వలంగైమన్ ఎ.షణ్ముగసుందరం పిళ్ళై

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వలంగైమన్ ఆరుముగం షణ్ముగసుందరం పిళ్ళై
Shanmugasundaram pillai.jpg
వలంగైమన్ షణ్ముగసుందరం పిళ్ళై
వ్యక్తిగత సమాచారం
జననం (1920-04-02) 1920 ఏప్రిల్ 2 (వయస్సు 101)
సెగల్ మాదాపురం, తమిళనాడు, భారతదేశం
మరణం1994 ఏప్రిల్ 22(1994-04-22) (వయస్సు 74)
సంగీత శైలికర్ణాటక సంగీతం
వృత్తిడోలు విద్వాంసుడు
వాయిద్యాలుడోలు

వలంగైమన్ ఎ.షణ్ముగసుందరం పిళ్ళై కర్ణాటక సంగీత డోలు వాద్య కళాకారుడు.

విశేషాలు[మార్చు]

ఇతడు 1920, ఏప్రిల్ 2[1]న తమిళనాడులోని సెగల్ మాదాపురం అనే గ్రామంలో జన్మించాడు. ఇతని బాల్యంలో ఇతని కుటుంబం శ్రీలంకకు వలస వెళ్ళింది. ఇతడు మొదట డోలు వాద్యాన్ని తన తండ్రి వి.ఆరుముగం పిళ్ళై, బాబాయి వి.సీతారామ పిళ్ళైల వద్ద నేర్చుకున్నాడు.[2]. తరువాత భారతదేశానికి తిరిగి వచ్చి నాచియార్ కోవిల్ రాఘవ పిళ్ళై వద్ద శిష్యుడిగా చేరాడు. ఇతడు తన 15 సంవత్సరాల వయసు నుండి ప్రదర్శనలు ఇవ్వసాగాడు. మొదట తన గురువు రాఘవపిళ్ళైతో కలిసి డోలు వాయించినా తరువాత అందరు పేరుపొందిన నాదస్వర విద్వాంసులకు సహకారం అందించాడు. ఇతడు ఎక్కువగా షేక్ చిన మౌలానాకు 30 సంవత్సరాల పాటు డోలు సహకారం అందించాడు. ఇతడు సోలో ప్రదర్శనలు కూడా చేశాడు. ఇతడు నాదస్వర విద్వాంసులకే కాక టి.ఆర్.మహాలింగం, ఎన్.రమణి వంటి వేణుగాన విద్వాంసులకు, ఉప్పలపు శ్రీనివాస్ వంటి మాండొలిన్ విద్వాంసులకు, టి.ఎన్.శేషగోపాలన్ వంటి గాత్ర విద్వాంసులకు ప్రక్కవాద్యం అందించాడు[3].

అవార్డులు, గుర్తింపులు[మార్చు]

"తమిళనాడు ఐయల్ ఇసై నాటక మన్రమ్"‌ ఇతడిని కళైమామణి పురస్కారంతో సత్కరించింది. తమిళనాడు ప్రభుత్వం ఇతడిని ఆస్థాన విద్వాంసుడిగా నియమించింది. 1985లో కేంద్ర సంగీత నాటక అకాడమీ ఇతడికి అవార్డును ప్రకటించింది. ఈ అవార్డును పొందిన మొట్టమొదటి డోలు కళాకారుడు ఇతడే. 1978లో మద్రాసు సంగీత అకాడమీ ఇతడికి టి.టి.కె.అవార్డును ఇచ్చింది. ఇంకా ఇతనికి "కలియుగ నంది", "జతీస్వర కళానిధి" మొదలైన బిరుదులు ఉన్నాయి.

శిష్యులు[మార్చు]

ఇతడు అనేక మంది శిష్యులను డోలు కళా విద్వాంసులుగా తీర్చిదిద్దారు. ఇతని శిష్యులలో కుళికారై రామకృష్ణన్, తిరువీళిమిళై చెల్లయ్య, తిరుకణ్ణమంగై పద్మనాభన్, తిరువోత్రియుర్ బాలసుందరం మొదలైన వారున్నారు. ఇతని కుమారుడు ఎస్.మురుగానందం, మనుమలు నవనీతం, ధనపాల్ వాద్యపరికరాల తయారీని తమ వృత్తిగా స్వీకరించారు. ఇతని మునిమనుమడు తంజావూరు కె.ప్రవీణ్ కుమార్ మృదంగ కళాకారుడిగా రాణిస్తున్నాడు.[1]

మరణం[మార్చు]

ఇతడు 1994 ఏప్రిల్ 22వ తేదీన తన 75వ యేట మరణించాడు.[1]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 1.2 parivadini. "Valangaiman Shanmugasundaram". rasikas.org. rasikas.org. Retrieved 22 March 2021.
  2. web master. "Valangaiman A. Shanmugasundaram Pillai". SANGEET NATAK AKADEMI. SANGEET NATAK AKADEMI. Retrieved 22 March 2021.[permanent dead link]
  3. B. Kolappan (12 January 2021). "Remembering a trendsetting thavil maestro". The Hindu. Retrieved 22 March 2021.