వరంగల్ మ్యూజియం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వరంగల్ మ్యూజియం
Warangal Museum.jpeg
Established1991
Locationవరంగల్, తెలంగాణ, భారతదేశం

వరంగల్ మ్యూజియం, తెలంగాణ రాష్ట్రం, వరంగల్‌లోని మ్యూజికల్ గార్డెన్ కాంప్లెక్స్‌లో ఉన్న మ్యూజియం.[1] కాకతీయుల కాలం నాటి కళాఖండాలను భద్రపరిచి, ప్రజలకు అందుబాటులో ఉంచేందుకు ఈ మ్యూజియం ఏర్పాటు చేయబడింది. ప్రస్తుతం ఇది భారత పురాతత్వ సర్వే సంస్థ నిర్వహణలో ఉంది.

చరిత్ర[మార్చు]

1985లో వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ పక్క స్థలంలో ప్లానిటోరియం మార్గంలో ఈ మ్యూజియంను ఏర్పాటు చేశారు. అప్పటి గవర్నర్ శంకర్ దయాల్ శర్మ ఈ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశాడు. పూర్తయిన మ్యూజియం భవనాన్ని 1987లో అప్పటి ముఖ్యమంత్రి నేదురుమల్లి  జనార్దనరెడ్డి ప్రారంభించాడు. కోట సమీపంలో 2015, జనవరిలో అప్పటి పర్యాటక శాఖ మంత్రి ఎ. చందూలాల్ కొత్త మ్యూజియం భవనానికి శంకుస్థాపన చేశాడు.[2]

సేకరణలు[మార్చు]

ఈ మ్యూజియంలో హిందూ, బౌద్ధ, జైన మతాలకు చెందిన శిల్పాల సేకరణ ఉంది. పెద్ద నంది, పాలరాతి బుద్ధుడు, చాముండాలతోపాటు అనేక శైవ శిల్పాలు ఉన్నాయి. 11వ శతాబ్దపు పార్శ్వనాథ చిత్రం, 12వ శతాబ్దపు వీరభద్ర చిత్రం నుండి షణ్ముఖ లేదా స్కందను కూడా కలిగి ఉంది. ఇందులో పురాతన నాణేలు, కుండల ముక్కల సేకరణ కూడా ఉంది. సూర్యాపేట జిల్లాలోని పిల్లలమర్రి వద్ద 13వ శతాబ్దపు దేవాలయాలతోసహా ఆ ప్రాంతంలోని కాకతీయ ఆలయ ప్రదేశాలను ఇది వివరిస్తుంది.

శిల్పాలు, సరస్వతి, గణపతి విగ్రహాలతో పాటు 300 నాణేలు, చోళులు, చాళక్యులు, కాకతీయులు ఉపయోగించిన వస్తువులు, వంట గిన్నెలు, మట్టి పాత్రలు, ఏడు పడగల సర్పం పడగ విప్పి నిలబడిన భంగిమలో విగ్రహాలు, సమకాలీన చిత్రాలు, కాంస్యాలు, ఆయుధాలు, పశ్చిమ చాళుక్యులు, కాకతీయులకు చెందిన శిల్పాలు, శాసనాలు, తాళపత్ర రాతప్రతులు, గారలు, బిడ్రివేర్, నాణేలు, టెర్రకోట, చైనావేర్, ఎనామెల్‌వేర్‌లు, ఎపిగ్రాఫ్‌లు, రాగి ప్లేట్లు, గ్రాంట్లు ఉన్నాయి.[3] మ్యూజియంలోని గ్రంథాలయంలో వరంగల్ పాలకుల చరిత్రకు సంబంధించిన సమాచారంతో పాటుగా దాదాపు 3,000 పుస్తకాలు ఉన్నాయి.

ఇతర వివరాలు[మార్చు]

  • ఈ మ్యూజియంను చూసేందుకు రాష్ట్రంలోని పలు జిల్లాలతోపాటు దేశ, విదేశాల నుంచి పర్యాటకులు వస్తుంటారు.
  • సందర్శకుల సంఖ్య పెరగడంవల్ల పాత భవనం కాకుండా వరంగల్ కోటలో కొత్త భవనం నిర్మాణం చేయాలని ప్రభుత్వం నిర్ణయించి, 3 కోట్ల 50 లక్షలు మంజూరు చేసింది.

మూలాలు[మార్చు]

  1. ASI Museum Warangal
  2. Deccan Chronicle, Telangana (21 May 2017). "Telangana: Museum in state of neglect" (in ఇంగ్లీష్). Anudeep Ceremilla. Archived from the original on 15 January 2018. Retrieved 18 September 2021.
  3. Telangana Heritage, Warangal. "Warangal District Archaeological Museum". www.heritage.telangana.gov.in. Archived from the original on 17 July 2021. Retrieved 18 September 2021.