వలసవాదం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పశ్చిమ దేశాల వలసవాదంతో సంబంధం లేని వలసవాదం యొక్క ఉదాహరణల కోసం వలస రాజ్యం (కాలనీ) మరియు వలస రాజ్యాల ఏర్పాటులను చూడండి. కాలనైజేషన్ (విశదీకరణ)ను కూడా చూడండి
కలపతో తయారు చేసిన ఒక శిరాస్త్రాణం (ఇది రెండో ఫ్రెంచ్ సామ్రాజ్యానికి చెందినది), ఉష్ణమండల ప్రాంతాల్లో వలసవాదానికి ఇది చిహ్నంగా ఉంది.

ఒక భూభాగంలో మరొక భూభాగానికి చెందిన ప్రజలు వలస రాజ్యాలను ఏర్పాటు చేయడం, నిర్వహించడం, కొనుగోలు చేయడం మరియు విస్తరించడాన్ని వలసవాదం అంటారు. వలసవాదం అనేది ఒక ప్రక్రియ, దీనిలో వలసరాజ్యం (కాలనీ) పై మెట్రోపోల్ (సామ్రాజ్య ప్రధాన నగరం) కు సార్వభౌమాధికారం ఉంటుంది, కాలనీవాసులు - మెట్రోపోల్ నుంచి వచ్చిన వ్యక్తులు కాలనీ యొక్క సామాజిక నిర్మాణం, ప్రభుత్వం మరియు ఆర్థిక వ్యవస్థలో మార్పులు చేస్తారు. వలసవాదం అనేది మెట్రోపోల్ మరియు కాలనీ మధ్య; మరియు వలస పౌరులు మరియు స్థానిక జనాభా మధ్య ఒక అసమాన సంబంధాల సమూహం.

15వ శతాబ్దం చివరి నుంచి 20వ శతాబ్దం వరకు ఐరోపా దేశాలు ఇతర దేశాల్లో వలస రాజ్యాలను ఏర్పాటు చేశాయి, సాధారణంగా ఈ మధ్య ఉన్న చారిత్రక కాలాన్ని వలసవాదం అనే పదం సూచిస్తుంది. ఈ కాలంలో, లాభాలు సాధించడం, మెట్రోపోల్ యొక్క అధికారాన్ని విస్తరించాలనే ఆకాంక్షలు మరియు వివిధ మత మరియు రాజకీయ విశ్వాసాలు వంటి కారణాలతో వలసవాదం సమర్థించబడింది.

వలసవాదం మరియు సామ్రాజ్యవాదం సైద్ధాంతికంగా వర్తకవాదంతో సంబంధం కలిగివున్నాయి.[1]

నిర్వచనాలు[మార్చు]

1926లో ఆంస్టెర్‌డ్యామ్‌లో క్వీన్ విల్‌హెల్మినా కాలనియల్ ఇన్‌స్టిట్యూట్ (ఇప్పుడు ట్రోపెన్‌మ్యూజియం) ను ప్రారంభిస్తున్న దృశ్యం

కొల్లిన్స్ ఆంగ్ల నిఘంటువు వలసరాజ్యాలను పొందడానికి మరియు నిర్వహించానికి సంబంధించిన, ముఖ్యంగా దోపిడీ కోసం ఉద్దేశించిన విధానంగా వలసవాదాన్ని నిర్వచిస్తుంది.[2]

మెర్రియం-వెబ్‌స్టర్ నిఘంటువు దీనికి నాలుగు నిర్వచనాలు అందిస్తుంది, "ఒక వలసరాజ్యం యొక్క లక్షణం" మరియు "ఒక పరతంత్ర భూభాగం లేదా పౌరులపై ఒక రాజ్యం యొక్క నియంత్రణ" అనే నిర్వచనాలు వీటిలో భాగంగా ఉన్నాయి.[3]

స్టాన్‌ఫోర్డ్ ఎన్‌సైక్లోపీడియా ఆఫ్ ఫిలాసఫీ అమెరికా ఖండాలు, ఆస్ట్రేలియా, ఆఫ్రికా మరియు ఆసియా భూభాగాలతోపాటు, మిగిలిన ప్రపంచ భూభాగంలో ఐరోపా స్థిరనివాసాల ఏర్పాటు ప్రక్రియ మరియు రాజకీయ నియంత్రణలను "వలసవాదం"గా నిర్వచిస్తుంది. వలసవాదం మరియు సామ్రాజ్యవాదం మధ్య వ్యత్యాసాన్ని ఇది చర్చిస్తుంది, రెండు పదాల మధ్య వ్యత్యాసాలను గుర్తించడంలో సంక్లిష్టతల కారణంగా, ఇక్కడ వలసవాదం 16వ శతాబ్దం నుంచి 20వ శతాబ్దం వరకు ఐరోపా రాజకీయ ఆధిపత్య ప్రక్రియను సూచించే ఒక విస్తృత అంశాన్ని తెలియజేస్తుంది, దీని ప్రకారం 1960నాటి జాతీయ విమోచన ఉద్యమాలతో వలసవాదానికి తెరపడింది.[4]

జూర్జెన్ ఓస్టెర్‌హామ్మెల్ యొక్క కాలనిజం: ఎ థియరిటికల్ ఓవర్‌వ్యూ పై తన యొక్క ముందుమాటలో రోజెర్ టిగ్నోర్ ఈ విధంగా అభిప్రాయపడ్డారు, ఈ పుస్తకంలో ఓస్టెర్‌హామ్మెల్ వలసవాదం యొక్క ప్రాముఖ్యతను వలసరాజ్యాల ఉనికిగా సూచించినట్లు తెలిపారు, నిర్వచనం ప్రకారం రక్షిత ప్రాంతాలు లేదా అనధికారిక ఆధిపత్య మండలాల వంటి ఇతర భూభాగాలకు భిన్నంగా ఈ వలసరాజ్యాలు పాలించబడ్డాయని తెలియజేశారు.[5] ఈ పుస్తకంలో, ఓస్టెర్‌హామ్మెల్ వలసరాజ్యం నుంచి స్వతంత్రంగా వలసవాదాన్ని ఏ విధంగా నిర్వచించవచ్చని ప్రశ్నించారు? [6] ఒక మూడు-వాక్యాల నిర్వచనంతో ఆయన సంతృప్తి చెందారు:

Colonialism is a relationship between an indigenous (or forcibly imported) majority and a minority of foreign invaders. The fundamental decisions affecting the lives of the colonized people are made and implemented by the colonial rulers in pursuit of interests that are often defined in a distant metropolis. Rejecting cultural compromises with the colonized population, the colonisers are convinced of their own superiority and their ordained mandate to rule.[7]

వలసవాదం యొక్క రకాలు[మార్చు]

చరిత్రకారులు ప్రధానంగా వలసరాజ్యాలు ఏర్పడుతున్న దేశంలో, వలసరాజ్యంలో స్థిరపడిన పౌరుల సంఖ్య ఆధారంగా రెండు రకాల వలసవాదాల మధ్య వ్యత్యాసాన్ని సూచిస్తున్నారు:

 • స్థిరనివాసుల వలసవాదం అనేది భారీ సంఖ్యలో వలసరాజ్యంలో స్థిరపడే వలసదారులను సూచిస్తుంది, వీరు ఎక్కువగా వ్యవసాయానికి సారవంతమైన భూమి కోసం మరొక ప్రాంతంలో స్థిరపడతారు.
 • దోపిడీ వలసవాదం అనేది కొద్ది సంఖ్యలో వలసదారులు ఉన్న ప్రదేశాలను సూచిస్తుంది, మహానగరానికి (మెట్రోపోల్) కు వనరులను ఎగుమతి చేయడం వీరి ప్రధాన ధ్యేయంగా ఉంటుంది. వాణిజ్య కేంద్రాలు కూడా ఈ వర్గంలో ఉంటాయి, అయితే ఇది బాగా పెద్ద వలసరాజ్యాలకు కూడా ఎక్కువగా వర్తిస్తుంది, వీటిలో వలసదారులు పరిపాలనలో కీలకంగా ఉంటారు, ఎక్కువ భూభాగం మరియు ఇతర పెట్టుబడి వీరి ఆధీనంలో ఉంటుంది, అయితే కార్మికుల కోసం స్థానిక పౌరులపై ఆధారపడతారు.

ఈ వలసవాద నమూనాలు ఒకదానిపై ఒకటి ఆధారపడివుంటాయి. రెండు సందర్భాల్లోనూ, ప్రజలు వలసరాజ్యానికి తరలి వెళుతుంటారు, సరుకులు మెట్రోపోల్‌కు ఎగుమతి చేయబడతాయి.

తోటల పెంపక వలసరాజ్యం (కాలనీ) అనేది సాధారణంగా దోపిడీ వలసవాద నమూనాలో భాగంగా పరిగణించబడుతుంది. అయితే ఈ సందర్భంలో వలసరాజ్యానికి ఇతర వలసదారులు కూడా వస్తారు, - ఎగుమతి కోసం వాణిజ్య పంటలు సాగు చేసేందుకు బానిసల రూపంలో వీరు వలసరాజ్యానికి రావడం జరుగుతుంది.

కొన్ని సందర్భాల్లో, స్థిరనివాసులకు ఉద్దేశించిన వలసరాజ్యం ఎక్కువగా గణనీయమైన స్థాయిలో ముందుగానే జనావాసాలు ఉన్న ప్రాంతాల్లో ఏర్పాటు చేయబడుతుంది, దీని ఫలితంగా సాంస్కృతికంగా మిశ్రమ జనాభా (అమెరికా ఖండాల్లో మెస్టిజో‌ల వంటివారు) లేదా ఫ్రెంచ్ అల్జీరియా లేదా దక్షిణ రోడెసియాలో కనిపించేటువంటి జాతిపరంగా భిన్నమైన జనాభాలు ఏర్పడ్డాయి.

వలసరాజ్యానికి చట్టబద్ధంగా నానాజాతి సమితి తీర్మానం బాగా భిన్నంగా ఉంటుంది. అయితే తీర్మాన వ్యవస్థలో దోపిడీ వలసవాదంతో కొంత సారూప్యత ఉంటుంది.

చరిత్ర[మార్చు]

వలసవాదం కోసం ఉపయోగించిన ప్రపంచ పటం, 1800
1914లో ఈ ప్రపంచ పటం ప్రపంచవ్యాప్తంగా శక్తివంతమైన దేశాలు ఏర్పాటు చేసిన అతిపెద్ద కాలనీ సామ్రాజ్యాలను చూపిస్తుంది
1945లో రెండో ప్రపంచ యుద్ధం ముగింపు సమయంలో వలసరాజ్యాలను చూపించే ప్రపంచ పటం

వలసవాదంగా పిలిచే చర్యలకు సుదీర్ఘ చరిత్ర ఉంది. ఈజిప్షియన్‌లు, ఫోయెనిసియన్‌లు, గ్రీకులు మరియు రోమన్‌లు అందరూ పురాతన కాలంలో వలసరాజ్యాలను నిర్మించారు. "మెట్రోపోల్" అనే పదం గ్రీకు పదమైన మెట్రోపోలిస్ [గ్రీకు: "μητρόπολις"] - "మాతృ నగరం" నుంచి ఉద్భవించింది. "కాలనీ" అనే పదం లాటిన్‌లోని కాలోనియా - "వ్యవసాయ ప్రదేశం" నుంచి స్వీకరించబడింది. 11వ మరియు 18వ శతాబ్దాల మధ్యకాలంలో, వియత్నాం తమ అసలు భూభాగానికి దక్షిణంగా సైనిక వలసరాజ్యాలను ఏర్పాటు చేసింది, ఆపై ఈ భూభాగాన్ని విలీనం చేసుకుంది, ఈ ప్రక్రియను నామ్ టయెన్‌గా గుర్తించేవారు.[8]

ఆధునిక వలసవాదం అన్వేషణ యుగంతో ప్రారంభమైంది. పోర్చుగల్ మరియు స్పెయిన్ దేశాలు మహాసముద్రాలపై ప్రయాణాలు ద్వారా కొత్త భూభాగాలను కనిపెట్టి, అక్కడ వాణిజ్య కేంద్రాలను ఏర్పాటు చేశాయి. కొందరు వ్యక్తులు మహాసముద్రాలపై భూభాగాల్లో కాలనీలను నిర్మించడాన్ని, విస్తరణ వాదం యొక్క ఇతర రకాల నుంచి వలసవాదాన్ని వేరు చేసే ప్రక్రియగా గుర్తిస్తున్నారు. ఈ కొత్త భూభాగాలు పోర్చుగీస్ సామ్రాజ్యం మరియు స్పానిష్ సామ్రాజ్యం మధ్య వేరుచేయబడ్డాయి, మొదట పాపల్ బుల్ ఇంటర్ సెటెరా, తరువాత ట్రీటీ ఆప్ టోర్డెసిల్లాస్ మరియు ట్రీటీ ఆఫ్ జారాగోజా (1529) అనే ఒప్పందాలు కొత్త భూభాగాలను ఆయా సామ్రాజ్యాల నుంచి వేరు చేశాయి.

17వ శతాబ్దంలో బ్రిటీష్ సామ్రాజ్యం, ఫ్రెంచ్ వలస సామ్రాజ్యం మరియు డచ్ సామ్రాజ్యం సృష్టించబడ్డాయి. కొన్ని స్వీడన్ విదేశీ కాలనీలు మరియు డెన్మార్క్ వలస సామ్రాజ్యం కూడా ఈ శతాబ్దంలోనే ఏర్పాటయ్యాయి.

వలస సామ్రాజ్యాల విస్తరణ 18వ శతాబ్దం చివరి కాలంలో మరియు 19వ శతాబ్దం ప్రారంభంలో తగ్గుముఖం పట్టింది, అమెరికన్ విప్లవ యుద్ధం మరియు లాటిన్ అమెరికా స్వాతంత్ర్య యుద్ధాలు ఫలితంగా వలస రాజ్యాల ఏర్పాటు చర్యలు తగ్గిపోయాయి. అయితే, అనేక నూతన కాలనీలు ఈ కాలం తరువాత ఏర్పాటయ్యాయి, ఈ నూతన కాలనీలు జర్మనీ వలస సామ్రాజ్యం మరియు బెల్జియం వలస సామ్రాజ్యంలో భాగంగా ఏర్పాటయ్యాయి. 19వ శతాబ్దం చివరి కాలంలో, అనేక ఐరోపా రాజ్యాలు ఆఫ్రికా ఖండంపై ఆధిపత్యం కోసం పోటీ పడ్డాయి.

రష్యా సామ్రాజ్యం మరియు ఒట్టోమన్ సామ్రాజ్యం ఈ కాలంలో ఉన్నప్పటికీ, అవి ఈ మార్గంలో విస్తరణ కోసం ప్రయత్నించలేదు. పొరుగు దేశాల భూభాగాలను యుద్ధంలో ఓడించడం ద్వారా సాంప్రదాయిక మార్గంలో ఈ సామ్రాజ్యాలు విస్తరణ చర్యలు నిర్వహించాయి. ఇదిలా ఉంటే బేరింగ్ జలసంధివ్యాప్తంగా అమెరికా ఖండాల్లో రష్యా వలసరాజ్యాల ఏర్పాటు జరిగింది. జపాన్ సామ్రాజ్యం కూడా ఐరోపా వలస సామ్రాజ్యాల నమూనా ఆధారంగా నిర్మించబడింది. స్పానిష్-అమెరికన్ యుద్ధం తరువాత యునైటెడ్ స్టేట్స్ కూడా విదేశీ భూభాగాలను పొందింది, దీంతో "అమెరికన్ సామ్రాజ్యం" అనే పదం కూడా వాడుకలోకి వచ్చింది.

మొదటి ప్రపంచ యుద్ధం తరువాత విజయం సాధించిన మిత్రరాజ్యాలు జర్మనీ వలస సామ్రాజ్యాన్ని చీల్చి పంచుకున్నాయి, నానాజాతి సమితి తీర్మానాలు ప్రకారం ఒట్టోమన్ సామ్రాజ్యంలో ఎక్కువ భూభాగాన్ని మిత్రరాజ్యాలు పంచుకోవడం జరిగింది. స్వాతంత్ర్యం పొందడానికి ఎంత త్వరగా ఆస్కారం ఉందనే అంశం ప్రాతిపదికన ఈ భూభాగాలను మూడు తరగతులుగా విభజించారు.[9] అయితే, అమెరికా ఖండాల వెలుపల వలసరాజ్యాల ఉపసంహరణ మాత్రం రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తరువాత కాలం వరకు జరగలేదు. 1962లో ఐక్యరాజ్యసమితి వలసరాజ్యాల ఉపసంహరణపై ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది, ఈ ప్రక్రియను వేగవంతం చేసేందుకు ఉద్దేశించిన ఈ కమిటీని తరచుగా "కమిటీ ఆఫ్ 24"గా (24 సభ్యదేశాల కమిటీ) పిలిచేవారు.

నూతన వలసవాదం[మార్చు]

రెండో ప్రపంచ యుద్ధం తరువాత వలసరాజ్యాల ఉపసంహరణ చర్యలు ప్రారంభమైన తరువాత వివిధ రకాల చర్యలను సూచించేందుకు నూతన వలసవాదం (నియోకాలనిజం) అనే పదాన్ని ఉపయోగిస్తున్నారు. సాధారణంగా దీనిని వలసవాదం యొక్క ఒక రకంగా పరిగణించడం లేదు, అయితే ఇతర అర్థాల్లో వలసవాదంగానే భావించబడుతుంది. దీనిలో ముఖ్యంగా బలమైన మరియు బలహీనమైన దేశాల మధ్య సంబంధం దోపిడీ వలసవాదానికి సారూప్యంగానే ఉంటుందనే ఆరోపణ ఉంది, బలమైన దేశం వలసరాజ్యాన్ని నిర్మించడం లేదా నిర్వహించాల్సిన అవసరం లేకుండానే ఇక్కడ వలసరాజ్యానికి సంబంధించిన చర్యలు కొనసాగుతున్నాయనే విమర్శలు ఉన్నాయి. ఇటువంటి ఆరోపణలు ఎక్కువగా ఆర్థిక సంబంధాలు మరియు బలమైన దేశం బలహీనమైన దేశం యొక్క రాజకీయాల్లో జోక్యం చేసుకోవడం వంటి అంశాలపై దృష్టి పెడుతున్నాయి.

వలసవాదం మరియు చారిత్రక భావన[మార్చు]

వలసవాదం మరియు భూగోళ శాస్త్రం[మార్చు]

స్థానికులు మరియు సామ్రాజ్య పెత్తనం మధ్య అనుసంధానంగా స్థిరనివాసులు పనిచేశారు, వీరు వలసరాజ్యం స్థాపించడానికి సాయపడినవారు మరియు వలసవాదులు నివసించే భూభాగం మధ్య భౌగోళిక అంతరం మధ్య వారధిగా ఉన్నారు. పేయింటర్ జే. మరియు జెఫ్రే, ఎ. ఐరోపా రాజ్యాల విస్తరణకు కొన్ని నిర్దిష్ట పురోగమనాలు సాయపడ్డాయని నిర్ధారించారు. మానచిత్ర రచన, నౌకా నిర్మాణం, సముద్రయానం, గనుల త్రవ్వకం మరియు వ్యవసాయ ఉత్పాదకత వంటి సాధనాలతో వలసరాజ్యాలు ఏర్పాటు చేసినవారికి ఆధిపత్యం ఉంది. భూమి ఉపరితలంపై అవగాహన మరియు అపారమైన ఆచరణాత్మక నైపుణ్యాలు ఉండటం వలసరాజ్యాల స్థాపకులు ఆధిపత్యం సాధించేందుకు వీలు కల్పించింది.

భూగోళ శాస్త్రం ఒక వాస్తవిక విజ్ఞాన శాస్త్రం కాదని పేయింటెర్ మరియు జెఫ్రే వాదించారు, ఇది భౌతిక ప్రపంచం యొక్క అంచనాలు ఆధారంగా రూపొందిందని పేర్కొన్నారు. అన్వేషణల విషయంలో దీనికి సంబంధించిన పరిజ్ఞానం పశ్చిమ దేశాలకు సానుకూల ప్రయోజనాలు అందించింది, అయితే ఇది జాతి నూన్యత యొక్క మండలాలను కూడా సృష్టించింది. వాతావరణం, చట్టబద్ధ వలసవాదం కారణంగా పర్యావరణ నిర్ణాయక పద్ధతి వంటి భౌగోళిక విశ్వాసాలు ప్రపంచంలోని కొన్ని ప్రాంతాలను అభివృద్ధికి దూరమైన ప్రాంతాలుగా పరిగణిస్తున్నాయి, ఇవి వక్రీకరించిన పరిణామం యొక్క భావాలను సృష్టించాయి.[10] వీటిని ఇప్పుడు ప్రాథమిక భావాలుగా పరిగణిస్తున్నారు. ప్రపంచం యొక్క భౌతిక గుర్తింపుల ద్వారా వలసవాద ప్రవర్తన పటిష్ఠపరచబడిందని, చూసేందుకు "వారు" మరియు "మనం" అనే విభజన ఏర్పడిందని రాజకీయ భూగోళ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. భూగోళ శాస్త్రవేత్తలు ప్రధానంగా వలసవాదం మరియు సామ్రాజ్యవాదంపై దృష్టి సారించారు, ముఖ్యంగా అంతరం యొక్క పదార్థ మరియు ప్రతీకాత్మక వినియోగం వలసవాదానికి వీలు కల్పించిందని సూచిస్తున్నారు.[11]

వలసవాదం మరియు సామ్రాజ్యవాదం[మార్చు]

ఒక వలసరాజ్యం అనేది ఒక సామ్రాజ్యంలో భాగంగా ఉంటుంది, అందువలన వలసవాదం అనేది సామ్రాజ్యవాదంతో దగ్గరి సంబంధం కలిగివుంటుంది. ప్రాథమిక అంచనా ఏమిటంటే వలసవాదం మరియు సామ్రాజ్యవాదం మధ్య వినిమయానికి వీలుంటుంది, అయితే రాబర్ట్ యంగ్ అభిప్రాయం ప్రకారం సామ్రాజ్యవాదం అనేది భావన కాగా, వలసవాదం అనేది ఆచరణ. ఒక సామ్రాజ్య అంచనాపై వలసవాదం ఆధారపడివుంటుంది, అందువలన రెండింటి మధ్య అనుషంగిక అనుబంధం ఏర్పడుతుంది. ఒక సామ్రాజ్యం ద్వారా, వలసవాదం ఏర్పటు చేయబడుతుంది, పెట్టుబడిదారీ విధానం విస్తరించబడుతుంది, మరోవైపు పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ సహజంగా ఒక సామ్రాజ్యాన్ని పటిష్ఠపరుస్తుంది. ఈ పరస్పర పటిష్ఠ సంబంధం కోసం తరువాతి భాగంలో మార్క్సిస్ట్‌లు ఒక సందర్భాన్ని సూచించారు.

వలసవాదంపై మార్క్సిస్ట్ అభిప్రాయం[మార్చు]

మార్క్సిజం వలసవాదాన్ని ఒక రకమైన పెట్టుబడిదారీ విధానంగా పరిగణిస్తుంది, ఇది దోపిడీ మరియు సామాజిక మార్పుకు దారి తీస్తుందని తెలియజేస్తుంది. అంతర్జాతీయ పెట్టుబడిదారీ వ్యవస్థలో పని చేయడం ద్వారా వలసవాదం అసమాన అభివృద్ధితో దగ్గరి అనుబంధం కలిగివుంటుంది. ఇది ఒక సంపూర్ణ వినాశక, పరాధీన మరియు క్రమబద్ధమైన దోపిడీ సాధనంగా వక్రీకరించబడిన ఆర్థిక వ్యవస్థలను సృష్టిస్తుంది, సామాజిక-మానసిక స్థితిభ్రాంతి, కఠిక దారిద్ర్యం మరియు నవీన వలసవాద పరాధీనతలకు కారణమవుతుంది.[12] వలసరాజ్యాలను ఉత్పత్తి సాధనాలుగా నిర్మించబడ్డాయి. ముడి పదార్థాల కోసం అన్వేషణ మరియు నూతన పెట్టుబడి అవకాశాల కోసం ప్రస్తుత అన్వేషణలు పెట్టుబడి వృద్ధి కోసం పెట్టుబడిదారుల మధ్య పోటీ ఫలితంగా ఏర్పడ్డాయి. వలసవాదాన్ని లెనిన్ సామ్రాజ్యవాదం యొక్క మూల కారణంగా వర్ణించారు, వలసవాదం ద్వారా గుత్తాధిపత్య పెట్టుబడిదారీ విధానానికి సామ్రాజ్యవాదం ప్రత్యేకించబడుతుంది, లాయల్ ఎస్. సుంగా అభిప్రాయం ప్రకారం: "వ్లాదిమీర్ లెనిన్ సామ్యవాద విప్లవంపై తన యొక్క సిద్ధాంతాల్లో పౌరుల స్వీయ గుర్తింపు యొక్క సిద్ధాంతాన్ని బలమైన మద్దతు తెలిపారు, సామ్యవాద అంతర్జాతీయ వాద కార్యక్రమంలో దేశాలకు స్వీయ గుర్తింపు హక్కు ఒక సమగ్ర లక్ష్యమని పేర్కొన్నారు, రాజకీయ కోణంలో దేశాలకు స్వీయ-గుర్తింపు హక్కు పరోక్షంగా వారి స్వాతంత్ర్య హక్కును, మరొక దేశం నుంచి స్వేచ్ఛా రాజకీయ విభజన హక్కును సూచిస్తుందని లెనిన్ పేర్కొన్నారు. ముఖ్యంగా, రాజకీయ ప్రజాస్వామ్యానికి ఈ డిమాండ్ వేర్పాటుకు ఆందోళన చేసే సంపూర్ణ స్వేచ్ఛను మరియు విడిపోయే దేశం చేత వేర్పాటుపై ప్రజాభిప్రాయ సేకరణను సూచిస్తుంది.[13]

ఉదారవాదం, పెట్టుబడిదారీ విధానం మరియు వలసవాదం[మార్చు]

సాంప్రదాయిక ఉదారవాదులు సాధారణంగా వలసవాదాన్ని మరియు సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకించారు, వీరిలో ఆడమ్ స్మిత్, ఫ్రెడెరిక్ బాస్టియాట్, రిచర్డ్ కోబ్డెన్, జాన్ బ్రైట్, హెన్రీరిచర్డ్, హెర్బెర్ట్ స్పెన్సెర్, హెచ్.ఆర్.ఫాక్స్ బౌర్నే, ఎడ్వర్డ్ మోరెల్, జోసెఫిన్ బట్లర్, డబ్ల్యూ.జే. ఫాక్స్ మరియు విలియమ్ ఎవార్ట్ గ్లాడ్‌స్టోన్ ముఖ్యులు. అంతేకాకుండా, అమెరికన్ విప్లవం మొదటి వలసవాద-వ్యతిరేక తిరుగుబాటుగా గుర్తింపు పొందడంతోపాటు, ఇతర తిరుగుబాట్లకు స్ఫూర్తిగా నిలిచింది.[1][14]

ఆడమ్ స్మిత్ తన యొక్క వెల్త్ ఆఫ్ నేషన్స్‌లో బ్రిటన్ తన యొక్క అన్ని వలసరాజ్యాలకు స్వాతంత్ర్యాన్ని ఇవ్వాలని రాశారు, బ్రిటీష్ పౌరులకు సగటున ఇది ఆర్థిక ప్రయోజనాన్ని అందిస్తుందని సూచించారు, వర్తకులు మాత్రం వర్తక ప్రయోజనాలను కోల్పోవాల్సి వస్తుందని తెలియజేశారు.[1]

బ్రిటీష్ వలసరాజ్య పాలనలో భారతదేశంలో రైతులు కొన్ని పంటలను మాత్రమే పండించాలని ఒత్తిళ్లు ఎదుర్కోవడం మరియు వాటిని బ్రిటన్‌కు విక్రయించేలా బలవంతపెట్టడం, అణిచివేత పన్నులు చెల్లించడం వంటి చర్యలను ఎదుర్కొన్నారు.[14][15]

వలసవాదోత్తర విధానం[మార్చు]

వలసవాదోత్తర విధానం (వలసవాదోత్తర సిద్ధాంతంగా కూడా దీనిని గుర్తిస్తారు) వలసరాజ్య పాలన యొక్క పరంపరతో ముడిపడిన తత్వశాస్త్రం మరియు సాహిత్యంలోని కొన్ని సిద్ధాంతాలను సూచిస్తుంది. ఈ కోణంలో, వలసవాదోత్తర సాహిత్యాన్ని గతంలో వలసవాద సామ్రాజ్యాలతో అణిచివేయబడిన పౌరుల రాజకీయ మరియు సాంస్కృతిక స్వాతంత్ర్యానికి సంబంధించిన ఆధునికోత్తర సాహిత్యంలో ఒక విభాగంగా పరిగణించవచ్చు. అనేక మంది ఆచరణకర్తలు ఎడ్వర్డ్ సెడ్ యొక్క పుస్తకం ఓరియంటలిజం (1978) ను ఈ సిద్ధాంతం యొక్క మూల పుస్తకంగా పరిగణిస్తున్నారు (అయితే ఏమే సీసైర్ మరియు ఫ్రాంట్జ్ ఫానోన్ అనే ఫ్రెంచ్ సిద్ధాంతకర్తలు కొన్ని దశాబ్దాలకు పూర్వమే ఇటువంటి సిద్ధాంతాలను ప్రతిపాదించారు).

బాల్జాక్, బౌడెలైరీ మరియు లౌట్రెయామోంట్ రచనలను ఎడ్వర్డ్ సెడ్ విశ్లేషించారు, ఐరోపా జాతి ఆధిపత్యం యొక్క సామాజిక విపరీత భావనతో వీరిద్దరు ఏ విధంగా ప్రభావితమయ్యారు మరియు దీనికి తుది రూపం ఇవ్వడానికి ఏ విధంగా సాయపడ్డారనేది అన్వేషించారు. వలసవాదోత్తర కాల్పనిక రచయితలు సాంప్రదాయిక వలసవాద ఆవిష్కరణతో పనిచేశారు, అయితే దానిని నవీకరించడం లేదా నాశనం చేశారు; కథలో అణిచివేయబడిన చిన్న పాత్ర యొక్క దృష్టికోణం నుంచి ఇటువంటి ఒక కథను తిరిగి చెప్పడాన్ని దీనికి ఉదాహరణగా పరిగణించవచ్చు. గాయత్రి చక్రవర్తి స్పివాక్ యొక్క కెన్ వి సబాల్టర్న్ స్పీక్? (1998) అనే పుస్తకం సబాల్టర్న్ స్టడీస్‌కు (తక్కువ స్థాయి అధ్యయనాలు) తన పేరును ఇచ్చింది.

ఎ క్రిటిక్ ఆఫ్ పోస్ట్‌కాలోనియల్ రీజన్ (1999) లో స్పివాక్ ఐరోపాలో అధిభౌతిక శాస్త్రం యొక్క ప్రధాన రచనల్లో (ఉదాహరణకు కాంట్, హెగెల్) ఏ విధంగా తక్కువస్థాయి విభాగాన్ని మినహాయించాయి, ఐరోపాయేతరులు పూర్తిగా మానవ అంశాలుగా పదవులు పొందకుండా అడ్డుకున్నాయనే అంశాలపై అధ్యయనం చేశారు. హెగెల్ యొక్క ఫెనమెనోలజీ ఆఫ్ స్పిరిట్ (1807) దానిలోని స్పష్టమైన స్వజాతి సంస్కృతి వ్యామోహానికి ప్రసిద్ధి చెందింది, పశ్చిమ నాగరికతను ఈ పుస్తకం మిగిలిన నాగరికతల్లో అత్యంత కార్యసాధకమైనదిగా గుర్తించింది, కాంట్ కూడా తన రచనల్లో జాతివాదం యొక్క కొన్ని మూలాలను అనుమతించారు.

ఒక భారతీయ ఇంటిమనిషితో రాబర్ట్ క్లైవ్ మరియు ఆయన కుటుంబం, జాషువా రీనాల్డ్స్ 1765లో ఈ చిత్రాన్ని గీశారు.

వలసవాదం యొక్క ప్రభావం మరియు వలసరాజ్యాల ఏర్పాటు[మార్చు]

మూస:Importance-section వలసవాదం యొక్క గుర్తించిన ప్రతికూల మరియు సానుకూల పరిణామాలు గురించి చర్చ (తీవ్రమైన రోగాల వ్యాప్తి, అసమాన సామాజిక సంబంధాలు, దోపిడీ, బానిసత్వం, మౌలిక సదుపాయాలు, వైద్య పురోగమనాలు, కొత్త సంస్థలు, సాంకేతిక పురోగమనాలు తదితరాల వ్యాప్తి) కొన్ని శతాబ్దాలుగా సంభవించాయి, ఇవి వలసరాజ్యాలు ఏర్పడటానికి సాయపడినవారు మరియు వలసవాదులు ఇద్దరిలో ప్రస్తుత రోజుకు కూడా ఇవి కొనసాగుతున్నాయి.[16] మిశ్రమ జాతుల సృష్టికి సంబంధించిన ప్రశ్నలు; వలసరాజ్య సంస్థలు, సామూహిక హత్యాకాండల మధ్య అనుమానిత సంబంధాలు - హెరెరో నరమేధం మరియు అర్మేనియన్ నరమేధం - మరియు యూదులపై నాజీల జరిపిన మారణహోమం (హోలోకాస్ట్) చూడండి; సామ్రాజ్యవాదం, పరాధీనత సిద్ధాంతం మరియు నూతన వలసవాదం (ముఖ్యంగా తృతీయ ప్రపంచ రుణం) వాస్తవికతను కొనసాగిస్తున్నాయి.

ఆరోగ్యంపై ప్రభావం[మార్చు]

ప్రపంచంలోని మిగిలిన ప్రాంతాల్లో అన్వేషకులు మరియు జనాభాల మధ్య సంపర్కాలు కొత్త వ్యాధులను పరిచయం చేశాయి, కొన్నిసార్లు ఈ వ్యాధులు అసాధారణ హానితో స్థానిక మహమ్మారులను సృష్టించాయి.[17] ఉదాహరణకు చిన్నమ్మవారు, తట్టు, మలేరియా, పసుపు జ్వరం మరియు ఇతర రోగాలు కొలంబస్ పూర్వ అమెరికాలో లేవు.[18]

16వ శతాబ్దంలో వ్యాధి కానరీ దీవుల్లోని మొత్తం స్థానిక (గువాన్చెస్) జనాభాను నాశనం చేసింది. 1518లో హిస్పానియోలా స్థానిక జనాభాలో సగం మంది చిన్న అమ్మవారుతో మరణించారు. 1520వ దశకంలో మెక్సికోలో చిన్న అమ్మవారు విజృంభించింది, ఒక్క టెనోచ్‌టిట్లాన్ ప్రాంతంలోనే 150,000 మంది మరణించారు, ఈ వ్యాధి బారినపడి చక్రవర్తి కూడా మృతి చెందారు, 1530వ దశకంలో పెరూ దేశంలో కూడా ఈ వ్యాధి విజృంభించింది, దీంతో ఐరోపా సేనలు సులభంగా విజయం సాధించారు. తట్టు వ్యాధి 17వ శతాబ్దంలో మరో రెండు మిలియన్ల మంది మెక్సికో స్థానికుల మరణానికి కారణమైంది. 1618–1619లో, చిన్న అమ్మవారు మసాచుసెట్స్ అఖాతం పరిసరాల్లో నివసించే 90% మంది స్థానిక అమెరికన్‌లను బలిగొంది.[19] చిన్న అమ్మవారు 1780–1782 మధ్యకాలంలో మరియు 1837–1838 మధ్యకాలంలో మైదానప్రాంత ఇండియన్‌లు పెద్ద సంఖ్యలో మరణించేందుకు, వారి సంతతి నాశనం కావడానికి కారణమైంది.[20] నూతన ప్రపంచం యొక్క స్థానిక అమెరికన్ జనాభాలో 95% మంది మరణాలు పురాతన ప్రపంచ వ్యాధుల వలన సంభవించాయని కొందరు భావిస్తున్నారు.[21] శతాబ్దాలకుపైగా, ఐరోపావాసులు ఈ వ్యాధులకు అధిక స్థాయి రోగ నిరోధకతను పొందారు, ఇదిలా ఉంటే స్థానిక పౌరులకు ఇటువంటి రోగ నిరోధక శక్తి లేదు.[22]

ఆస్ట్రేలియా స్థానిక జనాభాను కూడా చిన్న అమ్మవారు వ్యాధి నాశనం చేసింది, బ్రిటీష్ వలసరాజ్య స్థాపన జరిగిన ప్రారంభ సంవత్సరాల్లో స్థానిక ఆస్ట్రేలియన్‌లలో 50% మంది మృతి చెందారు.[23] న్యూజీల్యాండ్‌కు చెందిన మావోరీ జనాభాలో అనేక మందిని కూడా ఈ వ్యాధి బలిగొంది.[24] 1848–49నాటికి, మొత్తం 150,000 మంది హవాయి పౌరుల్లో 40,000 మంది తట్టు, కోరింత దగ్గు మరియు విషపడిశం వ్యాధుల వలన మరణించారు. ప్రవేశపెట్టిన వ్యాధులు, ముఖ్యంగా చిన్న అమ్మవారు ఈస్టర్ ఐల్యాండ్‌లోని స్థానిక జనాభాను పూర్తిగా తుడిచిపెట్టింది.[25] 1875లో తట్టు వ్యాధి కారణంగా ఫిజి పౌరుల్లో 40,000 మందికిపైగా మృతి చెందారు, మొత్తం జనాభాలో మూడింట ఒక వంతు మంది ఈ వ్యాధికి బలైనట్లు అంచనాలు ఉన్నాయి.[26] ఐను జనాభా 19వ శతాబ్దంలో నాటకీయంగా క్షీణించింది, ఎక్కువగా హోక్కైడోలోకి అడుగుపెట్టిన జపనీస్ స్థిరనివాసులు వలన సంక్రమించిన వ్యాధులు వీరి ప్రాణాలు తీశాయి.[27]

కొలంబస్ సముద్రయానం తరువాత సవాయి రోగం నూతన ప్రపంచం నుంచి ఐరోపాకు వ్యాప్తి చెందినట్లు పరిశోధకులు నిర్ధారించారు. సుఖవ్యాధి యేతర ఉష్ణమండల బ్యాక్టీరియాను ఐరోపావాసులు తమ ఖండానికి తీసుకొచ్చారని నిర్ధారణలను తెలియజేస్తున్నాయి, ఐరోపాలోని భిన్నమైన పరిస్థితుల్లో ఈ బ్యాక్టీరియా మరింత ప్రమాదకరమైన రూపంలోకి పరివర్తనం చెందాయి.[28] ప్రస్తుత రోజు కంటే ఈ వ్యాధి తరచుగా ప్రాణాంతకంగా మారుతుండేది. సవాయి రోగం పునరుజ్జీవనోద్యమ కాలంలో ఐరోపాలో ప్రధాన ప్రాణాంతక వ్యాధిగా ఉంది.[29] మొదటి కలరా మహమ్మారి బెంగాల్‌లో ప్రారంభమైంది, తరువాత 1820లో భారతదేశవ్యాప్తంగా విస్తరించింది. 10,000 బ్రిటీష్ సేనలు మరియు అసంఖ్యాక భారతీయులు ఈ మహమ్మారి సమయంలో ప్రాణాలు కోల్పోయారు.[30] 1736 మంరియు 1834 మధ్యకాలంలో స్వదేశానికి చివరి ప్రయాణంలో కేవలం 10% మంది ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారులు మాత్రమే బతికి బయటపడ్డారు.[31] మొదటి సూక్ష్మక్రిమి శాస్త్రవేత్తగా గుర్తింపు పొందిన వాల్డెమార్ హాఫ్‌కైన్ కలరా మరియు బుబోనిక్ ప్లేగు వ్యాధులకు టీకాలు కనిపెట్టారు, ఆయన ప్రధానంగా భారతదేశంలో పనిచేశారు.

1803 ప్రారంభ సమయానికి, స్పానిష్ చక్రవర్తి స్పెయిన్ కాలనీలకు చిన్న అమ్మవారు టీకాను రవాణా చేసేందుకు ఒక మిషన్‌ను (బాల్మిస్ ఎక్స్‌పెడిషన్) ను చేపట్టారు, ఈ వలసరాజ్యాల్లో పెద్దఎత్తున టీకాలు వేసే కార్యక్రమాలు నిర్వహించారు.[32] 1832నాటికి అమెరికా సంయుక్త రాష్ట్రాల సమాఖ్య ప్రభుత్వం స్థానిక అమెరికన్‌ల కోసం చిన్న అమ్మవారు టీకా కార్యక్రమాన్ని చేపట్టింది.[33] మౌంట్‌స్టువర్ట్ ఎల్ఫిన్‌స్టోన్ ఆదేశాలపై భారతదేశంలో చిన్న అమ్మవారు టీకా వ్యాప్తి కోసం ఒక కార్యక్రమాన్ని ప్రారంభించారు.[34] 20వ శతాబ్దం ప్రారంభం నుంచి, ఉష్ణమండల దేశాల్లో ఈ వ్యాధి నిర్మూలన మరియు నియంత్రణ కార్యక్రమాలు అన్ని వలసరాజ్యాలకు ఒక చోదన శక్తిగా మారాయి.[35] అతినిద్రా వ్యాధి మహమ్మారి ఆఫ్రికాలో నియంత్రించబడింది, సంచార వైద్య బృందాలు మిలియన్ల మంది పౌరులకు సకాలంలో పరీక్షలు నిర్వహించి ఈ వ్యాధిని నియంత్రించాయ.[36] 20వ శతాబ్దంలో, ప్రపంచ మానవ చరిత్రలో అత్యధిక స్థాయిలో జనాభా పెరుగుదల సంభవించింది, వైద్య పురోగమనాలతో అనేక దేశాల్లో మరణాల రేటు తగ్గిపోవడం జనాభాలో విపరీతమైన పెరుగుదల కనిపించింది.[37] ప్రపంచ జనాభా 1900లో 1.6 బిలియన్‌ల వద్ద ఉండగా, ప్రస్తుతం 6.7 బిలియన్‌లకు చేరుకుంది.[38]

స్థానిక పౌరులు కొత్త వ్యాధుల బారిన ఏ విధంగా పడ్డారనే అంశం యొక్క వాస్తవ మూలాలను మరుగున పెట్టేందుకు వలసవాదుల పూర్వీకుల ద్వారా వ్యాధులు ఏ విధంగా సంక్రవించాయనే చర్చను కొందరు విశ్వసిస్తున్నారు. స్థానిక పౌరులకు కొన్ని రోగాల విషయంలో వ్యాధి నిరోధక శక్తి లేదని తెలుసుకున్న ఐరోపా వలసదారులు సైనిక ప్రయోజనాలు పొందేందుకు మరియు స్థానిక పౌరులను అణిచివేసేదుకు ఉద్దేశపూర్వకంగా ఈ వ్యాధులను వ్యాప్తి చేశారనే వాదన కూడా ఉంది. లార్డ్ జెఫ్రే అమ్‌‍హెరస్ట్ యొక్క సూచనలు ద్వారా దీనికి సంబంధించిన ఆధారాలు లభిస్తున్నాయి, [39] అయితే ఆయన యొక్క తీవ్రమైన సూచనలు నిజంగా జరిగాయా లేవా తెలియజేసేందుకు చరిత్ర సరైన విశ్వసనీయ సాక్ష్యాలేవీ అందించడం లేదు. ఇటువంటి విధానాన్ని పాటించినట్లు ఉత్తర అమెరికావ్యాప్తంగా ఎటువంటి బలమైన సాక్ష్యం లేదని అనేక మంది అధ్యయనకారులు వాదిస్తున్నారు. అయినప్పటికీ, ఇతర స్థానిక సమూహాల్లోకి ఉద్దేశపూర్వకంగా వ్యాధులు ప్రవేశపెట్టినట్లు లభిస్తున్న ఆధారాలు పెరుగుతున్నాయి, పూర్వీకులు తమ వారసులకు తెలియజేసిన సమాచారం ఇందుకు బలం చేకూరుస్తుంది. యుద్ధ చరిత్రలో జీవ-తీవ్రవాదం లేదా జీవ ఆయుధాలు ఉపయోగించడానికి సంబంధించిన మొదటి ఉదాహరణగా ఇది గుర్తించబడుతుంది. మరింత సమాచారం కోసం [40] మరియు [41] చూడండి, అయితే, క్రిమి యుద్ధం యొక్క పత్రబద్ధమైన ఆధారం బ్రిటీష్ కమాండర్ జెఫ్రే అమ్‌హెరస్ట్ ద్వారా లభిస్తుంది.[42] పత్రబద్ధం చేసిన ఈ సమాచారంలో బ్రిటీష్‌వారు భారతీయులకు వ్యాధులు సంక్రమింపజేసేందుకు చేసిన ప్రయత్నంలో విజయవంతమయ్యారా లేదా అనేది అస్పష్టంగా ఉంది.[43]

ఆహార భద్రత[మార్చు]

1492 తరువాత ముందుకాలపు స్థానిక పంటలు మరియు పశుసంపద యొక్క ఒక అంతర్జాతీయ వినిమయం సంభవించింది. ఈ వినిమయంలో భాగంగా ఉన్న ప్రధాన పంటలు టమేటో, మొక్కజొన్న, బంగాళాదుంప మరియు దుంపులు, వీటిని నూతన ప్రపంచ నుంచి పాత ప్రపంచానికి రవాణా చేశారు. 1368లో మింగ్ రాజవంశం స్థాపించబడినప్పుడు చైనా జనాభా దాదాపుగా 60 మిలియన్ల వద్ద ఉన్నట్లు గణించారు, 1644లో ఈ రాజవంశం పాలన ముగిసే సమయానికి జనాభా 150 మిలియన్లకు పెరిగింది.[44] 16వ శతాబ్దంలో స్పానిష్ వలసవాదుల ద్వారా అమెరికా ఖండాల నుంచి ఆసియా ఖండానికి కొత్త పంటలు పరిచయమయ్యాయి, వీటిలో మొక్కజొన్న మరియు తియ్యటి బంగాళాదుంపలు ముఖ్యమైనవి, ఈ పంటలు జనాభా వృద్ధికి తోడ్పడ్డాయి.[45] మానవ వినియోగానికి మొదట వీటిని అనువైనవిగా పరిగణించనప్పటికీ, ఉత్తర ఐరోపాలో బంగాళాదుంపలు ముఖ్యమైన ఆహారంగా మారాయి.[46] మొక్కజొన్న 15వ శతాబ్దంలో ఐరోపాకు పరిచయం చేయబడింది. అధిక దిగుబడుల కారణంగా, ఐరోపా అంతటా ఇది వేగంగా విస్తరించింది, తరువాత ఆఫ్రికా మరియు భారతదేశానికి కూడా ఈ పంట విస్తరించింది. భారతదేశంలో మొక్కజొన్నను పోర్చుగీసువారు 16వ శతాబ్దంలో పరిచయం చేశారు.[47]

16వ శతాబ్దంలో పోర్చుగీసు వ్యాపారులు పరిచయం చేసినప్పటి నుంచి[48] మొక్కజొన్న మరియు దుంపలు సాంప్రదాయిక ఆఫ్రికా పంటల స్థానాన్ని ఆక్రమించింది, ఇవి ఖండం యొక్క అత్యంత ముఖ్యమైన ఆహార పంటలుగా మారాయి.[49] దుంపలు (కసావా) కొన్నిసార్లు ఉష్ణమండల ప్రాంతాల యొక్క రొట్టెగా వర్ణించబడింది.[50] ఆల్‌ఫ్రెడ్ డబ్ల్యూ. క్రాస్‌బై మొక్కజొన్న, దుంపలు మరియు ఇతర పంటల ఉత్పత్తి పెరగడంతో అమెరికా పంటలకు బానిస వ్యాపారులు ఉష్ణమండల వర్షారణ్య ప్రాంతాల నుంచి అనేక మంది బానిసలను సరఫరా చేయడానికి దారి తీసింది, ముందుకంటే ఎక్కువ స్థాయిలో స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకునేందుకు వీలున్న ప్రదేశాలకు బానిసల రవాణా జరిగింది.[51]

బానిస వాణిజ్యం[మార్చు]

దాదాపుగా అన్ని సంస్కృతుల్లో మరియు ఖండాల్లో బానిసత్వం వివిధ స్థాయిల్లో, రూపాల్లో మరియు కాలాల్లో ఉంది.[52] 7 మరియు 20వ శతాబ్దానికి మధ్యకాలంలో, అరబ్ బానిస వాణిజ్యం (తూర్పు ప్రాంతంలో బానిసత్వంగా కూడా దీనిని గుర్తిస్తున్నారు) ఆఫ్రికా నుంచి సహరా ఎడారి మరియు హిందూ మహాసముద్ర మార్గాల గుండా సుమారుగా 18 మిలియన్ల మంది బానిసలను ఉపయోగించింది.[53] 15 మరియు 19వ శతాబ్దాల మధ్య కాలంలో, అట్లాంటిక్ బానిస వాణిజ్యం నూతన ప్రపంచానికి 12 మిలియన్ల మంది బానిసలను తీసుకెళ్లింది.[54]

1654 నుంచి 1865 వరకు జీవనం కోసం ఉద్దేశించిన బానిసత్వం ప్రస్తుత అమెరికా సంయుక్త రాష్ట్రాల సరిహద్దుల్లో చట్టబద్ధమైన కార్యకలాపంగా ఉండేది.[55] 1860నాటి US జనాభా లెక్కలు ప్రకారం, బానిసత్వం చట్టబద్ధమైన కార్యకలాపంగా ఉన్న 15 రాష్ట్రాల్లో మొత్తం 12 మిలియన్ల మంది జనాభాలో సుమారుగా నాలుగు మిలియన్ల మంది బానిసలు ఉన్నారు.[56] 15 బానిస రాష్ట్రాల్లోని మొత్తం 1,515,605 కుటుంబాల్లో 393,967 కుటుంబాలు బానిస కుటుంబాలుగా ఉన్నాయి (సుమారుగా ప్రతి నలుగురిలో ఒకరు, [56] వీరి సంఖ్య మొత్తం అమెరికా కుటుంబాల్లో 8% ఉంది.[57]

1807లో బానిస వాణిజ్యంలో ఇకపై తాము పాల్గొనబోమని ప్రకటించిన మొదటి దేశాల్లో ఒకదానిగా యునైటెడ్ కింగ్‌డమ్ గుర్తింపు పొందింది.[58] అంతేకాకుండా, 1808 మరియు 1860 మధ్యకాలంలో, బ్రిటీష్ పశ్చిమ ఆఫ్రికా దళం సుమారుగా 1600 బానిస నౌకలను ముట్టడించి, వాటిలోని 150,000 మంది ఆఫ్రికన్‌లను విముక్తి కల్పించింది.[59] ఆఫ్రికా మరియు అమెరికా సముద్రాలపై ఈ కిరాతక వాణిజ్యానికి అడ్డుకట్టవేసేందుకు ఈ చర్యలు చేపట్టారు.[60] ఈ వాణిజ్యాన్ని చట్టవిరుద్ధం చేసిన బ్రిటీష్ ఒప్పందాలకు అంగీకరించని ఆఫ్రికా నేతలపై కూడా చర్యలు తీసుకుంది, ఉదాహరణకు బానిస వాణిజ్యాన్ని నిలిపివేసేందుకు నిరాకరించిన లాగోస్ రాజును 1851లో బలవంతంగా పదవి నుంచి తొలగించారు. 50కిపైగా ఆఫ్రికా పాలకులు బానిసత్వ-నిరోధక ఒప్పందాలపై సంతకాలు చేశారు.[61] 1827లో బ్రిటీన్ బానిస వాణిజ్యాన్ని సాగర చౌర్యంగా ప్రకటించింది, దీనికి మరణ దండన విధించేందుకు చట్టాలు చేసింది.[62]

వీటిని కూడా చూడండి[మార్చు]

 • ఆఫ్రికా స్వాతంత్ర్య ఉద్యమాలు
 • అన్వేషణ యుగం
 • అమెరికన్ సామ్రాజ్యం
 • వలసవ్యతిరేక వాదం
 • అరబ్ సామ్రాజ్యం
 • ఆస్ట్రియా-హంగేరీ
 • బెల్జియన్ వలస సామ్రాజ్యం
 • బ్రిటీష్ సామ్రాజ్యం
 • ఛార్టెర్డ్ కంపెనీలు
 • క్రైస్తవ మతం మరియు వలసవాదం
 • నాగరికత మిషన్
 • ప్రచ్ఛన్న యుద్ధం
 • వలస సామ్రాజ్యం
 • వలసరాజ్యాల యుద్ధాలు
 • పురాతన కాలంలో వలసరాజ్యాలు
 • భారతదేశంలో వలసరాజ్యాలు
 • వలసరాజ్యం
 • ప్రత్యేక సదుపాయం (భూభాగం)
 • డెన్మార్క్ విదేశీ వలసరాజ్యాలు
 • డచ్ సామ్రాజ్యం
 • ఎంపైర్ ఆఫ్ లిబర్టీ

 • అమెరికా ఖండాల్లో ఐరోపా వలసరాజ్యాల స్థాపన
 • అన్వేషణ
 • ఫ్రెంచ్ వలస సామ్రాజ్యం
 • జర్మన్ వలస సామ్రాజ్యం
 • జర్మనీ తూర్పువైపు విస్తరణ
 • అంతర్జాతీయ సామ్రాజ్యం
 • చారిత్రక వలస
 • బ్రిటీష్ సామ్రాజ్యం యొక్క చరిత్ర
 • ఆసియాలో సామ్రాజ్యవాదం
 • సామ్రాజ్యవాదం
 • ఇంకా సామ్రాజ్యం
 • ఇటలీ సామ్రాజ్యం
 • జపాన్ సామ్రాజ్యం
 • మెనిఫెస్ట్ రాజవంశం
 • మెక్సికో సామ్రాజ్యం
 • మంగోల్ సామ్రాజ్యం
 • మంగోలుల దండయాత్రలు
 • మొఘల్ సామ్రాజ్యం
 • ముస్లిం దండయాత్రలు

 • ఒట్టోమన్ సామ్రాజ్యం
 • ఐరోపాలో ఒట్టోమన్ యుద్ధాలు
 • పర్షియా సామ్రాజ్యం
 • ఐర్లాండ్ యొక్క తోటల పెంపకం
 • పోర్చుగీసు సామ్రాజ్యం
 • వలసవాదోత్తర విధానం
 • రక్షిత రాజ్యం
 • మనుగడ హక్కు
 • రష్యా సామ్రాజ్యం
 • స్థిరనివాసుల వలసవాదం
 • చైనా-ఆఫ్రికా సంబంధాలు
 • సోవియట్ సామ్రాజ్యం
 • సోవియట్ ఆక్రమణలు
 • స్పానిష్ సామ్రాజ్యం
 • వలసరాజ్యాల నిర్మూలనపై ప్రత్యేక కమిటీ
 • స్వీడన్ విదేశీ వలసరాజ్యాలు
 • ట్రాన్స్‌మైగ్రేషన్ ప్రోగ్రామ్
 • ఉష్ణమండల భౌగోళిక పరిస్థితులు
 • టర్కీ వలసలు

గమనికలు[మార్చు]

 1. 1.0 1.1 1.2 లిబరల్ యాంటీ-ఇంపీరియలిజం Archived 2005-12-31 at the Wayback Machine., ప్రొఫెసర్ డేనియల్ క్లెయిన్, 1.7.2004
 2. "Colonialism". Collins English Dictionary. HarperCollins. 2010. మూలం నుండి 14 మే 2011 న ఆర్కైవు చేసారు. Retrieved 5 April 2010.
 3. "Colonialism". Merriam-Webbster. Merriam-Webster. 2010. Retrieved 5 April 2010.
 4. Margaret Kohn (2006). "Colonialism". Stanford Encyclopedia of Philosophy. Stanford University. Retrieved 5 April 2010.
 5. Tignor, Roger (2005). preface to Colonialism: a theoretical overview. Markus Weiner Publishers. p. x. ISBN 1558763406, 9781558763401 Check |isbn= value: invalid character (help). Retrieved 5 April 2010.
 6. Osterhammel, Jürgen (2005). Colonialism: a theoretical overview. trans. Shelley Frisch. Markus Weiner Publishers. p. 15. ISBN 1558763406, 9781558763401 Check |isbn= value: invalid character (help). Retrieved 5 April 2010.
 7. Osterhammel, Jürgen (2005). Colonialism: A Theoretical Overview. trans. Shelley Frisch. Markus Weiner Publishers. p. 16. ISBN 1558763406, 9781558763401 Check |isbn= value: invalid character (help). Retrieved 5 April 2010.
 8. ది లి డైనస్టీ అండ్ సౌత్‌వార్డ్ ఎక్స్‌పాన్షన్
 9. "The Trusteeship Council - The mandate system of the league of nations". Encyclopedia of the Nations. Advameg. 2010. Retrieved 8 August 2010.
 10. "పేయింటర్, జే. & జెఫ్రే, ఎ., 2009. పొలిటికల్ జియోగ్రఫీ 2వ ఎడిషన్, సాజే “ఇంపీరియలిజం” పేజి 23 (GIC)
 11. గల్లాహెర్, సి. మరియు ఇతరులు, 2008. కీ కాన్సెప్ట్స్ ఇన్ పొలిటకల్ జియోగ్రఫీ, సాజే పబ్లికేషన్స్ లిమిటెడ్. "ఇంపీరియలిజం/కాలనైలిజం" పేజి 5 (GIC)
 12. డిక్షనరీ ఆఫ్ హ్యూమన్ జియోగ్రఫీ, "కాలనైలిజం"
 13. ఇన్ ది ఎమర్జింగ్ సిస్టమ్ ఆఫ్ ఇంటర్నేషనల్ క్రిమినల్ లా: డెవెలప్‌మెంట్స్ అండ్ కోడిఫికేషన్, బ్రిల్ పబ్లిషర్స్ (1997) ఎట్ పేజ్ 90, సుంగా ట్రేసెస్ ది ఆరిజిన్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ మూమెంట్ ఎగైనెస్ట్ కాలనైలిజం అండ్ రిలేట్స్ ఇట్ టు ది రైజ్ ఆఫ్ ది రైట్ టు సెల్ఫ్-డిటర్మినేషన్ ఇన్ ఇంటర్నేషనల్ లా.
 14. 14.0 14.1 Johannorberg.net Archived 2011-09-21 at the Wayback Machine. 2004-9-4
 15. లేట్ విక్టోరియన్ హోలోకాస్ట్స్: ఎల్ నినో ఫెమినెస్ అండ్ ది మేకింగ్ ఆఫ్ ది థర్డ్ వరల్డ్, మైక్ డేవిస్, 2000
 16. కమ్ బ్యాక్, కాలనైజిజం, ఆల్ ఈజ్ ఫర్‌గివన్
 17. కెన్నెత్ ఎఫ్. కిపుల్, ed. ది కేంబ్రిడ్జ్ హిస్టారికల్ డిక్షనరీ ఆఫ్ డిసీజ్ (2003)
 18. ఆల్‌ఫ్రెడ్ డబ్ల్యూ, క్రోస్బీ, జూనియర్, ది కొలంబియన్ ఎక్స్ఛేంజ్: బయోలాజికల్ అండ్ కల్చర్ కాన్సీక్వెన్సెస్ ఆఫ్ 1492 (1974)
 19. స్మాల్‌పాక్స్ ది ఫైట్ టు ఎరాడికేట్ ఎ గ్లోబల్ స్కౌర్జ్ Archived 2008-09-07 at the Wayback Machine., డేవిడ్ ఎ. కోప్లోవ్
 20. "ది ఫస్ట్ స్మాల్‌పాక్స్ ఎపిడెమిక్ ఆన్ ది కెనడియన్ ప్లెయిన్స్: ఇన్ ది ఫుర్-ట్రేడర్స్' వర్డ్స్", నేషనల్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్
 21. ది స్టోరీ ఆఫ్... స్మాల్‌పాక్స్ – అండ్ అదర్ డెడ్లీ యురేషియన్ జెర్మ్స్
 22. "స్టేసీ గుడ్‌లింగ్, "ఎఫెక్ట్స్ ఆఫ్ యూరోపియన్ డిసీజెస్ ఆన్ ది ఇన్‌హాబిటాంట్స్ ఆఫ్ ది న్యూ వరల్డ్"". మూలం నుండి 2008-05-10 న ఆర్కైవు చేసారు. Retrieved 2011-02-11. Cite web requires |website= (help)
 23. "Smallpox Through History". మూలం నుండి 2009-10-31 న ఆర్కైవు చేసారు. Retrieved 2011-02-11. Cite uses deprecated parameter |deadurl= (help); More than one of |deadurl= and |url-status= specified (help); Cite web requires |website= (help)
 24. "న్యూజీలాండ్ హిస్టారికల్ పెర్‌స్పెక్టివ్". మూలం నుండి 2010-06-12 న ఆర్కైవు చేసారు. Retrieved 2011-02-11. Cite web requires |website= (help)
 25. హౌ డిడ్ ఈస్టర్ ఐల్యాండ్స్ ఏన్షియంట్ స్టేటస్ లీడ్ టు ది డిస్ట్రక్షన్ ఆఫ్ ఎన్ ఎంటైర్ ఎకోసిస్టమ్?, ది ఇండిపెండెంట్
 26. "ఫిజీ స్కూల్ ఆఫ్ మెడిసిన్". మూలం నుండి 2014-10-20 న ఆర్కైవు చేసారు. Retrieved 2011-02-11. Cite web requires |website= (help)
 27. మీటింగ్ ది ఫస్ట్ ఇన్‌హాబిటాంట్స్, TIMEasia.com, 21 ఆగస్టు 2000
 28. జెనెటిక్ స్టడీ బోల్‌స్టెర్స్ కొలంబస్ లింక్ టు సైఫిలిస్, న్యూయార్క్ టైమ్స్, జనవరి 15, 2008
 29. కొలంబస్ మే హావ్ బ్రాడ్ సిఫిలిస్ టు యూరప్, లివ్‌సైన్స్
 30. కలరాస్ సెవెన్ పాండెమిక్స్. CBC న్యూస్. డిసెంబరు 2, 2008.
 31. "సాహిబ్: ది బ్రిటీష్ సోల్జర్ ఇన్ ఇండియా, 1750-1914 బై రిచర్డ్ హోమ్స్". మూలం నుండి 2012-05-30 న ఆర్కైవు చేసారు. Retrieved 2011-02-11. Cite web requires |website= (help)
 32. డాక్టర్ ఫ్రాన్సిస్కో డి బాల్మిస్ అండ్ హిజ్ మిషన్ ఆఫ్ మెర్సీ, సొసైటీ ఆఫ్ ఫిలిప్పీన్స్ హెల్త్ హిస్టరీ
 33. లెవీస్ కాస్ అండ్ పాలిటిక్స్ ఆఫ్ డిసీజ్: ది ఇండియన్ వాక్సినేఏషన్ యాక్ట్ ఆఫ్ 1832
 34. "స్మాల్‌పాక్స్ హిస్టరీ- అదర్ హిస్టరీస్ ఆఫ్ స్మాల్‌పాక్స్ ఇన్ సౌత్ ఏషియా". మూలం నుండి 2012-04-16 న ఆర్కైవు చేసారు. Retrieved 2011-02-11. Cite web requires |website= (help)
 35. కాంక్వెస్ట్ అండ్ డిసీజ్ ఆర్ కాలనైలిజం అండ్ హెల్త్?, గ్రీషమ్ కాలేజ్ | లెక్చర్ అండ్ ఈవెంట్స్
 36. WHO Media centre (2001). "Fact sheet N°259: African trypanosomiasis or sleeping sickness". Cite journal requires |journal= (help)
 37. ది ఆరిజిన్స్ ఆఫ్ ఆఫ్రికన్ పాపులేషన్ గ్రోత్, బై జాన్ ఐలిఫ్, ది జర్నల్ ఆఫ్ ఆఫ్రికన్ హిస్టరీ వాల్యూమ్ 30, నెం. 1 (1989), పేజీలు 165-169
 38. వరల్డ్ పాపులేషన్ క్లాక్ - వరల్డోమీటర్స్
 39. "ఆర్కైవ్ నకలు". మూలం నుండి 2003-05-07 న ఆర్కైవు చేసారు. Retrieved 2011-02-11. Cite web requires |website= (help)
 40. ఎన్ ఎఫ్. రామెనోఫ్‌స్కై, వెక్టర్స్ ఆఫ్ డెత్: ది ఆర్కెయోలోగీ ఆఫ్ యూరోపియన్ కాంటాక్ట్ (ఆల్బుక్వెరాక్, NM: యూనివర్శిటీ ఆఫ్ న్యూ మెక్సికో ప్రెస్, 1987):
 41. రాబర్ట్ ఎల్. ఓకానెల్, ఆఫ్ ఆర్మ్స్ అండ్ మెన్: ఎ హిస్టరీ ఆఫ్ వార్, వెపన్స్ అండ్ అగ్రెషన్ (NY అండ్ ఆక్స్‌ఫోర్డ్: ఆక్స్‌ఫోర్డ్ యూనివర్శిటీ ప్రెస్, 1989)
 42. Diamond, Jared (1997). Guns, Germs, and Steel: The Fates of Human Societies. W.W. Norton & Company. ISBN 0-393-03891-2.
 43. డిక్సన్, నెవర్ కమ్ టు పీస్ , 152–55; మెక్‌కానెల్, ఎ కంట్రీ బిట్వీన్ , 195–96; Dowd, వార్ అండర్ హెవెన్ , 190. ఫర్ హిస్టారియన్స్ బిలీవ్ ది అటెంప్ట్ ఎట్ ఇన్ఫెక్షన్ వాజ్ సక్సెస్‌ఫుల్, సీ నెస్టర్, హాటీ కాంకరర్స్" , 112; జెన్నింగ్స్, ఎంపైర్ ఆఫ్ ఫార్చూన్ , 447–48.
 44. మింగ్ డైనస్టీ Archived 2009-01-26 at the Wayback Machine. MSN.com. ఆర్కైవ్డ్ 2009-10-31.
 45. చైనాస్ పాపులేషన్: రీడింగ్ అండ్ మ్యాప్స్. కొలంబియా యూనివర్శిటీ, ఈస్ట్ ఆసియన్ కరికులం ప్రాజెక్ట్
 46. ది ఇంపాక్ట్ ఆఫ్ ది పొటాటో. హిస్టరీ మేగజైన్
 47. ఆంటిక్విటీ ఆఫ్ మైజ్ ఇన్ ఇండియా Archived 2011-04-30 at the Wayback Machine.. రాజేంద్ర అగ్రికల్చరల్ యూనివర్శిటీ
 48. సూపర్-సైజ్డ్ కసావా ప్లాంట్స్ మే హెల్ప్ ఫైట్ హంగర్ ఇన్ ఆఫ్రికా Archived 2013-12-08 at the Wayback Machine.. ది ఒహియో స్టేట్ యూనివర్శిటీ
 49. మైజ్ స్టీక్ వైరస్-రెసిస్టెంట్ ట్రాన్స్‌జెనిక్ మైజ్: ఎన్ ఆఫ్రికన్ సొల్యూషన్ టు ఎన్ ఆఫ్రికన్ ప్రాబ్లమ్ Archived 2011-10-20 at the Wayback Machine.. సిటిజెన్. ఆగస్టు 7, 2007
 50. http://www.springerlink.com/index/t514426365436ur2.pdf[permanent dead link]
 51. సావోరింగ్ ఆఫ్రికా ఇన్ ది న్యూ వరల్డ్ బై రాబర్ట్ ఎల్. హాల్ Archived 2010-05-21 at the Wayback Machine. మిల్లర్స్‌విల్లే యూనివర్శిటీ
 52. హిస్టారికల్ సర్వే > స్లేవ్-ఓనింగ్ సొసైటీస్, ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా
 53. వెల్‌కమ్ టు ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికాస్ గైడ్ టు బ్లాక్ హిస్టరీ, ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా
 54. ఫోకస్ ఆన్ ది స్లేవ్ ట్రేడ్, BBC
 55. ది షాపింగ్ ఆఫ్ బ్లాక్ అమెరికా: ఫోర్త్‌కమింగ్ 400th సెలెబ్రేషన్ రిమైండ్స్ అమెరికా దట్ బ్లాక్స్ కమ్ బిఫోర్ ది మేఫ్లవర్ అండ్ వర్ ఎమాంగ్ ది ఫౌండర్స్ ఆఫ్ దిస్ కంట్రీ.(బ్లాక్ హిస్టరీ)(జేమ్స్‌టౌన్, VA)(ఇంటర్‌వ్యూ)(ఎక్సెర్‌ప్ట్) - జెట్ | Encyclopedia.com
 56. 56.0 56.1 1860 సెన్సస్ రిజల్ట్స్, ది సివిల్ వార్ హోమ్ పేజ్.
 57. అమెరికన్ సివిల్ వార్ సెన్సస్ డేటా
 58. రాయల్ నేవీ అండ్ ది స్లేవ్ ట్రేడ్
 59. సెయిలింగ్ ఎగైనెస్ట్ స్లేవరీ. బై జో లూసెమోర్ BBC
 60. బ్రిటీష్ అండ్ ఫారిన్ స్టేట్ పేపర్స్, వాల్యూమ్ 10 బై గ్రేట్ బ్రిటన్. ఫారిన్ అండ్ కామన్వెల్త్ ఆఫీస్
 61. ది వెస్ట్ ఆఫ్రికన్ స్క్వాడ్రన్ అండ్ స్లేవ్ ట్రేడ్
 62. "యాంటీ-స్లేవరీ ఆఫరేషన్స్ ఆఫ్ US నేవీ". మూలం నుండి 2011-01-23 న ఆర్కైవు చేసారు. Retrieved 2011-02-11. Cite web requires |website= (help)

సూచనలు[మార్చు]

 • గై అంకెర్ల్, Coexisting Contemporary Civilizations: Arabo-Muslim, Bharati, Chinese, and Western, (2000) ISBN 2881550045
 • ఆరెండ్, హన్నా, ది ఆరిజిన్స్ అఫ్ టోటలిటేరియనిజం (1951) (సెకండ్ ఛాప్టర్ ఆన్ ఇంపీరియలిజం ఎగ్జామిన్స్ టైస్ బిట్వీన్ కాలనిజం అండ్ టోటలిటేరియనిజం)
 • కాన్‌రాడ్, జోసఫ్, హార్ట్ అఫ్ డార్క్‌నెస్, 1899
 • ఫనోన్, ఫ్రాంట్జ్, ది రాచ్డ్ అఫ్ ది ఎర్త్, బై జీన్-పాల్ సార్ట్రే. కాన్‌స్టాన్స్ ఫారింగ్టన్ అనువాదం లండన్: పెంగ్విన్ బుక్, 2001
 • గోబినెయు, ఆర్థూర్ డి, ఎన్ ఎస్సే ఆన్ ది ఇన్ఈక్వాలిటీ ఆఫ్ ది హ్యూమన్ రేసెస్, 1853–55
 • గుటీరెజ్, గుస్తావో, ఎ థియోలజీ ఆఫ్ లిబరేషన్: హిస్టరీ, పాలిటిక్స్, సాల్వేషన్, 1971
 • కిప్లింగ్, రూడీయార్డ్, ది వైట్ మ్యాన్స్ బర్డన్, 1899
 • లాస్ కాసాస్, బార్టోలోమే డి, ఎ షార్ట్ అకౌంట్ ఆఫ్ ది డిస్ట్రక్షన్ ఆఫ్ ది ఇండీస్ (1542, పబ్లిష్డ్ ఇన్ 1552)
 • లెకౌర్ గ్రాండ్‌మైసన్, ఆలీవియర్, కాలనైజేర్, ఎక్స్‌టెర్మినెర్ - Sur la guerre et l'Etat colonial, ఫాయార్డ్, 2005, ISBN 2213623163
 • లిండ్‌క్విస్ట్, సెవన్, ఎక్స్‌టెర్మినేట్ ఆప్ ది బ్రూటెస్, 1992, న్యూ ప్రెస్; రీప్రింట్ ఎడిషన్ (జూన్ 1997), ISBN 978-1-56584-359-2
 • మేరియా పెట్రింగా, బ్రాజా, ఎ లైఫ్ ఫర్ ఆఫ్రికా (2006), ISBN 978-1-4259-1198-0
 • జుర్జెన్ ఓస్టెర్‌హామ్మెల్, కాలనైలిజం: ఎ థియరిటికల్ ఓవర్‌వ్యూ, ప్రిన్స్‌టన్, NJ: ఎం. వీనెర్, 1997.
 • సెయిడ్, ఎడ్వర్డ్, ఓరియంటలిజం, 1978; 25-యానివర్శరీ ఎడిషన్ 2003 ISBN 978-0-394-74067-6
 • లైయల్ ఎస్. సుంగా, ది ఎమర్జింగ్ డెవెలప్‌మెంట్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ క్రిమినల్ లా: డెవెలప్‌మెంట్స్ ఇన్ కోడిఫికేషన్ అండ్ ఇంప్లిమెంటేషన్, బ్రిల్ పబ్లిషర్స్ (1997), ఛాప్టర్ I (4).
 • వైటెస్, అలెన్, "స్టేట్స్ ఇన్ డెవెలప్‌మెంట్," DFID, లండన్ 2007[1]

బాహ్య లింకులు[మార్చు]

మూస:Colonial Empires మూస:Empires మూస:Colonization మూస:Indigenous rights footer

"https://te.wikipedia.org/w/index.php?title=వలసవాదం&oldid=2826358" నుండి వెలికితీశారు