వసంత వెంకట కృష్ణ ప్రసాద్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వసంత వెంకట కృష్ణ ప్రసాద్
వసంత వెంకట కృష్ణ ప్రసాద్


ఎమ్మెల్యే
పదవీ కాలం
2019 – ప్రస్తుతం
నియోజకవర్గం మైలవరం నియోజకవర్గం
ముందు దేవినేని ఉమామహేశ్వరరావు

వ్యక్తిగత వివరాలు

జననం (1970-04-09)1970 ఏప్రిల్ 9
ఐతవరం గ్రామం , నందిగామ మండలం , కృష్ణా జిల్లా , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , భారతదేశం
రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ , వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
తల్లిదండ్రులు వసంత నాగేశ్వర రావు, హైమావతి
జీవిత భాగస్వామి శిరీష
సంతానం ధీమంత్ సాయి & హిమ సాహితి

వసంత వెంకట కృష్ణ ప్రసాద్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2019లో మైలవరం నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.[1]

జననం, విద్యాభాస్యం

[మార్చు]

వసంత వెంకట కృష్ణ ప్రసాద్ 9 ఏప్రిల్ 1970న వసంత నాగేశ్వరరావు, హైమావతి దంపతులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , కృష్ణా జిల్లా , నందిగామ మండలం , ఐతవరం గ్రామం లో జన్మించాడు. ఆయన గుంటూరులోని శ్రీ పాటిబండ్ల సీతారామయ్య హై స్కూల్ లో పదవ తరగతి పూర్తి చేశాడు.[2]

రాజకీయ జీవితం

[మార్చు]

వసంత వెంకట కృష్ణ ప్రసాద్ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 1999 ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా నందిగామ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయాడు. ఆయన 2004లో రెండవసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయాడు. ఆయన 2005లో జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (కేడీసీసీ బ్యాంకు) చైర్మన్‌గా, ఆప్‌కాబ్‌ చైర్మన్‌గా, జాతీయ స్థాయిలో నాప్కాబ్‌ వైస్‌ చైర్మన్‌గా పని చేశాడు. తెలంగాణ ఉద్యమం సమయంలో సమైక్యాంధ్రకు మద్దతుగా ఆప్‌కాబ్‌ చైర్మన్‌ పదవికి రాజీనామా చేశాడు.

వసంత వెంకట కృష్ణ ప్రసాద్ 2014 లో తెలుగుదేశం పార్టీలో చేరి ఎన్నికల్లో నందిగామ నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థి తంగిరాల ప్రభాకరరావు గెలుపులో కీలకంగా పని చేశాడు. ఆయన 2018లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లో చేరి పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త పని చేశాడు.[3][4] వసంత వెంకట కృష్ణ ప్రసాద్ 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మైలవరం నియోజకవర్గం నుండి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి దేవినేని ఉమా పై 12653 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.

వసంత వెంకట కృష్ణ ప్రసాద్ 2024 మార్చి 02న టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరాడు.[5][6]

మూలాలు

[మార్చు]
  1. Sakshi (2019). "Mylavaram Constituency Winner List in AP Elections 2019 | Mylavaram Constituency MLA Election Results 2019". Archived from the original on 3 September 2021. Retrieved 3 September 2021.
  2. Sakshi (18 March 2019). "కృష్ణా జిల్లా ...వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల వివరాలు". Archived from the original on 21 మార్చి 2019. Retrieved 22 December 2021.
  3. The Hans India (10 May 2018). "Eminent industrialist joins YSRCP" (in ఇంగ్లీష్). Archived from the original on 3 September 2021. Retrieved 3 September 2021.
  4. May 10. "Krishna Prasad: Andhra Pradesh: TDP's Krishna Prasad joins YSR Congress". The Times of India (in ఇంగ్లీష్). Archived from the original on 3 September 2021. Retrieved 3 September 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  5. Eenadu (2 March 2024). "తెదేపాలో చేరిన వైకాపా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌". Archived from the original on 2 March 2024. Retrieved 2 March 2024.
  6. The Hindu (2 March 2024). "YSRCP MLA Vasantha Krishna Prasad joins TDP" (in Indian English). Archived from the original on 23 March 2024. Retrieved 23 March 2024.