వరుణ్ చక్రవర్తి
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | వరుణ్ చక్రవర్తి వినోద్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | బీదర్, కర్ణాటక, భారతదేశం | 1991 ఆగస్టు 29|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
ఎత్తు | 1.85 మీ. (6 అ. 1 అం.) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడి చేయి లెగ్ బ్రేక్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | బౌలర్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి T20I (క్యాప్ 87) | 2021 25 జూలై - శ్రీలంక తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి T20I | 2025 2 ఫిబ్రవరి - ఇంగ్లాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
T20Iల్లో చొక్కా సంఖ్య. | 29 | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2018–ప్రస్తుతం | తమిళనాడు | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2019 | కింగ్స్ ఎలెవన్ పంజాబ్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2020–ప్రస్తుతం | కోల్‌కతా నైట్ రైడర్స్ (స్క్వాడ్ నం. 29) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: ఈఎఎస్పిఎన్, 2 ఫిబ్రవరి 2025 |
వరుణ్ చక్రవర్తి వినోద్ (జననం 29 ఆగస్టు 1991) భారతదేశానికి చెందిన అంతర్జాతీయ క్రికెటర్. ఆయన దేశీయ క్రికెట్లో తమిళనాడు తరపున, ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ తరపున లెగ్ స్పిన్ బౌలర్‌గా ఆడుతున్నాడు. వరుణ్ చక్రవర్తి జూలై 2021లో భారత క్రికెట్ జట్టు తరపున అంతర్జాతీయంగా అరంగేట్రం చేశాడు.[1][2][3]
వరుణ్ చక్రవర్తి 2025లో ఇంగ్లండ్‌తో స్వదేశంలో జరిగిన టీ20 సిరీస్‌లో 14 వికెట్లు తీసి ఓ ద్వైపాక్షిక టీ20 సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన స్పిన్నర్‌గా రికార్డుకెక్కాడు.[4]
వ్యక్తిగత జీవితం
[మార్చు]వరుణ్ చక్రవర్తి వినోద్ 29 ఆగస్టు 1991న కర్ణాటకలోని బీదర్‌లో జన్మించాడు. ఆయన చెన్నైలోని కేంద్రీయ విద్యాలయ CLRI లో పాఠశాల విద్యను ఆ తర్వాత ఎస్ఆర్ఎం విశ్వవిద్యాలయం నుండి ఆర్కిటెక్చర్లో బ్యాచిలర్ డిగ్రీ పొందాడు. వరుణ్ చక్రవర్తి సెయింట్ పాట్రిక్స్ ఆంగ్లో ఇండియన్ హయ్యర్ సెకండరీ స్కూల్లో క్రికెట్ ఆడాడు. ఆయన 25 సంవత్సరాల వయసులో క్రికెట్‌ను వృత్తిపరంగా కొనసాగించడానిక ఆర్కిటెక్ట్‌గా తన ఉద్యోగాన్ని వదులుకున్నాడు.[5][6]
వరుణ్ చక్రవర్తి 2020 డిసెంబర్ 11న తన చిరకాల స్నేహితురాలు నేహా ఖేడేకర్ను చెన్నైలో వివాహం చేసుకున్నాడు. ఆయన 2014లో తమిళ సినిమా జీవాలో క్లబ్ క్రికెటర్‌గా అతిధి పాత్రలో నటించాడు.
కెరీర్
[మార్చు]వరుణ్ చక్రవర్తి 2018 సెప్టెంబర్ 20న 2018–19 విజయ్ హజారే ట్రోఫీలో తమిళనాడు తరపున లిస్ట్ A అరంగేట్రం చేసి[7] తొమ్మిది మ్యాచ్‌లలో ఇరవై రెండు అవుట్లతో 2018–19 విజయ్ హజారే ట్రోఫీలో తమిళనాడు తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు.[8] ఆయన 2018 నవంబర్ 12న 2018–19 రంజీ ట్రోఫీలో తమిళనాడు తరపున తన ఫస్ట్-క్లాస్ అరంగేట్రం చేశాడు.[9]
వరుణ్ చక్రవర్తి డిసెంబర్ 2018లో 2019 ఇండియన్ ప్రీమియర్ లీగ్ కోసం జరిగిన ఆటగాళ్ల వేలంలో కింగ్స్ XI పంజాబ్ అతనిని 8.4 కోట్ల ధరకు కొనుగోలు చేయగా[10][11] 2019 మార్చి 27న జట్టు తరపున ట్వంటీ20 అరంగేట్రం చేసి[12] అతడు వేసిన మొదటి ఓవర్ లో 25 పరుగులు ఇచ్చి ఐపీఎల్లో అరంగేట్రంలో ఒక బౌలర్ అత్యధిక పరుగులు ఇచ్చిన వాడిగా నిలిచాడు.[13] వరుణ్ చక్రవర్తిని 2020 ఐపీఎల్ వేలానికి ముందు కింగ్స్ XI పంజాబ్ అతన్ని విడుదల చేయగా[14] వేలంలో 2020 ఇండియన్ ప్రీమియర్ లీగ్‌కు ముందు కోల్‌కతా నైట్ రైడర్స్ అతన్ని కొనుగోలు చేయగా[15] 2020 అక్టోబర్ 24న ఐపీఎల్లో అబుదాబిలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 20 పరుగులకు 5 వికెట్లు పడగొట్టి తన తొలి ఐదు వికెట్ల రికార్డును సాధించాడు.[16] ఆయన 2021 ఐపీఎల్ టోర్నమెంట్లో కోల్‌కతా నైట్ రైడర్స్ తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు.[17]
వరుణ్ చక్రవర్తి అక్టోబర్ 2020లో ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్ కోసం భారతదేశం తరపున ట్వంటీ20 అంతర్జాతీయ ట్వంటీ20 జట్టులో చోటు దక్కించుకున్నాడు.[18] అయితే, నవంబర్ 9న గాయం కారణంగా జట్టు నుండి తొలగించబడ్డాడు.[19] ఆయన ఫిబ్రవరి 2021లో ఇంగ్లాండ్‌తో జరిగిన సిరీస్ కోసం భారతదేశం ట్వంటీ20 జట్టులో చోటు దక్కింది.[20]
వరుణ్ చక్రవర్తి జూన్ 2021లో శ్రీలంకతో జరిగిన సిరీస్ కోసం భారతదేశం వన్డే ఇంటర్నేషనల్ (ODI), ట్వంటీ20 జట్లలో చోటు దక్కించుకున్నాడు.[21] ఆయన 2021 జూలై 25న శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో భారతదేశం తరపున తన టీ20 అరంగేట్రం చేసి దాసున్ షనక వికెట్ తీసుకున్నాడు.[22][23] ఆయన సెప్టెంబర్ 2021 2021 ICC పురుషుల T20 ప్రపంచ కప్ భారత జట్టులో చోటు దక్కించుకున్నాడు.[24]
మూలాలు
[మార్చు]- ↑ "వన్డే జట్టులోకి వరుణ్ చక్రవర్తి". 4 February 2025. Archived from the original on 4 February 2025. Retrieved 4 February 2025.
- ↑ "Varun Chakravarthy". ESPNcricinfo. Retrieved 20 September 2018.
- ↑ "Decoding the mystery: Who is Varun Chakravarthy?". ESPNcricinfo. 8 January 2018. Retrieved 8 January 2018.
- ↑ "చరిత్ర సృష్టించిన వరుణ్ చక్రవర్తి". Sakshi. 2 February 2025. Archived from the original on 4 February 2025. Retrieved 4 February 2025.
- ↑ Dani, Bipin (30 October 2020). "Varun Chakravarthy is spinning reality out of dreams". Deccan Chronicle (in ఇంగ్లీష్). Retrieved 24 October 2021.
- ↑ "'Wasn't expecting it': Architect-turned-cricketer Varun Chakravarthy after being awarded India call-up". WION (in ఇంగ్లీష్). Retrieved 29 October 2020.
- ↑ "Elite, Group C, Vijay Hazare Trophy at Chennai, Sep 20 2018". ESPNcricinfo. Retrieved 20 September 2018.
- ↑ "Vijay Hazare Trophy, 2016/17 - Tamil Nadu: Batting and bowling averages". ESPNcricinfo. Retrieved 11 October 2018.
- ↑ "Elite, Group B, Ranji Trophy at Tirunelveli, Nov 12-15 2018". ESPNcricinfo. Retrieved 12 November 2018.
- ↑ "IPL 2019 auction: The list of sold and unsold players". ESPNcricinfo. 18 December 2018. Retrieved 18 December 2018.
- ↑ "IPL 2019 Auction: Who got whom". The Times of India. Retrieved 18 December 2018.
- ↑ "6th Match (N), Indian Premier League at Kolkata, Mar 27 2019". ESPNcricinfo. Retrieved 27 March 2019.
- ↑ "Sunil Narine makes it a first over to forget for Varun Chakravarthy". ESPNcricinfo. 27 March 2019. Retrieved 27 March 2019.
- ↑ "Where do the eight franchises stand before the 2020 auction?". ESPNcricinfo. 15 November 2019. Retrieved 15 November 2019.
- ↑ "IPL auction analysis: Do the eight teams have their best XIs in place?". ESPNcricinfo. 20 December 2019. Retrieved 20 December 2019.
- ↑ "Varun Chakravarthy took his first five-wicket haul". scroll.in. Retrieved 24 October 2020.
- ↑ "Kolkata Knight Riders (KKR) IPL 2021 Stats & Records: Most Runs, Wickets & Catches, Highest & Lowest Score - myKhel.com". mykhelcom (in ఇంగ్లీష్). Retrieved 22 October 2021.
- ↑ "Rishabh Pant omitted from India's white-ball squads, Varun Chakravarthy in T20I squad". ESPNcricinfo. Retrieved 26 October 2020.
- ↑ "Kohli to go on paternity leave after 1st Australia Test; Rohit included for Tests, Varun Chakravarthy injured". The Hindu. Retrieved 9 November 2020.
- ↑ "India's squad for Paytm T20I series announced". Board of Control for Cricket in India. Retrieved 19 February 2021.
- ↑ "Shikhar Dhawan to captain India on limited-overs tour of Sri Lanka". ESPNcricinfo. Retrieved 10 June 2021.
- ↑ "1st T20I (N), Colombo (RPS), Jul 25 2021, India tour of Sri Lanka". ESPNcricinfo. Retrieved 25 July 2021.
- ↑ "India vs Sri Lanka: 'He's got an X-factor,' says Laxman as he praises Varun Chakravarthy on his debut performance". Hindustan Times (in ఇంగ్లీష్). 26 July 2021. Retrieved 26 July 2021.
- ↑ "India's T20 World Cup squad: R Ashwin picked, MS Dhoni mentor". ESPNcricinfo. Retrieved 8 September 2021.