వర్షా భోంస్లే
| Varsha Bhosle | |
|---|---|
| జననం | 1956 Nagpur, India |
| మరణం | 2012 October 8 (వయసు: 55–56) Mumbai, Maharashtra, India |
| విశ్వవిద్యాలయాలు | Elphinstone College |
| వృత్తి |
|
| భార్య / భర్త |
Hemant Kenkre (before 1998) |
| తల్లిదండ్రులు |
|
| కుటుంబం | Mangeshkar family and Manikya dynasty (in-laws) |
వర్షా భోంస్లే (1956- 2012 అక్టోబర్ 8) ముంబై చెందిన భారతీయ గాయని, పాత్రికేయురాలు రచయిత్రి. వర్షా భోస్లే ప్రముఖ నేపథ్య గాయని ఆశా భోంస్లే కుమార్తె.[1]
కెరీర్
[మార్చు]వర్షా భోస్లే తన తల్లి ఆశా భోంస్లే తో కలిసి సంగీత కచేరీలలో కనిపించింది . వర్షా భోస్లే 1973లో ముంబైలోని పెడర్ రోడ్ హిల్ గ్రేంజ్ హైస్కూల్ నుండి తన పాఠశాల విద్యను పూర్తి చేసింది.[2] వర్షా భోస్లే ముంబైలోని బొంబాయి విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న ఎల్ఫిన్స్టోన్ కళాశాల లో రాజకీయ శాస్త్రాన్ని అభ్యసించింది.[2]
వర్షా భోస్లే 1997-2003 మధ్యకాలంలో భారతీయ వార పత్రిక వెబ్ పోర్టల్ లో వ్యాసాలు రాసింది. 1994-1998 మధ్యకాలంలో ది సండే అబ్జర్వర్ వారపత్రిక కోసం రచనలు రచించింది. 1993లో జెంటిల్మాన్ పత్రిక కోసం అనేక వ్యాసాలు రాశారు.[1] ఆమె టైమ్స్ ఆఫ్ ఇండియా రక్షక్-ది ప్రొటెక్టర్ పోలీస్ మ్యాగజైన్ కోసం కొన్ని కథనాలు కూడా రాసింది.[1]
వ్యక్తిగత జీవితం
[మార్చు]ఆమె తన తల్లి ఆశా భోంస్లే తో కలిసి ముంబైలో నివసించింది. వర్షా భోస్లే క్రీడా రచయిత ప్రజా సంబంధాల నిపుణుడు హేమంత్ కెంక్రెను వివాహం చేసుకున్నారు, కానీ ఈ జంట 1998లో విడాకులు తీసుకున్నారు. ఆమె డిప్రెషన్ లో ఉంది, సన్నిహిత స్నేహితుడి మరణంతో డిప్రెషన్ తీవ్రతరం అయ్యింది. మానసిక చికిత్స చేయించుకుంది. 2008 సెప్టెంబరు 9న, వైద్యు ఇచ్చిన మందులు అధిక మోతాదులో తీసుకుంది. దీంతో వర్షా భోస్లేను ముంబైలోని జస్లోక్ ఆసుపత్రి చేర్చారు.[3][4] 2012 అక్టోబర్ 8న, భోంస్లే ముంబైలోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకుంది.[1] ఆమె మృతదేహాన్ని ఆమె తల్లి డ్రైవర్ పనిమనిషి ఆమె ఇంటిలోని సోఫాపై రక్తపు మడుగులో కనుగొన్నారు.[1][2][4] ముంబై పోలీసులు తరువాత ఆత్మహత్యను ధృవీకరించారు. లైసెన్స్ పొందిన తుపాకీ తో ఆమె తలపై కాల్చుకున్నట్లు చెప్పారు.[4][5][6]
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 1.3 1.4 "Why did Asha Bhosles daughter Varsha commit suicide? Police clueless". India Today. 8 October 2012. Retrieved 2 August 2019. ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>ట్యాగు; ":0" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు - ↑ 2.0 2.1 2.2 "Varsha Bhosle: Asha Bhosle's daughter had a troubled life – Times of India". The Times of India/Mumbai Mirror. 8 October 2012. Retrieved 2 August 2019. ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>ట్యాగు; ":1" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు - ↑ "Asha's daughter in hospital after pill overdose] News article adverse reaction". Mid-Day. 10 September 2008. Archived from the original on 5 March 2016. Retrieved 2 August 2019.
- ↑ 4.0 4.1 4.2 "'Gautam's death depressed Asha Bhosle's daughter'". www.santabanta.com. 9 October 2012. Retrieved 2 August 2019.
- ↑ Mateen Hafeez; Bharati Dubey (8 October 2012). "Varsha Bhosle, daughter of Asha Bhosle, commits suicide". The Times of India. TNN. Retrieved 2 August 2019.
- ↑ Aditi Raja (8 October 2012). "Asha Bhosles daughter varsha bhosle commits suicide". India Today. Retrieved 2 August 2019.