వర్జీనియా వూల్ఫ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Virginia Woolf
Virginia Woolf 1927.jpg
వృత్తిNovelist, Essayist, Publisher, Critic
గుర్తింపునిచ్చిన రచనలుTo the Lighthouse, Mrs Dalloway, Orlando: A Biography, A Room of One's Own
ప్రభావంWilliam Shakespeare, George Eliot, Leo Tolstoy, Marcel Proust, James Joyce, Anton Chekhov, Emily Bronte, Daniel Defoe, E. M. Forster
జీవిత భాగస్వామిLeonard Woolf (1912–1941)

అడెలైన్ వర్జీనియా వూల్ఫ్ (pronounced /ˈwʊlf/; 1882 జనవరి 25 - 1941 మార్చి 28) ఇంగ్లీష్ రచయిత, ప్రచురణకర్త, కథానికల రచయిత, ఇరవయ్యో శతాబ్దికి చెందిన సర్వశ్రేష్ఠులైన అధునికతావాద సాహితీ ప్రముఖులలో ఈమె ఒకరు.

రెండు ప్రపంచ యుద్ధాల మధ్యకాలంలో, వర్జీనియా వూల్ఫ్, లండన్ లిటరరీ సొసైటీలో ప్రముఖ వ్యక్తిగా, బ్లూమ్స్‌బరీ గ్రూప్ సభ్యురాలిగా ఉండేది. ఆమె రాసిన ప్రసిద్ధ రచనల్లో మిసెస్ డల్లోవే (1925), టు ది లైట్ హౌస్ (1927) మరియు ఓర్లాండో (1928) వంటి నవలలతో పాటు, "మహిళ కాల్పనిక రచన చేయాలంటే ఆమెకు డబ్బు మరియు తనదైన సొంత గది తప్పక ఉండాలి" అనే సుప్రసిద్ధ సూక్తితో కూడిన పుస్తక ప్రమాణంలోని వ్యాసం ఎ రూమ్ ఆఫ్ వన్స్ ఓన్ (1929) కూడా ఉన్నాయి.

బాల్య జీవితం[మార్చు]

వూల్ఫ్ తల్లి జూలియా స్టీఫెన్ పోటోగ్రఫిక్ పోర్ట్రయిట్, జూలియా మార్గరెట్ కేమరూన్ ద్వారా తీయబడింది.

వర్జీనియా వూల్ఫ్ 1882లో లండన్‌లోని అడెలైన్ వర్జీనియా స్టీఫెన్ ప్రాంతంలో పుట్టింది. ఆమె తల్లి, అద్వితీయ సుందరి, జూలియా ప్రిన్‌సెప్ స్టీఫెన్ (బోర్న్ జాక్సన్) (1846–1895), భారత్‌లో డాక్టర్ జాన్, మరియా పట్లే జాక్సన్ దంపతులకు పుట్టింది, తర్వాత తల్లితోపాటు ఇంగ్లండ్‌కు తరలి పోయింది, అక్కడ ఆమె ఎడ్వర్డ్ బర్న్-జోన్స్- వంటి రఫేలైట్ పూర్వ పెయింటర్లకు మోడల్‌గా సేవలందించింది. ఆమె తండ్రి, సర్ లెస్లీ స్టెఫెన్, ప్రముఖ చరిత్రకారుడు, రచయిత, విమర్శకుడు మరియు పర్వతారోహకుడు.[1] చిన్నారి వర్జీనియా ఆమె తల్లిదండ్రులకు చెందిన 22 హైడ్ పార్క్ గేట్, కెన్సింగ్టన్‌లో సాహిత్య వాతావరణం కలిగిన, చక్కటి గృహంలో విద్యనభ్యసించింది. ఆమె తల్లితండ్రులకు అంతకుముందే పెళ్లయింది, తర్వాత తల్లి భర్త, తండ్రి భార్య చనిపోయారు, ఫలితంగా, వీరి కుటుంబంలో మూడు పెళ్ళిళ్ల ద్వారా కలిగిన పిల్లలు ఉండేవారు. జూలియా తన మొదటి భర్త హెర్బర్ట్ డక్‌వర్త్ ద్వారా ముగ్గురు పిల్లల్ని కన్నారు: జార్జ్ డక్‌వర్త్, స్టెల్లా డక్‌వర్త్ మరియు గెలార్డ్ డక్‌వర్త్. ఆమె తండ్రి, మిన్నీ థాకరేని పెళ్లాడాడు, వీరికి ఒక కూతురు కలిగింది: లారా మేక్‌పీస్ స్టీఫెన్ అనే ఈమెను మానసిక వైకల్యం కలిగినదిగా ప్రకటించారు, ఆమెను 1891లో చికిత్సా కేంద్రంలో చేర్పించే వరకు కుటుంబంతో కలిసి జీవించింది.[2] లెస్లీ మరియు జూలియా ఇరువురికి కలిపి నలుగురు పిల్లలు కలిగారు: వనెస్సా స్టీఫెన్ (1879), థోబీ స్టీఫెన్ (1880), వర్జీనియా (1882), మరియు ఆడ్రెయిన్ స్టీఫెన్ (1883)

సంపాదకుడిగా, విమర్శకుడిగా, జీవిత చరిత్రకారుడిగా, సర్ లెస్లీ స్టీఫెన్ ప్రాముఖ్యత మరియు విలియం థాకరేతో అతడి సంబంధం (ఇతడు థాకరే చిన్న కూతురు భర్త, ఆమె చనిపోయింది) కారణంగా, అతడి పిల్లలు విక్టోరియన్ లిటరరీ సొసైటీ ప్రభావాలతో నిండిన పరిసరాలలో పెరిగారని భావించవచ్చు. హెన్రీ జేమ్స, జార్జ్ హెన్రీ ల్యుస్, జూలియా మార్గరెట్ కామెరూన్ (జూలియా స్టీఫెన్ అత్త) మరియు వర్జీనియా గౌరవనీయ తాతయ్య అయిన జేమ్స్ రస్సెల్ లోవెల్ వీరి ఇంటిని సందర్శించేవారు. జూలియా స్టీఫెన్ కూడా సమానంగా వీరితో సంబంధాలలో ఉండేది. మేరీ ఆంటోయినెట్ సహాయకురాలి కుటుంబం నుంచి వచ్చిన ఈమె రఫేలైట్ పూర్వ చిత్రకారులకు మోడళ్లుగా విక్టోరియన్ సొసైటీపై తమదైన ప్రభావం వేసిన ప్రసిద్ధ సుందరీమణులకు చెందిన కుటుంబానికి చెందినది. ఈ ప్రభావాలకు తోడు స్టీఫెన్ ఇంట్లో అతి పెద్ద గ్రంథాలయం ఉండేది, ఇక్కడే వర్జీనియా, వనెస్సా (లాంఛనప్రాయంగా విద్యనభ్యసించిన వారి సోదరుల వలే కాకుండా) సంప్రదాయిక ప్రామాణిక గ్రంథాలు మరియు ఆంగ్ల సాహిత్యాన్ని చదివారు.

జూలియా ప్రిన్‌సెప్ స్టీఫెన్ చిత్తరువు 1866లో ఎడ్వర్డ్ బర్నె-జోన్స్‌చే తీయబడింది

వూల్ఫ్ జ్ఞాపకాల ప్రకారం, ఆమె మధురమైన బాల్య జ్ఞాపకాలు లండన్‌కి కాకుండా కార్న్‌వాల్లోని సెయింట్ ల్వెస్‌కు సంబంధించినవే ఎక్కువగా ఉండేవి, ఎందుకంటే 1895 వరకు వీరి కుటుంబం ప్రతి వేసవిలోనూ ఇక్కడే గడిపేది. స్టీఫెన్ వేసవి విడిది టల్లాండ్ హౌస్ పోర్త్‌మినిస్టర్ బేలో ఉండేది, ఈరోజుకు అది అక్కడ ఉంది కాని కొన్ని మార్పులు చేయబడింది. ఈ కుటుంబ సెలవులకు సంబంధించిన జ్ఞాపకాలు, అక్కడి ప్రకృతి దృశ్యాల ముద్రలు, ప్రత్యేకించి గాడ్‌రెవి లైట్ హౌస్ తరువాతి సంవత్సరాలలో వూల్ఫ్ రాసిన కాల్పనిక సాహిత్యానికి ఆదరవులుగా నిలిచాయి. ప్రత్యేకించి టు ది లైట్‌హౌస్ నవలలో ఇవి విశేషంగా కనబడతాయి.

వర్జీనియా 13 ఏళ్ల ప్రాయంలో ఉన్నప్పుడు 1895లో తల్లి, రెండేళ్ల తర్వాత సోదరి స్టెల్లా ఆకస్మిక మరణాలు వర్జీనియాలో తీవ్రమైన మనో వైకల్యాలకు నాంది పలికాయి. అయితే ఆమె 1897 మరియు 1901 మధ్య కాలంలో లండన్ కింగ్స్ కాలేజీలోని మహిళా విభాగంలో గ్రీక్, లాటిన్, జర్మన్ మరియు చరిత్రలలో, (డిగ్రీ స్థాయి వరకు) విద్య కొనసాగించింది. దీంతో క్లారా పాటర్, జార్జ్ వార్ర్, లిలియన్ ఫెయిత్‌పుల్ (కింగ్స్ లేడీస్ డిపార్ట్‌మెంట్ ప్రిన్సిపాల్) వంటి తొలి తరం మహిళల ఉన్నత విద్యా సంస్కరణ వేత్తలలో కొందరితో ఆమెకు పరిచయం ఏర్పడింది[3]. ఆమె వనెస్సా కూడా లాటిన్, ఇటాలియన్, కళ, వాస్తుశిల్పం అంశాలను కింగ్స్ లేడీస్ డిపార్ట్‌మెంట్‌లో చదివింది.

1904లో ఆమె తండ్రి మరణంతో ఆమె కుప్పగూలిపోయింది, ఆమెను కొంతకాలంపాటు మానసితి చికిత్సాకేంద్రంలో చేర్పించారు.[2] ఆమె మానసిక వైకల్యం కొనసాగింపుగా వచ్చే నిస్పృహ కాలావధుల కారణంగా, సోదరులైన జార్జ్ మరియు గెరాల్డ్ డక్‌వర్త్‌ల లైంగిక దూషణల ప్రభావాలకు కూడా ఆమె, వనెస్సాలు గురికావలసివచ్చిందని, ఆధునిక పండితులైన (ఆమె మనవడు మరియు జీవిత చరిత్రకారుడు క్వెంటన్ బెల్తో పాటుగా) సూచించారు[4], వూల్ఫ్ తన ఎ స్కెచ్ పాస్ట్ మరియు 22 హైడ్ పార్క్ గేట్‌ జీవిత చరిత్ర వ్యాసాలలో వీటిని మననం చేసుకుంది ).

తన జీవితం పొడవునా, వూల్ఫ్ క్రమానుగతమైన మానసిక కల్లోలాలు మరియు దానితో ముడిపడిన అస్వస్థతలకు గురవుతూ వచ్చింది. ఈ అస్థిరత్వం ఆమె సామాజికి జీవితాన్ని ప్రభావితం చేసినప్పటికీ, ఆమె సాహిత్య సృజన మటుకు అప్పుడప్పుడూ విరామాలతో ఆమె ఆత్మహత్య వరకు కొనసాగుతూ వచ్చింది.

బ్లూమ్స్‌బరీ[మార్చు]

ఆల్బేనియిన్ రిగాలియాలో డ్రెడ్‌నాట్ హోక్సర్స్: ఎడమ వైవు దూరంగా గడ్డం పట్టుకుని ఉన్న వ్యక్తి వర్జీనియా వూల్ఫ్.

తన తండ్రి మరణం తర్వాత వర్జీనియా రెండోసారి చిత్త చాంచల్యానికి గురైంది, వనెస్సా మరియు అడ్రెయిన్ 22 హైడ్ పార్క్ గేట్ ఇంటిని అమ్మివేసి బ్లూమ్స్‌బరీలో 46 గార్డన్ స్క్వేర్‌‌లో ఒక ఇంటిని కొన్నారు.

వూల్ఫ్, లిట్టన్ స్ట్రాచీ క్లైవ్ బెల్, రూపర్ట్ బ్రూక్, శాక్సన్ సిడ్నీ-టర్నర్, డంకన్ గ్రాంట్, లియోనార్డ్ వూల్ఫ్ మరియు రోజెర్ ప్రైలతో పరిచయంలోకి వచ్చింది, వీరంతా కలిసి బ్లూమ్స్‌బరీ గ్రూప్‌గా పేరొందిన రచయితలు మరియు కళాకారులతో కూడిన మేధో బృందంగా ఏర్పడినారు. ఈ గ్రూపులోని పలువురు 1910లో డ్రెడ్‌నాట్ హోక్స్‌తో ఒక్కసారిగా పేరుకెక్కారు, దీంట్లో వర్జీనియా పురుష అబిస్సీనియన్ రాయల్‌‌గా మారువేషంలో పాల్గొంది. హోక్స్‌పై ఆమె 1940లో చేసిన పూర్తి ప్రసంగం కనుగొనబడింది మరియు అది ది ప్లాట్‌ఫాం ఆఫ్ టైమ్ (2008)‌ యొక్క విస్తరించబడిన సంకలనంలో సేకరించిన జ్ఞాపకాలుగా ప్రచురించబడింది. 1907లో వనెస్సా క్లైవ్ బెల్‌ని వివాహమాడింది, ఈ దంపతులకు అవంత్ గార్డె కళపై ఉన్న ఆసక్తి, రచయితగా వర్జీనియా రూపొందడంపై గణనీయమైన ప్రభావం చూపింది.[5]

వర్జీనియా స్టీఫెన్ 1912లో రచయిత లియొనార్డ్ వూల్ఫ్‌ని వివాహమాడింది. అతడికి సామాజిక స్థాయి పెద్దగా లేనప్పటికీ, (వర్జీనియా తన నిశ్చితార్థం సమయంలో లియొనార్డ్‌ని "నయాపైస కూడా లేని యూదుడి"గా వర్ణించింది) దంపతులిరువురూ సన్నిహిత బంధాన్ని పంచుకున్నారు. నిజానికి, 1937లో, వర్జీనియా తన దినచర్యలో రాసుకుంది: లవ్ మేకింగ్ - 25 ఏళ్ల తర్వాత విడిపోవడాన్ని భరించలేము ... పురుషుడినుంచి ఆశించబడటంలో ఆపారమైన సంతోషాన్ని మీరు చవిచూస్తారు: ఒక భార్య. మరియు మా వివాహం పరిపూర్ణమయింది." ఇద్దరూ వృత్తిపరంగా కూడా కలిసిపోయారు, 1917లో వీరు హోగార్త్ ప్రెస్ స్థాపించారు, ఇది ఏకకాలంలో వర్జీనియా నవలలతో పాటు టి.ఎస్. ఇలియట్, లారెన్స్ వాన్ డెర్ పోస్ట్, మరియు ఇతరుల రచనలను కూడా ప్రచురించింది. ఈ ప్రెస్ డోరా కారింగ్టన్ మరియు వన్నెస్సా బెల్‌తో పాటుగా సమకాలీన కళాకారుల కృషిని చేపట్టింది.

బ్లూమ్స్‌బరీ గ్రూపు లక్షణం లైంగిక వెసులుబాటును నిరుత్సాహపర్చింది, 1922లో వర్జీనియా, రచయిత, ఉద్యానవనశిల్పి విటా సేక్‌విల్లె-వెస్ట్‌ని కలిసింది, ఈమె హెరాల్డ్ నికల్సన్ భార్య. తాత్కాలిక పరిచయం తర్వాత వీరు లైంగిక సంబంధం ప్రారంభించారు 1920ల వరకు వీరిమధ్య సంబంధం కొనసాగింది.[6] 1928లో, వూల్ఫ్ ఒర్లాండోతో పాటు శాక్‌విల్లెపై ఒక అద్భుతమైన జీవిత చరిత్రను సమర్పించింది, దీంట్లో మూడు శతాబ్దాల కాలంలో మారిన హీరో జీవితకాలాన్ని మరియు ఇద్దరి జెండర్‌ని చిత్రించింది. విటా-శాక్‌విల్లె-వెస్ట్ కుమారుడైన నిగెల్ నికల్సన్ దీన్ని, "సాహిత్యంలో అతి సుదీర్ఘమైన, ఆకర్షణీయమైన ప్రేమలేఖగా ప్రస్తుతించాడు."[6] వీరి సంబంధం ముగిశాక, ఇద్దరు మహిళలూ 1941లో వూల్ఫ్ చనిపోయినంతవరకు స్నేహితులుగా కొనసాగారు. వర్జీనియా వూల్ఫ్ బతికి ఉన్న తన సోదరిలు అడ్రెయిన్ మరియు వనెస్సాలతో సన్నిహితంగా మెలిగింది; థోబీ 26 ఏళ్ల ప్రాయంలో అస్వస్థత కారణంగా మరణించాడు.

రచన[మార్చు]

వూల్ఫ్ 1900లో వృత్తిపరంగా రచనను ప్రారంభించింది, ప్రారంభంలో టైమ్స్ సాహిత్య అనుబంధం కోసం బ్రొంటీ కుటుంబానికి చెందిన హవోర్త్ ఇంటిపై పత్రికా రచన చేసింది.[7] ఆమె తొలి నవల, ది వాయేజ్ అవుట్‌ని 1915లో ఆమె సోదరుడి ప్రెస్ గెరాల్డ్ డక్‌వర్త్ మరియు కంపెనీ లిమిటెడ్‌చే ప్రచురించబడింది.

ఈ నవలకు మొదట్లో మెలింబ్రోసియా పేరు పెట్టారు కాని వూల్ఫ్ పదే పదే చిత్తు ప్రతిని మార్చింది. ది వాయేజ్ అవుట్ తొలి వెర్షన్‌ను వూల్ఫ్ రచనల పండితుడు లూయిస్ డెసాల్వో తిరగరాశారు. ఇప్పుడిది మార్చిన శీర్షికతో అందుబాటులో ఉంది. ఈ నవలకుగాను వూల్ఫ్ చేసిన మార్పులలో చాలావరకు తన సొంత జీవితంలో వచ్చిన మార్పులకు అనుగుణంగా చేయబడ్డాయని డెశాల్వో వాదించారు.[8]

గార్సింగ్టన్‌లో లిట్టన్ స్ట్రాచీ మరియు వూల్ఫ్, 1923.[9]

ప్రజల మేధావిగా వూల్ఫ్ నవలలు మరియు వ్యాసాలను ప్రచురించడం కొనసాగించింది. ఇవి విమర్శనాత్మకంగా ఉండటమే కాకుండా మంచి విజయం కూడా పొందాయి. ఆమె రచనలు చాలావరకు హోగ్రాత్ ప్రెస్ ద్వారా స్వంతంగా ప్రచురించబడ్డాయి. ఇరవయ్యో శతాబ్దపు అతి గొప్ప నవలా రచయితలలో ఒకరిగా, అగ్రశ్రేణి ఆధునికతావాదులలో ఒకరిగా ఈమె ప్రశంసలందుకుంది.

ఇంగ్లీష్ భాషను కొత్త పుంతలు తొక్కించిన మహా ఆవిష్కర్తలలో ఒకరిగా వూల్ఫ్‌ గుర్తించబడింది. ఆమె తన రచనలలో చైతన్య స్రవంతి రీతితో ప్రయోగాలు చేసింది, పాత్రల మానసిక, భావోద్వేగ ప్రేరణలను చిత్రిస్తూ వచ్చింది. రెండవ ప్రపంచయుద్ధం తర్వాత వూల్ఫ్ కీర్తి క్షీణించసాగింది కాని 1970లలో స్రీవాద విమర్శతో ఆమె పేరుప్రఖ్యాతులు పునరుద్ధరించబడ్డాయి.[10]

ఇంగ్లీషు మేధావి వర్గంలోని ఎగువ ఉన్నత తరగతి సంకుచిత ప్రపంచాన్ని చిత్రిక పట్టినందుకు గాను ఆమె రచనలు విమర్శల పాలయ్యాయి. కొంతమంది విమర్శకులు ఆమె రచనలకు సార్వత్రికత మరియు గాఢత లేదని 1920ల నాటి సౌందర్యశాస్త్ర లక్షణాలు వీటిలో లోపించాయని, భ్రమలు కోల్పోయిన సాధారణ పాఠకుడికి భావోద్వేగం మరియు నైతిక సాంగత్యానికి సంబంధించిన ఎలాంటి భావప్రసార శక్తి ఈ రచనలలో లేవని విమర్శించారు. స్వయంగా ఆమె ఒక యూదుడిని పెళ్లాడినప్పటికీ ఆమె కొంతమేరకు యూదు వ్యతిరేక భావాలను కలిగి ఉన్నదని కూడా ఆమెపై విమర్శలు వచ్చాయి. తన రచనలలో తరచుగా ఆమె మూసపోసిన రీతిలో యూదు పాత్రలను ప్రస్తావించి సాధారణీకరించేది, పైగా యూదు పాత్రలను శారీరకంగా నిరాసక్తికరమైన వారుగా, మురికివారుగా వర్ణించిందన్న వాస్తవం ప్రాతిపదికన ఆమెను యూదు వ్యతిరేకిగా విమర్శించారు. 1920లు, 30ల కాలంలో తీవ్రమైన యూదు వ్యతిరేక భావాలు వర్జీనియా వూల్ఫ్‌ని ప్రభావితం చేసి ఉండవచ్చు కూడా. ఆమె తన దినచర్యలో ఇలా రాసుకుంది, "నేను యూదు కంఠస్వరాన్ని ఇష్టపడను; యూదు నవ్వును కూడా నేను ఇష్టపడను." అయితే 1930లో ఆమె స్వరకర్త ఎథిల్ స్మిత్‌కు రాసిన లేఖలో, -ఇది నిగెల్ నికల్సన్ రాసిన జీవిత చరిత్ర వర్జీనియా వూల్ఫ్‌లో ఉటంకించబడింది, ఆమె లియొనార్డ్ యూదుతనాన్ని ప్రశసిస్తూ తన సానుకూల ధోరణులను నిర్ధారించింది, "ఒక యూదును పెళ్లాడటాన్ని నేనెలా ద్వేషించాను- నేనెంత గర్విష్టిని, వారు ఎంతో జీవశక్తి గలవారు."[11] తన సన్నిహిత మిత్రురాలు ఎథిల్ స్మిత్‌కు రాసిన మరో లేఖలో వర్జీనియా క్రైస్తవతత్వాన్ని పూర్తిగా తోసిపుచ్చింది, పాపభీతి కలిగిన "ఆత్మస్తుతి పరత్వం" ఈ మతంలో ఉందని చెబుతూ, ఇలా ప్రకటించింది "నా యూదుడు మరింత ఎక్కువ మత శక్తిని కలిగి ఉన్నాడు, మరింత మానవ ప్రేమను కలిగి ఉన్నాడు."[12] వర్జీనియా మరియు ఆమె భర్త లియొనెద్ వూల్ఫ్ వాస్తవానికి 1930ల నాటి ఫాసిజంని ద్వేషించారు, దానిపట్ల భీతి చెందారు, తాము హిట్లర్ బ్లాక్‌లిస్ట్‌లో ఉన్నామన్న విషయం తెలిసి కూడా వారు యూదు వ్యతిరేకతను నిరసించారు. 1938లో ఆమె రాసిన త్రీ గినియాస్ ఫాసిజం పట్ల తీవ్ర నిరసనను తెలుపుతుంది.[13]

ఒక కల్పనా సాహిత్య రచయితగా వర్జీనియా వూల్ఫ్ ప్రత్యేకతలు ఆమె ప్రధాన శక్తిని నిగూఢపర్చేవి: ఇంగ్లీష్ భాషలో కీలకమైన ఆత్మాశ్రయ నవలా రచయితగా వూల్ఫ్‌ని పేర్కొంటుంటారు. ఆమె నవలలు అత్యంత ప్రయోగ శీలత్వంతో ఉండేవి: వర్ణణాత్మక శైలి, తరచుగా సంఘటనలు లేకపోవడం, అతి సాధారణత్వంతో ఉంటూ, కొన్ని సార్లు పూర్తిగా పాత్రల చైతన్యాన్ని తోసిపుచ్చే స్వభావంతో కూడా ఉండేవి. శ్రవణం మరియు దృశ్య ముద్రణలతో అమితంగా నిండిపోయిన ప్రపంచాన్ని సృష్టించేందుకు ఆమె రచనలు తీవ్రమైన ఆత్మాశ్రయ ధోరణి మరియు శైలీపరమైన సాంకేతిక సమ్మిశ్రణతో ఉండేవి.

వర్జీనియా వూల్ఫ్ యొక్క కవితా దార్శనికత తీవ్రత ఆమె నవలన్నింటిలో సాధారణమైన, కొన్నిసార్లు మామూలు సెట్టింగులను - యుద్ధ వాతావరణాలలో - వ్యక్తీకరించేది. ఉదాహరణకు, మిసెస్ డల్లోవే (1925) పార్టీని నిర్వహించడంలో సాంప్రదాయ డల్లోవే, మధ్యవయస్కురాలైన సొసైటీ మహిళ చేసే ప్రయత్నాలపై కేంద్రీకరిస్తుంది, ఆమె జీవితం కూడా తీవ్రమైన మానసిక వైకల్యాలతో మొదటి ప్రపంచ యుద్ధం నుంచి తిరిగి వచ్చిన శ్రామిక వర్గ పురుషుడు సెప్టిమస్ వారెన్ స్మిత్‌కు సమాంతరంగానే ఉండేది.[14]

టు ది లైట్‌హౌస్ (1927) పది సంవత్సరాల రెండు రోజులతో ముగుస్తుంది. ఈ నవల ఇతివృత్తం రామ్సే కుటుంబం ఒక లైట్‌హౌస్‌ను సందర్శించడంలో పాల్గొనడం, వారిపై దాని ప్రతిఫలనాలు, ముడిపడిన కుటుంబ ఒత్తిళ్ల చుట్టూ తిరుగుతుంది. ఈ నవల ప్రధాన థీమ్‌లలో ఒకటి పెయింటర్ లిలీ బ్రిస్కో‌ సృజనాత్మక ప్రక్రియలో ఉన్న ఘర్షణను చిత్రించడం, కుటుంబ డ్రామా మధ్యలో ఆమె పెయింటింగ్ చేయడానికి ఘర్షణ పడుతుంది. యుద్ధం మధ్యలో, యుద్ధం ప్రాంతానికి వెనుక, దేశంలో నివసిస్తున్న ప్రజలకు ఆమె నవల ఒకవిధమైన ధ్యాన చికిత్సను అందించింది. ఇది కాల గమనాన్ని కూడా ఆవిష్కరించింది, మహిళల నుంచి భావోద్వేగ శక్తిని పురుషులు తీసుకునేలా మహిళలు సమాజంచేత ఎంతగా ఒత్తిడికి గురవుతున్నారో ఈ నవల తెలిపింది.

ఒర్లాండో (1928) వర్జీనియా ఇతర నవలలతో పోలిస్తే పూర్తి భిన్నమైన శైలితో ఉంటుంది. దాని శీర్షిక "ఎ బయాగ్రఫీ"కి తగినట్లుగా ఈ నవల ఒక వాస్తవ వ్యక్తి స్వభావాన్ని ప్రతిబింబించేందుకు ప్రయత్నించింది, ఇది విటా శాక్‌విల్లే-వెస్ట్‌కి అంకితం చేయబడింది. బాలికగా ఉన్నందుకు విటాను ఓదారుస్తూ, ఆమె పూర్వీకుల ఇంటిని పోగొట్టుకున్నందుకు ఓదారుస్తూ నవల నడచింది. ఒకరకంగా ఇది విటాకు, రచయిత కృషికి వ్యంగ్యంతో కూడిన ట్రీట్‌మెంట్‌గా చెప్పవచ్చు. ఓర్లాండోలో చారిత్రక జీవిత చరిత్రకారుల శైలులను ఆమె అవహేళన చేసింది; ఒక ఆడంబరుడైన జీవిత చరిత్రకారుడి పాత్రను దాన్ని అవహేళన చేసే ఉద్దేశంతోనే ఆమె చిత్రించింది.[15]

ది వేవ్స్ (1931) ఆరుగురు స్నేహితుల బృందాన్ని ప్రతిబింబించింది, వీటి ప్రతిఫలనాలు వారి అంతర్గత స్వగతాల కంటే వాటి రాగయుక్త వచన పఠనానికే సన్నిహితంగా ఉంటాయి, ఇది ఒక ఇతివృత్త ప్రాధాన్యత కలిగిన నవల కంటే వచన పద్యాన్ని పోలిన తరంగ శైలి వాతావరణాన్ని సృష్టిస్తుంది.[16]

ఆమె చివరి నవల బిట్వీన్ ది యాక్ట్స్ (1941) వూల్ఫ్ యొక్క ముఖ్యమైన భావాలను క్రోడీకరించి విశదీకరిస్తుంది: కళ, లైంగిక అనిశ్చితి, కాలం, జీవితం యొక్క థీమ్‌లపై ఆలోచన, క్షయం మరియు పునర్‌యౌవనాన్ని ఏకకాలంలోనే చిత్రించడం అనేవి ఇంగ్లీష్ చరిత్ర పొడవునా ఉండే అత్యంత భావనాత్మక, ప్రతీకాత్మక వర్ణనలతో కూడి ఉంటున్నాయి. ఆమె రచనలన్నింటి కంటే అత్యంత ఆత్మాశ్రయ, భావకవితా ధోరణితో ఈ నవల రూపొందింది, అనుభూతి మాత్రంతోనే కాకుండా శైలిలోకూడా ఇది ప్రధానంగా పద్య శైలిలో రాయబడింది.[17]

బృంద భావాలను తిరిగి సాదాశైలిలో చెప్పడానికి దగ్గిరగా, వూల్ఫ్ రచనను బ్లూమ్స్‌బరీతో సంభాషణ నేపథ్యంలో అర్థం చేసుకోవచ్చు, ప్రత్యేకించి (జి.ఇ.మోరె, తదితరులు చెప్పినట్లుగా) సైద్ధాంతిక హేతువాదం వైపు మొగ్గే ధోరణిలో ఆమె రచనను అర్థం చేసుకోవలసి ఉంటుంది.[18]

ఆమె రచనలు జోర్గ్ లూయిస్ బోర్జెస్ మరియు మార్గ్యురైట్ యువర్సెనర్ వంటి రచయితల ద్వారా దాదాపు 50 భాషల్లోకి అనువదించబడ్డాయి.

ఆత్మహత్య[మార్చు]

ఆమె చివరి (మరణానంతరం ప్రచురించబడిన) నవల బిట్వీన్‌ ది యాక్ట్స్ రాతప్రతిని పూర్తి చేసినతర్వాత, వూల్ఫ్ మళ్లీ, గతంలో తానెదుర్కొన్న తీవ్ర నిస్ప్రహ బారిన పడింది. రెండో ప్రపంచ యుద్ధ ఆరంభ కాలంలో ది బ్లిట్జ్ సందర్భంగా లండన్‌లో ఉన్న తన ఇల్లు ధ్వంసం అయిపోయినప్పుడు, తన దివంగత స్నేహితురాలు రోజెర్ ప్రైపై రాసిన జీవితచరిత్రకు తగినంత స్పందన కొరవడిన సందర్భంగా ఆమె మానసిక స్థితి బాగా క్షీణించి ఆమె పని చేయలేని స్థితికి చేరుకున్నారు.[9]

1941 మార్చి 28న వూల్ఫ్ ఆత్మహత్య చేసుకున్నారు. ఆమె తన ఓవర్‌కోట్‌ జేబులలో రాళ్లు నింపి, తర్వాత ఆమె ఇంటికి దగ్గరగా ఉండే ఔస్ నదిలోకి నడచి వెళ్లి నీటిలో మునిగిపోయింది. వూల్ఫ్ అస్థిపంజరం 1941 ఏప్రిల్ వరకు కనుగొనబడలేదు.[19] ఆమె భర్త ఆమె అవశేషాలను సస్సెక్స్‌లోని వారి ఇల్లు రాడ్‌మిల్‌లోని మాంక్స్ హౌస్‌ ఉద్యానవనంలో ఎల్మ్ చెట్టుకింద సమాధి చేశారు.

భర్తకు తను రాసిన చివరి ఉత్తరంలో ఆమె ఇలా రాశారు:

I feel certain that I am going mad again. I feel we can't go through another of those terrible times. And I shan't recover this time. I begin to hear voices, and I can't concentrate. So I am doing what seems the best thing to do. You have given me the greatest possible happiness. You have been in every way all that anyone could be. I don't think two people could have been happier 'til this terrible disease came. I can't fight any longer. I know that I am spoiling your life, that without me you could work. And you will I know. You see I can't even write this properly. I can't read. What I want to say is I owe all the happiness of my life to you. You have been entirely patient with me and incredibly good. I want to say that — everybody knows it. If anybody could have saved me it would have been you. Everything has gone from me but the certainty of your goodness. I can't go on spoiling your life any longer. I don't think two people could have been happier than we have been. V.[20]

'

ఆధునిక పాండిత్యం మరియు వ్యాఖ్యానాలు[మార్చు]

ఇటీవల, ఐలీన్ బారెట్ మరియు పాట్రిషియా క్రేమర్ 1997లో సంకలనపర్చిన విమర్శనాత్మక వ్యాసాల సంకలనం వర్జీనియా: లెస్బియన్ రీడింగ్స్/2} వంటి వర్జీనియా వూల్ఫ్‌పై అధ్యయనాలు, ఆమె రచనలలో స్త్రీవాద మరియు లెస్బియన్ ధీమ్‌లపై చూపు సారించాయి. వివాదాస్పదంగా, లూయిస్ ఎ. డిసల్వో వూల్ఫ్ జీవితం, కెరీర్‌ను చాలావరకు చదివారు. 1989లో ఈమె రాసిన వర్జీనియా వూల్ఫ్: ది ఇంపాక్ట్ ఆఫ్ ఛైల్డ్‌హుడ్ సెక్సువల్ అబ్యూస్ ఆన్ హర్ లైఫ్ అండ్ వర్క్ పుస్తకంలో యువతిగా వూల్ఫ్ లైంగిక దూషణ బారిన పడిన దృక్కోణం నుంచి లూయిస్ ఆమెను చదివారు.

వూల్ఫ్ కల్పనా సాహిత్యం షెల్ షాక్, యుద్ధం, వర్గం మరియు ఆధునిక బ్రిటిష్ సమాజం నేపథ్యంలో చదువబడుతోంది. ఆమె రాసిన కాల్పనికేతర రచనలలో ఉత్తమమైనవి ఎ రూమ్ ఆఫ్ వన్స్ ఓన్ (1929) మరియు త్రీ గినియాస్ (1938), రచనలు. పురుషులు దామాషా ప్రాతినిధ్యంతో సంబంధం లేకుండా చట్టపరమైన, ఆర్థికపరమైన శక్తిని కలిగివున్న కారణంగా మహిళా రచయితులు మరియు మేధావులు ఎదుర్కొంటున్న కష్టాలను, విద్యలో, సమాజంలో మహిళల భవిష్యత్తుకు సంబంధించిన సమస్యలను ఈ రచనలు ఎత్తి చూపాయి.

ఐరేన్ కోట్స్ పుస్తకం లియొనార్డ్ వూల్ఫ్‌ను చూసి ఎవరు భయపడతారు: వర్జీనియా వూల్ఫ్ ఆరోగ్యంపై పరిశోధన, తన భార్యతో లియొనార్డ్ వూల్ఫ్ వ్యవహరించిన తీరు వల్లే ఆమె అనారోగ్యం పెరిగి చివరకు ఆమె మరణానికి కారణమయిందని తెలిపింది. దీన్ని లియొనార్డ్ కుటుంబం అంగీకరించలేదు, కాని ఇది వర్జీనియా వూల్ఫ్ జీవితంలోని సాంప్రదాయిక చిత్రణలో ఉన్న కొన్ని అంతరాలను విస్తృతంగా పరిశోధించి నింపడంలో తోడ్పడింది. మరింత విస్తృత పరిశోధన చేసి సమకాలీన రచనల మద్దతును కూడా పొందిన విక్టోరియా గ్లెన్‌డైనింగ్స్ పుస్తకం లియొనార్డ్ వూల్ఫ్: ఎ బయోగ్రఫీ, లియోనార్డ్ వూల్ఫ్ తన భార్య వర్జీనియాకు మద్దతుగా నిలబడటమే కాకుండా, ఆమె జీవించడానికి, రాయడానికి అవసరమైన జీవితాన్ని, వాతావరణాన్ని అందించడం ద్వారా ఆమె దీర్ఘకాలం మనగలిగేలా చేశాడని చెబుతోంది. వర్జీనియా యూదు వ్యతిరేకత (లియెనార్డ్ నాస్తికుడు) గురించి చెబుతున్న వివరాలు చారిత్రక నేపథ్యంలో తీసుకోకపోవడమే కాకుండా వాటిని చాలా అతిశయించి చెప్పడం జరిగింది. వర్జీనియా స్వంత డైరీలు వూల్ఫ్ పెళ్ళికి సంబంధించిన ఈ దృక్పథాన్ని బలపరుస్తున్నాయి.[21]

వర్జీనియా జీవించి ఉన్నప్పుడే ఆమె జీవిత చరిత్రపై ఒక పుస్తకం వచ్చినప్పటికీ, ఆమె జీవితంపై తొలి అధికారిక అధ్యయనం 1972లో ఆమె మనమరాలు క్వెంటిన్ బెల్ ద్వారా ప్రచురించబడింది.

1992లో థామస్ కరమాగ్నో ది ఫ్లైట్ ఆఫ్ ది మైండ్: వర్జీనియా వూల్ఫ్స్ ఆర్ట్ అండ్ మేనిక్-డిప్రెసివ్ ఇల్‌నెస్" అనే పుస్తకాన్ని ప్రచురించారు.

హెర్మియోన్ లీ 1996లో రాసిన వర్జీనియా వూల్ఫ్ జీవిత చరిత్ర వూల్ఫ్ జీవితం, రచనల గురించి సాధికారికంగా పరిశీలించింది.

2001లో లూయిస్ డెసల్వో మరియు మిచెల్ ఎ.లీస్కా కలిసి ది లెటర్స్ ఆఫ్ విటా శాక్‌విల్లె-వెస్ట్-అండ్ వర్జీనియా వూల్ఫ్‌ ని సంకలన పర్చారు. 2005లో ప్రచురించబడిన జూలియా బ్రిగ్స్ వర్జీనియా వూల్ఫ్స్: యాన్ ఇన్నర్ లైఫ్ పుస్తకం వూల్ఫ్ జీవితంపై ఇటీవలి తాజా పరిశీలనగా నిలిచింది. వూల్ఫ్స్ రచనపై, ఆమె నవలలపై, సృజనాత్మక ప్రక్రియపై ఆమె వ్యాఖ్యానంపై దృష్టి సారించిన ఈ పుస్తకం ఆమె జీవితాన్ని కూలంకషంగా వెలికితీసింది. థామస్ సాజ్ రచించిన మై మాడ్‌నెస్ సేవ్డ్ మి: ది మాడ్‌నెస్ అండ్ మ్యారేజ్ ఆఫ్ వర్జీనియా వూల్ఫ్ (ISBN 0-7658-0321-6) పుస్తకం 2006లో ప్రచురించబడింది.

రీటా మార్టిన్ రచించిన ఫ్లోర్ల్ నో మి పోంగన్ (2006) నాటకం, ద్విలింగ సంపర్కం, యూదుతత్వం, యుద్ధం వంటి వివాదాస్పద అంశాల జోలికి పోకుండా వూల్ఫ్ జీవితంలోని చివరి క్షణాలపై కేంద్రీకరించింది. స్పానిష్ భాషలో రాసిన ఈ నాటకాన్ని నటి మిరియమ్ బెర్ముడెజ్ దర్శకత్వంలో నిర్వహించారు.

చిత్రాలలో[మార్చు]

 • హూ ఈజ్ అఫ్రైడ్ ఆఫ్ వర్జీనియా వూల్ఫ్‌? అనేది ఎడ్వర్డ్ అల్బీ రచించిన అమెరికన్ నాటకం మరియు సినిమా (1966), దీనికి మైక్ నికోలస్ దర్శకత్వం వహించారు (నాటకం నుండి తీసుకున్న ఈ సినిమాకు ఎర్నెస్ట్ లేమన్ స్క్రీన్‌ప్లే రాశారు). ఈ సినిమాలో వర్జీనియా వూల్ఫ్ ఒక పాత్రగా కనిపించలేదు. నాటక రచన ప్రకారం, నాటకం శీర్షిక - పనిచేయని యూనివర్శిటీ దంపతుల గురించిన కథ - "తప్పుడు భ్రమలు లేకుండా జీవించడానికి భయపడేదెవరు" అనే ఎకడమిక్ జోక్‌ను ప్రస్తావిస్తుంది.
 • మైఖేల్ కన్నిగ్‌హామ్ ఉత్తమ నవల ఆధారంగా తీసిన చిత్రం ది హవర్స్ (2002)లో వర్జీనియా వూల్ఫ్ పాత్ర ఉంది. వూల్ఫ్‌గా పాత్ర పోషణకు గాను నటి నికోలె కిడ్మన్ ఉత్తమ నటిగా అకాడమీ అవార్డ్ గెల్చుకుంది.

గ్రంథ పట్టిక[మార్చు]

నవలలు[మార్చు]

 • ది వాయేజ్ అవుట్ (1915)
 • నైట్ అండ్ డే (1919)
 • జాకబ్స్ రూమ్ (1922)
 • మిసెస్ డల్లోవే (1925)
 • టు ది లైట్‌హౌస్ (1927)
 • ఓర్లాండో (1928)
 • ది వేవ్స్ (1931)
 • ది ఇయర్స్ (1937)
 • బిట్వీన్ ది యాక్ట్స్ (1941)

కథానికల సేకరణలు[మార్చు]

 • మండే ఆర్ ట్యూస్‌డే (1921)
 • ఎ హాంటెడ్ హౌస్ అండ్ అదర్ షార్ట్ స్టోరీస్ (1944)
 • మిసెస్ డల్లోవే'స్ పార్టీ (1973)
 • ది కంప్లీట్ షార్టర్ ఫిక్షన్ (1985)

జీవిత చరిత్రలు[మార్చు]

వర్జీనియా వూల్ఫ్ ప్రచురించిన మూడు పుస్తకాలకు "ఎ బయోగ్రఫీ" అనే ఉపశీర్షిక పెట్టింది:

 • Orlando: A Biography (1928, సాధారణ పాత్రలతో కూడిన నవల , విటా శాక్‌విల్లె-వెస్ట్ జీవితంతో ప్రభావితమైంది)
 • Flush: A Biography (1933, మరింత స్పష్టంగా సంకర-కళాసాహిత్య సృజన: "చైతన్య స్రవంతి"గా కాల్పనికసాహిత్యం ప్లష్, కుక్క చెప్పిన కథ; కాల్పనికేతరం కుక్క యజమాని కథను చెబుతున్న అర్థంలో, ఎలిజబెత్ బ్రౌనింగ్ ), 2005లో పర్సెఫోన్ బుక్స్ వారిచే పునర్ముద్రణ అయింది.
 • Roger Fry: A Biography (1940, సాధారణంగా కాల్పనికేతరం గా పాత్రీకరించబడింది, అయితే: "[వూల్ఫ్ యొక్క] నవలా రచనా కౌశలాలు జీవితచరిత్రకారిణిగా ఆమె ప్రతిభకు వ్యతిరేకంగా పనిచేశాయి. ఆమె అనుభావనాత్మక పరిశీలనలు అనేక రకాల వాస్తవాలను మార్షల్ చేసే ఏకకాలిక అవసరంతో అననుకూలంగా పెనుగులాడాయి.[22])

కాల్పనికేతర పుస్తకాలు[మార్చు]

 • మోడరన్ ఫిక్షన్ (1919)
 • ది కామన్ రీడర్ (1925)
 • ఎ రూమ్ ఆఫ్ వన్స్ ఓన్ (1929)
 • ఆన్ బీయింగ్ ఇల్ (1930)
 • ది లండన్ సీన్ (1931)
 • ది కామన్ రీడర్: సెకండ్ సీరీస్ (1932)
 • త్రీ గినియాస్ (1938)
 • ది డెత్ ఆఫ్ ది మోత్ అండ్ అదర్ ఎస్సేస్ (1942)
 • ది మూమెంట్ అండ్ అదర్ ఎస్సేస్ (1947)
 • ది కేప్టెన్స్ డెత్ బెడ్ అండ్ అదర్ ఎస్సేస్ (1950)
 • గ్రానైట్ అండ్ రెయిన్‌బో (1958)
 • బుక్స్ అండ్ పోర్ట్రయిట్స్ (1978)
 • విమెన్ అండ్ రైటింగ్ (1979)
 • సంకలిత వ్యాసాలు (నాలుగు సంపుటాలు)

నాటకం[మార్చు]

 • Freshwater: A Comedy (ఫెర్ఫార్మ్‌డ్ ఇన్ 1923, రివైజ్‌జ్ ఇన్ 1935, అండ్ పబ్లిష్‌డ్ ఇన్ 1976)

ఆటో‌బయోగ్రాఫికల్ వ్రైటింగ్స్ అండ్ డైరీస్[మార్చు]

 • ఏ వ్రైటర్స్ డైరీ (1953) – ఎక్స్‌ట్రాక్స్ట్ ఫ్రమ్ ది కంప్లీట్ డైరీ
 • మూమెంట్స్ ఆఫ్ బీయింగ్ (1976)
 • ఏ మూమెంట్స్ లైబర్టీ: ది షార్టర్ డైరీ (1990)
 • ది డైరీ ఆఫ్ వర్జీనియా వూల్ఫ్ (ఫైవ్ వాల్యూమ్స్) – డైరీ ఆఫ్ వర్జీనియా వూల్ఫ్ ఫ్రమ్ 1915 to 1941
 • ప్యాసనేట్ అప్రెంటీస్: ది ఎర్లీ జర్నల్స్, 1897–1909 (1990)
 • ట్రావెల్స్ విత్ వర్జీనియా వూల్ఫ్ (1993) – గ్రీక్ ట్రావెల్ డైరీ ఆఫ్ వర్జీనియా వూల్ఫ్, ఎడిటెడ్ బై జాన్ మోరిస్
 • ది ప్లాట్‌ఫాం ఆఫ్ టైమ్: మెమొరీస్ ఆఫ్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ , ఎక్స్‌పాండెడ్ ఎడిషన్, ఎడిటెడ్ బై ఎస్. పీ. రోసెన్‌బాఅమ్ (లండన్, హెస్‌పెర్‌అస్, 2008)

లేఖలు[మార్చు]

 • కాంగినియల్ స్పిరిట్స్: ది సెలెక్టెడ్ లెటర్స్ (1993)
 • ది లెటర్స్ ఆఫ్ వర్జీనియా వూల్ఫ్ 1888–1941 (సిక్స్ వాల్యూమ్స్, 1975–1980)
 • పేపర్ డర్ట్స్: ది ఇల్లస్ట్రేటెడ్ లెటర్స్ ఆఫ్ వర్జీనియా వూల్ఫ్ (1991)

ముందుమాటలు, చేర్పులు[మార్చు]

 • సెలక్షన్స్ ఆటో‌బయోగ్రాఫికల్ అండ్ ఇమాజినేటివ్ ఫ్రమ్ ది వర్క్స్ ఆఫ్ జార్జ్ గిస్సింగ్ ఎడ్. ఆల్‌ఫ్రెడ్ సీ. గిస్సింగ్, విత్ యాన్ ఇంట్రడక్షన్ బై వర్జీనియా వూల్ఫ్ (లండన్ అండ్ న్యూయార్క్, 1929)

జీవిత చరిత్రలు[మార్చు]

 • వర్జీనియా వూల్ఫ్ బై నిగెల్ నికల్సన్. న్యూయార్క్, పెంగ్విన్ గ్రూప్. 2000
 • వర్జీనియా వూల్ఫ్: ఎ బయోగ్రఫీ బై క్వెంటిన్ బెల్. న్యూయార్క్, హర్‌కోర్ట్ బ్రాస్ జోవనోవిక్, 1972; రివైజ్‌డ్ ఎడిషన్స్ 1990, 1996
 • "వానెస్సా అండ్ వర్జీనియా" బై సుసన్ సెల్లర్స్ (టు రావెన్స్, 2008; హర్‌కోర్ట్ 2009) [ఫిక్టియోనల్ బయోగ్రఫీ ఆఫ్ వూల్ఫ్ అండ్ హర్ సిస్టర్ వానెస్సా బెల్]
 • ది అన్‌నౌన్ వర్జీనియా వూల్ఫ్ బై రోజెర్ పూలే. కేంబ్రిడ్జ్ యూపీ, 1978.
 • ది ఇన్విజిబుల్ ప్రెజెన్స్: వర్జీనియా వూల్ఫ్ అండ్ ది మదర్-డాటర్ రిలేషన్‌షిప్ బై ఎల్లెన్ బేఅక్ రేసెన్‌మన్. లూసియానా స్టేట్ యూనివర్సిటీ ప్రెస్, 1986.
 • వర్జీనియా వూల్ఫ్ అండ్ ది పాలిటిక్స్ ఆఫ్ స్టైల్ , బై పమేలా జే. ట్రాన్స్‌స్యూ. సునీ ప్రెస్, 1986. ఐఎస్‌బీఎన్ 0262081504
 • ది విక్టోరియన్ హెరిటేజ్ ఆఫ్ వర్జీనియా వూల్ఫ్: ది ఎక్స్‌టర్నల్ వరల్డ్ ఇన్ హర్ నావల్స్ , బై జానిస్ ఎమ్. పాల్. పిలిగ్రిమ్ బుక్స్, 1987. ఐఎస్‌బీఎన్ 0262081504
 • వర్జీనియా వూల్ఫ్స్ టు ది లైట్‌హౌస్ , బై హరోల్డ్ బ్లూమ్. చెల్సియా హౌస్, 1988. ఐఎస్‌బీఎన్ 0262081504
 • వర్జీనియా వూల్ఫ్: ది ఫ్రేమ్స్ ఆఫ్ ఆర్ట్ అండ్ లైఫ్ , బై సీ. రూత్ మిల్లర్. మాక్‌మిల్లన్, 1988. ఐఎస్‌బీఎన్ 0262081504
 • వర్జీనియా వూల్ఫ్: ది ఇంపాక్ట్ ఆఫ్ చైల్డ్‌హుడ్ సెక్సువల్ అబ్యూస్ ఆన్ హర్ లైఫ్ అండ్ వర్క్ బై లూయిస్ డెసాల్వో. బోస్టన్ : లిటిల్, బ్రౌన్, 1978.
 • ఏ వర్జీనియా వూల్ఫ్ క్రోనోలజీ బై ఎడ్వర్డ్ బిషప్. బోస్టన్: జీ.కే. హాల్ అండ్ కో., 1989.
 • ఏ వెరీ క్లోజ్ కాన్‌స్పిరసీ: వనేస్సా బెల్ అండ్ వర్జీనియా వూల్ఫ్ బై జానే డన్న్. బోస్టన్ : లిటిల్, బ్రౌన్, 1978.
 • వర్జీనియా వూల్ఫ్: ఏ వ్రైటర్స్ లైఫ్ బై లిండాల్ గోర్డన్. న్యూయార్క్: నార్టన్ఓ, 1984; 1991.
 • వర్జీనియా వూల్ఫ్ అండ్ వార్ , బై మార్క్ హుస్సే. సైరాక్యూస్ యూనివర్సిటీ ప్రెస్,1991. ఐఎస్‌బీఎన్ 0262081504
 • ది ఫ్లైట్ ఆఫ్ ది మైండ్: వర్జీనియా వూల్ఫ్స్ ఆర్ట్ అండ్ మానిక్-డిప్రెసివ్ ఇల్‌నెస్ బై థామస్ డీ. కారామగో. బెర్‌కెలే: యు ఆఫ్ కాలిఫోర్నియా ప్రెస్, 1992
 • వర్జీనియా వూల్ఫ్ బై జేమ్స్ కింగ్. ఎన్‌వై: డబ్ల్యూ. డబ్ల్యూ నార్టన్, 1994.
 • ఆర్ట్ అండ్ అఫెక్షన్: ఎ లైఫ్ ఆఫ్ వర్జీనియా వూల్ఫ్ బై పాంట్‌హియా రీడ్. న్యూయార్క్: ఆక్స్‌ఫర్డ్ యూపీ, 1996.
 • వర్జీనియా వూల్ఫ్ by హెర్మీవన్ లీ. న్యూయార్క్: నోఫ్, 1997.
 • గ్రానైట్ అండ్ రెయిన్‌బో: ది హిడ్డెన్ లైఫ్ ఆఫ్ వర్జీనియా వూల్ఫ్ బై మిట్‌చెల్ల్ లియాస్కా. న్యూయార్క్: ఫార్రర్, స్ట్రావస్ అండ్ గిరోఅక్స్, 1998.
 • ది ఫెమినిస్ట్ ఈస్తటిక్స్ ఆఫ్ వర్జీనియా వూల్ఫ్ , బై జానే గోల్డ్‌మన్. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం పాత్రికేయులు, 1972. ఐఎస్‌బీఎన్ 0262081504
 • వర్జీనియా వూల్ఫ్ అండ్ ది నైన్టీన్త్-సెంచురీ డొమెస్టిక్ నావెల్ , బై ఎమిలీ బ్లెయిర్. సునీ ప్రెస్, 2002. ఐఎస్‌బీఎన్ 0262081504
 • వర్జీనియా వూల్ఫ్: బికమింగ్ ఎ వ్రైటర్ , బై క్యాథరిన్ డాల్సిమెర్. యేల్ యూనివర్సిటీ ప్రెస్, 2002. ఐఎస్‌బీఎన్ 0262081504
 • వర్జీనియా వూల్ఫ్: ది విల్ టు క్రియేట్ యాజ్ ఎ ఉమన్ బై రుత్ గ్రూబెర్. న్యూయార్క్: కరోల్ అండ్ గ్రాఫ్ పబ్లిషర్స్, 2005
 • మై మ్యాడ్‌నెస్ సేవ్‌డ్ మి: ది మ్యాడ్‌నెస్ అండ్ మ్యారేజ్ ఆఫ్ వర్జీనియా వూల్ఫ్ బై థామస్ జాస్జ్, 20060
 • వర్జీనియా వూల్ఫ్: యాన్ ఇన్నర్ లైఫ్ , బై జులియా బ్రిగ్స్. హర్‌కోర్ట్, 2006. ఐఎస్‌బీఎన్0262081504
 • ది బిసైడ్, బాత్‌టబ్ అండ్ ఆర్మ్‌చైర్ కంపానియన్ టు వర్జీనియా వూల్ఫ్ అండ్ బ్లూమ్స్‌బర్రీ బై సరహ్ ఎమ్. హాల్, కంటినమ్ పబ్లిషింగ్, 2007
 • వర్జీనియా వూల్ఫ్ అండ్ ది విసిబుల్ వరల్డ్ , బై ఎమిలీ డల్గర్నో. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం పాత్రికేయులు, 1972. ఐఎస్‌బీఎన్ 0262081504
 • ఎ లైఫ్ ఆఫ్ వన్స్ ఓన్: ఎ గైడ్ టు బెటర్ లివింగ్ త్రూ ది వర్క్ అండ్ విస్డమ్ ఆఫ్ వర్జీనియా వూల్ఫ్ బై ఇలాన సైమన్స్, న్యూయార్స్: పెంగ్విన్ ప్రెస్, 2007

సంబంధిత రచనలు మరియు సాంస్కృతిక ప్రస్తావనలు[మార్చు]

 • అమెరికన్ స్వరకర్త డొమినిక్ అర్జెంటో (b.1927) తన ఫ్రమ్ ది డైరీ ఆఫ్ వర్జీనియా వూల్ఫ్ అనే పాటకు గాను సంగీతంలో పులిట్జర్ బహుమతిని అందుకున్నారు (1975), దీన్ని డేమ్ జానెట్ బేకర్, మెజ్జో సోప్రానో మరియు మార్టిన్ ఇస్సెప్, వియానిస్ట్ ద్వారా మిన్నసోటా లోని మిన్నేపోలిస్‌లో ఆర్కెస్ట్రా హాల్‌లో విడుదల చేశారు.
 • 1998లో పులిట్జర్ బహుమతి పొందిన మైఖేల్ కన్నింగ్‌హామ్ నవల ది హవర్స్ వూల్ఫ్ నవల మిసెస్ డల్లోవే ద్వారా ప్రభావితమైన ముగ్గురు మహిళలపై చూపు సారించింది. 2002లో, ఈ నవల సినిమా రూపం విడుదలైంది, వూల్ఫ్ పాత్రలో నటించిన నికోలీ కిడ్‌మన్ 2002లో ఉత్తమ నటిగా అకాడమీ అవార్డ్ గెల్చుకుంది. ఈ సినిమాలో జూలియన్నె మోర్ మరియు మెరిల్ స్ట్రీప్ కూడా నటించారు.
 • ఎడ్వర్డ్ అల్బీ నాటకం హూ ఈజ్ అఫ్రెయిడ్ ఆఫ్ వర్జీనియా వూల్ఫ్?, 1963లో ప్రదర్శించబడింది తర్వాత దీని సినిమా రూపాన్ని 1966లో విడుదల చేశారు. నాటకం/సినిమా రెండూ వూల్ఫ్ పేరును మ్యూజికల్ పంచ్ లైన్‌గా వాడుకున్నారు, "హూ ఈజ్ ఆఫ్రెయిడ్ ఆఫ్ ది బిగ్ బ్యాడ్ వూల్ఫ్?" అనే పాటలోని ది బిగ్ బ్యాడ్ వూల్ఫ్‌ స్థానంలో వచ్చిన జోక్‌కోసం వూల్ఫ్ పంచ్ లైన్‌ని వాడుకున్నారు. "వర్జీనియా వూల్ఫ్"తో. లియొనార్డ్ వూల్ఫ్‌ని తన దివంగత భార్య పేరును ఉపయోగించుకోవడానికి గాను అల్బీ అనుమతిని కోరి ఆమోదింప జేసుకున్నప్పటికీ, నాటకం మరియు సినిమాకు రచయిత్రితో ఆమె జీవితంతో ఎలాంటి సంబంధం లేదు.

గమనికలు[మార్చు]

 1. అలన్ బెల్, ‘స్టీఫెన్, సర్ లెస్‌లీ (1832–1904)’, ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీ ఆఫ్ నేషనల్ బయోగ్రఫీ, ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్, సెప్టెంబర్ 2004; ఆన్‌లైన్ ఎడిషన్, మే 2006
 2. 2.0 2.1 రాబర్ట్ మేయర్, 1998, కేస్ స్టడీస్ ఇన్ అబ్‌నార్మల్ బిహేవియర్, అల్లిన్ అండ్ బాకన్
 3. క్రిస్టైన్ కెన్‌యాన్ జోన్స్ అండ్ అన్నా స్నైత్, ‘“టిల్టింగ్ అట్ యూనివర్సిటీస్”: వూల్ఫ్ అట్ కింగ్స్ కాలేజ్ లండన్’, వూల్ఫ్ స్టడీస్ యాన్యువల్, వాల్యూమ్ 16, 2010, పేజీలు 1–44."
 4. బెల్ 1996: 44
 5. బ్రిగ్స్, వర్జీనియా వూల్ఫ్ (2005), 69–70
 6. 6.0 6.1 "Matt & Andrej Koymasky – Famous GLTB – Virginia Woolf". Andrejkoymasky.com. Retrieved 2008-09-08.
 7. "Virginia Woolf". Retrieved 2007-10-05.
 8. హావులే, జే. (1982). మోలిమ్‌బ్రోసియా: యాన్ ఎర్లీ వెర్షన్ ఆఫ్ "జి వోయేజ్ అవుట్". కాంటెంపరరీ లిటరేచర్ , 23, 100–104.
 9. 9.0 9.1 లీ, హెర్మీ‌వన్: "వర్జీనియా వూల్ఫ్." నోప్, 1997.
 10. "క్రిటికల్ ఎస్సేస్ ఆన్ వర్జీనియా వూల్ఫ్", మోరిస్ బేజా, 1985, ఇంట్రడక్షన్, పేజీలు.1,3,53.
 11. ""Mr. Virginia Woolf"". Commentarymagazine.com. Retrieved 2008-09-08.
 12. "ది లెటర్స్ ఆఫ్ వర్జీనియా వూల్ఫ్" వాల్యూమ్ ఫైవ్ 1932–1935, నైజెల్ నికోల్సన్ అండ్ జోన్నె ట్రావుట్‌మన్, 1979, పేజీ. 321.
 13. "ది హవర్స్" డీవీడీ, "స్పెషల్ ఫీచర్స్", "ది మైండ్ అండ్ టైమ్స్ ఆఫ్ వర్జీనియా వూల్ఫ్", 2003.
 14. "క్రిటికల్ ఎస్సేస్ ఆన్ వర్జీనియా వూల్ఫ్", మోరిస్ బేజా, 1985, పేజీలు.13,53.
 15. "ది నావెల్స్ ఆఫ్ వర్జీనియా వూల్ఫ్", హెర్మీ‌ఒన్ లీ, 1977, పేజీలు.138–157.
 16. "క్రిటికల్ ఎస్సేస్ ఆన్ వర్జీనియా వూల్ఫ్", మోరిస్ బేజా, 1985, పేజి నెం.19.
 17. "క్రిటికల్ ఎస్సేస్ ఆన్ వర్జీనియా వూల్ఫ్", మోరిస్ బేజ, 1985, పేజి నెం.24.
 18. "ఫ్రమ్ కాల్ఫమ్ టు బ్లూమ్స్‌బర్రీ: ఎ జెనియలోనీ ఆఫ్ మోరల్స్", ప్రొఫెసర్ గెర్‌ట్రూడ్ హిమ్మెల్‌ఫర్బ్, 2001. http://www.facingthechallenge.org/himmelfarb.php
 19. Panken, Shirley (1987). ""Oh that our human pain could here have ending" — Between the Acts". Virginia Woolf and the "Lust of Creation": a Psychoanalytic Exploration. SUNY Press. pp. 260–262. ISBN 9780887062001. Retrieved 13 August 2009.
 20. Rose, Phyllis (1986). Woman of Letters: A Life of Virginia Woolf. Routledge. p. 243. ISBN 0863580661. Retrieved 2008-09-24.
 21. ""Mr. Virginia Woolf"". Commentarymagazine.com. Retrieved 2008-09-08.
 22. ఫ్రాన్సెస్ స్పాల్డింగ్ (ఈడీ.), వర్జీనియా వూల్ఫ్: పేపర్ డర్ట్స్: ది ఇల్లస్ట్రేటెడ్ లెటర్స్ , కాలిన్స్ అండ్ బ్రౌన్, 1991, (ఐఎస్‌బీఎన్ 1-85585-046-ఎక్స్) (హెచ్‌బి) అండ్ (ఐఎస్‌బీఎన్ 1-85585-103-2) (పీబీ), పీపీ. 139–140

బాహ్య లింకులు[మార్చు]

మూస:Wikiquotepar

మూస:Virginia Woolf