వల్లభ్ బెంకే
వల్లభ్ బెంకే | |||
![]()
| |||
పదవీ కాలం 2004 – 2014 | |||
ముందు | బాలాసాహెబ్ దంగత్ | ||
---|---|---|---|
తరువాత | శరద్ సోనావనే | ||
నియోజకవర్గం | జున్నార్ | ||
పదవీ కాలం 1985 – 1995 | |||
ముందు | దిలీప్ ధామ్ధేరే | ||
తరువాత | బాలాసాహెబ్ దంగత్ | ||
నియోజకవర్గం | జున్నార్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1950 జూన్ 23 మహారాష్ట్ర | ||
మరణం | 2024 ఫిబ్రవరి 11 ముంబై | ||
జాతీయత | ![]() | ||
రాజకీయ పార్టీ | నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ | ||
ఇతర రాజకీయ పార్టీలు | భారత జాతీయ కాంగ్రెస్ | ||
సంతానం | అతుల్ వల్లభ్ బెంకే | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
వల్లభ్ శేథ్ బెంకే మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మహారాష్ట్ర శాసనసభకు జున్నార్ శాసనసభ నియోజకవర్గం నుండి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. వల్లభ్ బెంకే కృష్ణా ఖోరే డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ ఉపాధ్యక్షుడిగా పని చేశాడు.
రాజకీయ జీవితం
[మార్చు]వల్లభ్ బెంకే భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 1985 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో జున్నార్ శాసనసభ నియోజకవర్గం నుండి ఐఎన్సీ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన ఆ తరువాత 1990 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.
వల్లభ్ బెంకే ఆ తరువాత 1995, 1999 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో శివసేన అభ్యర్థి బాలాసాహెబ్ దంగత్ చేతిలో ఓడిపోయాడు. ఆయన 2004, 2009 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో తిరిగి వరుసగా రెండుసార్లు శాసనసభకు ఎన్నికయ్యాడు.
మరణం
[మార్చు]వల్లభ్ బెంకే వృద్ధాప్యం కారణంగా అనారోగ్యంతో ముంబైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఆరోగ్యం విషమించడంతో 2024 ఫిబ్రవరి 11న మరణించాడు.[1][2][3]
మూలాలు
[మార్చు]- ↑ "माजी आमदार वल्लभ बेनकेंच्या पार्थिवावर अंत्यसंस्कार; काका-पुतणे दोघेही राहिले उपस्थित". ETV Bharat News. 12 February 2024. Archived from the original on 1 January 2025. Retrieved 1 January 2025.
- ↑ "Ex-NCP MLA Vallabh Benke dies at 74" (in ఇంగ్లీష్). Mid-day. 12 February 2024. Archived from the original on 1 January 2025. Retrieved 1 January 2025.
- ↑ "शरद पवार यांना मोठा धक्का! खंद्दे समर्थक माजी आमदार वल्लभशेठ बेनके यांचं निधन". News18 मराठी. 12 February 2024. Archived from the original on 1 January 2025. Retrieved 1 January 2025.