వర్ష పట్నాయక్
వర్ష పట్నాయక్, ఒడిశా రాష్ట్రంలోని పారాదీప్ లో జన్మించిన భారతీయ నటి. ఆమె ఒడియా సినిమా పరిశ్రమలో పనిచేస్తుంది. ఆమె తొలి చిత్రం తులసి అపా. ఒడిశా ప్రభుత్వం ఆమెకు 27వ రాష్ట్ర చలనచిత్ర పురస్కారాలలో ఉత్తమ నటిగా అవార్డు ఇచ్చింది. దీంతో ఆమె తొలి చిత్రంతోనే ప్రసిద్ధి చెందింది.
కెరీర్
[మార్చు]2015లో ఆమె హైదరాబాదులోని ఒక ఐటి కంపెనీలో పనిచేస్తున్నప్పుడు ఆడిషన్ ఇచ్చిన తర్వాత అమియా పట్నాయక్ దర్శకత్వం వహించిన 'తులసి అపా' చిత్రంలో అవకాశం అందుకుంది.[1] ఈ చిత్రం సామాజిక కార్యకర్త, పద్మశ్రీ అవార్డు గ్రహీత తులసి ముండా జీవితం ఆధారంగా రూపొందించబడింది.[2] తులసి అపా చిత్రం ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఐఎఫ్ఎఫ్ఐ) 21వ కోల్కతా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ తో పాటు 8వ బెంగళూరు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో, ఇంటర్నేషనల్ ఫిల్మెస్టివల్ అఫ్ సిమ్లా (ఐఎఫ్ఎఫ్ఎస్), 8వ నాసిక్ ఇంటర్నేషనల్ ఫిల్మోత్సవంలలో ప్రదర్శించబడింది.[3][4] ఈ చిత్రం 2017 మే 19న థియేటర్లలో విడుదలైంది.[5] ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వరల్డ్ వైడ్ లో ప్రదర్శించబడిన మొదటి ఒడియా చలన చిత్రంగా మారింది.[6]
ఫిల్మోగ్రఫీ
[మార్చు]| సంవత్సరం | సినిమా | పాత్ర | మూలం |
|---|---|---|---|
| 2017 | తులసి అపా | తులసి ముండా | |
| 2022 | ప్రతీక్ష్యం | కల్యాణి |
గుర్తింపు
[మార్చు]| సంవత్సరం | అవార్డు | సినిమా | వర్గం | ఫలితం | మూలం |
|---|---|---|---|---|---|
| 2015 | 27వ ఒడిశా రాష్ట్ర చలనచిత్ర అవార్డు | తులసి అపా | ఉత్తమ నటి | విజేత | [7] |
| 2016 | 1వ హర్యానా అంతర్జాతీయ చలన చిత్రోత్సవం | విజేత | [8] |
మూలాలు
[మార్చు]- ↑ "Debutante proves mettle in Tulasi Apa - OrissaPOST". Odisha News, Odisha Latest news, Odisha Daily - OrissaPOST (in అమెరికన్ ఇంగ్లీష్). 2016-12-16. Retrieved 2020-01-16.
- ↑ "Tulasi Apa sweeps film awards". www.telegraphindia.com (in ఇంగ్లీష్). Retrieved 2020-01-16.
- ↑ Bureau, ReportOdisha (2016-10-15). "Biopic 'Tulasi Apa' to be screened at Tehran Jasmine International Film Festival". ReportOdisha.com (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2020-01-15.
{{cite web}}:|last=has generic name (help) - ↑ "'Tulasi Apa' Gets Applaud at Fest". The New Indian Express. 7 February 2016. Retrieved 2020-01-16.
- ↑ "Wait for Tulasi Munda biopic in city". www.telegraphindia.com (in ఇంగ్లీష్). Retrieved 2020-01-16.
- ↑ "Biopic on Odisha activist Tulasi Munda bags top honours at IFFS | Sambad English" (in అమెరికన్ ఇంగ్లీష్). 2016-10-04. Retrieved 2020-01-16.
- ↑ "Debutante proves mettle in Tulasi Apa - OrissaPOST". Odisha News, Odisha Latest news, Odisha Daily - OrissaPOST (in అమెరికన్ ఇంగ్లీష్). 2016-12-16. Retrieved 2020-01-16.
- ↑ "Debutante proves mettle in Tulasi Apa - OrissaPOST". Odisha News, Odisha Latest news, Odisha Daily - OrissaPOST (in అమెరికన్ ఇంగ్లీష్). 2016-12-16. Retrieved 2020-01-16.