వరంగల్ రెవెన్యూ డివిజను
వరంగల్ రెవెన్యూ డివిజను | |
|---|---|
ఎగువ నుండి సవ్యదిశలో: గోవిందరాజుల కొండ, కాకతీయ విశ్వవిద్యాలయం, వరంగల్ కోట, వెయ్యి స్తంభాల దేవాలయం, కాకతీయ కళా తోరణం నగర వీక్షణ దృశ్య చిత్రాలు | |
| దేశం | భారతదేశం |
| రాష్ట్రం | తెలంగాణ |
| జిల్లా | వరంగల్ |
వరంగల్ రెవెన్యూ డివిజను, తెలంగాణ రాష్ట్రం, వరంగల్ జిల్లాలోని ఒక పరిపాలనా విభాగం. వరంగల్ జిల్లాలోవున్న రెండు రెవెన్యూ డివిజన్లలో ఇది ఒకటి. ఈ డివిజను పరిపాలనలో 7 మండలాలు ఉన్నాయి.[1] ఈ డివిజను ప్రధాన కార్యాలయం వరంగల్ పట్టణంలో ఉంది. 2016, అక్టోబరు 11న రాష్ట్రంలోని జిల్లాల పునర్వ్యవస్థీకరణ ఆధారంగా రెవెన్యూ డివిజను పరిధి సవరించబడింది.[2] ఈ రెవెన్యూ డివిజను వరంగల్ లోక్‌సభ నియోజకవర్గం, వరంగల్ శాసనసభ నియోజకవర్గాల పరిధిలో భాగంగా ఉంది.
వివరాలు
[మార్చు]ఐఏఎస్ క్యాడర్‌లో సబ్ కలెక్టర్ లేదా డిప్యూటి కలెక్టర్ హోదాలో ఉన్న రెవెన్యూ డివిజనల్ అధికారి ఈ రెవెన్యూ విభాగానికి ఆఫీసర్ గా ఉంటాడు. తహశీల్దార్ కేడర్‌లోని అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పరిపాలనలో సహాయం చేస్తాడు. కలెక్టరేట్, మండల రెవెన్యూ విభాగాల మధ్య అనుసంధానంగా ఈ డివిజను పరిపాలనా వ్యవహారాలలో పనిచేస్తుంటుంది.[3]
పరిపాలన
[మార్చు]వరంగల్ డివిజనులోని మండలాలు:[4]
| క్ర.సం | మండలాలు | రెవెన్యూ గ్రామాలు |
|---|---|---|
| 1 | వరంగల్ మండలం | 8 |
| 2 | ఖిలా వరంగల్ మండలం | 11 |
| 3 | సంగెం మండలం | 17 |
| 4 | గీసుగొండ మండలం | 16 |
| 5 | వర్ధన్నపేట మండలం | 12 |
| 6 | పర్వతగిరి మండలం | 14 |
| 7 | రాయపర్తి మండలం | 18 |
మూలాలు
[మార్చు]- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 224 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "District Census Handbook - Krishna" (PDF). Census of India. pp. 14–17. Retrieved 2022-05-13.
- ↑ "List of Revenue Divisions, Mandals in Warangal District". TeachersBadi. 2022-03-01. Archived from the original on 2021-05-15. Retrieved 2022-05-13.
- ↑ "వరంగల్ గ్రామీణ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2022-01-06. Retrieved 2022-05-13.