వర్చస్వి కార్టూనిస్ట్
| వర్చస్వి కార్టూనిస్ట్ | |
|---|---|
| జననం | 1963 జూలై 24 తెనాలి, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ |
| నివాస ప్రాంతం | హైదరాబాదు |
| ఇతర పేర్లు | పి. ఎల్. వర్చస్వి |
వర్చస్వి తెలుగు కార్టూనిస్ట్, ఇలస్ట్రేటర్, రచయిత, కవి.
జీవిత విశేషాలు:
[మార్చు]'వర్చస్వి' పేరుతో కార్టూన్లు వేస్తున్న ఈయన పూర్తి పేరు పుచ్చా లక్ష్మీనారాయణ వర్చస్వి. బి.యస్సీ., యం.ఏ., ఎల్.ఎల్.ఎం. చదివి, సెంట్రల్ టాక్సెస్-హైదరాబాద్, డిపార్ట్మెంట్ లో సీనియర్ సూపరింటెండెంట్ గా పనిచేసి, హైదరాబాదులో పదవీవిరమణ చేశారు. ప్రస్తుతం తెలంగాణ హైకోర్టులో న్యాయవాదిగా వున్నారు.
ఆర్టిస్టూ,కార్టూనిస్టుగా:
[మార్చు]1976 లో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కల్చర అసోసియేషన్, తెనాలి వారు నిర్వహించిన (జూనియర్స్) పెయింటింగ్ పోటీల్లో డా.సంజీవ్ దేవ్ చేతులమీదుగా పురస్కారం, 1978 లో ఏపీ లలితకళా అకాడమీ, నవరంగ్ చిత్రకళా పరిషత్, వెల్లటూర్ వారు నిర్వహించిన పెయింటింగ్ కాంపిటీషన్ లో 'బిక్షగాడు ' చిత్రానికి బంగారు పతకం, అదే సంవత్సరం రోటరాక్ట్, తెనాలి వారి అఖిలభారత పెయింటింగ్ పోటీల్లో ప్రధమ బహుమతీ తీసుకొగా, సాధన సమితి మరియూ వెంకట్ అవార్డ్ నిర్వహించిన అఖిల భారత కార్టూన్ పోటీల్లో వరుసగా 1982, 1983, 1985 బహుమతులు స్వీకరించారు. అలాగే ఏపీ ఫ్యామిలీ ప్లానింగ్ డిపర్ట్మెంట్ వారు నిర్వహించిన జాతీయ కార్టూన్ పోటీల్లో (1984, 1985, 1987) బహుమతులూ, 1986 లో ఆంధ్ర ప్రభ నిర్వహించిన జాతీయ కార్టూన్ పోటీల్లో రెండవ బహుమతీ గెలుచుకున్నారు. అలాగే 1993 లో ఆంధ్రజ్యొతి దినపత్రిక నిర్వహించిన స్పాట్ కాంపిటీషన్ లో జాతీయ బహుమతి గెలిచారు. 2014 లో తలిశెట్టి రామారావు స్మారక సంస్థ నిర్వహించిన పోటీల్లో జాతీయ బహుమతీ, ప్రఖ్యాత కార్టూన్ వాచ్ మ్యాగజైన్ వరు నిర్వహించిన జాతీయ కారూన్ పోటీల్లో వరుసగా 2013, 2014 లో బహుమతులూ, అదే మ్యాగజైన్ మరియూ సీఈసీబీ (బీట్ పొల్యూషన్) సమ్యుక్తంగా నిర్వహించిన జాతీయ పోటీలో ప్రత్యేక బహుమతీ గెలుచుకున్నారు. వీరి మొదటి కార్టూన్ 1980 లో మార్గదర్శి అనే 'ఆరోగ్య' మాసపత్రికలో వచ్చింది. అలాగే 'బాల' అని రేడియో మావయ్య (న్యాపతి రాఘవయ్య) గారి ఆధ్వర్యంలో మాసపత్రిక వచ్చేది. అందులో ఫుల్ పేజీ కార్టూన్లు ప్రచురించబడడంతో వీరు ఉత్సాహంతో కార్టూన్లు గీయడం ప్రారంభించారు. వీరి కార్టూన్లు యోజన, విజయచిత్ర, స్వాతి, ఆంధ్రప్రభ, ఆంధ్రభూమి, తరంగిణీ, పల్లకీ , హాస్యానందం, గో తెలుగు.కాం లాటివే వివిధ వార, మాసపత్రికల్లో ఎక్కువగా వీరి కార్టూన్లు ప్రచురితమయ్యాయి. గత నాలుగు దశాబ్దాల్లో మొత్తం కలిపి ఐదారు వేల కార్టూన్లు, అనేక పత్రికల్లో, వెబ్ మ్యాగజైన్స్ లో వందలాది ఇలస్ట్రేషన్స్/స్కెచెస్,కేరికేచర్లు, అనేక కథల,కవితల, వ్యాసంపుటుల కవర్ పేజీ చిత్రాలు కూడా గీశారు. కార్టూన్లు, కేరికేచర్లు గీయడంలో వీరికి తనదైన ముద్ర వుంది.[1] కళాసాగర్ ప్రచురించిన కొంటెబొమ్మల బ్రహ్మలు పుస్తకంలో 80 మంది ప్రముఖ కార్టూనిస్టుల కేరికేచర్లు గీసారు.
కథారచయితగా :
[మార్చు]1982 లో 'జాగ్రుతి ' వార పత్రికలో మొదటి కథ ప్రచురితమైంది.. వివిధ పత్రికల్లో వచ్చిన కథలతో ' వర్చస్వీయం' కథా సంపుటిగా వచ్చింది. వాటిలో కొన్ని కథలు కాళీపట్నం వారి కథానిలయం వెబ్సైట్ లో ఉంచారు.[2]
నార్లవారి "పురాణ వైరాగ్యం" అసంపూర్ణ నవలిక పూరణ కోసం ఆహ్వానం పత్రిక వారు నిర్వహించిన అంతర్జాతీయ పోటీ లో (1993) ప్రఖ్యాత త్రిపురనేని కవిరాజు ట్రస్ట్ అవార్డ్ ను గెలుచుకున్నారు. ఇటీవల కొన్ని సినిమా స్క్రిప్ట్స్ లో సహకారం అందించగా(ఘోస్ట్ రైటర్), స్టోరీ బోర్డ్స్ తయారీ, స్క్రిప్ట్ ల అనువాదం, చర్చలలో పాల్గొనటం జరిగింది.
కవి గా:
[మార్చు]కొన్ని పత్రికల్లోనూ, వెబ్ మ్యాగజైన్ లోనూ పబ్లిష్ అయిన కవితలతోనూ, వేదికల పై చదివిన కవితలతోనూ 'లోకాస్సమస్తా' అనే కవిత్వ సంపుటి వెలువరించారు. [3]
ప్రచురించిన పుస్తకాలు
[మార్చు]- 1997 లో 'వర్చస్వీయమ్' అన్న పేరుతో కథల పుస్తకం.
- 2012 లో 'లోకాస్సమస్తా...' అన్న పేరుతో కవితల సంపుటి.
- 2017లో 'వర్చస్వి కార్టూన్లు' అన్న పేరుతో కార్టూన్ల సంకలనం ఎమెస్కో వారి ప్రచురణ.
- 2024లో 'Wings of a Free Bard' (English Poetry)
- 2025లో 'నవ్వుల జంక్షన్' (కార్టూన్ల సంకలనం)
బహుమతులు
[మార్చు]వర్చస్వి అనేక జాతీయ, అంతర్జాతీయ కార్టూన్[4] పోటీల్లో ఎన్నో బహుమతులు పొందారు..[5] వాటిలో కొన్ని ముఖ్యమైనవి:
- 1998 లో'ది హిందూస్తాన్ టైమ్స్' నిర్వహించిన అంతర్జాతీయ క్యారికేచర్ కాంపిటీషన్ లో ప్రశంసా పత్రం, హైదరాబాదు
- 2013 లో తెలుగు కార్టూనిస్ట్స్ అస్సోసియేషన్, 'నది - మాసపత్రిక, పీ.ఆర్.ఫౌండేషన్-అమెరికా వారి అంతర్జాతీయ కార్టూనిస్ట్ పోటీల్లో ప్రధమ బహుమతి.
- 2013, 2014లో 'కార్టూన్ వాచ్' పత్రిక జాతీయస్థాయి కార్టూన్ పోటీలో ప్రత్యేక బహుమతి.
- 2015 మళ్ళ జగన్నాధం లైఫ్ టైమ్ పురస్కారం, అనకాపల్లి
- 2019 'హాస్యానందం' పత్రిక వారి 'శేఖర్ అవార్డ్', హైదరాబాదు
- 2019 లో వంశీ ఆర్ట్ థియేటర్స్-వెంకట్ అక్కిరాజు పురస్కారం, హైదరాబాదు
మూలాలు
[మార్చు]- ↑ https://www.gotelugu.com. "Cartoons by Varchaswi | Gotelugu.com". https://www.gotelugu.com. Retrieved 2026-02-12.
{{cite web}}: External link in(help)|last=and|website= - ↑ "కథానిలయం - View Writer". kathanilayam.com. Retrieved 2026-02-12.
- ↑ https://www.facebook.com/groups/kavisangamam/permalink/827250460661041/.
{{cite web}}: External link in(help); Missing or empty|website=|title=(help); Missing or empty|url=(help) - ↑ "list of participants of FECO Exhibition 2020 - TabrizToon.com". www.tabriztoon.com. Archived from the original on 2025-10-05. Retrieved 2026-02-12.
- ↑ "The Final List of Participants of FECO Exhibition | 2020 Theme: Theater". IRANCARTOON (in ఇంగ్లీష్). Retrieved 2026-02-12.[permanent dead link]
ఇతర లింకులు
[మార్చు]- https://www.amazon.in/WINGS-Medley-Poetry-Happiness-Harmony/dp/8196611625
- https://www.amazon.in/Varchaswi-Cartoonlu-Laxminarayana/dp/B077Z39SDB/ref=sr_1_1?crid=26ZPB5CLJ6W1C&dib=eyJ2IjoiMSJ9.N2ru_-9WBCYjd4nUu54RrdCPNzBd7DoekpRPGE93fn_GjHj071QN20LucGBJIEps.cBNx4Dj8skhYgKMV5ocwaXdChUvYxjDVC8-u7Wx7BOo&dib_tag=se&keywords=Varchaswi&qid=1770912552&sprefix=varchaswi%2Caps%2C365&sr=8-1