వసంత్‌దాదా పాటిల్
వసంత్‌దాదా పాటిల్ | |
|---|---|
| రాజస్థాన్ గవర్నర్ | |
| In office 1985 నవంబరు 20 – 1987 అక్టోబరు 15 | |
| అంతకు ముందు వారు | ఓం ప్రకాష్ మెహ్రా |
| తరువాత వారు | సుఖ్‌దేవ్ ప్రసాద్ |
| మహారాష్ట్ర ముఖ్యమంత్రి | |
| In office 1983 పిబ్రవరి 2 – 1985 జూన్ 3 | |
| అంతకు ముందు వారు | బాబాసాహెబ్ భోసలే |
| తరువాత వారు | శివాజీరావు నీలంగేకర్ పాటిల్ |
| In office 1977 మే 17 – 1978 జులై 18 | |
| అంతకు ముందు వారు | శంకర్రావు చవాన్ |
| తరువాత వారు | శరద్ పవార్ |
| వ్యక్తిగత వివరాలు | |
| జననం | వసంతరావు బందూజీ పాటిల్ 1917 నవంబరు 13 సాంగ్లీ, బాంబే ప్రెసిడెన్సీ, బ్రిటిష్ ఇండియా |
| మరణం | 1989 మార్చి 1 (వయసు: 71) బొంబాయి, మహారాష్ట్ర, భారతదేశం |
| రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ |
| జీవిత భాగస్వామి | మాలతీతాయ్ పాటిల్ షాలినీ పాటిల్ |
| సంతానం | ప్రకాష్ బాపు పాటిల్ |
వసంత్‌దాదా పాటిల్ (1917 నవంబరు 13 - 1989 మార్చి 1), మహారాష్ట్రలోని సాంగ్లీ ప్రాంతానికి చెందిన భారతీయ రాజకీయవేత్త. మహారాష్ట్ర రాజకీయాలలో మొదటి మాస్ లీడర్ గా ఆయన ప్రసిద్ధి చెందాడు.[1]
ఆయన 1977 మే 17 నుండి 1978 జూలై 18 వరకు, మళ్లీ 1983 ఫిబ్రవరి 2 నుండి 1985 జూన్ 1 వరకు మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసాడు.[2] ఆయన 1985 నుండి 1987 వరకు రెండు సంవత్సరాల కాలం రాజస్థాన్ గవర్నర్ గా కూడా పనిచేసాడు.[3]
వ్యక్తిగత జీవితం
[మార్చు]1917 నవంబరు 13న సాంగ్లీ సమీపంలోని పద్మలే గ్రామంలో జన్మించాడు. స్థానిక మరాఠీ భాషలో చదువుకున్న తర్వాత ఆయన రైతుగా మారాడు. ఆయన మొదటి భార్య మాలతి తాయ్ పాటిల్ 1960లలో మరణించింది. వారికి నలుగురు పిల్లలు. కొంతకాలం తర్వాత, ఆయన షాలినిటై పాటిల్ ను వివాహం చేసుకున్నాడు. వీరికి సంతానం లేదు. 1980లలో ఆమె మహారాష్ట్రలో మంత్రిగా పనిచేసింది.
ఆయన కుమారుడు ప్రకాష్ పాటిల్ లోక్‌సభలో సాంగ్లీ లోక్‌సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించాడు. 2005లో ప్రకాష్ పాటిల్ మరణం తరువాత, ఆయన కుమారుడు (వసంత్‌దాదా మనవడు) ప్రతీక్ పాటిల్ రెండుసార్లు సాంగ్లీ నుండి ఎంపీ అయ్యాడు.
స్వాతంత్య్ర సమరయోధుడు
[మార్చు]స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్న వసంత్‌దాదా పాటిల్ ను 1940లలో బ్రిటిష్ వారు వసంత్‌దాదా ను జైలుకు పంపారు.
రాజకీయ జీవితం
[మార్చు]1976 నుండి 1985 వరకు మూడు సార్లు మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసాడు. 1980లో సాంగ్లీ లోక్‌సభ నియోజకవర్గం నుండి 7వ లోక్‌సభకు సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[4]
మరణం
[మార్చు]వసంత్‌దాదా పాటిల్ 1989 మార్చి 1న మరణించాడు.
గుర్తింపు
[మార్చు]
- పద్మభూషణ్ పురస్కారం (1967) [5]
- ఆయన గౌరవార్థం ముంబైలో పద్మభూషణ్ వసంత్‌దాదా పాటిల్ ప్రతిష్ఠాన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అని పేరు పెట్టారు.
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "A.R. Antulay supporters petition for prosecution of CM Vasantdada Patil, wife Shalinitai". indiatoday.in (in ఇంగ్లీష్). Retrieved 2014-04-11.
- ↑ "A.R. Antulay supporters petition for prosecution of CM Vasantdada Patil, wife Shalinitai". indiatoday.in (in ఇంగ్లీష్). Retrieved 2014-04-11.
- ↑ "Rajasthan Governor Vasantdada Patil steps up efforts to unseat Maharashtra CM S.B. Chavan". indiatoday.in (in ఇంగ్లీష్). Retrieved 2014-01-03.
- ↑ "A.R. Antulay supporters petition for prosecution of CM Vasantdada Patil, wife Shalinitai". indiatoday.in (in ఇంగ్లీష్). Retrieved 2014-04-11.
- ↑ "A.R. Antulay supporters petition for prosecution of CM Vasantdada Patil, wife Shalinitai". indiatoday.in (in ఇంగ్లీష్). Retrieved 2014-04-11.