వర్తమానతరంగిణి
'
| సంపాదకులు | పువ్వాడ వెంకట్రావు |
|---|---|
| ప్రచురణకర్త | సయ్యద్ రంహంతుల్లా |
| స్థాపకులు | సయ్యద్ రంహంతుల్లా |
| స్థాపించిన సంవత్సరం | 1842 |
| మొదటి సంచిక | 1842-06-08 |
| భాష | తెలుగు |
'వర్తమానతరంగిణి 1842 జూన్ 8 న మద్రాసులో సయ్యద్ రహమతుల్లా స్థాపించిన వార పత్రిక.[1] ఇది ఒక ముస్లిం వెలువరించిన తొలి తెలుగు వార పత్రిక. ఇది ఒక దశాబ్దం పైగా కొనసాగింది.[2] చిన్నయసూరి రచనా ప్రారంభ దశలో వర్తమానతరంగిణిలో రాసేవాడు.[3] ఈ పత్రిక వాడుక భాషలోనే వెలువడేది.[4] బుచ్చిరెడ్డిపాళెం నుంచి వర్తమానతరంగిణి మాసపత్రిక సాహిత్యానికి, వార్తలకు సమప్రాధాన్యాన్నిస్తూ వెలువడింది.[5] ఆరునెలల తరువాత పత్రికకు సంపాదకుడుగా పువ్వాడ వెంకట్రావు పనిచేసాడు.[6]
విశేషాలు
[మార్చు]మొదటి పత్రికలో ఆయన రాసిన మాటలు: "మేము మిక్కిలి ధనవంతులము కాము. ఆంధ్ర భాష యందు మిక్కిలి జ్ఞానము గలవారమూ కాము. హిందువుల యొక్క స్నేహమునకు పాత్రులమై తద్వారా ప్రతిష్ట పొందవలెననే తాత్పర్యము చేత నూరార్లు వ్యయపడి ముద్రాక్షరములు మొదలగు పనిముట్లను సంపాదించి ఈ పత్రికను ఉదయింపజేయడమునకు కారకులమైతిమి"
పత్రిక ఇంగ్లీషు డెమ్మీ సైజులో చైనా పీచు కాగితంపై 12 పేజీలు ఉండేది. పేజీకి రెండు కాలములుండేవి. ఒక్కోసారి 8 పేజీలే వేసేవారు. ఫోర్ట్ సెంట్‌జార్టి గెజిట్ లోని విషయాలను తెలుగులోకి అనువదించి వేసేవారు. అందుచేత గెజిట్ ప్రతి మంగళవారం వెలువడగా, వర్తమానతరంగిణి ప్రతి బుధవారం వెలువడేది. ఆ తర్వాత ప్రతి గురువారం వెలువడేది. అప్పుడప్పుడూ పత్రికకు అనుబంధం కూడా వేసేవారు. దాన్ని 'ఉపపత్రిక' అనేవారు.[7]
రచనలు
[మార్చు]వర్తమానతరంగిణిలో క్రైస్తవమత ప్రచారఖండన, సమస్యాపూరణలు, అధికారుల నిరంకుశ ప్రవర్తనలు మొదలైనవి ప్రచురించేవారు. లోకరక్షకుడు, జనమనోరంజకుడు, లోకోపకారి, న్యాయవాది, సకలజనసమ్మతుడు, వికటసంకట కవి అనే పేర్లతో పాఠకుల లేఖలను ఇందులో ప్రచురించేవారు. ఆంధ్ర భాషా సంజీవని, వివేకవర్థిని వంటి పత్రికలు ఈ పత్రిక గురించి రాసాయి. తెలుగులో ప్రసిద్ధి పొందిన తొలి పత్రికలలో ఇది మొదటిది. మహాభారతాన్ని తొలిసారిగా, 1842 లో, వర్తమానతరంగిణిలో ప్రచురించారు. కొన్ని ప్రబంధాలు, శతకాలను కూడా ఇందులో ప్రచురించారు.[8]
మూలాలు
[మార్చు]- ↑ రాపోలు, ఆనంద భాస్కర్ (1988). జర్నలిజం చరిత్ర - వ్యవస్థ. p. 40. Retrieved 28 December 2017.
- ↑ "హిత సూచని – ఈమాట" (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2023-04-16.
- ↑ "పుట:2015.497290.chinnayasuuri-jiivitamu.pdf/91 - వికీసోర్స్". te.wikisource.org. Retrieved 2023-04-16.
- ↑ "పుట:English Journalismlo Toli Telugu Velugu Dampuru Narasayya.pdf/113 - వికీసోర్స్". te.wikisource.org. Retrieved 2023-04-16.
- ↑ "పుట:English Journalismlo Toli Telugu Velugu Dampuru Narasayya.pdf/122 - వికీసోర్స్". te.wikisource.org. Retrieved 2023-04-16.
- ↑ https://sarasabharati.files.wordpress.com/2013/01/telugu-news-papers.jpg. "తమిళనాట తొలి తెలుగు పత్రిక".
{{cite web}}: External link in(help)CS1 maint: numeric names: authors list (link)|last= - ↑ జె., చెన్నయ్య (2003). "ప్రారంభ దశలో వివిధ పత్రికలు - తొలి పత్రిక". తెలుగు దినపత్రికలు భాషా సాహిత్య స్వరూపం. హైదరాబాదు: రవికిరణ్ పబ్లికేషన్స్. p. 30.
- ↑ వెలగపూడి, వైదేహి (2013). మహాకవి దాసు శ్రీరాములు గారి కథలు - ఒక సమీక్ష. హైదరాబాదు: మహాకవి దాసు శ్రీరాములు స్మారకసమితి.