వల్లంపాటి వెంకటసుబ్బయ్య

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
వల్లంపాటి వెంకటసుబ్బయ్య
వల్లంపాటి వెంకటసుబ్బయ్య.jpg
జననం (1937-03-15)మార్చి 15, 1937
రొంపిచెర్ల, చిత్తూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్
మరణం జనవరి 2, 2007(2007-01-02) (వయసు 69)
చదువు ఎం. ఎ, ఎం. లిట్
వృత్తి రచయిత, విమర్శకుడు, లెక్చరర్
పురస్కారాలు కేంద్ర సాహిత్య అకాడెమీ

వల్లంపాటి వెంకటసుబ్బయ్య (మార్చి 15, 1937 - జనవరి 2, 2007) ప్రముఖ సాహితీ విమర్శకుడు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత.[1]

జననం[మార్చు]

వల్లంపాటి 1937, మార్చి 15చిత్తూరు జిల్లా రొంపిచర్ల లో జన్మించాడు. ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడిగా వృత్తిని ప్రారంభించి, ఇంగ్లీషులో ఎం.ఏ చేసి, తరువాత హైదరాబాదు లోని సెంటర్‌ ఫర్‌ ఇంగ్లీష్‌ అండ్‌ ఫారెన్‌ లాంగ్వేజెస్‌ నుంచి ఎం.లిట్‌ పొందాడు. మదనపల్లె బీసెంట్‌ థియేసాఫికల్‌ కాలేజీలో లెక్చరర్‌గా పనిచేసి పదవీ విరమణ చేసాడు.

వల్లంపాటి కథకుడిగా తన రచనా వ్యాసంగాన్ని మొదలుపెట్టాడు. పరిష్కారం, మిథ్య మొదలైన కథానికలు 40 దాకా ప్రచురించాడు. ఆయన రాసిన ఇంధ్రధనస్సు, దూర తీరాలు నవలలు ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రికలో బహుమతులు పొందాయి. వల్లంపాటి సాహితీ విమర్శకుడిగా సుప్రసిద్ధుడు. ఆయన రాసిన కథా శిల్పం, నవలాశిల్పం, విమర్శా శిల్పం పుస్తకాలు తెలుగు సాహిత్య విమర్శకు ప్రామాణికాలు. అనువాదకుడిగా కుడా ఆయన ప్రసిద్ధుడే. ఇంగ్లీషు నుంచి, కన్నడం నుంచి తెలుగులోకి ఎన్నో గ్రంధాలు, కథలను అనువదించాడు. తస్లీమా నస్రీన్‌ రచించిన లజ్జ, బ్రిటిష్‌ రచయిత ఇ.హెచ్‌.కార్‌ రచించిన చరిత్ర అంటే ఏమిటి...? ఆయన చేసిన అనువాద రచనలలో కొన్ని.

ఆయన రాసిన కథాశిల్పం రచనకు 1999 సంవత్సరానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. ఇదే పుస్తకానికి తెలుగు విశ్వవిద్యాలయం ఉత్తమ సాహిత్య విమర్శ గ్రంథంగా ఎంపిక చేసి, సత్కరించింది.

మరణం[మార్చు]

2007, జనవరి 2 న వల్లంపాటి మదనపల్లెలో మరణించాడు.

రచనల జాబితా[మార్చు]

నవలలు
 • ఇంద్ర ధనుస్సు - 1962
 • దూర తీరాలు - 1964
 • మమతలు - మంచుతెరలు - 1972
 • జానకి పెళ్ళి - 1974
కథలు
 • బండి కదిలింది
 • రానున్న శిశిరం
 • బంధాలు
సాహితీ విమర్శ, పరిశోధన
 • కథా శిల్పం - 1996
 • నవలా శిల్పం - 1995
 • నిమర్శా శిల్పం - 2002
 • అనుశీలన - 1985
 • నాటికవులు - 1963
 • వల్లంపాటి సాహిత్య వ్యాసాలు - 1997
 • రాయలసీమలో ఆధునిక సాహిత్యం - సామాజిక సాంస్కృతిక విశ్లేషణ - 2006
అనువాదాలు
 • ప్రపంచ చరిత్ర
 • చరిత్ర అంటే ఏవిటి?
 • చరిత్రలో ఏమి జరిగింది?
 • ప్రాచీన భారతదేశం ప్రగతి
 • సంప్రదాయ వాదం - 1998
 • భారతదేశం చరిత్ర - (ఆర్.ఎస్.శర్మ 2002)
 • బతుకంతా (కన్నడ నవల)
 • లజ్జ
 • నవల-ప్రజలు
ఇంకా
 • ఎన్నో సంకలనాలు, సంపుటాలకు ముందు మాటలు వ్రాసాడు
 • తెలుగు, కన్న, ఇంగ్లీషు భాషలలోకి, వాటినుండి అనువాదాలు చేశాడు
 • ఇండో - ఆంగ్ల సాహిత్యానికి సంబంధించిన షుమారు 15 పరిశోధనా పత్రాలను లిటరరీ క్రిటేరియన్ వంటి పత్రికలలో ప్రచురించాడు.

సత్కారాలు[మార్చు]

 • తాపీ ధర్మారావు అవార్డు - 1993
 • కొండేపూడి సాహిత్య సత్కారం - 1995
 • తెలుగు యూనివర్శిటీ అవార్డు - 1997
 • గజ్జల మల్లారెడ్డి అవార్డు - 2000
 • కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు - 2000

వనరులు[మార్చు]

 1. ఎం. వి, నాగసుధారాణి. "రాయలసీమ కథలు క్షామ చిత్రణ" (PDF). shodhganga. తిరుపతి: శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం. p. 67. Retrieved 1 December 2017.