Jump to content

వర్జిన్ దీవులు

Coordinates: 18°12′N 64°48′W / 18.2°N 64.8°W / 18.2; -64.8
వికీపీడియా నుండి
Virgin Islands
Satellite image, October 2008
భూగోళశాస్త్రం
ప్రదేశంCaribbean Sea, Atlantic Ocean
అక్షాంశ,రేఖాంశాలు18°12′N 64°48′W / 18.2°N 64.8°W / 18.2; -64.8
ద్వీపసమూహంLeeward Islands
Insular areaU.S. Virgin Islands
Insular areaPuerto Rico
Overseas territoryBritish Virgin Islands
జనాభా వివరాలు
జనాభా150,000 (estimation) (2022)
భాషలుEnglish
Virgin Islands Creole
Spanish
జాతి సమూహాలుAfro-Caribbean
White-Caribbean
Hispanic-Caribbean
Asian-Caribbean
Indo-Caribbean

వర్జిన్ దీవులు (స్పానిషు;ఇసాసు విర్జెనెసు) అనేది ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రం, ఈశాన్య కరేబియన్ సముద్రం మధ్య ఉన్న ఒక ద్వీపసమూహం. ఇది ప్యూర్టో రికో ప్రధాన ద్వీపంకు సరిగ్గా తూర్పున ఉంది. ఇది సాధారణంగా కరేబియను ప్రాంతం లోని వెస్ట్ ఇండీసులో ఉన్న లెసరు ఆంటిల్సు లీవార్డు దీవులులో భాగంగా ఉంటుంది.

భూగర్భ శాస్త్రపరంగా అనెగాడా కనుమ ద్వారా లెసరు ఆంటిల్సు నుండి, మోనా కనుమ ద్వారా గ్రేటరు ఆంటిల్సు నుండి వేరు చేయబడిన సెయింటు క్రోయిక్సు మినహా మిగిలిన అన్ని ద్వీపాలు ప్యూర్టో రికో బ్యాంకు అని పిలువబడే ఒకే కార్బోనేటు పీఠభూమి ఖండాంతర అంచు మీద, ప్యూర్టో రికో-వర్జిను ఐలాండ్సు మైక్రోప్లేటు అని పిలువబడే ఒకే టెక్టోనికు ప్లేటు‌ మీద ఉన్నాయి.

రాజకీయంగా ఈ ద్వీపాలు మూడు అధికార పరిధులలోకి వస్తాయి: వర్జిను ఐలాండ్సు ‌లోని అత్యంత తూర్పున ఉన్న బ్రిటిషు ఓవర్సీసు భూభాగం. దీనిని సాధారణంగా బ్రిటిషు వర్జిను ఐలాండ్సు అని పిలుస్తారు; యునైటెడు స్టేట్సు వర్జిను దీవులలోని మధ్య విలీనం కాని అమెరికను భూభాగం. సాధారణంగా యు.ఎస్. వర్జిన్ దీవులు; అమెరికా విలీనం కాని భూభాగం అయిన ప్యూర్టో రికో అత్యంత పశ్చిమ దిశలో ఉన్న దీవుల-పురపాలక ప్రాంతాలు—అధికారికంగా వెయిక్యూసు, కులెబ్రా అని పిలువబడినప్పటికీ సాధారణంగా స్పానిషు వర్జిను దీవులు లేదా ప్యూర్టో రికను వర్జిను దీవులు అని పిలువబడతాయి.

వర్జిన్ దీవుల రాజకీయ పటం

పద వ్యుత్పత్తి

[మార్చు]
US, UK వర్జిన్ దీవుల స్థానాలు
Rigobert Bonne: వర్జిన్ దీవుల పటం, 1780

క్రిస్టోఫరు కొలంబసు ఈ దీవులకు సెయింటు ఉర్సులా, 11,000 మంది కన్యల (స్పానిషు;సంత ఉర్సుల, పదకొండు వేల కన్యలు) పేరిట నామకరణం చేశారు; దీనిని క్లుప్తంగా' 'కన్యలు అని పిలిచేవారు. బ్రిటిషు భూభాగం యుఎస్ అధికారిక పేరు 'వర్జిను దీవులు' కాగా, యుఎస్. భూభాగం అధికారిక పేరు 'యునైటెడు స్టేట్సు వర్జిను దీవులు' అని ఉంది. ఆచరణలో మాత్రం ఈ రెండు దీవుల సమూహాలను దాదాపు అందరూ బ్రిటిషు వర్జిను దీవులు,యుఎస్. వర్జిను దీవులు అని మాత్రమే వ్యవహరిస్తారు.

చరిత్ర

[మార్చు]

వర్జిన్ దీవులలో మొదట అరవాకు, కారిబు జాతుల వారు నివసించేవారు. వలస పాలన కాలంలో యూరోపియను వలసదారులు తీసుకువచ్చిన బానిసత్వం, విదేశీ వ్యాధులు, యుద్ధాల కారణంగా వీరిలో చాలామంది మరణించి ఉంటారని భావిస్తున్నారు.[1]

తరువాత యూరోపియను వలసదారులు ఇక్కడ స్థిరపడి చక్కెర తోటలను, కనీసం ఒక పొగాకు తోటను ఏర్పాటు చేశారు; అలాగే బానిసలను ఆఫ్రికా నుండి ఇక్కడికి తీసుకువచ్చారు. ఆ బానిసలుగా మార్చబడిన వారి వారసులే నేటికీ ఇక్కడి జనాభాలో అత్యధిక సంఖ్యలో ఉన్నారు. వీరు మిగిలిన ఆంగ్లం మాట్లాడే కరేబియను ప్రాంతాల ప్రజలతో కలిసి ఒక ఉమ్మడి ఆఫ్రికను-కరేబియను వారసత్వాన్ని పంచుకుంటున్నారు.

ప్యూర్టో రికో మాదిరిగానే ఒకప్పుడు స్పెయిన్ ఆధీనంలో ఉన్న వర్జిను దీవులు కూడా 1898లో యునైటెడు స్టేట్సు‌కు అప్పగించబడ్డాయి. స్పానిషు-అమెరికను యుద్ధంలో సైనిక చర్యలకు ముగింపు పలికే శాంతి ఒప్పందం కుదిరిన తర్వాత యునైటెడు స్టేట్సు ఈ దీవుల ఆధిపత్యాన్ని స్వీకరించింది.

1916లో యునైటెడు స్టేట్సు, డెన్మార్కు మధ్య కుదిరిన ఒక ఒప్పందం (దీనిని యునైటెడు స్టేట్సు 1917 వరకు ఆమోదించలేదు) ఫలితంగా డెన్మార్కు తన ఆధీనంలోని డానిషు వెస్టు ఇండీసు‌ను 25 మిలియన్ల డాలర్ల బంగారానికి యునైటెడు స్టేట్సు‌కు విక్రయించింది.

చారిత్రక అనుబంధాలు

[మార్చు]

చరిత్ర పొడవునా వర్జిను దీవులు అనేక దేశాలు, సమూహాల సార్వభౌమాధికారం క్రింద ఉన్నాయి. వివిధ దీవుల అనుబంధాలను సూచించే పట్టిక క్రింద ఇవ్వబడింది:

1685
పాలన ప్రారంభం ప్రస్తుత U.S.V.I. ప్రస్తుత British V.I. ప్రస్తుత Spanish V.I. (P.R.) పాలన ప్రారంభం
St. Thomas St. John St. Croix Tortola Virgin Gorda Anegada Jost Van Dyke Culebra Vieques
1493
న్యూ స్పెయిన్

న్యూ స్పెయిన్

న్యూ స్పెయిన్

న్యూ స్పెయిన్

న్యూ స్పెయిన్

న్యూ స్పెయిన్

న్యూ స్పెయిన్

న్యూ స్పెయిన్

న్యూ స్పెయిన్
1493
1580 ప్యూర్టో రికో (ES)* ప్యూర్టో రికో (ES)* 1580
1625 డచ్ వర్జిన్ దీవులు బ్రిటిష్ లీవార్డ్ దీవులు** డచ్ వర్జిన్ దీవులు** 1625
ప్యూర్టో రికో (ES)**
1628 డచ్ వర్జిన్ దీవులు 1628
1648 డచ్ వర్జిన్ దీవులు డచ్ వర్జిన్ దీవులు 1648
1650 1650
1651 డానిష్ వెస్ట్ ఇండీస్ నైట్స్ హాస్పిటలర్ 1651
1664 ఫ్రెంచ్ వెస్ట్ ఇండీస్ 1664
1671 డానిష్ వెస్ట్ ఇండీస్ 1671
1672 బ్రిటిష్ లీవార్డ్ దీవులు 1672
1680 బ్రిటిష్ లీవార్డ్ దీవులు 1680
1684 బ్రిటిష్ లీవార్డ్ దీవులు 1684
బ్రాండెన్‌బర్గ్-ప్రష్యా*** 1685
1689 బ్రాండెన్‌బర్గ్-ప్రష్యా 1689
1693 ప్యూర్టో రికో (ES) 1693
1698 డానిష్ వెస్ట్ ఇండీస్ 1698
బ్రిటిష్ లీవార్డ్ దీవులు** ఫ్రెంచ్ వెస్ట్ ఇండీస్** డానిష్ వెస్ట్ ఇండీస్** స్కాటిషు డారియను కంపెనీ
1699 1699
1718 డానిష్ వెస్ట్ ఇండీస్ 1718
1733 1733

-

1750 బ్రిటిష్ లీవార్డ్ దీవులు 1750
1754 1754
1801 బ్రిటిష్ లీవార్డ్ దీవులు 1801
1802 డానిష్ వెస్ట్ ఇండీస్ 1802
1807 బ్రిటిష్ లీవార్డ్ దీవులు 1807
1811 1811
1815 డానిష్ వెస్ట్ ఇండీస్ 1815
1816 బ్రిటిష్ వర్జిన్ దీవులు 1816
1833 బ్రిటిష్ లీవార్డ్ దీవులు 1833
1898 ప్యూర్టో రికో (యుఎస్) 1898
1917 యునైటెడ్ స్టేట్స్ వర్జిన్ దీవులు 1917
1958 బ్రిటిష్ వర్జిన్ దీవులు 1958

* ప్రధానంగా సముద్రపు దొంగల నియంత్రణలో ఉంది.

** సహ-ఉనికిలో ఉన్న దావా.

*** లీజుకు ఇవ్వబడిన/పంచుకోబడిన భూభాగం.

జనాభా వివరాలు

[మార్చు]

వర్జిను దీవుల మొత్తం జనాభా 147,778: ఇందులో యుఎస్. వర్జిను దీవులలో 1,04,901 బ్రిటిషు వర్జిను దీవులలో 31,758 స్పానిషు వర్జిను దీవులలో 11,119 మంది ఉన్నారు. బ్రిటిషు, యు.ఎస్. వర్జిను దీవులలోని నివాసులలో సుమారు మూడు వంతుల మంది నల్లజాతీయులు కాగా కులెబ్రా, వెయిక్యూసు దీవులలోని నివాసులలో అత్యధికులు యూరోపియన్ మూలాలు కలిగిన ప్యూర్టో రికన్లు; ఇక్కడ ఒక గణనీయమైన ఆఫ్రో-ప్యూర్టో రికను వర్గం కూడా ఉంది. యు.ఎస్., బ్రిటిషు వర్జిను దీవులలో ప్రధాన భాషలు ఇంగ్లీష్, వర్జిను ఐలాండ్సు క్రియోలు కాగా, ప్యూర్టో రికను భూభాగంలో ప్రధాన భాష స్పానిషు. ఎస్‌టి. థోమసు అత్యధిక జనాభా కలిగిన దీవి. దీని తర్వాతి స్థానంలో ఎస్‌టి. క్రొయిక్సు ఉంది (వీటి జనాభా వరుసగా 51,634, 50,601).

పేరు సార్వభౌమ దేశం ఉపవిభాగాలు విస్తీర్ణం
(km2)
జనాభా
(2005 అంచనా)
జనసాంద్రత
(ప్రతి km2కు)
రాజధాని
బ్రిటిష్ వర్జిన్ దీవులు యునైటెడ్ కింగ్‌డమ్ జిల్లాలు &&&&&&&&&&&&0153.&&&&&0153.0 0సమాసంలో (Expression) లోపం: "," అనే విరామ చిహ్నాన్ని గుర్తించలేకపోతున్నాను..సమాసంలో (Expression) లోపం: "," అనే విరామ చిహ్నాన్ని గుర్తించలేకపోతున్నాను.31,758 &&&&&&&&&&&&0207.600000207.6 రోడ్ టౌను
స్పానిష్ వర్జిన్ దీవులు (ప్యూర్టో రికో) యునైటెడ్ స్టేట్స్ బారియోలు &&&&&&&&&&&&0165.100000165.1 0సమాసంలో (Expression) లోపం: "," అనే విరామ చిహ్నాన్ని గుర్తించలేకపోతున్నాను..సమాసంలో (Expression) లోపం: "," అనే విరామ చిహ్నాన్ని గుర్తించలేకపోతున్నాను.11,119 &&&&&&&&&&&&&067.30000067.3 శాన్ జువాన్, PR
యునైటెడ్ స్టేట్స్ వర్జిన్ దీవులు యునైటెడ్ స్టేట్స్ జిల్లాలు &&&&&&&&&&&&0346.400000346.4 0సమాసంలో (Expression) లోపం: "," అనే విరామ చిహ్నాన్ని గుర్తించలేకపోతున్నాను..సమాసంలో (Expression) లోపం: "," అనే విరామ చిహ్నాన్ని గుర్తించలేకపోతున్నాను.104,901 &&&&&&&&&&&&0302.800000302.8 షార్లెట్ అమాలీ
మొత్తం &&&&&&&&&&&&0664.500000664.5 0సమాసంలో (Expression) లోపం: "," అనే విరామ చిహ్నాన్ని గుర్తించలేకపోతున్నాను..సమాసంలో (Expression) లోపం: "," అనే విరామ చిహ్నాన్ని గుర్తించలేకపోతున్నాను.147,778 222.4

ట్రాఫిక్ నియంత్రణ

[మార్చు]

బ్రిటిషు. యు.ఎస్. వర్జిను దీవులు రెండింటిలోనూ మోటారు వాహనాలను రహదారికి ఎడమ వైపున నడుపుతారు; అయితే చాలా కార్లలో స్టీరింగు చక్రాలు ఎడమ వైపునే అమర్చబడి ఉంటాయి (కుడి వైపున వాహనాలు నడిపే ప్రాంతాలలో ఇది సాధారణ పద్ధతి). స్పానిషు వర్జిను దీవులలో మాత్రం, వాహనాలను రహదారికి కుడి వైపున నడుపుతారు.

ఇవి కూడా చూడండి

[మార్చు]
  • వర్జిను దీవుల సంస్కృతి
  • డానిషు వర్జిను దీవులు
  • డచ్ వర్జిను దీవులు
  • వర్జిను దీవుల సంగీతం
  • వర్జిను దీవుల క్రియోలు
  • వర్జిను దీవుల ప్యాచ్ రీఫు‌లు

మూలాలు

[మార్చు]
  1. Pereña, Luciano (1992). Genocidio en América. Madrid: Editorial MAPFRE. p. 351. ISBN 84-7100-453-4.