మేడారం వద్ద తాత్కాలిక నివాసాలను ఏర్పాటు చేసుకుని భక్తులు జంపన వాగు వద్ద కూడి ఈ జాతర జరుపుకుంటారు. వరంగల్ నుండి 90 కిలోమీటర్ల దూరంలో జరిగే ఈ జాతర గిరిజన తెగలలో జరిగే అతి పెద్ద పండుగగా భావించబడుతుంది. ఈ జాతర కుంభమేళా తరువాత ఆసియాలో జరిగే అతి పెద్ద ప్రజాకూడికగా భావించబడుతుంది.

వరంగల్ జిల్లా నుండి అత్యధికంగా యువత విదేశాలలో పని చేస్తున్నారు. ప్రధానంగా అమెరికా వంటి దేశాలలో అధికంగా పని చేస్తున్నారు. అత్యధికంగా సాఫ్ట్‌వేర్ రంగంలో పని చేస్తున్న వారే. అనేకంగా ప్రతి ఇంట్లో విదేశాలలో నివసిస్తున్న సభ్యులు ఉన్నారు. యువతలో అధికులు సాంకేతిక రంగంలో నైపుణ్యం ఉన్న కారణంగా ఐ టి సంస్థలు ఇక్కడ తమ శాఖలను స్థాపించడానికి ఉత్సుకత చూపుతున్నారు.

పశుపక్ష్యాదులు[మార్చు]

తెలంగాణలోని ఇతర జిల్లాల్లోలాగే ఈ జిల్లాలో కూడా పశుపక్ష్యాదులు సమృద్థిగానే ఉన్నాయి.

విద్యాసంస్థలు[మార్చు]

వరంగల్ జిల్లాలో దేశంలో ఉత్తమమైనవిగా గుర్తింపు పొందిన విద్యాసంస్థలు ఉన్నాయి. వరంగలు తెలంగన జిల్లాలలో 2 ఉంది. 1959లో పండిత జవహర్లాల్ నెహ్రుచే పునాది రాయి స్థాపించబడిన నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, వరంగల్ (పాత పేరు ఆర్.ఇ.సి వరంగల్)మరియు కాకతీయ మెడికల్ కాలేజీ ఉంది. ఎన్ ఐ టి భారతదేశం అంతా చక్కగా అభివృద్ధి చెందింది. వరంగల్ నిట్ (ఎన్ ఐ టి) దేశంలో అత్యుత్తమమైనదిగా భావిస్తున్నారు. 1959 లో దీనిని స్థాపించినప్పటి నుండి ఇక్కడ శిక్షణ పొందిన విద్యార్ధులు అనేకులు దేశ విదేశాలలో వున్నారు. ఈ సంస్థ దేశం మొత్తం నుండి ప్రతిభావంతులని అనేక మందిని ఆకర్షిస్తుంది.

ఆకర్షణలు[మార్చు]

 • ఓరుగల్లు కోట: 13వ శతాబ్దంలో నిర్మించబడిన ఓరుగల్లు కోట వరంగల్ పట్టణానికి 2 కి.మీ. ల దూరములో ఉన్నది.
 • వేయి స్థంభాల గుడి: 11వ శతాబ్దంలో కాకతీయ వంశానికి చెందిన రుద్రదేవునిచే చాళుక్యుల శైలిలో నిర్మించబడి కాకతీయ సామ్రాజ్య కళాపిపాసకు మచ్చుతునకగా భావితరాలకు వారసత్వంగా మిగిలిన వేయి స్తంభాల గుడి వరంగల్ నుండి సుమారు 5 కి.మీ. దూరంలోనూ హనుమకొండ నగరం నడిబొడ్డున కలదు.
 • రామప్ప దేవాలయము : ప్రసిద్థిగాంచిన ఈ దేవాలయం పాలంపేటలో ఉంది.
 • పాకాల సరస్సు: 1213 సంవత్సరంలో కాకతీయ రాజు గణపతి దేవుడు 30 చదరపు కి.మీ విస్తీర్ణములో ఈ సరస్సును త్రవ్వించాడు. ఖానాపురం మండలంలోని ఈ ప్రదేశము ఇప్పుడు పర్యాటకులకు చాలా నేత్రానందం కలిగిస్తున్నది. ఈ చెఱువు ఒడ్డున పాకాల వన్యప్రాణి సంరక్షణ కేంద్రం 839 చదరపు కి.మీ విస్తీర్ణంలో ఉన్నది. ఇక్కడ దట్టమైన అడవులు మరియు జంతుసంపద ఉన్నది.
 • వన విజ్ఞాన కేంద్రం : వన విజ్ఞాన కేంద్రం తెలంగాణ అటవీ శాఖ వారి ఆధ్వర్యములో సామాన్య ప్రజానీకానికి వన్య సంరక్షణ గురించి తెలుపడానికి ఏర్పాటు చేయబడినది. ఈ విజ్ఞాన కేంద్రాన్ని ప్రతి రోజు 500 మంది వరకు సందర్శకులు సందర్శిస్తుంటారు. 50 ఎకరాల విస్తీర్ణములో విస్తరించి ఉన్న ఈ విజ్ఞాన కేంద్రం, వరంగల్ హంటర్ రోడ్ వద్ద ఉన్నది.
 • కొమురవెల్లి మల్లన్న స్వామి దేవాలయం : సిద్ధిపేట నుండి సికిందరాబాదు వెళ్ళే మార్గంలో సిద్ధిపేటకు 10 కి.మీ దూరంలో ఉన్న కొమురవెల్లి మల్లన్న స్వామి దేవాలయం చాలా ప్రసిద్ధి చెందింది..
 • భద్రకాళి దేవాలయము: వరంగల్ నగరం నడిబొడ్డున కొలువైవున్న శ్రీ భద్రకాళి అమ్మవారు భక్తుల పాలిట కొంగుబంగారమై విల్లసిల్లుతున్నారు. అందమైన మరియు ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రక్కన భద్రకాళి చెరువు, గుడి వెనుక అందమైన తోటలతో శోభయమయంగా వెలుగొందుతున్న ప్రముఖ దేవాలయం ఇది.

ఐనవోలు మల్లన్న స్వామి దేవాలయం : వర్ధన్నపేట మండలంలోని ఐనవోలులో ఈ దేవాలయం ఉంది. పశ్చిమ చాళుక్య చక్రవర్తి, త్రిభువన మల్ల బిరుదాంకితుడైన ఆరవ విక్రమాదిత్యు( క్రీ .శ. 1076-1127) ని మంత్రి అయిన అయ్యనదేవుడు ఈ ఆలయాన్ని కట్టించాడు.

క్రీడలు[మార్చు]

ప్రముఖవ్యక్తులు[మార్చు]

భాగవతమును సంస్కృతం నుండి తెనిగించిన బమ్మెర పోతన వంటి కవులకు ప్రసిద్ధి చెందింది. అలాగే పాల్కురికి సోమనాథుడు ,విద్యానాథుడు , మరియు ఆధునిక కవి అయిన కాళోజి నారాయణ రావు ,ప‌సునూరి ర‌వీంద‌ర్‌, కలామ్-ఏ షాద్ కాళోజీ రామేశ్వర్ రావు , వంటి కవులు వరంగల్ వాసులే. భారత ప్రధానమంత్రి గా పనిచేసిన పి.వి.నరసింహారావుఈ జిల్లా వారే.

బయటి లింకులు[మార్చు]

గ్రామ జనాభా[మార్చు]

http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=09

మూలాలు[మార్చు]

2008 youthforindia.org team india youth team paticipated health care biomedicaal bioinformatics project at orugallu technology services web site www.warangalinfo.co.in with team youth university faculties india at hanamkonda,warangal city

edited warangal info by 2015-2016 -orugallu technology educaiton and technology services web site hanamkonda,Warangal-Telangana-India orugallu Technology -

Anchuri Gopal Guptha -hanamkonda,Warangal- (Anchuri Gopal Guptha -Assistant Proffessor Comptuier Science affilaite(private) colleges

kakaitya univeristy,hanamkonda,Warangal city in hanamkonda,Warangal at kakatiya univeristy -Warangal -Telangana-India- Master of Philosiophy Computers Guide and software engieering services oruallu technology services web site www.warangalinfo.co.in A.Gopal - Anchuri Gopal Guptha Founder 2008 orugallu Technology services and Software eingeer -Assitatn proffessro Computers-Oriugallu Technology services in year 2008 at hanamkonda,Warangal-city-India <A href="http://www.warangalinfo.co.in">ORUGALLU TECHNOLOGY INDIA TECHNOLOGY SERVICES WEB SITE -WARANGAL-INDIA</A>

 1. 2009 నియోజకవర్గాల పునర్విబజన ద్వారా ఏర్పడినవి [1].
 2. పంచాయత్ రాజ్ మంత్రిత్వ శాఖ వెబ్‌సైటులో వరంగల్ జిల్లా తాలూకాల వివరాలు. జూలై 28, 2007న సేకరించారు.